Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అలా వెళ్లిన మంత్రి వెంటనే వెనక్కువచ్చాడు - యువరాణీ ...... స్వయంగా పురోహితులే రాజ్యప్రజలందరితో కలిసి విచ్చేస్తున్నారు .
యువరాణి - మహారాణి : ఆశ్చర్యం వారే వస్తున్నారా ..... ? అంటూ ప్రాంగణానికి చేరుకున్నారు , రాజ పురోహితులకు స్వాగతం అంటూ సాధరంగా ఆహ్వానించి ఆశీర్వాదం తీసుకున్నారు .
పురోహితులు : మహారాణీ - యువరాణులకు ఆశీర్వాదాలు .
యువరాణి : మిమ్మల్నే ఆహ్వానించాలనుకున్నాము అంతలోపు మీరే దర్శనమిచ్చారు .
పురోహితులు : తప్పక రావాల్సిన పరిస్థితి యువరాణీ ....... , రాజ్యంలో వర్షాలు పడాలంటే వెంటనే శుభకార్యం జరగాలి .
యువరాణీ - మహారాణీ - చెలికత్తెలు ....... ఒకరివైపు మరొకరు చూసుకున్నారు .
పురోహితులు : ఆ శుభకార్యం ఎవరికి జరిపించాలో విన్నవించుకోవడానికే విచ్చేసాము - కానీ ఎలాచెప్పాలో అర్థం కావడంలేదు అంటూ సంశయిస్తున్నారు - ఆ శుభకార్యం జరిగితే మన రాజ్యంలో వర్షాలు విరివిగా కురవడమే కాదు రాజ్యం సకల సంతోషాలతో విరాజిల్లుతుంది .
యువరాణి : అయితే ఎవరికో వెంటనే తెలియజేయ్యండి పురోహితులారా జరిపించేద్దాము .
పురోహితులు : అదీ అదీ అదీ .......
యువరాణి : రాజ్యం సంతోషం కోసం అయితే ఎందుకు సంశయిస్తున్నారు , సంకోచించకుండా చెప్పండి .
పురోహితులు : అందరూ ఒకరినొకరు చూసుకున్నారు , మ అక్షరంతో మొదలయ్యే రాశులు గల వారికి వివాహం జరిపితే వెంటనే వర్షాలు కురుస్తాయి , మన రాజ్యానికి దేవుళ్ళు అనుగ్రహం లభిస్తుంది .
యువరాణి : ఎవరికో అర్థమైనట్లు సిగ్గుపడుతున్న మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టి , వారెవరో మీరే తెలపండి పురోహితులారా అంటూ అడిగింది .
పురోహితులు : అదీ అదీ ..... మన రాజ్య ప్రజలకోసం అహర్నిశలూ ఆలోచించే వీరాధివీరుడైన మహారాజు మహేశ్వరుడికి మరియు మరియు .......
యువరాణీ : మరియు .....
పురోహితులు : మహారాజుతో ..... మా రాజ్యప్రజల సంతోషాలకోసం ఆరాటపడే దేవతైన మహా ..... మహారాణీ గారి వివాహం జరిపించాలి , తప్పుగా మాట్లాడితే మమ్మల్ని మన్నించండి కానీ శాస్త్రాల ప్రకారం ఇదొక్కటే మార్గం ......

యువరాణీ సంతోషాలకు అవధులులేనట్లు వదినమ్మా అంటూ కౌగిలించుకుని ముద్దులుకురిపిస్తోంది .
చుట్టూ చెలికత్తెలు సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు .
పురోహితులు : మహారాణీవారికి ఇష్టమే అన్నమాట అంటూ ఊపిరిపీల్చుకున్నారు - రాజ్యప్రజలు ఆనందిస్తున్నారు .
చెలికత్తెలు : ఇష్టం అంటారు ఏంటి పురోహితులారా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అంటూ మా ప్రేమ మరియు జరిగిన వివాహం మరియు వివాహం గురించి వివరించారు .
రాజ్యప్రజాలందరూ ఉద్వేగాలకు లోనైనట్లు కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుని ఆనందిస్తున్నారు .
పురోహితులు : మహారాణీ వివాహంతోపాటు రాజ్యపు రక్తం అయిన యువరాణీ వివాహం కూడా జరిగితే మరింత లాభం .......
మహారాణి : ఖచ్చితంగా ఖచ్చితంగా పురోహితులారా ...... శుభకారమైన విషయం చెప్పారు అంటూ చెల్లెమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

