Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
హిడుంభి యువరాజు మోసపూరిత మాటలను నమ్మి నాన్నగారు ...... మీనుండి దూరం చెయ్యడానికి మత్తుమందు ఇచ్చి బండిలోకి చేర్చడంతో రాక్షస వ్యూహంతో నన్ను వెంటనే అక్కడ నుండి తీసుకెళ్లిపోయాడు , ప్రయాణంలో కొద్దిసేపటి తరువాత మెలకువరావడంతో ....... నావైపే అందమైనకోపంతో చూస్తోంది .
దేవీ ...... మెలకువరావడంతో ...... 
మహి : ముద్దులు ......
కాస్త కష్టమే దేవీ ......
మహి : ముద్దులు లేకపోతే నేను చెప్పను అంటూ నాబుగ్గపై కొరికేసి బుంగమూతిపెట్టుకుంది .
సరే సరే అంటూ నవ్వుకుని ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ ముద్దులుకరిపించాను .
మహి : ప్రభూ ..... నేనేమి చెప్పినా బాధపడకండి అది గతం , అమ్మ అనుగ్రహంతో ఇప్పుడు నా దేవుడి కౌగిలిలో సంతోషంగా ఉన్నాను , ముద్దులు ఆపారో ......
స్స్స్ .......
మహి : కొరికేస్తాను ...... , మెలకువవచ్చి చూస్తే దట్టమైన అరణ్యంలో ప్రయాణిస్తున్నాను , అంతే రక్షించండి రక్షించండి అంటూ కేకలువేశాను , ఎంతకూ ఆపకపోవడంతో మళ్లీ ముక్కుకు ఏవో ఆకులు తాకించడంతో స్పృహకోల్పోయాను , అలా చాలాసార్లు చేశారు , ఈసారి మెలకువవచ్చి చూస్తే ఒక ఆశ్రమంలో ఉన్నాను - కడుపులో భయంకరమైన నొప్పి ......
మహీ అంటూ కన్నీళ్ళతో హత్తుకున్నాను .
మహి : ఆపేయ్యనా ప్రభూ ..... అంటూ నా బుగ్గలను అందుకుని కన్నీళ్లను తుడిచి ముద్దుపెట్టింది .
ఈ శిక్ష పడాల్సిందే దేవీ ......
మహి : ప్రభూ ....... అంటూ కన్నీళ్లను తుడుచుకుంది , నొప్పికి అల్లాడిపోతుంటే తల్లీ ...... నీకేమీ కాదు నీకేమీ కాదు అంటూ బాగా వయసున్నవారు నోటికి పానీయం అందించడంతో హాయిగా అనిపించింది - కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ వైద్యం చేశారు - ఎందుకిలా అయ్యిందో తెలిసి వాడిని నిలదీశారు - అవును బలవంతంగానే తీసుకెళుతున్నాము నువ్వు అడ్డు వస్తే నిన్నూ చంపేస్తాము అంటూ ఒక్కసారిగా పాతికమందికిపైగా ఆయనను బంధించారు అయినా వారి వల్ల కావడం లేదు ఆవయసులో అంత శక్తి ఆశ్చర్యపోయాను - ఇక అక్కడ ఉండకూడదు అని వారిని కట్టేసి వెంటనే ప్రయాణానికి సిద్ధం చేశారు - నన్ను రక్షించాలని విశ్వప్రయత్నం చేశారు వీలుకాక బాధపడుతూ మందులను తీసుకువెల్లమన్నారు - ఆ మందులు లేకపోయుంటే నేనిలా ప్రాణాలతో ఉండేదానిని కాదేమో .......
గురువుగారూ ..... మీ బిడ్డను మీరే కాపాడుకున్నారా అంటూ ఆనందించాను .
మహి : ప్రభూ .......
దేవీ ...... వారి వయస్సు చాలా ఎక్కువ ......
మహి : అవును అలానే ఉన్నారు , మీకెలా తెలుసు ప్రభూ ......
