Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భార్య భర్తల కిల్లికజ్జాలు (సమాప్తం)
#63
 
గౌతమ్ వెంటనే నందుని హగ్ చేసుకుని "రియల్లీ సారీ నందు నేను అసలు ఊహించలేదు నేను ఎప్పుడూ నిన్ను అలా అంటానని!!!! ఈసారి నా నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను..... నిన్ను జాగ్రత్తగా చూసుకోవలసిన టైం లో నా వల్లే నువ్వు ఏడ్చావు అన్న ఫీలింగ్ నే నేను తట్టుకోలేకపోతున్నాను..... ప్లీజ్ నందు నన్ను వదిలెయ్యకే!!!! ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయ్..... ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నోరు మెదపకుండా తీసుకుంటాను...." అని అడుగుతాడు
 
నందు ఇక నిన్నటి నుంచి గౌతమ్ మాటలకి మనసులో ఉన్న బాధ తట్టుకోలేక అది తారస్థాయికి చేరుకొని గౌతమ్ ని గట్టిగా హగ్ చేసుకొని గుక్క పెట్టి ఏడుస్తూ "నువ్వు నిన్ను అలా అనగానే నాకు ఎంత బాధ వేసిందో తెలుసా గౌతమ్???? లైఫ్ లో ఫస్ట్ టైం తప్పు చేసానా అనిపించింది??? నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నిన్నే ప్రాణంగా అనుకున్నాను.... అటువంటిది నీ నోట్లో నుంచి నన్ను నీ జీవితం లోకి తీసుకు రావడం నువ్వు చేసిన పెద్ద తప్పు అని అనగానే లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు బ్రతుకుతున్ననా అనిపించింది????" అని ఏడుస్తూ అంటుంది
 
నందు "ష్ ష్ ఏడవకు నందు..... నిన్న నా నోటి నుంచి అలాంటి మాటలు రాకుండా ఉండాల్సింది పొరపాటున వచ్చేశాయి కానీ ఇంటేన్షనల్ గా కాదు అని చెప్పాను కదా!!!! ఇక జీవితంలో నిన్ను కష్టపెట్టే మాట ఒకవేళ అంటే మాత్రం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నేను సంతోషంగా తీసుకుంటాను..... కానీ ఇలా నీలో నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెట్టకు..... నిజంగా నందు నిన్ను పెళ్లి చూపులలో చూడగానే నాకు నచ్చేసావు..... అందుకే ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి చూడగానే తన పర్మిషన్ కూడా అడగకుండా ముద్దు పెట్టాను.... కానీ పెళ్లయినప్పటి నుంచి నువ్వు నాకోసం ఆఫీసు నుంచి రాగానే నువ్వు ఎదురు వస్తే ఎంత బాగుండు అనుకున్నాను!!!!
 
నువ్వు మాత్రం ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నా మీద చిరాకు పడే దానివి!!!? ఆ టైంలో చాలా బాధగా అనిపించేది!!!!! ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని!!!! నీకు ఏదైనా కావాలి అనుకుంటే ప్రేమగా మాట్లాడుతావు లేకపోతే చిరాకు పడతావు.... నిజంగానే నీ బిహేవియర్ నాలో కొంచెం ఫ్రస్టేషన్ లేపింది.... పైగా మొన్న నువ్వు చీర కోసం చేసిన దాని వల్ల లాస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా ఉండేసరికి ఆఫీస్ లో మేనేజర్ నన్ను ఎడాపెడా వాయించేశాడు...... ఆ కోపం ఫ్రస్టేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియక పైగా నువ్వు మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంటే మళ్లీ అలాగే చేస్తున్నావ్ ఏమో అనుకొని బాధపడి అలా అనేశాను..... అంతే తప్ప ఒక్క మాట కూడా నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు నందు.... నన్ను కూడా అర్థం చేసుకో నందు...." అని బాధగా అడుగుతాడు
 
నందు తన కన్నీళ్లు తుడుచుకొని తన చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి గౌతమ్ చేతులు పట్టుకుని "ఐ యాం రియల్లీ సారీ గౌతమ్ నిజంగా ఇందులో నా తప్పు కూడా ఉంది.... నిన్ను ఇలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది.... అలా చేయబట్టే నీలో ఇలా ప్రస్టేషన్ పెరిగిపోయింది..... ఇక నుంచి నీ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయను ప్రామిస్.... నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు వచ్చేసరికి నీ ఎదురుగా నవ్వుతూ ఉంటాను.... కానీ నువ్వు కూడా ఇకనుంచి మీ ఆఫీసులో టెన్షన్స్ అన్నీ తీసుకువచ్చి నామీద అరవ కూడదు..... మీరు ఒక్క మాట మమ్మల్ని మీ జీవితంలో తక్కువ చేసేలా అంటే అది మేము ఈజీగా తీసుకోలేము అర్థం చేసుకో!!!" అని బాధగా అడుగుతుంది
 
