Thread Rating:
  • 16 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అనిరుద్ర H/o అనిమిష
#45

అనిరుద్ర H/o అనిమిష - 15వ భాగం

లంచ్ అవర్.

అనిమిష లంచ్ బాక్స్ తీసుకొని తన సీటులో నుండి లేచింది. అప్పుడే అనిరుద్ర వచ్చాడు. రిసెప్షన్లో వున్న భావన అనిరుద్రను చూసి లేచి విష్ చేసింది.

“హలో... బావున్నారా సార్... అనిమిషను పిలుస్తాను. ఉండండి” అంది.

“అక్కర్లేదు... మా ఆవిడకు స్లిప్ ఇచ్చి వెళ్తామని వచ్చాను. ఇది తనకు ఇవ్వండి” అంటూ ఓ స్లిప్ ఇచ్చాడు. దాని మీద టమోటా... పదహారు రూపాయలు కిలో, పచ్చిమిర్చి... పద్దెనిమిది రూపాయలు... వంకాయలు పన్నెండు రూపాయలు.. మొత్తం నలభై ఆరు రూపాయలు.. కొత్తిమీర రెండు రూపాయలు, కరివేపాకు రెండు రూపాయలు... మొత్తం యాభై రూపాయలు. అనిరుద్ర సార్ ఇచ్చినది నలభై రూపాయలు. బాకీ పది రూపాయలు... నాగలక్ష్మి, కూరగాయలమ్మి చేవ్రాలు... అని ఉంది.

అది చూడకూడదనుకుంటూనే చూసి, “ఇదేంటి సార్?” అని అడిగింది భావన క్యూరియాసిటీ ఆపుకోలేక.

“బిల్లు... మా ఆవిడ బిల్లు కావాలంది. ఎందుకైనా మంచిదని ఆఫీసుకొచ్చి ఇస్తున్నాను. అన్నట్టు ఈ పాన్ కూడా మా ఆవిడకివ్వండి. తనకు భోం చేయగానే 'కామత్ స్వీట్ పాన్' తినడం అలవాటు.

“మంచిది కాదు మొర్రో' అన్నా వినదు. మర్చిపోకుండా ఇవ్వండి” అంటూ మరో మాటకు అవకాశమివ్వకుండి వెనుదిరిగాడు అనిరుద్ర.

అనిమిష భయపడ్తూనే భావన దగ్గరికొచ్చింది. అప్పటికే భావన ఈ విషయాన్ని నిఖితకు పాస్ చేసింది.

“ఇదేం బావోలేదు అనిమిషా... మీ ఆయన్ని చూస్తుంటే జెంటిల్మెన్ లా ఉన్నాడు. అయినా కూరగాయలకు కూడా లెక్కలు అడుగుతావా.. మరీ అంత అనుమానం పనికిరాదే... పాపం... నాగలక్ష్మి అట... ఆవిడ చేవ్రాలు కూడా రాసుకొచ్చాడు. బంగారంలాంటి ఆయన్ని లెక్కలడుగుతావ్... ఆ పాప పరిహారానికి లక్షోత్తుల నోము నోయాల్సిందే” చెప్పింది నిఖిత.

భావన అనిరుద్ర ఇచ్చిన పాన్ని అనిమిషకు ఇచ్చి, దాంతోపాటు కూరగాయలు రేట్లు వున్న స్లిప్ కూడా ఇచ్చింది..

అన్నం తిని కోపంగా పాన్ని బయటకు గిరాటు వేయబోయింది. అయినా స్వీట్ పాన్ని గిరాటు వేయడం ఇష్టంలేక నోట్లో పెట్టుకొని అనిరుద్రను ఊహించుకుంటూ నమిలి నమిలి తినేసింది అనిమిష.

****

ఆఫీసు వదలగానే కూరగాయల మార్కెట్ కు వెళ్లింది. రెగ్యులర్గా కూరలు కొనే నాగలక్ష్మి దగ్గరకెళ్లింది.

“నమస్తే మేడమ్... బావున్నారా? అయినా ఇదేం బావోలేదు మేడమ్... పాపం సార్ ఎంత బాధపడ్డారు. మా ఆవిడ నమ్మడం లేదు. బిల్లు ఇవ్వమని అడిగారు. నాతో కాగితం రాయించారు. అయినా సారు చాలా మంచోరు...” నాగలక్ష్మి చెప్పుకుపోతోంది. అనిమిష కూరగాయలు కొనకుండానే ఇంటికొచ్చింది. అనిరుద్రను కరిచేయాలన్నత కోపంగా ఉందామెకు.

* * *

“అసలు మీరేమనుకుంటున్నారు? ఆఫీసుకు వచ్చి బిల్లు ఇస్తారా? నాగలక్ష్మితో చెప్పిస్తారా?” గయ్మంది ఇంటికి వస్తూనే అనిమిష.