ఆయనే మన గురువుగారు ...... 
మహి : గురువుగారూ ...... అంటూ దండం పెట్టుకుంది , అంటే నాదేవుడు పెరిగిన ఆశ్రమం .......
అదే దేవీ ....... 
మహి : నాదేవుడు పెరిగిన ఆశ్రమం ...... మళ్లీ నాకు జన్మనిచ్చింది అంటూ సంతోషం పట్టలేక ముఖమంతా ముద్దులుకురిపించింది , ఇక అక్కడనుండి నదీఅమ్మ రక్షణలో కొన్నిరోజులకు ఈరాజ్యం చేరుకున్నాము , రాగానే ఏదో పని పడినట్లు సముద్రంలోకి వెళ్ళిపోయి మూడు నెలల తరువాత వచ్చాడు , ఈరోజు విశ్రాంతి రేపు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా నాదానిని చేసుకుంటాను అన్నాడు , ఈ దేహం - ప్రాణం ..... నా దేవుడికి మాత్రమే సొంతం మరొకరు తాకాకూడదు అంటూ కొండ చివరన చేరాను .
మహీ ...... అంతో ప్రాణంలా చుట్టేసాను .
మహి : లేదులే ప్రభూ ...... భయపడకండి , దూకడానికి ఒక్కక్షణం ముందు వాంతులు అయ్యాయి , బుజ్జాయిలు కడుపున పడ్డారన్న ఆనందం - కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... అంతలోనే చిరుజల్లులు ...... , " తల్లీ మహీ ...... కంటికి రెప్పలా కాచుకునే నేను ఉండగా భయమేల - నువ్వు ..... నీ ప్రాణ నాథుడిని చేరేంతవరకూ అనుక్షణం తోడుగా ఉంటానుగా - నా ఒడిలో మీరు ప్రేమను పంచుకోవడం వలన జనించబోవు బిడ్డల సంరక్షణ నాధికాక మరెవ్వరిది ధైర్యంగా ఉండు ....... " , అమ్మా అమ్మా ...... అంటూ ప్రార్థించి కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా ఈ గుడిసెలోకే చేరాను .
అక్కడ గురువుగారు - ఇక్కడ స్వయంగా అమ్మ ...... నా మహికి తోడుగా ఉన్నారు అంటూ ఆనందబాస్పాలతో ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించాను.
మహి : సంతోషం ముద్దులుపెట్టారు అంటూ సంతోషం పట్టలేక నాబుగ్గపై పంటిగాట్లు పెట్టింది .
స్స్స్ .......
మహి : మీరేలాగో చెయ్యరు - ఇన్నాళ్ల విరహం కొరుక్కుని తినేస్తాను నా వీరుడిని అంటూ అందంగా నవ్వుతోంది .
అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను , ముద్దులు - కొరుకుళ్ళు కాదు నా దేవతను నాలో ఐక్యం చేసేసుకుంటాను .
మహి : అంతులేని ఆనందంతో పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి పులకరించిపోతోంది , ఆరోజు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిన మూర్ఖుడికి ...... విశ్వరూపం చూయించింది నదీ అమ్మ -  కలలో కనిపించి " రేయ్ ..... మహి బా బిడ్డ - తనను తాకాలని ప్రయత్నించినా నీ రాజభవనం నా నదీ ప్రవాహంలో భూస్థాపితం అయిపోతుంది , నువ్వు నీటి గుండంలో భయంకరమైన చావు చేస్తావు అంటూ కళ్ళకు చూయించారు , ఇప్పటివరకూ తనను ఇబ్బందిపెట్టినందుకుగానూ రాజభవనపు కొండల్లోని సగం వజ్రపు నిక్షేపాలు బూడిద చేసేసాను " .
