Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
పెద్దమ్మ : బుజ్జిజానకీ - తల్లులూ ...... ఆకలివెయ్యడం లేదా ? .
అమ్మకూచీ - అక్కయ్యలు చిరునవ్వులు చిందిస్తున్నారు , ఐదుగురు దేవతలు - ఒక దేవుడు సంతోషాలనే ఆహారంగా పంచుతుంటే ఇక ఎక్కడ ఆకలివేస్తుంది చెప్పండి అంటూ ఐదుగురు దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి నావైపుకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .
దేవతలు : లవ్ యు లవ్ యు లవ్ యు ...... కానీ మాకైతే మన దేవతమ్మ వంటల రుచి చూడాలనిపిస్తోంది , లోపలికి వస్తూ కారులో క్యారెజీలు ఉండటం గమనించాములే ...... 
అక్కయ్యలు : క్యారెజీలతో కారు మొత్తం నిండిపోయింది చెల్లీ ..... , అందుకే కదా మేము స్కూటీలలో వచ్చింది .
బుజ్జిజానకి : దేవతమ్మ చేతి వంట ..... , దేవతల చేతి వంటలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ఆశిద్దాము , వింటుంటేనే నోరూరిపోతోంది - ఇంతవరకూ ఆకలివెయ్యలేదు కానీ ఇప్పుడు బాగా ఆకలివేస్తోంది దేవతలూ ......
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ..... అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : మ్మ్ మ్మ్ దేవతమ్మ వంటలు ..... మాకుకూడా ఆకలి ఆకలి .....
దేవతలంతా నవ్వుకున్నారు .
రోజుల తరువాత పెద్దమ్మ లోకపు పెద్దమ్మ చేతి వంట టేస్ట్ చెయ్యబోతున్నాను , ఫస్ట్ టైం తినబోతున్న దేవతలు - అమ్మకూచీ - అక్కయ్యలు ..... రుచిలో మైమరిచిపోతారేమో అంటూ లోలోపలే ఆనందిస్తున్నాను .

దేవతమ్మ : నీ దేవతల చేతి వంటలతో ఎవరైనా పోటీ పడగలరా మహేష్ కూచీ ..... - ఉదయం వంటలు అద్భుతం అంతే , దేవతల చేతి వంటతో పోల్చావు అధిచాలు .......
అంటీలు : మన దేవతమ్మ చేతి వంట మరింత అద్భుతంగా ఉంటుంది , ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశతో ఉంటే మీరు మాటలు పెట్టారు ......
బుజ్జిజానకి : దేవతమ్మ ఏమో దేవతలను - దేవతలేమో దేవతమ్మను ...... పొగుడుకోండి పొగుడుకోండి ఎంతైనా దేవతలు దేవతలే , మేమైతే ఫుల్ గా కుమ్మేస్తాము .
అక్కయ్యలు : అంతే చెల్లీ ......
బుజ్జిజానకి : పదండి అక్కయ్యలూ అన్నింటినీ తీసుకొద్దాము .
పెద్దమ్మ : అమ్మో ఇంకేమైనా ఉందా ...... ? , మేమెందుకు ఉన్నది అంటూ ముద్దులుపెట్టారు .
నేనెందుకు ఉన్నది ......
అంటీలు : తమరి సహాయం ఏమీ అక్కర్లేదు , మనమే తీసుకొద్దాము పదండి దేవతమ్మా ...... , నీ 100 గుంజీలు తియ్యడం అయిపోతే వెళ్లి డైనింగ్ టేబుల్ పై బుద్ధిగా కూర్చో ..... , దేవతమ్మా - చెల్లీ రండి అంటూ ఐదుగురు దేవతలూ గుమ్మం బయటకు అడుగుపెట్టడం ఆలస్యం ......

మహేష్ మహేష్ లవ్ ..... sorry sorry అంటూ అమ్మకూచీ వచ్చి 987 988 ...... గుంజీలు తీస్తున్న నా గుండెలపైకి చేరింది .
వెనుకే అక్కయ్యలు వచ్చారు .
బుజ్జిజానకి : ఏంటీ 989 ...... , 100 గుంజీలే కదా తియ్యమన్నది అంటూ కళ్ళల్లో చెమ్మ , ఇక చాలు ఆపు ఆపు మహేష్ ......
990 ..... మరొక్క పది తీస్తే దేవతల స్వీట్ పనిష్మెంట్ పూర్తవుతుంది .
