Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య
#34
33     


మీనాక్షి కంపెనీ గేట్ లోపలికి వెళుతుంటేనే లోపల ఏదో జరుగుతుందనిపించింది ఎందుకంటే బైట కొంతమంది ఇంతకముందు పనిచేసిన గోపాల్, శ్యామ్ మనుషులు కనిపించారు. లోపలికి వెళ్లాను

శివ : గగన్ సర్ ఏమైంది ఏంటిదంతా

సందీప్ : వీళ్లంతా లోకల్ బయ్యర్స్ మన వస్తువులని కొనుక్కోబోయ్యేదే లేదని వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు.

గగన్ : ఇప్పుడేం చేద్దాం శివా

శివ : ఇదంతా ఎవరు చేపిస్తున్నారో నాకు తెలుసు, అని అందరినీ చూసి హలో అని అరిచాను.

హలో బాబు నిన్నే వినాలి, అరుస్తుంటే వినిపించట్లేదా.. అస్సులు ఇక్కడికి మీరంతా ఎందుకు వచ్చినట్టు మిమ్మల్ని కొనమని బలవంతంగా ఎవరైనా మిమ్మల్ని లాక్కొచ్చారా? (అందరూ సైలెంట్ గా అయిపోయారు)

మీరు చేసేది ఎలా ఉందొ తెలుసా అమ్మ అన్నం పెట్టకపోయినా దెగ్గరికి వెళ్లి మరీ అమ్మా నేను అన్నం తినను అని మారం చేసినట్టుంది. అమ్మ అయినా కరిగి బతిమిలాడుతుంది ఇక్కడ మీ అమ్మ అయ్యలు ఎవ్వరు లేరు కొనకపోతే వెళ్లిపోండి అంతే.

"మా సపోర్ట్ లేకుండానే బిజినెస్ చేద్దామనుకుంటున్నారా, ఎలా చేస్తారో మేమూ చూస్తాం"

శివ : నీ బాదేంటి బామ్మర్ది.. అనగానే వెనక ఉన్న అందరూ నవ్వారు. నా ప్రోడక్ట్ కొనను అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావ్, అస్సలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. (ఇంతలో ప్యూన్ అందరికి చాయ్, బిస్కెట్స్ తీసుకువచ్చాడు)

రాజు ఇక్కడ మనతో బిజినెస్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు, చాయ్ బిస్కెట్స్ దండగ లోపల పెట్టు.. (అనగానే రాజు లోపలికి వెళ్ళిపోయాడు)

ఆ ఎక్కడున్నాం.. మీకు ఒక చిన్న కధ చెపుతా వినండి. నాకు తెలిసిన ఒకాయన పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాడు, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, కాని ఒక్కడే ఎదుగుతూ స్థిరపడుతూ తను ఏదగడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని అందరికి షేర్స్ ప్రాఫిట్స్ కూడా పంచాడు. ఎవరో తెలుసా ఈ కంపెనీ ఓనర్ సీతారామ్ గారు. బాబులు ఇందులో సుబ్బారావు గారి ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా అనగానే ముగ్గురు లేచి నిలబడ్డారు, వాళ్ళని చూస్తూనే ఒక్కసారి ఈ కంపెనీ గురించి మీ నాన్న గారిని అడగండి చెపుతారు. రెడ్డి గారి కుటుంబం అనగానే ఇద్దరు చేతులు లేపారు.

మీరంతా ఎప్పటి నుంచో ఈ వ్యాపారంలో కొన్ని తరాలుగా ఉంటూ వస్తున్నారు, ఎవడో నిన్న మొన్న వచ్చిన వాడి మాటలు విని ఇంత దూరం వచ్చారు, కంపెనీ పేరు మాత్రమే మారింది, దాని విలువలు మారలేదండి. మీరు ఇంకా నమ్మకపోతే కంపెనీ ఓనర్ సీతారామ్ గారి మనవరాల్ని పిలిపిస్తాను తనే ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్.. ఈ రెండేళ్లు మాత్రమే కంపెనీ ఇలా ఉందండి కొన్ని రోజుల్లో పాత కంపెనీ ఎలా నడిచేదో దాన్ని మించిన పూర్వ వైభవం మీకు చూపిస్తాను. ఎవరైతే కంపెనీని నమ్ముతాం తిరిగి కంపెనీ మనకి తోడుగా ఉంటుంది అని నమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళంతా మళ్ళీ గెట్అవుట్ అని చెప్పక ముందే వెళ్ళిపోరా ప్లీజ్ చెప్పాలంటే మనసు రావట్లేదు.. అనగానే ఒక పది మంది వచ్చిన ప్లాన్ ఫెయిల్ అయినట్టు మొహం మాడ్చుకుని లేచివెళ్ళిపోగా మిగతావాళ్ళు ఎక్కడివాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు.