“నువ్వేగా బిల్లు అడిగావ్... అందులో నా తప్పేముంది...” తాపీగా అన్నాడు. ఏమనాలో అనిమిషకు తోచలేదు. తనేమంటే అతనేమంటాడోనన్న భయం కూడా ఉంది.

“త్వరగా ఫ్రెషప్ అయి వస్తే వేడి వేడి కాఫీ రెడీ చేసి పెడతా... ఆ తర్వాత చల్లారింద లాభం లేదు” అన్నాడు అనిరుద్ర. ఆలస్యం చేస్తే చల్లారిన కాఫీ ఇస్తాడన్న భయంతో బాత్రూమ్లోకి దూరింది ఫ్రెషప్ అవ్వడానికి.

***

రోజులు గడిచిపోతున్నాయి. అనిరుద్రతో క...లి...సి...వుం...డ...డం... అనిమిషలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు వున్నా, అతను ఆమెను ఎంత ఇరిటేట్ చేసినా అందులో ఏదో మత్తు వున్నట్టు అనిపిస్తోంది. మరో పక్క ఆమె సమకూర్చుకోవాల్సిన డబ్బు కూడా జమ అవుతూ వస్తోంది. అనిరుద్ర కాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఓ రోజు సినిమాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకోవాలనుకున్నారు. ఆటోలో వెళ్లారు. కనీసం ఆటో డబ్బులైనా అనిరుద్ర ఇస్తాడనుకుంది. తన వంతుకు సగం డబ్బు ఇచ్చి కామ్గా థియేటర్ వైపు నడిచాడు.
మరోసారి సన్నజాజులు జడలో పెట్టుకోవాలని అనుకుంది. అదీ అనిరుద్ర కొనిపెడితే పెట్టుకోవాలని... సన్నజాజులు తెచ్చిచ్చి అందులో సగం డబ్బులు డిమాండ్ చేశాడు. అనిరుద్ర ఎలా ప్రవర్తించినా ఆమెలో ఉక్రోషం కలుగుతుందేగానీ ద్వేషం కలగడంలేదు. స్వీట్ పెయిన్ లా ఉంది.

****

“అప్పుడే మీ పెళ్లయి ఆరు నెలలు దాటిందంటే ఆశ్చర్యంగా ఉంది” అంది ద్విముఖ.

“నాకూ అలానే ఉంది. బెంగుళూరులో ఫైనల్ ట్రీట్ మెంట్ మొదలైంది. వన్ ఆర్ టూ వీక్స్లో సర్జరీ మొదలవుతుంది. ఈలోగా మొత్తం ఆరు లక్షలు సమకూరాలి. లోన్స్, అడ్వాన్స్లు, శాలరీ... అన్నీ కలిపి మూడు లక్షలు దాటలేదు” బాధగా నిట్టూర్చి చెప్పింది.

“చూద్దాం... మీ బాస్ ని పర్సనల్ లోన్ కూడా అడిగావ్గా”

“ఏం చేస్తాడో ఏమో... టైం తక్కువగా ఉంది” అంది అనిమిష.

“అనిరుధ్రను అడక్కూడదనే డిసైడ్ అయ్యావుగా” " “అవును... ఆయన అదో టైప్ మనిషి”

“ఇంతకీ ఇంతవరకూ 'అది' లేదా?” అడిగింది లోగొంతుకతో ద్విముఖ.

“అదేంటి.. అదంటే... ఏది?” ముందు అర్ధంకాక అడిగింది అనిమిష.

“అదంటే 'అదే'... మీ ఆయనతో “అది” అంది ద్విముఖ.

ఎర్రబడ్డ మొహంతో తలదించుకొని, “ఏదీ లేదు. అయినా ఆయన చేస్తోంది హజ్బెండ్ జాబ్... అందులోనూ టెంపరరీ..” చెప్పింది.

“పర్మినెంట్ చేసెయ్... 'అది'కి ఒప్పుకుంటే పర్మనెంట్ అయిపోతుంది”

“నాకిప్పుడు వేటి మీదా ఎలాంటి ఆశలు లేవు” అంది అనిమిష ఓ విషాద వీచిక ఆమెను ఆవరిస్తుండగా.

***

అనిరుద్ర కూరగాయలు తరుగుతున్నాడు. అనిమిష అతనికి హెల్ప్ చేస్తోంది.

“ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలు పేముంది. అన్న పాట నిజమే కదూ...” అడిగింది అనిమిష.

“కాదు... అసలు ఆడుతూ పాడుతూ పని ఎలా చేస్తారు? నీలా ఆ కూరగాయలు అటూ ఇటూ కెలకడం తప్ప” అన్నాడు అనిరుద్ర..