బుజ్జిజానకి : అయితే నేనూ 1000 గుంజీలు తీస్తాను .....
అక్కయ్యలు మేముకూడా అంటూ మాతోపాటు గుంజీలు తీస్తున్నారు .
సో స్వీట్ అంటూ అమ్మమ్మ ..... బాబు బుగ్గపై ముద్దులుపెడుతూ ఆనందిస్తున్నారు .
నో నో నో అమ్మకూచీ - ఆక్ ...... దేవతలను కొరికేసాను వెయ్యి కాదు లక్ష గుంజీలైనా తియ్యాల్సిందే అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను , అందుకుగానూ మీకు బోలెడు బోలెడు లవ్ ...... థాంక్స్ నేనే చెప్పుకోవాలి , ముందైతే మీరు గుంజీలు తియ్యడం ఆపండి , దేవతల బుగ్గలపై నా పంటిగాట్లు ...... అఅహ్హ్హ్ జీవితాంతం గుర్తుండిపోతుంది , లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : మరి అంత ఆనందం ఆస్వాదించేలా చేస్తే కేవలం చిన్న ముద్దు అదికూడా నుదుటిపై ......
అక్కయ్యలు : నుదుటిపై అంటే ప్రాణం కంటే ఎక్కువైన ముద్దు చెల్లీ ...... , మాకైతే ఆ చిన్న ముద్దుకూడా లేదు ప్చ్ ప్చ్ ప్చ్ ......
ఇంకేమైనా ఉందా ...... , నేనేదో మాటవరసకు అంటే మీ అక్కయ్యలు నిజంగానే లక్ష గుంజీల శిక్షను వేయించేలా ఉన్నారు , 1000 ...... హమ్మయ్యా హ్యాపీలీ finished ......
బుజ్జిజానకి : మావింకా పదే అయ్యింది ......
నువ్వుకూడానా అమ్మకూచీ ...... , అదిగో లోపలికివస్తున్న దేవతలు ..... మీరు గుంజీలు తియ్యడం చూస్తే కొరికినప్పుడు కంట్రోల్ చేసుకున్నారు ఇప్పుడిక ......
బుజ్జిజానకి - అక్కయ్యలు : దేవతలు కొడితే ఆనందమే కదా .......
ఆనందం కాదు పండగే ......
అమ్మకూచీ - అక్కయ్యలు ...... చిరునవ్వులు చిందించి , ఫీల్ అవుతున్న నా బుగ్గలపై ఏకంగా కొరికేశారు , దేవతలూ దేవతలూ ...... అంటూ వెళ్లి క్యారెజీలను డైనింగ్ టేబుల్ పైకి చేర్చడానికి హెల్ప్ చేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ......

అంటీలు : మమ్మల్ని కొరికి అల్లరి పిల్లాడు రుద్దుకుంటున్నాడు ఏంటి ? .
అక్కయ్యలు : ఫీల్ అవుతున్నట్లున్నాడు అమ్మలూ ...... , మీ నొప్పి తన నొప్పిలా ఫీల్ అవుతున్నాడు తమ్ముడు .
బుజ్జిజానకి : అవునవును దేవతలూ ......
అంటీలు : చేసిందంతా చేసి నాటకాలాడుతున్నాడు , అవసరం లేదని చెప్పు బుజ్జితల్లీ ...... , ఆకలి అన్నావుకదా కూర్చో వడ్డిస్తాము , ఆ అల్లరి పిల్లాడిని కూడా పిలవండి .
బుజ్జిజానకి : ఎంతైనా అల్లరి పిల్లడంటే మీకు ఇష్టమే దేవతలూ ...... , ఎంత ప్రేమతో పిలిచారో - చూడండి ఎలా మురిసిపోతున్నాడో ...... 
అంటీలు : నీకిష్టమైన వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేదు బుజ్జితల్లీ , నీ సంతోషం కంటే ఇంకేమి కావాలి ......
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ...... , వడ్డించేంతవరకూ ఇలా హత్తుకునే ఉంటాను .
అంటీలు : కావాలంటే ఒడిలో కూడా కూర్చోవచ్చు , ఎంచక్కా తినిపిస్తాము .