యువరాణి : ఆనందంతో మహారాణీ గుండెల్లో ఒదిగిపోయింది , ఇందులో ఒక మతలబు ఉంది ప్రజలారా ...... , వివాహం అయ్యేంతవరకూ వదినమ్మ ఎవరనేది తెలపనని ఒకరికి ( దుర్గమ్మకు ) మాటిచ్చారు .
మరి మహారాజుగారు వివాహానికి ఒప్పుకుంటారా అంటూ ఒక అమ్మ అడిగారు .
యువరాణి : ప్రాణం పోయినా ఒప్పుకోరు అన్నయ్య ....... , అన్నయ్య హృదయంలో దేవకన్యకు తప్ప మరొకరికి స్థానం లేదు .
మరెలా .......
యువరాణి : మీరు అనుకుంటే సాధ్యం ...... అర్థమయ్యిందా ? .
ప్రజలు : అర్థమైంది అర్థమైంది , మేమంటే మేము సంతోషంగా ఉండాలన్నదే మహారాజుగారి ఏకైక కోరిక , ఆ ఒక్కటి చాలు కథను కంచికి చేరుస్తాము .
యువరాణి : అయితే వెంటనే ఆనకట్ట దగ్గరికి బయలుదేరదాము .
ప్రజలు : ఒక్కమాట ఒక్కమాట మహారాణీ గారు కూడా ఇష్టం లేనట్లుగానే వ్యవహరించండి ఇక మేము చూసుకుంటాము .
యువరాణి : కలలోనైనా కాదనలేరు కానీ ఎలాగోలా ఒప్పిస్తాను మరి , వదినమ్మా .........

అంతే పిల్లా పెద్దా రాజ్య ప్రజలందరూ పురోహితులతోపాటు ఆనకట్ట దగ్గర ఆలోచిస్తున్న మాదగ్గరికి చేరుకున్నారు , మహారాణీ - యువరాణి ...... పిల్లల మధ్యన దాక్కుని ఆనందిస్తున్నారు .

రాజ్యప్రజలందరూ రావడం చూసి , ప్రజలారా ఏమైంది అందరూ ఇలావచ్చారు అని అడిగాను .
ప్రజలు : ప్రభూ ..... రాజ్యంలో ఆహారనిల్వలు అయిపోవచ్చాయి , త్వరలో వర్షాలు పడకపోతే కరువు సంభవిస్తుంది .
లేదు లేదు లేదు అలా జరగకూడదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను , నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మీ సంతోషం కోసం రాజుగా ఎంతదూరం అయినా వెళతాను , నా ప్రాణాలను కూడా .......
ప్రజలు : మా మహారాజు గురించి మాకు తెలుసు - మేమంటే ఎంత ఇష్టమో కూడా తెలుసు , వెంటనే వర్షాలు పడే మార్గాన్ని పురోహితులు విన్నవించారు .
అవునా అవునా రాజా పురోహితుల్లారా ...... అదేంటో తెలియజేయ్యండి వెంటనే వెంటనే అమలుపరుస్తాను .
పురోహితులు : మీచేతుల్లోనే ఉంది మహారాజా ......
నాచేతుల్లోనా అంటూ నావైపుకు చూస్తున్న బుజ్జాయిల వైపుకు చూసాను .
ప్రజలు : అవును మీచేతుల్లోనే ఉంది మహారాజా ...... 
పురోహితులు : అవును మహారాజా ...... , ఎన్నడూ సంభవించని ఈ ఉపద్రవానికి ఫలితం మహామహులైనవారికే అంతుచిక్కకపోవడంతో మన గ్రంథాలయంలోని పురాతన శాస్త్రాలను మరియు తాళపత్ర గ్రంథాలను తిరగేస్తే ఉపాయం లభించింది - ఆకాలంలోనే జ్ఞానులైన మన పూర్వీకులు ...... మూర్ఖులైన రాజులవలన ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని దానిని అంతమొందించడానికి పరమేశ్వర ప్రసాదమైన వీరాధివీరుడు మహేశ్వరుడు వస్తాడని రాసి ఉంది ఇదిగో ఇలా దేవుడిలా వచ్చి రాజ్య ప్రజలందరినీ కాపాడారు , రాజ్యం వర్షాలు - పచ్చని పంటలతో కళకళలాడాలంటే ఆ పరమేశ్వరుడి ప్రసాదమైన మా మహేశ్వరుడి వివాహం పార్వతీ దేవి ప్రసాదమైన మా మహారాణీ వారితో అంగరంగవైభవంతో జరిపించాలి . 
అంతే అలా కదలకుండా ఉండిపోయాను .......