లేదు లేదు అంటూ వొళ్ళంతా చెమటతో భయంతో వణికిపోతూ ఉలిక్కిపడి లేచాడు - నీళ్లు నీళ్లు నీళ్లు ...... రాజభవనం మొత్తం నీళ్లు అంటూ చుట్టూ చూసి హమ్మయ్యా అంటూ చెమటను తుడుచుకున్నాడు - కలనా ....... కలలన్నీ నిజమవుతాయా ఏంటి .......
అంతలో యువరాజా యువరాజా ...... అంటూ భటులు వచ్చి , ఎలా జరిగిందో తెలియదు మన కొండల్లోని ఒకవైపు భాగం మొత్తం వజ్రాలు మణులు ఒక్కసారిగా నల్లగా మారిపోయాయి .
యువరాజు : బూడిద అయిపోయాయి - అంటే తనను తాకితే అంటూ భయంతో వణికిపోసాగాడు .
మహి : ఆరోజు నుండీ తాకడం కాదుకదా నావైపు కన్నెత్తైనా చూడటానికి కూడా సాహసం చెయ్యలేదు .

అమ్మా .... అంటూ మొక్కుకున్నాను .
మహి : కొద్దిరోజులకు రాజ్యం కోసం రాజు - యువరాజు వాదులాడుకోవడం , అకస్మాత్తుగా రాజు చనిపోవడంతో వాడు రాజయ్యాడు - రాజును ..... వాడే చంపాడని రాజ్యం మొత్తం తెలుసు , ఇక వాడి ఇష్టం అయిపోయింది - రాజ్యంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని నాతోచినంత సహాయం చేసాను , నాపై కోపంతో ప్రజలను - ముఖ్యంగా మహిళలను బలవంతంగా ....... ఏమీచెయ్యలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది .
9 నెలలకు మీ బుజ్జాయిల జననo - ఆ క్షణం నుండీ బుజ్జాయిలే రక్షణగా ఉన్నారు .

అదేసమయంలో నాదేవుడు పోటీలలో దిగ్విజయంగా .......
నా కవల బుజ్జాయిల వల్లనే తొలి పోటీలు గెలిచానన్నమాట ...... , వెంటనే వారిని .......
మహి : చూడాలి అన్నారో కొరుక్కుని తినేస్తాను - ఇన్ని రోజులూ వదిలారా వాళ్ళని ఇకనుండీ నాదేవుడు ఒడి నాకుమాత్రమే సొంతం - బుజ్జాయిలు కుళ్ళుకోవాలి అంటూ ఏకమయ్యేలా చుట్టేసింది .
ఊహూ ......
మహి : ఏంటీ ...... అంటూ భుజంపై పంటిగాట్లు పెట్టేసింది .
స్స్స్ ...... రక్తం వచ్చేసిందేమో దేవీ .....
మహి : ఏదీ చూడనివ్వండి అంటూ ఏకంగా పైవస్త్రం చిరిగిపోయేలా మొత్తం లాగేసి నెలపైకి చేర్చింది .
దేవీ ......
మహి : నవ్వుతోంది - అమ్మో పంటిగాట్లు పెట్టేసాను అంటూ భుజంపై మొదలెట్టి హృదయం వరకూ ముద్దులుపెడుతూ హృదయంపై వొళ్ళంతా జలదరించేలా ముద్దుపెట్టింది .
అఅహ్హ్హ్ ...... అంటూ మహిని కౌగిలిలో బంధించి పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టాను .
మహి : మ్మ్ ..... బాగుంది అంటూ అందమైన నవ్వులతో గుండెలపై వాలింది .
దేవీ తరువాత ఏమైంది ......
