Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
169. 2

 
రేపు మద్యానం  లంచ్ చేసి బయలు దేరుదాము అని చెప్పి  ,  నా ఫోన్ లోని లొకేషన్  మ్యాప్  ను తన ఫోన్ లోకి  WhatsApp  ద్వారా transfer  చేసాను.  
 
ఇద్దరం మరో టీ  తాగి  డిస్ పెర్స్ అయిపోయాము.       రాత్రి  సరిగా నిద్ర లేకపోవడం వలన  ఇంటికి వెళ్లి మంచం ఎక్కగానే నిద్రలోకి జారుకున్నాను.  
 
పొద్దున్నే లేచి నా కు అప్పగించిన  సా మాన్ల  లిస్టు పట్టుకొని టౌన్ మీద పడ్డాను.    12.30  కో  ఓ పెద్ద   బ్యాగు నిండా  సా మాన్లు నింపు కొని  ఆటోలో  ఇంటికి వచ్చాను. 
 
లంచ్  తరువాత ఓ రెండు రోజులు పని మీద బయటకు వెళుతున్నా నని అమ్మకు చెప్పి  హమీద్  కలవమన్న  ప్లేస్ కు      వెళ్లాను కొన్న సామాన్లతో. 
 
తను అప్పటికే  ఓ  జీప్  లో  తన తేవలిసిన సా మాన్లు అన్నీ  తీసుకొని  రెడీ గా ఉన్నాడు.   నా బ్యాగ్ ను జీప్ లో వేసి  ఆలస్యం  లేనట్లు  ముందుకు  దూకించాడు  జీప్ ను.
 
దారిలో రెండు మూడు సార్లు   ఫోన్ చేసి మేము ఎక్కడ ఉన్నామో చెప్తూ ఉన్నాడు.    సాయంత్రం   7  , 8 మద్య  రోడ్డు పక్కన దాబాలో  ఆపి బొంచేసి  ఓ రెండు గంటలు రెస్ట్ తీసుకొని  ఆ తరువాత బయలు దేరాము. 
నేను తిన్న వెంటనే  నిద్ర పోయాను.  తనే రాత్రంతా  డ్రైవ్ చేసి    అడవిలోకి రాగానే   రోడ్డుకు కొద్ది దూరం లో  ఆపి తను కూడా  పడుకొని నిద్ర పోయాడు.  
ఉదయం పక్షుల  కిల కిల రావాలతో  , సూర్యుడి కిరణాలు  మొహం మీద పాడుతుండగా మెలకువ వచ్చింది  , హామీద్ తన  ఫ్రంట్ సీట్ లో  పడుకున్నాడు.  తనను disturb చేయకుండా  కింద కు దిగి ,   కొద్దిగా అటూ  ఇటు  తిరుగుతూ  , ఫోన్ ఓపెన్ చేసి  మల్లికార్జున ఇచ్చిన మ్యాప్  లోని లొకేషన్ ఎంత దూరం లో ఉందొ అని  వెతక సాగాను.   
 
గూగుల్  మ్యాప్ ఆ లొకేషన్ మాకు   1 కిలో మీటర్ దూరం లో ఉంది   అని  చూపిస్తుంది. అక్కడ నుంచి వీల్లు ఎక్కడ ఉన్నారో  అని వెతకాలి అనుకుంటుండగా  హమీద్ లేశాడు.
 
"మనం  ఇంకో  గంటలో  యాక్షన్ లోకి దిగాలి అంత వరకు కొద్దిగా రెస్టు తీసుకోండి"  అంటూ తను లేచి  వ్యాన్ లో నీళ్ళు  వంపుకొని మొహం కనుక్కున్నారు.  వస్తు వస్తూ  ప్లాస్క్  లో పోయించు కొన్న టి  ని రెండు కప్పుల్లో నింపుకొని  ఒకటి నా కిచ్చి  రెండోది తను తీసుకున్నాడు.
 
ఆ అడవిలో చెట్ల మద్య నుంచి మా మీద పడుతున్న లేత సూర్యకిరణాలు నును వెచ్చని  వేడి మా  శరీరాల లోంచి చలిని బయటికి పంపాలని ప్రయత్నిస్తుండగా.   దానికి తోడూ  రాత్రి  తెచ్చుకున్న  టి   ఇంకొద్దిగా సహాయ పడింది  శరీరం వేడెక్కడానికి. 
 
ముందే  అనుకున్న ప్లాన్ ప్రకారం  ఇద్దరం  ఫారెస్టు  గార్డ్స్  uniform  లోకి  దిగిపోయాము ,   కావలసిన ఆయుధాలు  అన్నీ  సర్దుకొని  మెల్లగా  మ్యాప్ లో  ఉన్న ప్రదేశం వైపు  కదల సాగాము.
 
ఆ మ్యాప్  ఉన్న ప్రదేశానికి చేరుకోగానే , అక్కడ నుంచి తనకు ఎదో బాగా తెలిసినట్లు ,  అడవిలో ఓ  దిశలో స్పీడ్ గా తన వాచ్ చూసుకోం టు నడవ సాగాడు.
 
దాదాపు  ఓ  ౩౦ నిమిషాలు  నడిచిన తరువాత ,   "సర్ , యాక్షన్  కు టైం అయ్యింది  ,  రెడీ గా ఉండండి " అంటూ   మా ముందున్న గుబురు పొదల్లోంచి  బయటకు చూసాడు.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:34 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)