రాజు.. చాయ్ బిస్కెట్స్ తోపాటు భోజనం ఏర్పాట్లు కూడా చెయ్యి, అందరూ భోంచేసి వెళ్ళండి, ఒక వారంలో మీటింగ్ పెట్టుకుందాం.. ఏమంటారు అనగానే అందరూ చెప్పట్లు కొట్టారు. తిరిగి గగన్ సర్ పక్కన నిల్చున్నాను.

శివ : హ్యాపీయేనా

గగన్ : నిజంగా నువ్వు చాలా గ్రే..

శివ : ఊరుకోండి సర్.. ఆమ్మో లేట్ అయిపోయింది వెళ్ళాలి, సర్ అదీ..

గగన్ : నేను చూసుకుంటాను, వెళ్ళు

శివ : సందీప్ మన పని ఎంతవరకు వచ్చింది

సందీప్ : రేపు పొద్దున్నే అందరూ నీ ముందుంటారు

అక్కడనుంచి బైటికి వచ్చేసి ఇంటికి వచ్చాను, డోర్ తీసుకుని లోపలికి అడుగుపెడుతుండగానే వాసన గుమగుమలాడుతుంది. అమ్మ నాకిష్టమైన కూర వండింది.

శివ : నేనొచ్చేసా..

కావేరి : రేయి ఆగాగు.. అక్కడే ఉండు వస్తున్నాం.. ముందు కళ్ళు మూసుకో

శివ : అలాగే..

ముగ్గురు చేతిలో మూడు గిన్నెలతో శివ ముందుకు వచ్చారు.

శివ : కళ్ళు తెరవనా

కావేరి : ఆగు ముందు వాసన చూసి అవేంటో కనిపెట్టు చూద్దాం

శివ : సరే

కావేరి : ఇదేంటో చెప్పు చూద్దాం

శివ : వాసన కూడా చూడనవసరంలేదు గుత్తోంకాయ, మసాలా స్టఫ్

కావేరి నవ్వుతూ ఆగిపోయింది

ముస్కాన్ : భయ్యా మరి ఇదీ.. అని శివ మొహం దెగ్గరికి తెచ్చింది.

శివ : హ్మ్మ్.. ఏదో స్వీట్ లా ఉంది.. ఏంటో తెలియట్లా

మీనాక్షి : మరి ఇదీ.. అని ముందుకు వచ్చింది

శివ : ఇది కూడా స్వీటే, కాని తెలియట్లా ఆగాగు గులాబ్ జాం అదేనా

మీనాక్షి : హా.. అదే

కళ్ళు తెరిచి ముందుగా ముస్కాన్ చేతిలో ఉన్నది తీసుకుని చూసాను కద్దు ఖీర్. గబగబా రెండు స్పూన్లు తినేసి మీనాక్షిని చూసాను, నన్ను చూసి నవ్వుతుంది.

శివ : ముస్కాన్ అంత బాగా చేస్తుంది మరి ఖీర్

మీనాక్షి : మరి నాది ?

శివ : ఇవ్వు.. వావ్ ఇంత సాఫ్ట్ గా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది.. నువ్వే గెలిచావ్

మీనాక్షి : అదేంటి మరి..

శివ : మా అమ్మ వంట రుచి చూడాల్సిన పనిలేదు, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అమ్మని చూసాను.. అమ్మా ఆకలేస్తుంది..
కావేరి కళ్ళ నిండా నీళ్లతో కొంగుతో తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

మీనాక్షి : ఏమైంది శివా

శివ : ఎప్పుడూ పెద్దమ్మ అని పిలుస్తాను కదా అమ్మా అని పిలిచేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యింది

ముస్కాన్ : ఎంత హ్యాపీగా ఉండుంటుందో

శివ : అవును రా.. ఇక నుంచి అమ్మా అనే పిలుస్తాను.. బతికుందో లేదో కూడా తెలియని అమ్మని మనసులో పెట్టుకుని ఈ అమ్మని బాధ పెట్టలేను.

