Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జాయిలు : బాధపడకండి నాన్నా నాన్నా అంటూ ముద్దులుపెట్టబోయి ఆగిపోయారు , అమ్మా దుర్గమ్మా ...... నాన్న - అమ్మల దైవం మీరేకదా మీరే దారిని చూయించండి , మేము పుట్టకముందు ఎల్లప్పుడూ ఈ రెండుకొండల మీదనుండి నీరు జారి రాజ్యం చుట్టూ నదిలా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసేదట కదా , ఆ రాక్షస రాజు ప్రాణభయంతో పరదేశానికి పారిపోయాడు - ఇప్పుడొచ్చిన మహారాజు మా నాన్న చాలా చాలా గొప్ప వీరాధివీరుడు మంచివారు కదా , ఇంతకుముందులా నీటిని అందివ్వండి అంటూ బాధపడుతూ నా గుండెలపైనుండి కిందకు దిగబోయారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... ఏమిటి అన్నారు అంటూ గుండెలపైకి హత్తుకున్నాను , రెండు కొండల మధ్యన జలమా ...... , అద్భుతమైన ఆలోచన అంటూ సంతోషంతో ముద్దులుకురిపించాను , బుజ్జాయిలూ - చెల్లీ ...... అదిగో ఈ రెండు కొండల మధ్యన ఉన్న విశాలమైన ద్వారానికి అడ్డుగా ఆనకట్ట నిర్మించాము అంటే వర్షపు నీళ్లన్నీ అక్కడే నిల్వ చేయబడతాయి , ఏడాది పొడవునా మనకు అవసరమైన నీళ్లను ఒకవైపున చిన్న చిన్న ద్వారాలు - కవాటాల ద్వారా వదులుకోవచ్చు , అప్పుడు వర్షాలపై ఆధారపడి ఏడాదికి ఒక పంట కాకుండా రెండు మూడు పంటలు వేసుకోవచ్చు ........
యువరాణి : అన్నయ్యా ...... అద్భుతమైన ఆలోచన , నిజంగా మీరు ఈ రాజ్యానికి దేవుడు .....
ఈ ఆలోచన నాదికాదు చెల్లీ ...... , మన బుజ్జి మహి - బుజ్జి మహేష్ ది అంటూ ముద్దులుపెట్టాను .
యువరాణీ : నాన్నకు తగ్గ బిడ్డలు - మహారాజుకు తగ్గ బుజ్జి యువరాజు యువరాణి అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు , అన్నయ్యా ..... అంత పెద్ద ఆనకట్టను ఎలా నిర్మించడం ? .

బుజ్జిమహీ - బుజ్జిమహేష్ ...... ఉదయం మీ అమ్మ చిత్రరూపం వేసారే అలాంటి తెల్లని వస్త్రాన్ని కాస్త పెద్దదిగా తీసుకొస్తారా ? .
యువరాణి : ఏంటీ ...... మాహారాణి మా వదినమ్మ చిత్రరూపం వేశారా ? , బుజ్జాయిలూ ...... ఇప్పటివరకూ గీసినవన్నీ చూయించి మీ అమ్మ చిత్రలేఖనం మాత్రం చూయించనేలేదు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
కాదు కాదు మహారాణీ చిత్రలేఖనం కాదు నా హృదయ దేవకన్య ప్రతిరూపం - రాత్రి వాళ్ళ ఊహాలలోకి కూడా వచ్చిందట .......
మాహారాణి : అంటే నా చిత్రలేఖనం కాదన్నమాట అంటూ చెల్లి చేతిని చుట్టేశారు .
కాదు కాదు మహారాణీ గారూ ....... , క్షమించండి .
యువరాణి : అన్నయ్యా ...... కాస్త అతిశయోక్తిలా లేదూ , మీ హృదయదేవత బుజ్జాయిల ఊహల్లోకి రావడం ఏమిటి ? వాళ్ళు ఆ రూపాన్ని చిత్రించడం ఏమిటీ ? , ఏదో తేడా కొడుతున్నట్లుగా లేదూ ...... కాస్త బాగా ఆలోచించండి అన్నయ్యా అంటూ మహారాణీవైపు చూసి నవ్వుతోంది .
మాహారాణి : ష్ ష్ ష్ ......
చెల్లీ ...... నువ్వే చూడు అంటూ నా వస్త్రం లోపలనుండి తీసి చూయించాను .
యువరాణి : చిత్రలేఖనాలను కూడా హృదయంలోనే దాచుకున్నారన్నమాట అంటూ చూసి , దివినుండి దిగివచ్చిన దేవతలానే ఉన్నారు అన్నయ్యా ...... , మీ చెల్లిని కదా నా కల్లోకి ఎందుకు రాలేదు వదినమ్మా ...... , నాకంటే బుజ్జాయిలంటేనే ఇష్టమన్నమాట ........
మాహారాణి : ష్ ష్ .......
చెల్లీ ...... మహారాణీ గారిని ? .
యువరాణి : ఆసంగతి మేము చర్చించుకుంటాములే కానీ ముందైతే ఆనకట్ట ఆనకట్ట .......