"నిన్ను బాధపెట్టాలని చెప్పలేదు నందు మేము ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ అలసటగా ఇంటికి రాగానే భార్యల దగ్గర నుంచి కొంచెం ప్రేమ ఆదరణ లభించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా!!!! అదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను.... అంతే తప్ప నిన్ను దేనిలోను ఫోర్స్ చేయాలని కాదు..... ఇకనుంచి నువ్వు నీకు నచ్చినట్టు ఉండు పర్వాలేదు....." అని నందు నూతన గుండెలకి హత్తుకుంటూ అంటాడు
 
"లేదులే గౌతమ్ ఇందులో నా తప్పు కూడా ఉంది...." అని ఒకరినొకరు నాది తప్పు అంటే నాదే తప్పు అని వాదించుకుంటూ ఉంటారు.....
 
ఇంతలో ఎవరో తమ రూమ్ డోర్ కొడుతూఉంటే ఇద్దరు వాదులాడుకోవడం ఆపేసి ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు.....
 
 
ఇంతలో మళ్లీ డోర్ సౌండ్ వినిపించి నవ్వటం ఆపేసి "ఇద్దరిదీ తప్పు ఉంది కాబట్టి ప్రస్తుతానికి చెల్లుకు చెల్లు చేసుకుందాం.... ఇకనుంచి ఇద్దరం ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం ఏమంటావు నందు????" అని గౌతమ్ అడుగుతాడు
 
"నాకు ఒకే గౌతమ్ ఇకనుంచి నేను కూడా నీకు నచ్చినట్టు గానే ఉంటాను...." అని నవ్వుతూ అంటుంది
 
"సరే ఎవరో వచ్చినట్టు ఉన్నారు... వెళ్ళి చూస్తాను నువ్వు రెస్ట్ తీసుకో!!" అని చెప్పి నందు ని బెడ్ మీద పడుకోబెట్టి గౌతమ్ వెళ్లి డోర్ తీయగానే గౌతమ్ అమ్మగారు నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తూ "అయిపోయాయా మీ అలకలు????" అని నవ్వుతూ అడుగుతుంది
 
అది విని బెడ్ మీద పడుకొని ఉన్న నందు షాక్ గా లేచి కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంటే గౌతమ్ కూడా నందు వైపు అలానే చూసి వెంటనే ఇద్దరు సర్దుకొని గౌతమ్ అమ్మగారి వైపు చూస్తూ ఇద్దరూ ఒకేసారి "అలాంటిదేమీ లేదు అత్తయ్య.... అలాంటిదేమీ లేదు అమ్మ.... జస్ట్ మాట్లాడుకుంటున్నాము అంతే!!!" అని కంగారుగా అంటారు
 
"నాకు తెలుసు మేము వచ్చిన దగ్గరనుంచి మీరు ఇద్దరు చాలా డల్ గా ఉన్నారు... పైగా ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవడం లేదు.... అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు ఏదో విషయం లో గొడవ పడ్డారని కానీ భార్య భర్తల విషయంలో మేము కలుగజేసుకోవటం మంచిది కాదని సైలెంట్ గా ఉన్నాము.... ఇప్పుడు మీ అంతట మీరే సాల్వ్ చేసుకున్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు.... అందుకే మేమందరం బయట ఉన్న పట్టించుకోకుండా మీరు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిన సైలెంట్ గా ఉన్నాము....సరే కానీ ఇక మీ సర్ది చెప్పుకోవడాలు అయిపోతే రెడీ అవ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం అయింది..... అందుకే డోర్ కొట్టి మరి మిమ్మల్ని డిస్టబ్ చేశాను...." అని నవ్వుతూ ఉంటుంది
 
నందు కూడా గడియారం వైపు చూసి ఆశ్చర్యంగా "అంటే అరగంట నుంచి మేమిద్దరం రూమ్ లోనే ఉన్నామా???" అనుకొని "సరే అత్తయ్య నేను రెడీ అయ్యి వస్తాను...." అని చెప్పిన రెడీ అవడానికి వాష్ రూమ్ కి వెళ్ళిపోతుంది
 