బుజ్జిజానకి : అంతకంటే ఇంకేమికావాలి అత్తయ్యలూ ..... ముద్దముద్దకూ ముగ్గురి అత్తయ్యల ఒడిలో కూర్చుని తింటాను , లవ్ యు సో మచ్ అత్తయ్యలూ ......
ఎంజాయ్ బుజ్జిజానకీ ...... అంటూ మేడమ్ మురిసిపోతూ అందరికీ వడ్డించి ఎదురుగా కూర్చున్నారు .
అమ్మకూచీ మొదటగా వాసంతి అంటీ ఒడిలో కూర్చుంది , దేవత ప్రేమతో తినిపించడం చూసి ఎంజాయ్ అంటూ సైగచేసాను , ప్చ్ ..... ఆ అదృష్టం నాకెప్పుడో ......
అంటీలు : ఏంటీ ...... 
బుజ్జిజానకి : మీ ఒడిలో కూర్చునే అదృష్టం ఎప్పుడు అని అన్నాడు అత్తయ్యలూ .......
దేవతలు కోప్పడకముందే లేచి లెంపలేసుకుని గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అమ్మకూచీ - అక్కయ్యలు నవ్వేయ్యడంతో అందరితోపాటు అంటీలు కూడా నవ్వేశారు .
బుజ్జిజానకి : అత్తయ్యలు నవ్వేశారుకదా ఇక ఆపి వచ్చి కూర్చో మహేష్ ......
భద్రకాలుల్లా కోపంతో చూస్తున్న దేవతలవైపు చూస్తూనే లోలోపల తెగ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను .
ఎంజాయ్ ఎంజాయ్ మహేష్ ....., అత్తయ్యలూ .... ఆ ఆ ......
నువ్వూ ఎంజాయ్ అమ్మకూచీ ...... 

పెద్దమ్మ : మీ టామ్ & జెర్రీ చిలిపిదనం కట్టిపెట్టి , వంటలు ఎలా ఉన్నాయో చెబితే బాగుంటుంది , ఒక్కరైనా చెబుతారని చూస్తున్నాను అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జిజానకి : నిన్న అత్తయ్యలు కూడా ఇలానే ఆడిగిమరీ పొగిడించుకున్నారు అంటూ నవ్వుతోంది , దేవతమ్మా ...... ఎందుకో ఇలా చెప్పాలని ఉంది దేవలోకపు వంటల రుచి మ్మ్ మ్మ్ ...... అంటూ వెళ్లి పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టి కాంచన అంటీ ఒడిలో కూర్చుంది ఆ అంటూ ...... అటుపై సునీత అంటీ .
అంటీలు : అవునవును సరిగ్గా చెప్పావు బుజ్జితల్లీ ...... , దేవలోకంలో ఇలానే ఉంటాయేమో , ఇక ఈ పాయసం అయితే అమృతం రుచి ఇలానే ఉంటుందేమో అన్నట్లుగా ఉంది .
అమృతంతో చేసినదే దేవతలూ .......
అంటీలు : నిన్ను ఎవ్వరూ అడగలేదులే , బుద్ధిగా తిను ......
అక్కయ్యలు : అమ్మాకూచీతోపాటు నవ్వి , దేవతమ్మా ...... మ్మ్ మ్మ్ సూపర్ అంతే .....
అవునవును భలే రుచి చూడండి బాబు కూడా ఎలా తింటున్నాడో అంటూ మేడమ్ - అమ్మమ్మ ......
పెద్దమ్మ : లవ్ యు అల్ అంటూ నావైపు కన్నుకొట్టి అందరికీ వడ్డించారు .
మొత్తం వంటలు ఊడ్చేసేంతవరకూ లంచ్ పూర్తవ్వలేదు .

అమ్మో ఒక్క అడుగుకూడా వెయ్యలేనంతగా తినేసాము , ఏమి రుచి ఏమి రుచి ....... ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంది అంటూ సోఫాలలోకి చేరిపోయారు దేవతలు .......
లవ్ యు పెద్దమ్మా అంటూ వెనుక నుండి బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మకూచీని ముద్దుచేస్తున్న దేవతల ఎదురుగా వచ్చి కూర్చున్నాను .
అంటీలు : ఏంటి అలా చూస్తున్నావు ? బుజ్జితల్లికి దిష్టి తగిలేలా ఉంది .
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ ...... ఇంత అమాయకులేంటి ? , కొరుక్కుతినేలా చూస్తున్నది నన్ను కాదు మిమ్మల్ని .......