బుజ్జితల్లి : ఇదిగో ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను నాన్నా ..... అంటూ ముద్దుపెట్టి కిందకుదిగి పరుగులుతీసింది .
బుజ్జితల్లీ ...... వస్త్రంతోపాటు పుల్లలు మరియు రంగులుకూడా .......
అయితే నేనుకూడా వెళ్ళాలి అంటూ బుజ్జినాన్న కూడా ముద్దుపెట్టి వెనుకే పరుగులుతీసాడు .
బుజ్జిసింహాలు రెండూ బుజ్జాయిల వెనుకే పరుగులుతియ్యడం చూసి ముచ్చటేసింది . మంజరీ ...... అడవిరాజును , మహారాణీ గారికి కాకుండా బుజ్జాయిల రక్షణను చూసుకోమని తెలియజేయ్యొచ్చుకదా ......
అంతే మహారాణీ గారు ...... చెల్లి చేతిని అందుకుని నా చేతిపై చూరుక్కు మనిపించారు .
స్స్స్ ........
చెల్లి - రాణులు నవ్వుకుంటున్నారు .
మహారాణీగారూ ...... కోపం వస్తే మీరే కొట్టొచ్చుకదా ? .
రాణులు : స్పృశిస్తే తెలిసిపోతుందికదా .......
ఏమి తెలిసిపోతుంది ? .
యువరాణి : అన్నయ్యా ...... బుజ్జాయిలు వచ్చేసారు .

నాన్నా నాన్నా అంటూ అందించారు .
నా బంగారం అంటూ ముద్దులుపెట్టి , రెండు కొండలు ప్రస్ఫుటంగా కనిపించే కొండ కొన బండ రాతి దగ్గరకు చేరుకున్నాను , బుజ్జాయిలను ఎత్తి రాతిపై కూర్చోబెట్టి వారి ఒడిలో బుజ్జిసింహాలను ఉంచి ఇద్దరి మధ్యన వస్త్రాన్ని పరిచాను , కళ్ళు మూసుకుని గురువుగారిని - హృదయంపై చేతినివేసుకుని మహిని తలుచుకుని బుజ్జాయిల నుదుటిపై ముద్దులుపెట్టి మొదలుపెట్టాను .
మాహారాణి : ముద్దులు బుజ్జాయిలకు మాత్రమేనా ? .
బుజ్జాయిలతోపాటు నా మహికి కూడా .......
యువరాణి : హృదయంపై చేతిని వేసుకుని మనసులో పెట్టారు కదా వదినమ్మా అంటూ మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టింది . 
మాహారాణి : అయితే సంతోషమే ......
మహారాణీగారూ ....... ఎందుకంత సంతోషం , తలుచుకున్నది నా దేవకన్యను .......
యువరాణి : సంతోషమే కదా అన్నయ్యా ...... , మీరు ఆనకట్ట పని మొదలుపెట్టండి .

గురువుగారిని తలుచుకుని దశాబ్దాలపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఆనకట్ట నిర్మాణపు ప్రతిరూపాన్ని చిత్రీకరించాను .
మాహారాణి : కళ్ళకు కట్టినట్లుగా ఉంది మహారాజా ..... , ఇంత అద్భుతంగా చిత్రీకరించినందుకు ముద్దు ద్వారా అభినందించి ప్రోత్సహించాలని ఉంది .
అంతే బుజ్జాయిల వెనుక దాక్కోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు , మహారాణీ గారూ ...... తప్పు పెద్ద తప్పు .
మాహారాణి : రాజ్యం కోసం ఇంతలా ఆలోచిస్తున్న మిమ్మల్ని అభినందించుకోవడం మహారాణిగా నా ధర్మం .
అలాగైతే ఈ ఆనకట్టకు ఆధ్యులు మన బుజ్జాయిలు ..... , వారిని ఎన్ని ముద్దులతో కావాలంటే అన్ని ముద్దులతో అభినందించండి .
మాహారాణి : " మన " అన్నారు ప్రస్తుతానికి అధిచాలు ముద్దుల సంగతి తరువాత చూద్దాము , నా బంగారాలు ఎప్పుడూ వాళ్ళ నాన్నలానే అంటూ బుజ్జి బుజ్జి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మహారాణీ గారూ ...... నా ఉద్దేశ్యం అధికాదు అధికాదు ......
మహారాణీ : ఏదో ఒక ఉద్దేశ్యం ఉందికదా అంటూ చెల్లి చేతిని చుట్టేసి ఆనందిస్తున్నారు .
ఏదీలేదు ఏదీలేదు ......

