Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
164 . 5

 
ఓ రోజు బాగా  ఓ ఫుల్ బాటిల్ ఎక్కించి న తరువాత  రామ కృష్ణ  బయట పడ్డాడు ,  మన కంద రికీ  ఓ పెద్ద తలకాయ  పైన పని చేస్తుంది అని.   సెక్యూరిటీ అధికారి కేసు లు కాకుండా , అటు వైపు నుంచి పెద్ద  వత్తిడి లేకుండా  అయన చూసుకొంటాడు అని.  అన్నీ చెప్పిన వాడు పేరు మాత్రం చెప్పలేదు. కానీ  ఆ వ్యక్తీ చాలా పెద్ద పోసిషన్ లో ఉన్నాడు అని మాత్రం చెప్పి  అవుట్ అయిపోయాడు.   ఆ  మరుసటి రోజు  రాత్రి తను తాగి వాగింది గుర్తుకు వచ్చి  అందరిని పోగు చేసి  ఓ మాట చెప్పాడు. 
“మనకు సెక్యూరిటీ అధికారి వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా  బాస్ చూసుకుంటాడు,  మన పని జాగ్రత్తగా కంప్లీట్ చేయడమే అని”.
ఆత్రం ఆగలేక  అమానుల్లా అన్నాడు “మరి  వాటాల సంగతేం టి”  అని
“ఎవరికీ అన్యాయం చెయ్యరు, నా మాట నమ్మండి,  అందరికి  సమానంగా వాటాలు వచ్చే ట్లు చేసే బాధ్యత నాది”  అని అన్నాడు
“అన్నీ అయిపోయిన తరువాత, మొండి చెయ్యి చూపిస్తే”
“నేను తెలుసుగా మీ వాటాలు వచ్చేంత వరకు నేను మితోనే ఉంటాను”  అంటూ భరోసా ఇచ్చాడు అందరికి.
అప్పటికి వేరే మార్గం లేక, చేసిన పని మద్యలో వదల లేక అందరు పనిలో నిమగ్నమై పోయారు.
వాళ్ళు మాట్లాడే దాంట్లో  తనకేం సంబందం లేనట్లు  ఎటువంటి అడ్డంకి చెప్పకుండా ,  సపోర్ట్ చేయకుండా వాళ్ళు  మాట్లేడేది వింటూ ఉన్నది  ఒకరే ఒక్కడు అది మాతో పాటు ఉన్న ఉమర్.
తనకు కొద్ది కొద్దిగా తెలుగు అర్థం అవుతుంది , కానీ  తిరిగి మాట్లాడాలంటే ఇబ్బంది పడతాడు , కానీ  తనలోని భావాలను ఎలాగోలా పక్కనోడికి అర్థం అయ్యేటట్లు చెప్పగలడు.
అనుకున్న టైం కు సొరంగం తవ్వే సారు.    మరుసటి రోజు ఆదివారం.  ఈరోజు రాత్రికి లాకర్ రూమ్ లోకి ఎంటర్ కావాలని ముందే అనుకోవడం వలన ఆ రోజు రాత్రి అంతా  లైట్ గా తలా రెండు పెగ్గులు పట్టించి  పడుకోండి పోయారు. 
ఆ రోజు రాత్రి  రామ కృష్ణ అక్కడే పడుకున్నాడు, మాములుగా రామ కృష్ణ  డే టైం లో  వాళ్లతో ఉండడు చీకటి పడ్డ తరువాతే  వచ్చి వాళ్లతో కలుస్తాడు  లేదంటే  లేదు.
 
ముందే అనుకున్నట్లు అంతా పడుకునే  ముందే అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మొత్తం  కావలిసినవి బ్యాగ్ లో సర్దుకొని , మిగిలినవి అగ్గి పెట్టే సారు.
 
అప్పుడప్పుడూ  ఆ కాంపౌండ్  లో ఎండిన మొక్కలు అగ్గి పెట్టడం మామూలే కాబట్టి చుట్టూ పక్కల ఎవ్వరు దాన్ని గురించి పెద్దగా పట్టించు కోలేదు.
 
సరిగ్గా రాత్రి  2.30  కి అంతా నిద్ర లే చారు. దాని కంటే  అస్సలు పడుకోలేదు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ముందు జరగ బోయే దాన్ని గురించి అందరికీ  టెన్షన్ గానే ఉంది.  అనుకున్న ప్లాన్ ప్రకారం  స్ట్రాంగ్ రూమ్,  లాకర్ రూమ్ ఓపెన్ చేసి  దొరికిన వాటిని  బ్యాగుల్లో సర్దేసి,ఆ బ్యాగులు సొరంగం ద్వారా గెస్ట్ హౌస్ కే తీసుకొచ్చారు.
వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ లోకి వచ్చిన ఇంకో కారులోకి  నింపారు దోచు కొచ్చిన బ్యాగులు అన్నింటినీ.  రామ కృష్ణ వెళ్లి డ్రైవర్ దగ్గర నుంచి   డబ్బులు తీసుకొని వచ్చాక ,  ఆ డ్రైవర్ తో కలిసి  ఉమర్ వెళ్లి పోయాడు.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:01 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 16 Guest(s)