బుజ్జాయిలయితే పట్టరాని సంతోషంతో బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి సంతోషపు కేకలువేస్తూ కిందకుదిగి అమ్మవారి చెంతకువెళ్లి మొక్కుకుంటున్నారు - బుజ్జాయిల ఆనందాలను చూసి బుజ్జిసింహాలూ ప్రార్థిస్తున్నాయి , నాన్నా నాన్నా ....... ఇన్నాళ్లకు మాకోరిక తీరబోతోంది అంటూ పూలవర్షం కురిపించారు .
తేరుకుని లేదు లేదు అలా జరగడానికి వీలులేదు , ఈ హృదయంలో ఒక్కరికే స్థానం నన్ను మన్నించండి ప్రజలారా ...... , పురోహితులారా వేరే మార్గమేమైనా ఉంటుంది చూడండి , ఇలా ఎక్కడైనా రాసి ఉంటుందా ...... ? .
పురోహితులు : కావాలంటే మీరే స్వయంగా చూడండి ప్రభూ అంటూ శిథిలావస్థకు చేరిన తాళపత్ర గ్రంథాన్ని అందించారు .
చూస్తే ఇప్పటివరకూ జరిగినది అచ్చుగుద్దినట్లు అప్పట్లోనే రాశారు - అంతే చేతిలో గ్రంథంతో బండరాయిపై కూలబడ్డాను .
బుజ్జాయిలు ముద్దులుకురిపిస్తూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు .
పురోహితులు : మహారాజా ...... వారం దినములలో దివ్యమైన దైవ ముహూర్తం , ఆ ముహూర్తాన మహారాజు - మహారాణీ వివాహంతోపాటు యువరాణీ వివాహం కూడా జరిపించవచ్చు .
చెల్లెమ్మ వివాహం ...... చాలా సంతోషం కానీ నేనొప్పుకోలేను అంతకన్నా నా ప్రాణాలు ఇవ్వమనండి సంతోషంగా ఇస్తాను - ఈ జనం నా మహికోసం .......