ష్ ష్ ష్ బుజ్జిజానకీ ...... , బుద్ధిగా లేచి గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు : అంటే నిజమేనన్నమాట ...... అంటూ నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అన్నీ తెలిసి మళ్లీ అడుగుతారేంటి అక్కయ్యలూ ...... , మీ తమ్ముడి మనసు మీకు తెలియదా ? , అత్తయ్యలు ..... మూడో కన్ను తెరిచేలా ఉన్నారు కూల్ కూల్ కూల్ అత్తయ్యలూ అంటూ ముద్దులతో శాంతిoపచేసింది .
చుట్టూ నవ్వులైతే ఆగడం లేదు .
అంటీలు : ఆపకు పాతిక గుంజీలైనా తియ్యాల్సిందే ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ..... ఇంతకుముందు మీరు వంద గుంజీలు తియ్యమంటే మీ మాటంటే గౌరవం లేనట్లు వెయ్యి గుంజీలు తీసాడు , దానికైనా శిక్ష పడాల్సిందే ......
అంటీలు : వందనే కదా చెప్పినది , అవునవును మనం ఐస్ క్రీమ్స్ తిన్నంతవరకూ అంటే దాదాపు అర గంటకుపైనే ...... , అయినా ఈ అల్లరి పిల్లాడు ఎందుకలా చేసాడు , వెయ్యి గుంజీలంటే మాటలా రాత్రికి కాళ్ళూ చేతులూ నొప్పివేస్తాయేమో ....... , అలా మేము కోరుకోలేదు బుజ్జితల్లీ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ విన్నారా ...... ఎంతైనా మహేష్ అంటే అత్తయ్యలకు ఎక్కడో ఇష్టమే ......
అంటీలు : లేదు లేదు లేదు బుజ్జితల్లీ ...... , మొదటి నుండీ అల్లరే అల్లరి ......

అమ్మమ్మ - మేడమ్ - దేవతమ్మ - అక్కయ్యలు ...... ఎంజాయ్ చేస్తున్నారు , దేవతలూ ...... ఆకు వక్క సున్నం తీసుకురమ్మంటారా ? .
అక్కయ్యలు : స్వీట్ కిళ్లీ ఉంటే ఎంత బాగుండేదో ......
పెద్దమ్మ : స్వీట్ కిళ్లీ ఏంటి తల్లులూ ...... , మహేష్ కూచీ ..... నువ్వు తీసుకొచ్చిన బాక్స్ ఎక్కడ ఉంచావు ? .
బుజ్జిజానకి : అదిగో డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచాను దేవతమ్మా ..... ఇదిగో అంటూ తీసుకొచ్చింది , గిఫ్ట్ బాక్స్ ఏమోనని ఎవ్వరం ఓపెన్ చెయ్యలేదు .
పెద్దమ్మ : అమృతం అన్నారుకదా , నీటితో కోకుండా అమృతపు కొలనులో పండిన ఆకులతో చుట్టిన కిళ్ళీలు , నీ చేతులతో అందించి నీ అక్కయ్యల కోరిక తీర్చు ......
బుజ్జిజానకి : లవ్ టు దేవతమ్మా అంటూ ఓపెన్ చేసి స్వీట్ సర్ప్రైజ్ లా అలా చూస్తుండిపోయింది .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ......
బుజ్జిజానకి : గోల్డ్ కిళ్ళీలు అక్కయ్యలూ ......
అక్కయ్యలు చూసి wow wow wow గోల్డ్ ప్లేటెడ్ కిళ్ళీలు లవ్ యు దేవతమ్మా అంటూ అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అంటూ అందించబోతే ఆ ఆ ఆ అంటూ నోటిని తెరవడంతో ముద్దులుపెట్టిమరీ నోటికి అందించింది .
అక్కయ్యలు : మ్మ్ మ్మ్ మ్మ్ అమృతం ఇలానే ఉంటుందేమో ...... అంటూ కళ్ళు మూసుకుని స్వీట్ నెస్ ఫీల్ అవుతున్నారు .
అమృతమే ఆక్ ...... అంటూ ఆగిపోయాను .
అవునా తల్లుల ఊరుతున్న పెదాలను చూస్తుంటేనే ...... మాకు కూడా మాకు కూడా అనడంతో మేడమ్ - దేవతలు - అమ్మమ్మకు మరియు దేవతమ్మకు ముద్దులతో తినిపించి , నాదగ్గరికి వచ్చింది .