“మీకు వంకరగా తప్ప చక్కగా మాట్లాడ్డం రాదా?” ఉక్రోషంగా అంది అనిమిష.

“హలో... మనకు మాట్లాడ్డమే వచ్చు. అది ఎవరితో... ఎప్పుడు... ఎలా... ఎందుకు... ఏ స్టయిల్లో... ఏ పాట్రన్లో... ఏ విధంగా మాట్లాడాలో అన్నది ఎదుటివాళ్లను బట్టి డిసైడ్ చేసుకుంటాను”

“ఏంటి... ఏలు ఎ ఏలు ఉపయోగించారు. ప్రాస కోసమా...” అంది అనిమిష.

అప్పుడే ద్విముఖ వాళ్లిద్దరిని దగ్గరగా చూసి, “సారీ... డిస్ట్రబ్ చేశానా... తర్వాతొస్తాన్లే” అంది వెనక్కి వెళ్లబోతున్నట్టు నటిస్తూ,

“అంతొద్దు. వచ్చేయండి... ఇక్కడ అలాంటి 'అది' ప్రోగ్రామ్స్ ఏమీ జరగడంలేదు. అసలు మీ ఫ్రెండ్ 'ఇదికే ఒప్పుకోవడం లేదు. ఇక 'అది'కేం ఒప్పుకుంటుంది?”

“ఇది' అంటే ఏది?”

“అది”కి ముందు 'ఇది'... అబ్బ... చెప్పాలంటే నాకు సిగ్గు” అన్నాడు అనిరుద్ర.

“ఇదిగో ఇలాంటి తింగరి వేషాలే వద్దు. బీ సీరియస్... అయామ్ యువర్ బాస్..”

“నేనింకా బ్రాస్ అనుకున్నాను. సారీ... బ్రా..స్” అన్నాడు అనిరుద్ర.

ద్విముఖ నవ్వుతోంది. అనిరుద్ర ద్విముఖ వంక చూస్తూ, “ఎంత బాగా నవ్వుతున్నారు... నవ్వడం కూడా ఓ ఫైన్ ఆర్ట్... అందులో ఆడవాళ్ల నవ్వులకు అర్ధాలే వేరేలే” అన్నాడు అల్లరిగా.

“ఏంటీ... నవ్వుల్లో కూడా ఆడ.. మగ... నవ్వులుంటాయా?”

"వైనాట్... మీకో విషయం తెలుసా? మగవారికన్నా ఆడవారే 126 శాతం ఎక్కువగా నవ్వుతారట. ఓ పరిశోధనలో తేలిన అంశం. కాకపోతే మగవాళ్లు సెక్సీ జోకులను ఆస్వాదిస్తారు.

ఆడవాళ్లు అలాంటివాటి పట్ల ఆసక్తి చూపించరు. డిగ్నిటీగా వినగానే ఫ్రెష్ గా నవ్వొచ్చే జోకుతలే ఇష్టం. నవ్వితేనే ఎండార్ఫిన్లనే సహజ ఉత్పత్తి బాధానివారిణీలు పనిచేసేవి. అంతెందుకు.. బాగా నవ్వినప్పుడు మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని చూసుకోండి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నవ్వడం ఆగిపోయిన తర్వాత ముఫ్పై సెకన్ల వరకు అలాగే కొట్టుకుంటుంది”

“మీకు చాలా విషయాలు తెలుసే....”

“ఆ విషయాన్ని మీ ఫ్రెండ్ గుర్తించడం లేదు” అంటూ అనిమిష వైపు చూశాడు.

“ద్విముఖ కాఫీ తెస్తానుండు” అంటూ లేచింది అనిమిష .

“నేను తీసుకొస్తాను... మీరు మాట్లాడుతూ ఉండండి”

“అక్కర్లేదు... మీరు తీస్కొస్తే సర్వీస్ ఛార్జ్ అని అకౌంట్ రాస్తారు”

“ద్విముఖగారు నాక్కూడా గెస్టే... నాలుగైదుసార్లు కాఫీ తాగించారు. దీనికి సర్వీస్ ఛార్జ్ వేయనులే” అంటూ కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.

****

“అనిమిషా... నీకో గుడ్ న్యూస్... 'రియల్ అండ్ ఫెయిర్' పేరుతో బెస్ట్ కపుల్ పోటీ ఏర్పాటుచేశారు. దానికి చీఫ్ గెస్ట్ మా డ్రీమ్ టీవీ ఛైర్మన్, వాళ్లావిడే... జడ్జెస్ ఎవరో తెలుసా? మీ బాస్ శోభరాజ్... మా బాస్, మా బాస్ భార్య... ఇంకా కమిటీ వుందిలే.... ప్రైజ్ మనీ ఎంతనుకున్నావ్... అక్షరాల లక్ష...”