యువరాణి : ఉందీ - లేదు ...... ఆ సంగతి మీ హృదయమే చూసుకుంటుంది , అన్నయ్యా ...... ఇంతపెద్ద ఆనకట్ట నిర్మించాలంటే నెలలు పట్టేలా ఉంది , మీ దేవకన్య కోసం మీరు వెళ్లాలికదా .......
వెళ్ళాలి తప్పదు కానీ దైవం మరో దారిని చూయించారు , నావల్లనే జరిగిన నష్టాన్ని నేనే నివారించి వెళతాను , మహి కోరుకునేది కూడా అదే , అంతవరకూ మహికి తోడుగా తల్లి దుర్గమ్మ - నదీ అమ్మలు ఉంటారని నమ్మకం .
అన్నయ్యా ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపైకి చేరింది , మేముకూడా అంటూ బుజ్జాయిలిద్దరూ గుండెలపైకి చేరి ముద్దులుకురిపిస్తున్నారు .
మహారాణీ : మరి నేను ? .
వద్దు వద్దు వద్దు ........
మాహారాణి : ప్చ్ ప్చ్ ..... , ( రాత్రికి మీ సంగతి చెబుతానులే అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంది ) .

చెల్లీ ....... ఈ బృహత్కార్యానికి చాలామంది అవసరం .
యువరాజు : అన్నయ్యా అన్నయ్యా ...... నాకెందుకు చెబుతున్నారు , మాహారాణి మా వదినమ్మ కదా ......
మహారాణీ గారూ ...... 
మాహారాణి : దేవుడే మహారాజుగా వచ్చారు , మీ ఇష్టం ఎలా పరిపాలిస్తారో .......
సంతోషం మహారాణీ ...... , భటులారా ...... మన రాజ్యంలోని కష్టించి పనిచెయ్యగలిగే మగవాళ్ళందరికీ ఈ విషయం చెప్పి వెంటనే కింద ఉన్న ఉద్యానవనంలోకి పిలుచుకునిరండి .
భటులు : చిత్తం మహారాజా ...... 

బుజ్జాయిలూ ...... కిందకు వెళదామా ? .
బుజ్జాయిలు : సంతోషంతో కేకలువేసి ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ఆకలివేస్తోందా ? , చెలికత్తెలారా ..... పళ్ళు తీసుకురండి , బుజ్జితల్లీ ...... మీ బజ్జుసింహాలు ఏమి తింటాయి ? .
బుజ్జాయిలు : మాకంటే బుజ్జి సింహాలు కదా , పాలు మాత్రమే త్రాగుతాయి అంటూ కిందకుదిగి అడవిరాణి చెంతకు వదిలారు .
చిత్తం మహారాజా అంటూ వెళ్లి తీసుకొచ్చి బుజ్జాయిలకు అందించారు .

మహారాజా - అన్నయ్యా - మహారాజా ...... మేమూ వస్తాము అనుమతి ఇవ్వండి అంటూ మాహారాణి - చెల్లి - రాణులు విన్నవించుకున్నారు .
మీ ఇష్టం .......
యువరాణి : ఇలా ఏ మహారాజు అనలేదు అన్నయ్యా ...... , మమ్మల్ని శరీర వాంఛలకోసం మాత్రమే మందిరాలలోనే బంధీలు చేసేసేవారు .
స్త్రీలకు స్వేచ్ఛ లభించినప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది , నేను ఉన్నంతవరకూ పూర్తి స్వేచ్ఛ .......
చాలా చాలా సంతోషం అన్నయ్యా - మహారాజా అంటూ కౌగిలించుకుని వెనుకే కిందకువచ్చారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2023, 10:17 AM



Users browsing this thread: 24 Guest(s)