మ్మ్ మ్మ్ మ్మ్ .......
ప్రసాదంలా చేతిని చాపాను .
బుజ్జిజానకి : ప్రేమతో మొట్టికాయవేసి చిరునవ్వులు చిందిస్తూ బుగ్గపై ముద్దుపెట్టిమరీ నోటికి అందించింది .
లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ ......
బుజ్జిజానకి : థాంక్యూ కాదు తినిపించు అదికూడా ముద్దుపెట్టి ......
దేవతలు ......
బుజ్జిజానకి : దేవతలు ..... అమృత కిళ్లీ ఫీల్ లో మైమరిచిపోయారు , తినిపిస్తావా లేక దేవతలకు ......
నో నో నో అంటూ లేచి నుదుటిపై ముద్దుపెట్టి తినిపించాను .
బుజ్జిజానకి : లవ్ ..... మ్మ్ మ్మ్ సూపర్ అంటూ కిల్లీతోపాటు నా బుగ్గపై కొరికేసింది , మ్మ్ ..... మరింత టేస్టీ ..... , మహేష్ ..... కదలకు కదలకు నీ బుగ్గపై ఎర్రగా కిళ్లీ అంటూ నాలుకతో జుర్రుకుని సిగ్గుపడుతూ వెళ్లి వాసంతి అంటీని చుట్టేసి కూర్చుంది .
అప్పటికిగానీ దేవతలు కళ్ళు తెరిచి , దేవతమ్మా దేవతమ్మా అక్కయ్యా ..... సో సో సో టేస్టీ లవ్ యు లవ్ యు మాపై ఎంత ప్రేమ ఉందో ఈ స్వీట్ తోనే తెలిసిపోతోంది.
బుజ్జిజానకి : అంతటి తియ్యనైన ప్రేమ వలన మైకం కూడా వచ్చేస్తోంది , నాకైతే దేవతల ఒడిలో నిద్ర వచ్చేసేలా ఉంది .
 అంతకంటే అదృష్టమా బుజ్జితల్లీ అంటూ సునీత అంటీ ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతోంది .
బుజ్జిజానకి : ఎదురుగా ఉన్న నావైపే ప్రేమతో అందమైన నవ్వులతో చూస్తూ చూస్తూనే నిద్రలోకిజారుకుంది .
మేముకూడా exam రాసి ఫుల్ గా తిని అలసిపోయాము అంటూ మేడమ్ - దేవతమ్మ - వాసంతి అంటీ ఒడిలో చేరారు , తమ్ముడూ ..... ఇక మిగిలినది కాంచన అమ్మే వచ్చి అమ్మ ఒడిలో వాలిపో ......
లవ్ టు అంటూ లేచాను .
దెబ్బలుపడతాయి అనడంతో బుద్ధిగా వెళ్లి అమ్మమ్మ ప్రక్కన చేరాను - కాంచన అంటీ ..... బాబును ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
అమ్మమ్మ : దేవుడిని పడుకోబెట్టుకునే అదృష్టాన్ని ఇస్తావా మహేష్ ..... ? .
లవ్ టు అమ్మమ్మా అంటూ ఒడిలో తలవాల్చాను .
అమ్మమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ..... నా జానకినే పడుకోబెట్టుకున్నట్లుగా ఉంది , హాయిగా నిద్రపో దేవుడా ...... , నిన్ను సంతోషపెడితే జానకి ఆనందిస్తుంది .
మీ ఆనందబాస్పాలను చూసి ఎంత ఆనందిస్తున్నారో అమ్మ ......
బుజ్జిజానకి : చాలా అంటే చాలా మహేష్ ......
నువ్వింకా నిద్రపోలేదా బుజ్జిజానకీ ..... 
బుజ్జిజానకి : ఇదిగో అందరినీ ఇలా చూసానుకదా ఇప్పుడు హాయిగా నిద్రపోతాను అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
క్యాచ్ పట్టేసి హృదయంలో దాచేసుకున్నాను .
అమ్మకూచీ - అక్కయ్యల నవ్వులు ......
అమ్మమ్మ అయితే పట్టరాని ఆనందంతో ప్రాణంలా జోకొడుతూ మురిసిపోతున్నారు .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 16-02-2024, 04:00 PM



Users browsing this thread: 8 Guest(s)