గౌతమ్ అమ్మగారు లోపలికి వచ్చి గౌతమ్ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి గౌతమ్ పక్కనే కూర్చుని గౌతమ్ వైపు చూస్తూ "చూడు గౌతమ్ ఇలా చెప్తున్నాను నువ్వు బాధపడకు.... ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకు వచ్చినప్పుడు తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటామని తన అమ్మానాన్నలకి ప్రామిస్ చేసి తీసుకు వస్తాము.... అటువంటిది మన వల్ల తను ఒక్క కన్నీటిబొట్టు కార్చిన అది చూసి మనం ప్రశాంతంగా బ్రతకలేము.... కాబట్టి ఎప్పుడూ నందుని బాధపెట్టకుండా చూసుకో...." అని అంటుంది
 
"అమ్మ నాకు నందు అంటే చాలా ఇష్టం ఇక నుంచి నందు కంట్లో నుంచి కన్నీటి చుక్క రాకుండా జాగ్రత్తగా చేసుకుంటాను.... ప్రామిస్" అని నవ్వుతూ అంటాడు
 
నందు వాష్ రూమ్ లోపలి నుంచే ఈ మాటలన్నీ విని "నాకు ఎంత మంచి కుటుంబం దొరికింది నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని.... గౌతమ్ నీ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు.... మీకు కూడా ఆఫీసులో సవాలక్ష టెన్షన్స్ ఉంటాయి అవన్నీ పోవడానికి మా దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా సేద తీరాలి అనుకుంటారు.... కానీ నేను నీకు అలా చేయకుండా ఇంకా ఎక్కువ టెన్షన్ ఇచ్చాను.... ఇక నుంచి ఇలాంటి సిల్లీ బిహేవియర్ నీ దగ్గర చూపించను...." అని తనలో తానే అనుకుంటుంది
 
తర్వాత నందు బయటికి రాగానే గౌతమ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు....
 
గౌతమ్ అమ్మగారు నందుని రెడీ చేస్తూ "ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నందు గౌతమ్ ది చిన్న పిల్లల మనస్తత్వం చిన్న చిన్న వాటికి సంతోషిస్తాడు కానీ మనం కూడా వాళ్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి..... వాళ్ళు బయట సవాలక్ష పనులు చేసుకుని ఇంటికి వస్తారు..... అటువంటి వాళ్ళ దగ్గర మనం మన టెన్షన్స్ కూడా చెప్పి ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదు..... సాధ్యమైనంతవరకు వాళ్ళకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ మనం ఇంకా వాళ్ళకి బరువై పోకూడదు....." అని అంటుంది
 
నందు వెంటనే గౌతమ్ అమ్మగారిని హగ్ చేసుకొని "అలాగే అత్తయ్య గౌతమ్ ని ఇకనుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను...." అని అంటుంది
 
గౌతమ్ కూడా ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ని కలుస్తారు డాక్టర్ నందుని చెక్ చేసి తల్లి బిడ్డ హెల్దీ గా ఉన్నారు అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు..... డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాటిలో టాబ్లెట్స్ మెడికల్ స్టోర్ లో తీసుకొని నందు ని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తారు..... మధ్యాహ్నం లంచ్ తర్వాత నందు అమ్మగారు నందుని తీసుకెళ్తాను అని చెప్పినా గౌతమ్ ససేమిరా ఒప్పుకోకుండా "నేను నా నందు ని జాగ్రత్తగా చూసుకుంటాను.... కావాలంటే కేర్ టేకర్ ని కూడా పెట్టుకుంటాను..... కానీ నా నందు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను...." అని నందు చెయ్యి గట్టిగా పట్టుకుని అంటాడు
 
గౌతమ్ ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక ఎంత చెప్పినా కోపం వినకపోయేసరికి ఇక అందరు చివరికి గౌతమ్ దగ్గరే నందుని ఉంచేలా ఒప్పుకోక తప్పలేదు..... అందరూ కూడా గౌతమ్ ప్రేమ చూసి సంతోషించి అప్పుడప్పుడు వస్తామని చెప్పి గౌతమ్ అమ్మగారు మాత్రం వెళ్లకుండా నందు దగ్గరే తనని చూసుకుంటూ ఉంటానని చెప్పి ఉండిపోయి మిగిలిన అందరు తర్వాతి రోజు అందరూ వెళ్లిపోతారు.....
 