మీనాక్షి : అంటే నువ్వు ఇంకా మీ అమ్మ కోసం వెతుకుతున్నావా

శివ : మీకెలా తెలుసు ఇదంతా, అమ్మ చెప్పిందా

ముస్కాన్ : అవును భయ్యా

శివ : తన గురించి తెలిసేంత వరకు వెతుకుతూనే ఉంటాను, ఆ రోజు తరవాత తను ఉందా చనిపోయిందా, ఎవరు చంపారు.. బతికుంటే ఇప్పుడు ఎక్కడ ఉంది.. జస్ట్ తెలుసుకుంటాను అంతే..

మీనాక్షి : తెలుసుకుని..?

శివ : తెలుసుకుంటాను అంతే ఎప్పటి నుంచో ఈ ప్రశ్నలు నన్ను సరిగ్గా నిద్రపోనివ్వడంలేదు.. ఇదంతా అమ్మతో చెప్పకు

మీనాక్షి : అలాగే

ముస్కాన్ : భయ్యా చెప్పడం మర్చిపోయా ఇవ్వాళ లతీఫ్ వాళ్ళు మళ్ళి వచ్చారు, నాన్నని నన్ను లతీఫ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యమని బలవంత పెడుతున్నారు. నాకు ఇష్టం లేదు

శివ : భయపడకు అయినా ఎందుకు భయం నీ వెనక ఎవరున్నారు

ముస్కాన్ : మా భయ్యా ఉన్నాడు అని వచ్చి వాటేసుకుంది (నవ్వుతూ)

శివ : కదా.. అన్ని నువ్వన్నట్టుగానే జరుగుతాయి, సరేనా

ముస్కాన్ : థాంక్స్

శివ : థాంక్స్ కాదు ఇంకో కప్ ఖీర్ పొయ్యి అని నవ్వాను

నలుగురం భోజనం చేసి ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేసాం. అమ్మా, ముస్కాన్ ఏదో మాట్లాడుకుంటుంటే మీనాక్షి వచ్చి నా పక్కన కూర్చుంది.

శివ : ఇంకా.. ఏంటి విశేషాలు.. నిజంగా గులాబ్ జాం నువ్వే చేసావా

మీనాక్షి : లేదు అత్తయ్య చేసింది

శివ : ఓహ్.. అత్తయ్య
మీనాక్షి : నువ్వు అమ్మా అని పిలుస్తున్నావ్ గా మరి, నేను ఏమని పిలవాలి, రేపటి నుంచి రోజు గంట ట్యూషన్ నాకు వంట నేర్పిస్తా అంది.

శివ : నేర్చుకో

మీనాక్షి : ఇంకా

శివ : చెప్పాలి

మీనాక్షి : ఏముంటాయి.. కంపెనీ పనులు నాన్న చూసుకుంటున్నాడు, తమ్ముడు నా మాట విని బుద్ధిగా చదువుకుంటున్నాడు, అమ్మ ఎప్పటిలానే ఇక నేనేమో ఎప్పుడు నీ చుట్టే నీ గురించే.. ఇక నువ్వేమో అన్ని చూసుకుంటావ్ ఇటు నా గురించి అటు అమ్మ గురించి ముస్కాన్ గురించి ఇంకా నీ మెదడులో ఏం ఏం ఉన్నాయో అంతా హ్యాపీనే.. మర్చిపోయా ఇంకో విషయం ఉంది, ఆ రోజు మనం ముద్దు పెట్టుకున్నాం గుర్తుందా

శివ : ఎప్పుడు

మీనాక్షి : ఆ.. ఎప్పుడంటా పెట్టుకుందే ఒక్కసారి, దుబాయిలో

శివ : హహ గుర్తుందిలే

మీనాక్షి : ఆ రోజు ఇంటికి వెళ్లి పడుకున్నాక కడుపు నొప్పి పుట్టింది, ఎంతలా అంటే ఆ రాత్రి అస్సలు నేను పడుకోలేదు. టాబ్లెట్ వేసుకున్నా ఉపయోగంలేదు.. బాగా నొప్పి పుట్టింది

శివ : డాక్టర్ దెగ్గరికి వెళ్లలేదా

మీనాక్షి : లేదు తగ్గిందికదా అని ఇక పోలేదు

శివ : ఇప్పటికే చీకటి పడింది, వెళతావా

మీనాక్షి : ప్చ్..ఇప్పుడు వెళ్ళాలి, ఎందుకో నిన్ను వదిలి దూరంగా ఉండాలంటే ఏదో పెయిన్ లా అనిపిస్తుంది

శివ : మన వయసు అలాంటిదిలే అని నవ్వాను

మీనాక్షి : ముస్కాన్ పదా వెళదాం

శివ : చాచా ఫోన్ చెయ్యలేదా

ముస్కాన్ : లేదు.. అయినా నీ దెగ్గరికి అని చెప్పానులే ఇంకెందుకు ఫోన్

కావేరి : ముస్కాన్ ఉండు కొంచెం పార్సెల్ చేసి ఇస్తాను ఇంట్లో తింటారు అని లోపలికి వెళ్ళింది, తనతోపాటు ముస్కాన్ కూడా లోపలికి వెళ్ళింది.