తమరు ఒప్పుకుంటే మాత్రం సరిపోతుందా నేను ఒప్పుకోవాలికదా ....... అంటూ మహారాణీగారు వచ్చారు .
యువరాణి : వదినమ్మా .......
మన్నించండి మన్నించండి మహారాణీగారూ ...... అదే నేనూ సెలవిస్తున్నాను , అలా ఎన్నటికీ జరగకూడదు , పురోహితులారా ..... నాదొక సందేహం అయినా ఆ జగన్మాత పరమేశ్వరి అంశ మహి కదా కానీ మన మహారాణీ గారి పేరు హిమ ......
పురోహితులు : గ్రంథాలు చదివిన మీలాంటి వీరాధివీరులకు తెలియనిది ఏముంటుంది హిమ అంటే గంగ , గంగమ్మ కూడా పరమేశ్వరీ అంశమే మహారాజా ........
తప్పించుకునే మార్గమే లేదన్నమాట .......
పురోహితులు - ప్రజలు : మహారాణీ గారికి మేమంటే ఇష్టం మాకోసం ఎలాగైనా ఒప్పుకుంటారు - మీరు ఒప్పుకోకపోతే అతిత్వరలో కరువుకాటకాలతో అల్లాడుతాము , ఎలాగో అప్పుడు ఆహారం ఉండదు కాబట్టి మీరు ఒప్పుకునేంతవరకూ పిల్లలు - వృద్ధులు తప్ప ప్రతి ఒక్కరమూ మీరు ప్రార్థించే ఈ అమ్మవారి ముందు ఉపవాసదీక్షలో ఉండిపోతాము .
బుజ్జాయిలు : మేముకూడా అంటూ నాబుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి అమ్మవారి ముందు కూర్చున్నారు - తోడుగా బుజ్జిసింహాలూ ......
పిల్లలు : అయితే మేముకూడా అంటూ వెళ్లి బుజ్జాయిల చుట్టూ కూర్చున్నారు .
ప్రజలు : మాగురించి ఎలాగో పట్టించుకోరు పిల్లల గురించి అయినా ఆలోచించండి , మాటంటే మాటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోము అంటూ అందరూ వెళ్లి కూర్చున్నారు .

అంతలో గుర్రంపై యువరాజు వచ్చి చెల్లెమ్మను అమాంతం పైకెత్తి ఆనందాన్ని పంచుకున్నాడు .
చెల్లెమ్మ : అంతలా ఆనందపడకు అన్నయ్య పెళ్లికి ఒప్పుకోవడంలేదు మన వివాహమూ జరగదు .
యువరాజు : ఒప్పుకోలేదా ..... ? , మహారాజా ..... కాదు కాదు బావగారూ సంతోషం కొద్దిసేపైనా లేకుండా చేశారు , మీరు ఒప్పుకునేంతవరకూ నేనుకూడా ఉపవాసమే అంటూ వెళ్లి చెల్లెమ్మ ప్రక్కన కూర్చున్నారు .

బుజ్జాయిలు : అమ్మా అమ్మా ఒప్పుకోవే .......
మహారాణి : సరే...... , మీకోసం - చెల్లికోసం - మన రాజ్యం కోసం ఒప్పుకుంటున్నాను .
సగం సంబరాలు నెలకొన్నాయి .
మహారాణీ గారూ ..... ఎంత పథకం పన్నారు , కావాలనే కాదని అందరి బలవంతంతో ఒప్పుకున్నట్లు నాటకం ....... , నేనైతే ఒప్పుకోనే ఒప్పుకోను .
మహారాణీ : నా రాజ్యపు ప్రజలకోసం నేనుకూడా ఉపవాసదీక్ష చేస్తాను అంటూ వెళ్లి అందరి మధ్యలో కూర్చున్నారు .

యువరాజు : బావగారూ ...... మీరు ఒప్పుకోకుంటే ఈ రాజ్యంతోనే ఆగదు , ఒక్క వర్తమానం పంపాను అంటే మా రాజ్యంలోని ప్రజలతోపాటు మన సామంతారాజ్యంలోని ప్రజలూ వచ్చేస్తారు .
ఈ ఒక్కటీ తప్ప ఏమైనా చేస్తాను , మీరంతా నాకు మద్దతు ఇవ్వకపోయినా నా మిత్రులు ........
అంతే మంజరి - కృష్ణ - సింహం మిత్రుడు ...... ఒక్కొక్కరుగా వెళ్లి మహారాణీ గారి ప్రక్కకు చేరుకున్నాయి .
మహారాణీ - యువారాణీ - బుజ్జాయిలతోపాటు అందరి నవ్వులు ......
మీరుకూడానా ...... మిత్రులారా , అమ్మా దుర్గమ్మా ..... వీరికెలా తెలియజెయ్యగలను , ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్య మరొకవైపు రాజ్యపు సంతోషం ...... , నేను వివాహం చేసుకోలేను నేనుకూడా ఉపవాసం అంటూ మరొకవైపుకు తిరిగి కూర్చున్నాను .