గౌతమ్, గౌతమ్ అమ్మగారు నందు ని జాగ్రత్తగా చూసుకుంటూ తనని సంతోషంగా ఉండేలా చేస్తారు.... నందు కూడా గౌతమ్ కోరినట్టు గౌతమ్ విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ గౌతమ్ ని సంతోషంగా చూసుకుంటుంది....
 
అలా ఇద్దరు ఒకరికొకరు తోడుగా మారిపోయి సంతోషంగా లైఫ్ గడిపేస్తూ ఉంటారు..... నందు కి తొమ్మిది నెలల తర్వాత నందు లాంటి బాబు పుడతాడు.... గౌతమ్ తన బాబు ని చేతుల్లోకి తీసుకుని సంతోషంగా నందు నుదిటిన ముద్దు పెట్టి "థాంక్యూ నందు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు!!!!" అని సంతోషంగా అంటాడు
 
నందు కూడా నవ్వుతూ "థాంక్యూ గౌతమ్ నీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు!!!" అని నవ్వుతూ అంటుంది
 
అలా ఇద్దరూ సంతోషంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు......
 
ఈ కథ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే!!!!
 
మగవాళ్ళకి బయట సవాలక్ష పనులు ఉంటాయి.... ఇంట్లో ఉండే ఆడవాళ్ళ వాళ్లకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ ఇంకా తలనొప్పి తెచ్చే పనులు చేసి వాళ్ళకి మన మీద మనసు విరిగేలా చేయకూడదు.... మన భర్తలు ఎవరి దగ్గర వాళ్ళ ఆనందాన్ని, బాధని అంత త్వరగా ‌షేర్ చేసుకోరు.... కానీ భార్య దగ్గర మాత్రం అన్ని చెప్తారు..... వాళ్ళని మన మాటలతో చేతలతో బాధపెట్టకుండా చూసుకోవటం మన బాధ్యత కాబట్టి ఎప్పుడు మగవాళ్ళని ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించ కూడదు..... భర్తలకి అనుగుణంగా ఉంటే భర్త భార్య ఇష్టాఇష్టాలు అన్ని తెలుసుకొని వాళ్లే మనకి కావల్సినవి ప్రేమతో తెచ్చి మరీ పెడతారు.... మనకి కూడా భర్త ప్రేమతో దగ్గరకు తీసుకుంటే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు కదా!!!! కాబట్టి మనం మన భర్తలని ప్రేమతో చూసుకోవాలి....
 
అబ్బాయిలు మీరు కూడా పెళ్ళయ్యాక పెళ్ళాం బానిస అనుకుంటూ తనని కాళ్ళ కింద చెప్పులా ఉంచకూడదు..... వాళ్లు కూడా పెళ్లయిన దగ్గరినుంచి అంతకు ముందు ఉన్న తమ ప్రపంచాన్ని కూడా వదిలేసి మీరే లోకంగా బ్రతుకుతారు.... అటువంటిది మీ నుంచి చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చిన భార్యలు తట్టుకోలేరు.... కాబట్టి వాళ్ళని బాధపెట్టకుండా మీకు కావాల్సినట్టుగా మీరే మార్చుకోవాలి.....
 
భార్యాభర్తలు ఇద్దరు ఓపికతో ఉండాలి అలా ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది.... లేదంటే మూడు ముక్కలు విడివిడిగా ఎవరి జీవితం వారు అన్నట్టే బ్రతకాల్సి వస్తుంది......
 
మొత్తానికి భార్యాభర్తలు గిల్లికజ్జాలు సరదాగా ఉండాలి కానీ ఒకరినొకరు నొప్పించేలా ఉండకూడదు..... భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ పెదవుల మీద నవ్వు రావాలి కానీ అసహనం కనిపించకూడదు.... నేను ఈ కథ రాసింది కూడా భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు ఎలా ఉండాలి అనేది చెప్పటానికి!!! మీకు నచ్చితే ప్లీజ్ నన్ను కామెంట్స్ తో ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి.....
 
సమాప్తం....
 
ఇంకా ఉంది అని చెప్పాలని ఉంది కానీ ఇక రాసే ఓపిక లేదు.... ఇక దీనితో ఈ కథ ముగింపు పలికించేశాను...అనుకున్నాను కానీ!
 
ఇంతవరకు నా కధని ఆదరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్.....

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: భార్య భర్తల కిల్లికజ్జాలు (సమాప్తం) - by k3vv3 - 30-04-2023, 10:06 AM



Users browsing this thread: 2 Guest(s)