మహి : వీరాధివీరుడైన ఈ బుజ్జాయిలను దాటి రాగలడా ...... , ఒకవైపు వర్షాలు లేక ప్రజలు అలాంటిస్తున్నారు - కొద్దిరోజులకు గూఢచారుల నుండి వార్త వచ్చింది సంపద - నిధులకోసం రాజ్యంపై దండెత్తడానికి సిద్ధం అవుతున్నారని ...... , ఇంకేముందీ భయంతో వణకడానికే సమయం సరిపోలేదు - అతడికి సహాయం చేయడానికి కూడా ఏ రాజు సామంతరాజు కూడా ముందుకురాలేదు , ప్రజాలుకూడా వాడి పరాభవం కోసమే ఎదురుచూడసాగారు కానీ వారికేం తెలుసు వాళ్ళుకూడా బానిసలు అవుతారని ...... పక్షములు గడవసాగాయి అదునుకోసం ఎదురుచూస్తున్న రాజు అలా రాజ్యంలోకి సైన్యంతో రాగానే ప్రజల రక్షణ వదిలేసి వీలైనంత సంపద - సైనికులతో సముద్రంలోకి జారుకున్నాడు , ఇక తరువాత ఏమైందో నాదేవుడికి తెలుసు ..... , ఇలా నాదేవుడి ఒడిలోకి చేరేలా చేశారు మన దైవం .......
అమ్మా ...... మిమ్మల్నే నమ్ముకున్న మీ బిడ్డలను ఎక్కడున్నా చల్లగా చూసుకుంటారని తెలియజేసారు అంటూ భక్తితో మొక్కుకుని నాదేవత నుదుటిపై పెదాలను తాకించాను .

మహి : మన రక్తమైన బుజ్జాయిలను ఏకంగా అడవిరాజైన సింహంపై స్వారీ చేయిస్తూ జాగ్రత్తగా తీసుకొచ్చిన నా ప్రియాతిప్రియమైన నా వీరాధివీరుడిని ప్రాణ నాథుడిని చూడగానే కలిగిన అంతులేని సంతోషం - పులకింత ...... అందుకేకదా బుజ్జాయిల సహకారంతో నదీఅమ్మను ప్రార్థించగానే మీరు నా ఊహల్లోకి వెళ్లారు నేనైతే తొలిరోజు రాత్రే రెండుసార్లు ......
రెండు సార్లా ...... ? .
మహి : అవునుమరి వర్షం పడకముందు మరియు పడిన తరువాత ..... అంటూ అందమైన సిగ్గుతో మురిసిపోతోంది , అంతటితో ఆగానా ..... అమ్మో ఉదయం నుండీ మీకు దూరంగా మీకౌగిలిలో లేకుండా ఉండటం నావల్ల కాలేదు అందుకే రోజూ రాత్రి .......
నదీఅమ్మను ప్రార్ధించడం - నేను ..... నా దేవకన్య ఊహల్లోకి వెళ్ళగానే బుజ్జాయిలు ...... అమ్మా అమ్మా అంటూ పిలవడం అంతేగా ..... ఉదయం అమాయకుడిలా ఒంటిపై నూలుపోగులేకుండా మేల్కొవడం .......
మహి నవ్వులు ఆగడంలేదు ....... 
నా సౌందర్యారాశి ఈ సంతోషం చూడటం కోసమే కదా విరహాన్ని సైతం సంతోషంగా భరిస్తూ వచ్చినది అంటూ ఆనందబాస్పాలతో కళ్ళపై ముద్దులుపెట్టి అమాంతం ఎత్తుకుని పైకిలేచాను .
మహి : అంతులేని ఆనందపు బాస్పాలతో నాముఖమంతా ముద్దులుపెట్టి , ప్రభూ ఎక్కడికి అంటూ ముద్దుగా అడిగింది .
ఏ నదీఅమ్మ సమక్షంలో అయితే మనం ఒక్కటయ్యామో ఆ వర్షం సాక్షిగానే ఈసారి స్పృహలో ఉండి నాదేవతలో ఏకమౌతాను .......
సిగ్గులోలికిపోతోంది - ప్రభూ ...... ద్వారానికి అటువైపు గొళ్ళెం ఉంచారు , అక్కడ మరొక ద్వారం ఉంది అంటూ కళ్ళతోనే సైగచేసింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 28-08-2023, 10:18 AM



Users browsing this thread: 21 Guest(s)