Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
#10
అదృశ్య మందిరం
అంతులేని పయనాలెన్నింటికో....ఆరంభమిది

అదృశ్య మందిరంలో ఏముందో తెలుసుకుందామని రాజవరం గ్రామానికి వెళ్లిన ముగ్గురు సి.బి.ఐ. ఆఫీసర్ లు అభిజిత్, అంకిత మరియు సంజయ్ అక్కడ జరిగే పరిణామాల వల్ల వారికి సిద్ధపురుషుడు తారసపడతాడు.
ఘోర కలి తన చీకటి రాజ్యాలు అన్నింటినీ విడుదల చేస్తాడు.
ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులనూ భయపెడతాడు. తన చీకటి రాజ్యాలను విస్తరించుకుంటూ పోతాడు.
 ముందు ముందు ఘోర కలి వల్ల జరగబోయేఎన్నో పెను ప్రమాదాల నుండి ప్రపంచాన్ని రక్షించటానికి సిద్ధపురుషుని నేతృత్వంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యానికి పయనమవుతారు.
ఘోర కలి బారి నుండి ప్రపంచాన్ని వారెలా కాపాడారో తెలుసుకోవాలంటే ఈ"అదృశ్య మందిరం"లోకి మీరు
అదృశ్యమైపోయిచదవాల్సిందే.

సి.బి.ఐ. స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ – ముంబై
సి.బి.ఐ. ఈ కేసు విచారణని ముంబైకి మళ్లించింది. డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయ్యి, చురుకుగా పనిచేస్తూ 'యంగ్ అండ్ ఎనర్జెటిక్' అని పేరు తెచ్చుకుంటున్న అభిజిత్, అంకితలకు ఈ కేసుని అప్పగించారు.
రాజవరానికి బయలుదేరి వెళ్లే ముందు సుపీరియర్ ఆఫీసర్ అశుతోష్ వాళ్ళని ఇలా హెచ్చరించాడు.
"అభిజిత్...అంకిత మీ మీద మాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకముందు ఆ రాజమహల్లో అడుగుపెట్టిన ఐదుగురు కనిపించకుండా పోయారు. మీరు ఉండాల్సింది రాజవరంలో. మీతో పాటుగా సంజయ్ వస్తున్నాడు. అక్కడ మీరుండటానికి స్పెషల్ పెర్మిషన్స్ తో మంచి లాడ్జింగ్ ఏర్పాటు చేశాను.
నాకు ఎప్పటికప్పుడు మీ నుండి అప్డేట్స్ కావాలి. నాకు పై ఆఫీసర్స్ నుండి ప్రెషర్స్ ఎక్కువవుతున్నాయి.
లాస్ట్ గా, వన్ థింగ్. స్టే సేఫ్. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. ఇది మీ వెల్ విషర్ గా చెబుతున్న మాట."
అభిజిత్,"అసలు ఏముంది సర్ ఆ 'అదృశ్య మందిరం' లో? అందరూ మమ్మల్ని తెగ భయపెడుతున్నారు ! ఆత్మలున్నాయా? నేనసలు నమ్మను అలాంటి వాటిని. ఈ కేసుని ఎవ్వరూ ఊహించనంత త్వరగా సాల్వ్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్."
సంజయ్,"పాతాళలోకాల గురించి ఐడియా ఉందా అభిజిత్?"
అభిజిత్,"లేదు సర్. నేను హిస్టరీలో చదువుకోలేదెప్పుడు.  ఇదే మొదటిసారి వినటం."
సంజయ్,"అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాల్ని సప్త పాతాళలోకాలు అంటారు. ఆ లోకాల్లో ఉండేవాళ్ళని కళ్లారా చూసినట్టుగా చెప్పాడు రాజభవనంలో తప్పిపోయిన ఆ ఐదుగురిలో ఒకరైన రాధాకృష్ణన్. చివరి నిమిషాల్లో ఆయన తన బ్లాగ్లో పెట్టిన పోస్టులో ఉందిది."
అంకిత,"నేనిది చదివాను కానీ నమ్మలేదు. ఆయన అకౌంట్ నుండి వేరే ఎవరైనా అలా పోస్ట్ చేసుంటారు అనుకున్నా. ఆ ఐదుగురితో పాటు ఆయన మిస్సింగ్ అని తెలిసి అప్పటికే రెండేళ్లు అయింది కదా."
సంజయ్,"ఆయన ఆ పోస్ట్ మొబైల్ నుండి పెట్టారు. ఒక ఫోటో కూడా అప్లోడ్ చేశారు. అదేంటో అర్థం కాట్లేదు. లొకేషన్ ట్రేస్ చేసి చూసాం కోఆర్డినెట్స్ అన్నీ విచిత్రమైన టైం జోన్ ఒకటి చూపిస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఆయన తన అకౌంట్ డీటెయిల్స్ వేరే ఎవ్వరితోను షేర్ చెయ్యలేదు. సో, ఖచ్చితంగా ఆ పోస్ట్ ఆయనదే. త్వరలోనే హ్యాకింగ్ డేటాబేస్ లో ఆయన తనతో పాటు తీసుకెళ్లిన సీక్రెట్ కెమెరా ఫుటేజ్ బయట పడుతుంది. అప్పుడు మరిన్ని విషయాలు బయటికొస్తాయ్. ఇన్ని రోజులూ ఆ ఫుటేజ్ కి యాక్సెస్ ని ప్రైవేట్ మోడ్ లో ఉంచారు. లాగిన్ అవ్వాలంటే సెక్యూరిటీ  కోడ్స్ తన మొబైల్ కే వచ్చేలా పెట్టుకున్నాడు. ఇప్పుడు మనవాళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. తొందర్లోనే మనం 'అదృశ్య మందిరం' లోపలి విజువల్స్ చూడబోతున్నాం."
అభిజిత్,"మీరు చాలా స్టడీ చేసినట్టున్నారు. గ్రేట్. బట్, ఈ మైథాలజీని మీరు నమ్ముతారా? నేను అవేవి చదవలేదు కాబట్టి ఎవిడెన్స్ లేకుండా దేన్నీ నమ్మలేను."
అంకిత,"అందుకే నేనూ నమ్మలేదు."
సంజయ్,"వినటానికి ఇంటరెస్టింగ్ గా ఉంది కదా. కొన్ని రోజులు నమ్మేద్దాం. మైథాలజీ రిఫర్ చేసినట్టు కూడా ఉంటుంది. ఏమో ఏదైనా క్లూ దొరకచ్చేమో."
అభిజిత్,"కరెక్ట్ గా చెప్పారు. నేను మైథాలజీ చదవలేను బాబోయ్. ఇందులో మాకు ఏ డౌట్ వచ్చినా, ఇక నుంచి మీరే మమ్మల్ని గైడ్ చెయ్యాలి."
అశుతోష్," సంజయ్ ని మీకు తోడుగా ఎందుకు పంపిస్తున్నానో ఇప్పుడర్థం అయ్యిందా? సంజయ్ కి ఈ కేసులో స్పెషల్ ఇంటరెస్ట్ ఉంది. చాలా ఎక్కువ తెలుసుకున్నాడు ఈ రెండేళ్లలో. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాడు.
విష్ యు ఆల్ ది బెస్ట్.
హ్యాపీ జర్నీ టు 'అదృశ్య మందిరం'.
క్షేమంగా వెళ్లి మాయమైపోకుండా తిరిగిరండి."

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 11 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 09-07-2023, 06:21 PM



Users browsing this thread: 1 Guest(s)