కాసేపటికే సూర్యుడు తన ప్రతాపం చూయించడం మొదలెట్టాడు , తిరిగిచూస్తే కొద్దిమంది పిల్లలు ఎండలో ఉన్నారు , బుజ్జితల్లీ ...... పిల్లలందరూ చెట్టు చాటున కూర్చోండి .
బుజ్జాయిలు : అలాగే నాన్నగారూ అంటూ నీడన కూర్చున్న పిల్లలతోపాటు లేచి ఎండలో కూర్చున్నారు .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : అమ్మా నాన్న కలిసేంతవరకూ ఇంతే ......

మరికొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ ..... మీ ముద్దులులేకుండా ఉండలేకపోతున్నాను .
బుజ్జాయిలు పరుగునవచ్చి , అమ్మకు ముద్దులుపెడితేనే మేము ముద్దులుపెట్టేది అంటూనే ముద్దులుపెట్టి పరుగునవెళ్లి ఎండలో కూర్చున్నారు .
ప్రజలంతా నవ్వుకున్నారు .
ప్రజలారా ...... ఎండ ఎక్కువగా ఉంది ఉపవాసం విరమించి పిల్లలకు దాహం తీర్చి మీరుకూడా ......
ప్రజలు : మాగురించి ఆలోచించేవారు అయితే వివాహానికి ఒప్పుకోండి , మా కష్ట సమయాలలో మాకు ఎంతో సహాయం చేసిన మా దేవతలాంటి మహారాణీ గారిని వివాహం చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి .
ఆ అర్హత నాకు లేదు ప్రజలారా .......
ప్రజలు : దేవతను వివాహం చేసుకునే అర్హత దేవుడికి మాత్రమే , అయినా మీతో మాటలు అనవసరం మిట్ట మధ్యాహ్నం ఎండకే నాలుకలు తడారిపోతున్నాయి , కొద్దిసేపట్లో పిల్లలు - వృద్ధులు - ఆడవారు స్పృహకోల్పోతారు ఆ పాపం ఎవరిదో మీరే ఆలోచించుకోండి .
అలా జరగకూడదు , ప్రజలారా ...... నాకు ఇప్పటికే మీ మహారాణీ గారి మనస్సులాంటి దేవకన్యతో వివాహం జరిగింది .
ప్రజలు : వీరాధివీరులైన మహారాజులూ బహు వివాహాలుకూడా చేసుకోవచ్చు .
కానీ నేను ఏక .......
ప్రజలు : మాకు వినపడటం లేదు , మాట్లాడితే దాహం ఎక్కువ వేస్తోంది .
అయినా వివాహం చేసుకున్నాక వర్షం పడకపోతే .......
పురోహితులు : మహారాణీ గారూ అంటూ గుసగుసలాడారు , మహారాజా మహారాజా ...... ఇప్పుడు సరైన మాట అన్నారు , మీరు తొలిముడి వేసినప్పుడు మేఘావృతం కాకపోయినా రెండవ ముడికి ఉరుములు మెరుపులు రాకపోయినా మూడవ ముడి పడేసరికి చినుకులు పడకపోయినా వెంటనే వెంటనే శాస్త్రం ప్రకారం వివాహాన్ని రద్దుచేస్తాము .
మహారాణి : నాకు సమ్మతమే .......
మహారాణీగారికి ఏదైనా సమ్మతమే .......
నవ్వులు విరిసాయి .
నా గుండెలపై చేతినివేసుకుని ఊహూ ఊహూ ..... ఒప్పుకోలేను .
అయితే మేమూ ఉపక్రమించము ........