మీనాక్షి : ఇంకోటి

శివ : ఏంటి

మీనాక్షి : ముద్దు

శివ : ఇక్కడా.. వద్దు

మీనాక్షి : ఏం కాదులే రా అని శివ కాలర్ పట్టుకుని పక్క రూంలోకి లాక్కెళ్ళింది.

శివ : త్వరగా కాని వాళ్ళు వచ్చేస్తారు

మీనాక్షి : నువ్వెక్కడ దొరికావురా మగడా అని రెండు నిముషాలు వేడి సరసాలు, ముద్దులు ఆడి ఇద్దరం బైటికి వచ్చి చూస్తే అక్కడ ముస్కాన్, కావేరి ఇద్దరు నిల్చొని మమ్మల్నే చూసి నవ్వుకుంటున్నారు.

మీనాక్షి : అదీ ఏదో ఉందంటే చూస్తున్నాం

కావేరి : అలాగా, సరే అని నవ్వు ఆపుకుంది.

మీనాక్షి : టైం అవుతుంది ముస్కాన్ వెళదాం పద అని సిగ్గుపడుతూ బైటికి పరిగెత్తింది.

ముస్కాన్ : బై భయ్యా, బై అమ్మా అని నవ్వుతూ వెళ్ళిపోయింది.

కావేరి : బై జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరూ అని సాగనంపడానికి ఇంటి బైటికి వెళ్ళింది.

సోఫాలో కూర్చుని టీవీ పెట్టాను, అమ్మ లోపలికి వచ్చింది.

కావేరి : పడుకుందాం పదా

శివ : వెళ్ళారా

కావేరి : హా..

శివ : హ్మ్.. ఏమంటుంది మీనాక్షి

కావేరి : ఆమ్మో తనకి అస్సలు వంట రాదు, రేపటి నుంచి రోజు ఒక్క గంట ఇంటికి రమ్మన్నాను

శివ : వెళ్లి పక్క వెయ్యిపో ఈ లోపు నేను స్నానం చేసి వస్తా

కావేరి : హ్మ్మ్.. అని లేచింది

ఇటు ముస్కాన్ ని ఇంటి దెగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళుతూ కారుని మూల తిప్పుతుండగా ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చి పొట్ట పట్టుకుంది. ముందుకు పోనిస్తూ కొంత ఓర్చుకుంది కాని నొప్పి విపరీతంగా పెరగడంతో తనవల్ల కాకా కారు పక్కకి ఆపబోయింది అప్పుడే వెనక నుంచి వస్తున్న లారీ మీనాక్షి కారు లారీకి అడ్డం రాగా డ్రైవర్ కి ఆ స్పీడ్ లో బ్రేక్ వేసినా లారీ ఆగలేదు. ముందున్న మీనాక్షి కారుని గుద్దేసింది.. మీనాక్షి కారు పక్కనే ఉన్న కిరాణా షాప్ గోడని గుద్దుకుని లోపలికి దూసుకెళ్లి ఆగిపోయింది, కార్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచ్చుకున్నాయి కాని అప్పటికే మీనాక్షి స్పృహ తప్పి పడిపోయింది.
Like Reply


Messages In This Thread
అరణ్య - by Takulsajal - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Takulsajal - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Takulsajal - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Takulsajal - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Takulsajal - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Takulsajal - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Takulsajal - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Takulsajal - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Takulsajal - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Takulsajal - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Takulsajal - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Takulsajal - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Takulsajal - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Takulsajal - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Takulsajal - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Takulsajal - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Takulsajal - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Takulsajal - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Takulsajal - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Takulsajal - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Takulsajal - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Takulsajal - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Takulsajal - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Takulsajal - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Takulsajal - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Takulsajal - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Takulsajal - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Takulsajal - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Takulsajal - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Takulsajal - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Takulsajal - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Takulsajal - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Takulsajal - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Takulsajal - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Takulsajal - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Takulsajal - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Takulsajal - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Takulsajal - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Takulsajal - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Takulsajal - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Takulsajal - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM



Users browsing this thread: 1 Guest(s)