“లక్షా...” అంది కళ్లు పెద్దవి చేసి.

“లక్షణంగా లక్షే. ఆ విషయం నాకూ తెలుసూ...” కాఫీ కప్పులతో వచ్చి ఓ కప్పు ద్విముఖకు, మరో కప్పు అనిమిషకు ఇచ్చి తనో కప్పు తీసుకొని అన్నాడు అనిరుద్ర.

“తెలుసా... తెలిసేందుకు చెప్పలేదు”

“చెప్పడం ఎందుకు?”

“మనకు లక్ష వస్తుందిగా” అంది అనిమిష .

“మనకా... మనకెందుకు వస్తుంది. మనకు 'అది' జరగలేదుగా. 'అది' జరక్కుండా కూడా బెస్ట్ కపుల్ అని లక్ష ఇస్తారా? ఉండు కనుక్కుంటాను” అంటూ కాఫీ కప్పు కింద పెట్టి ఫోన్ చేయబోయాడు. ద్విముఖ నవ్వును బలవంతాన ఆపుకుంది.

“చూశావా ద్విముఖా... బాస్ అన్న జాలి కూడా లేదు” అంది అనిమిష.

“బాస్ అంటే బాధ్యత ఉండాలి. జాలి ఎందుకు?” సెటైరిగ్గా అన్నాడు అనిరుద్ర.

ద్విముఖ వాళ్ల మధ్య కలుగజేసుకొని, “ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి. ఆ 'షో'లో పార్టిసిపేట్ చేస్తే మీకు బహుమతి రావచ్చు”

“నాకు నమ్మకం లేదు. ఈ తింగరి బుచ్చితో వెళ్తే ప్రైజేమొస్తుంది” అనిరుద్ర తేల్చేశాడు.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 08-11-2018, 10:54 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 08-11-2018, 10:58 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by ravinanda - 10-11-2018, 09:10 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 08-11-2018, 11:03 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by veerusani123 - 10-11-2018, 03:21 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Vikatakavi02 - 08-11-2018, 11:22 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by raaki86 - 08-11-2018, 11:43 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 08-11-2018, 11:44 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Pk babu - 08-11-2018, 11:57 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 09-11-2018, 12:56 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 06:20 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 06:24 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 11:23 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 09-11-2018, 12:19 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 09-11-2018, 01:43 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 09-11-2018, 01:44 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 02:01 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 09-11-2018, 03:29 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by amar_v420 - 09-11-2018, 03:33 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 07:01 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 07:05 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Vyas Kumar - 23-07-2022, 04:11 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Romeo.Raja - 23-07-2022, 04:50 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 09-11-2018, 08:32 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 09-11-2018, 09:14 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 09-11-2018, 09:16 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 09-11-2018, 10:34 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by ----DON - 10-11-2018, 01:07 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 10-11-2018, 01:48 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 10-11-2018, 01:53 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 10-11-2018, 02:09 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by veerusani123 - 10-11-2018, 03:23 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 10-11-2018, 03:39 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 10-11-2018, 05:05 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by chiru143 - 10-11-2018, 05:08 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 10-11-2018, 05:15 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 10:26 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by raaki86 - 10-11-2018, 11:59 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by pastispresent - 11-11-2018, 11:56 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 10:29 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 12-11-2018, 11:37 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 12-11-2018, 02:46 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:20 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:23 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:27 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:41 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:42 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:50 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:51 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:53 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:57 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Bubbly - 12-11-2018, 08:18 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by tvskumar99 - 12-11-2018, 09:32 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by saleem8026 - 12-11-2018, 09:52 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 12-11-2018, 10:10 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Mahesh61283 - 13-11-2018, 12:07 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by raaki86 - 13-11-2018, 12:18 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Terminator619 - 13-11-2018, 01:35 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by veerusani123 - 13-11-2018, 09:49 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by LUKYYRUS - 13-11-2018, 10:43 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 13-11-2018, 11:02 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by amar_v420 - 15-11-2018, 02:35 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by amar_v420 - 15-11-2018, 02:36 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by pastispresent - 20-11-2018, 05:32 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Mvd143 - 21-11-2018, 08:06 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by prasad_rao16 - 21-11-2018, 10:30 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by krish - 21-11-2018, 11:21 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Lakshmi - 21-11-2018, 09:22 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by whencutbk - 22-11-2018, 02:09 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by మన్మథుడు - 22-11-2018, 11:10 AM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Lakshmi - 22-11-2018, 12:21 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Rajkumar1 - 22-11-2018, 08:54 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Dpdpxx77 - 24-11-2018, 06:08 PM
RE: అనిరుద్ర H/o అనిమిష - by Pinkymunna - 04-12-2018, 01:16 AM



Users browsing this thread: 1 Guest(s)