మధ్యాహ్నం అయ్యింది - సాయంత్రం అయ్యింది - చీకటిపడింది .
పిల్లలు ...... ఆకలి ఆకలి అంటూ గోలచేస్తున్నారు .
వెంటనే స్వయంగా నేనే అరణ్యంలోకివెళ్లి బోలెడన్ని పళ్ళు తీసుకొచ్చి పిల్లల ముందు ఉంచాను .
పిల్లలు : ఊహూ ..... ఆకలి అన్నాముకానీ తింటాము అనలేదుకదా మహారాజా ....... , ఎన్నిరోజులైనా ఇలానే ఉంటాము , పొట్టలో నొప్పివేస్తోంది అయినా పర్లేదు ........
పిల్లలూ దయచేసి ఆహారం తీసుకోండి , రేపు ఆలోచిద్దాము , ప్రజలారా పిల్లలకు తినిపించండి .
ప్రజలు : వాళ్ళు మా మాట వినే స్థితిలో లేరు మహారాజా ...... , అందరి భవిష్యత్తు మీ నిర్ణయంపైననే ఆధారపడి ఉంది , కరువు సంభవిస్తే ఎలాగో ఈ పరిస్థితి వస్తుంది అదేదో ఇప్పటినుండే అలవాటు చేసుకుంటాము , పిల్లలు ఎలాగో తట్టుకుంటారు పాపం చాలామంది వృద్ధులు ఉన్నారు ఉదయానికల్లా ఉంటారో .......
ప్రజలారా అలా అనకండి , నావైపు కూడా ఒకసారి ఆలోచించండి .
పురోహితులు : ఆలోచించే సమయం లేదు మహారాజా ...... , మూడురోజులలోగల ముహూర్తం దేవతలకిష్టమైన ముహూర్తం ......
ఉదయమేకదా వారం దినాలు అన్నారు .
పురోహితులు : వారం దినములలో అన్నాము వారం రోజుల తరువాత కాదు మహారాజా ....... 

తెల్లవారుతుండగా బామ్మా బామ్మా ...... ఏమైంది , వైద్యులు ఎక్కడ ......
పరుగునవెళ్లాను .
స్పృహకోల్పోయిన బామ్మను పరీక్షించి వెంటనే ఆహారం తీసుకోవాలి లేకపోతే ప్రాణాపాయం .......
వెనువెంటనే ఒక్కరొక్కరుగా వృద్ధులు స్పృహకోల్పోతున్నారు .

కన్నీళ్లను తుడుచుకుని అమ్మవారి చెంతకు వెళ్లి , అమ్మా ..... మీరే సరైన మార్గంవైపుకు తీసుకెళతారని భావిస్తున్నాను , రాజ్య ప్రజల శ్రేయస్సు కంటే రాజుకు మరొకటి ముఖ్యం కాదు , మహీ ...... నన్ను మన్నించు - నీ నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాను మన్నించరాని నిర్ణయం తీసుకోబోతున్నాను , ప్రజలారా ఒప్పుకుంటాను కానీ ఒక్కటి వివాహం తరువాత .......
వర్షం పడకపోతే మీ ఇష్టం మహారాజా అంటూ ప్రజలందరూ లేచి మహారాజా మహారాజా ...... అంటూ అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు .
నాన్నా నాన్నా .......
కిందకుదిగి బుజ్జాయిలను ఎత్తుకుని అఅహ్హ్ ...... ప్రాణం లేచొచ్చింది మీరులేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ ముద్దులుకరిపించాను , మహారాణీ - యువరాణి సంతోషాలను కోపంతో చూస్తున్నాను .
బుజ్జాయిలు : ప్రజలారా ...... అమ్మవైపు కోపంతో చూస్తున్నాను నాన్నకు ఇష్టంలేదు మళ్లీ కూర్చోండి కూర్చోండి .
లేదు లేదు ఇష్టమే ఇష్టమే ఇదిగో ఇదిగో సంతోషం ......
మా నాన్న బంగారం అంటూ ముద్దులుపెట్టారు బుజ్జాయిలు .

