Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఫ్లైట్ ఆన్ టైం కావడం  వల్ల  రాత్రి  8 కి   హైదరాబాదు చేరుకున్నాను. బయటికి  రాగానే  షబ్బీర్  ఉన్నాడు  కార్ తో.
“ఏంట్రా మామా , ఎలా జరిగింది నీ ట్రిప్”
“ఏముంది అంతా బాగానే జరిగింది , ఇక్కడ ఏంటి  విశేషాలు”
“ఏమున్నాయి  అన్నీ  సవ్యంగానే జరుగుతున్నాయి.” అంటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ  ఇంటికి తీసుకొని వచ్చాడు. 
“రెస్ట్ తీసుకో రా  పొద్దున్నే మాట్లాడు కుందాము  ఆఫీస్ లో” అంటూ  నన్ను  డ్రాప్ చేసి  వెళ్ళిపోయాడు.
“ఎం   నాయనా  నీ టూర్  లు అన్నీ అయిపోయాయా  ఇన్ని రోజులకు  ఇల్లు గుర్తుకు వచ్చిందా?”  అంది అమ్మ.
“అయిపోయినాయి  లే” అంటూ   లోపలి కి  వెళ్లి  ఫ్రెష్ అయ్యి వచ్చి  అమ్మతో మాట్లాడుతూ కుచోన్నా.
“తొందరగా పెళ్లి చేసుకో , ఆ అమ్మాయి ఇంట్లో ఉంటె నాకు తోడూ ఉంటుంది , నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు నష్టం ఉండదు”
“అలాగే చేసుకుంటా  కానీ  శాంతి  వాళ్ళ  ఇంట్లో  వాళ్ళ తాతయ్య పోయారు గా అందుకో  ఓ సంవత్సరం పాటు ఎటువంటి  శుభ కార్యాలు జరుపు కోకూడదు అన్నారు  అందుకే  లేటు” అన్నాను.
“సరే నేను రేపు  శాంతి వాళ్ళ  నాన్నతో మాట్లాడ తాను, చూద్దాం ఎం అంటాడో” అంటూ   తన టాబ్లెట్  వేసుకొని పడుకుంది. నేను కూడా అమ్మతో పాటు పడుకోండి పోయాను.
ఉదయం  6  కు  మెలుకవ వచ్చింది.  అమ్మ అప్పటికే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉంది.    నేను రెడీ అయ్యి  వచ్చే సరికి టిఫిన్  రెడీ  గా  ఉంది.
“నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నన్ను శాంతి  వాళ్ళ ఇంట్లో దింపి వెళ్ళు” అంది.
 
అమ్మను  శాంతి   ఇంట్లో దింపి  ఆఫీస్ కి వెళ్లాను.  దాదాపు   రెండు వారాలు  లేకపోవడం వల్ల కొద్దిగా వర్క్ పెండింగ్  లో ఉంది. కానీ  షబ్బీర్  ఉండడం వల్ల  అన్నీ వాడే చూసుకోంటున్నాడు.   నా పని  ఒక్కటే   చెక్స్ మీద సంతకం పెట్టడం.  అది కూడా షాహిన్  కి చెక్ అథారిటీ  ఇస్తే  సరిపోతుంది , నేను లేకపోయినా పనులు జరుగుతాయి.
నేను వెళ్ళేటప్పుడు  కావలసినన్ని   ఖాళీ చెక్కలు మీద  సంతకం చేసి వెళ్లాను.  అందుకే పెద్ద ఇబ్బంది రాలేదు.
షాహీన్  వచ్చింది  బుక్స్ తీసుకొని.