ఇక చూడండి దేవుడు - దేవత వివాహానికి రెండు రోజులే ఉన్నా ఎలాంటి ఏర్పాట్లు చేస్తామో ...... భూలోకమంత అలంకరణ ఆకాశమంత పందిరి  .......
ఆగండాగండి ముందైతే పిల్లలు - వృద్ధులకు తినిపించి మీరూ తినండి , సైనికులారా ...... పళ్ళు అందించండి అంటూ బుజ్జాయిలకు తినిపించి తిన్నాను .
బుజ్జాయిలు : అమ్మకు కూడా తినిపించండి నాన్నగారూ ......
పురోహితులు : అవునవును తినిపించండి అదే నిశ్చితార్థానికి సంకేతం అంటూ మహారాణీ గారిని నాముందుకు ప్రవేశపెట్టారు .
తప్పదా ......
బుజ్జాయిలు : తప్పదు నాన్నగారూ ...... , అత్తయ్యా ..... మీరుకూడా మామయ్యకు తినిపించండి .
చెల్లెమ్మ : ఆ తినిపించేదేదో ముసుగుతీసి తినిపించండి అన్నయ్యా - మీ దేవత సౌందర్యం చూసి ......
అవసరంలేదు వర్షం పడకపోతే ఎలాగో ఇలానే ఉండాలి , నా దేవకన్యను తప్ప మరొకరిని చూడను .
మహారాణీ : వర్షం పడుతుంది మహారాజా ..... ఆ ఆ ......
పండు తినిపించాను .
నిశ్చితార్థం అయినట్లు మాపై పూలవర్షం కురిపించారు .
మహారాజా - మహారాణీ ...... అంటూ పిల్లలందరూ సంతోషంతో హత్తుకున్నారు .
ప్రజాలారా ఒప్పుకున్నానుకదా ఇక ఇంటికి వెళ్ళండి .

ఇంటికి వెళ్లాడమా ...... , రెండురోజుల్లో వివాహ పండుగ , వివాహ ఏర్పాట్లకే సమయం సరిపోదు అంటూ రాజభవన ఉద్యానవనం కు వెళ్లి పనులు మొదలుపెట్టారు ఉత్సాహంగా ......
బుజ్జాయిలు : అత్తయ్యా ..... వెంటనే పిన్నమ్మలను పిలిపించండి , సింహం మిత్రమా ...... అడవిలోని జంతువులన్నింటికీ ఈ సంతోషమైన విషయాన్ని తెలియజేయ్యండి , రెండురోజుల్లో మన రాజ్యం అంతా నిండుగా నీటితో పచ్చని పంటలతో కళకళలాడబోతోంది .
సరిగ్గా చెప్పారు బుజ్జాయిలూ అంటూ ముద్దులు కురిపించిహత్తుకుంది చెల్లెమ్మ , ఇప్పుడే వదినలకు ఈ సంతోషమైన కబురును పంపుతాను , ఆఘమేఘాలమీద వచ్చేస్తారు .
తప్పుచేస్తున్నానో - ఒప్పుచేస్తున్నానో అర్థంకాక బుజ్జాయిలతోపాటు వెళ్లి అమ్మ ముందు మోకరిల్లాను .
( మహి : దేవుడా ..... అంతా లోకకల్యాణం కోసమే కాదు కాదు మన నదీ అమ్మ ఆనందం కోసమే , చిలిపి ఆనందాలు కావాలని కోరిక కోరారు తప్పలేదు , అమ్మా ..... సంతోషమే కదా అంటూ మొక్కుకుంది ) .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2023, 10:26 AM



Users browsing this thread: 24 Guest(s)