“ఏంటి  అంతా  ఓకే నా ఇంట్లో , నూర్ ఎలా ఉంది  , మీ అమ్మీ , అబ్బు  ఎలా ఉన్నారు”
“అందరు బాగున్నారు ,  రెండు మూడు సార్లు అడిగింది నూర్   శివా ఎప్పుడు వస్తున్నాడు అని, నాకు తెలీదు అని చెప్పా”
“చెక్స్ అన్నీ  వాడేశావా  లేక ఇంకేమైనా  ఉన్నాయా”
“ఇదిగో ఇదే  లిస్టు” అంటూ నా ముందు ఓ  పుస్తకం ఉంచింది , అందులో  ఎన్ని  దేని కోసం వాడారు , అన్ని లెక్కలు ఉన్నాయి”
“బ్యాంకు  నుంచి   కొన్ని ఫోరమ్స్  తీసుకొని  రా , నిన్ను కూడా ఓ  సిగ్నాటరీగా పెడదాం” అన్నాను.
“మీరు ఇద్దరు ఉన్నారుగా  చాలదా , నేను ఎందుకు?”
“ఇలా  ముందుగా చెక్స్ మీద సంతకం చేయడం నాకు ఇష్టం ఉండదు,  ఎవరైనా  ఇద్దరు సంతకం పెట్టేట్లు  అమెండ్ చేద్దాం  బ్యాంకు లో , నిన్ను కూడా ఆడ్  చేస్తూ నేను లేనప్పుడు  నువ్వు షబ్బీర్ ఇద్దరు  సంతకాలు పెట్టొచ్చు”
“నేను మీ డబ్బులు అన్నీ  తీసుకొని పారిపోతే” అంది నా వైపు  చూసి కొంటే  గా నవ్వుతు.
“అంత  దాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళు నిన్ను వద్దు అనేది  ఎవ్వరు” అన్నాను.
“ఉరికే అన్నాలే, నిన్ను వదిలి ఎక్కడికీ నువ్వు పొమ్మన్నా పోములే”
“ఎందుకో  అంత  ప్రేమ  నా మీద”
“ఏమో  మా  అక్కను , మా అబ్బును అడుగు చెపుతారు ,  నాకు చెప్పడం సరిగా రాదు” అంది అదే నవ్వు మొహం  తో.
“కొద్దిగా  దగ్గరికి  రా  నేను చెప్తా  ఎందుకో” అన్నాను  
“ఇది ఆఫీస్  , ఇల్లు కాదు” అంది హింట్ ఇస్తూ  ఇల్లు అయితే  రెడీ  అన్నట్లు.
“అయితే  రేపు  చెక్స్ తీసుకొని ఇంటికి రా , నేను ఫోన్ చేస్తాను”
“అమ్మా  ఆశ , మీరు ఎలాగు ఆఫీస్ కి వస్తారుగా ఇంక నేను  ఇంటికి రావడం ఎందుకు”
మేము మాట్లాడుతూ ఉండగా షబ్బీర్  వచ్చాడు.
“రే  , నవ్వు  లేనప్పుడు  ఆ  పాతబస్తీ MLA ఓ సారి ఫోన్ చేశాడు. నీతో ఎదో మాట్లాడాలి అంట” అంటూ తన నెంబర్  ఇచ్చాడు.
“నేను తీరికగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాలే” అంటూ   షబ్బీర్  అయేషా తో బిజినెస్  విషయాలు మాట్లాడుతూ  రోజంతా  గడిపేశాను.
ఇంటికి వెళ్ళే ముందు  శివాని  కి ఫోన్ చేసాను.
“నువ్వు ఎప్పుడు వచ్చావు , అక్కడ అంతా  ఓకే  కదా” అంది
“నిన్ననే వచ్చాను , అంతా ఓకే, నువ్వు ఎలా ఉన్నావో అని ఫోన్ చేసాను”
“నేను బానే ఉన్నాను, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు,  ఇప్పుడు జాబ్ లో  ఉన్నా  కొద్దిగా బిజీ  తరువాత ఫోన్ చేస్తా” అంటూ ఫోన్ పెట్టేసింది.
“తను సెటిల్ అయ్యింది ,  ఇంక తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.  అనుకొంటు  బండిని ఇంటి వైపు తిప్పాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 31-12-2022, 10:20 PM



Users browsing this thread: 25 Guest(s)