Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#16
జవాబు లేదు.
మెల్లిగా నా ముందుకొచ్చి నా పెదాలపై ముద్దు పెట్టింది.
స్తబ్ధత....నా మనసు, బుద్ధి ఏమీ పని చెయ్యలేదు. తేరుకోలేదు. తిరిగి నేనే పెట్టాను ఈసారి...నింపాదిగా..
తరవాత తను సిగ్గుతో నా కళ్ళల్లోకి చూడలేకపొయ్యింది.
"ఒక పది నిమిషాలాగు.. డ్రెస్ వేసుకొని ఒచ్చి చూపిస్తాను." అని కిందికి పరుగెత్తింది.
ఆనందం... పుట్టి బుద్ధెరిగిన తరవాత ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు. ఎంత అదృష్టం!... నాదేనా?..నమ్మబుద్ధి కాలేదు.
ఫోన్ మోగింది...
హేమంత్ గాడు..
వీడికి చెప్పాలి.. కాని ఇప్పుడు కాదు.. కట్ చేశాను.
మళ్ళీ చేశాడు. మళ్ళీ కట్ చేశాను.. మధ్యాహ్నం నుంచీ ఇది అయిదోసారి. గొడవలో ఎత్తడం కుదరలేదు.
మెసేజ్ చేశాడు. "అర్జెంట్. అటెండ్ కాల్."
వెంటనే కాల్ బ్యాక్ చేశాను.
"నీ అయ్యా.. ఫోన్ కట్ చేస్తవేందిరా నువ్వు? మొత్తానికే మరిచిపొయినవా ఎట్ల?" అన్నాడు ఎత్తగానే.
"సారీ రా.. పనిలో ఉండి కుదరలే..ఏమైనా అర్జెంటా? రాత్రి ఫోన్ చెయ్యనా?...అప్పుడు నీకో సూపర్ న్యూస్ చెప్తా."
"నేనే నీకు చెప్తా దాని తాత లాంటి న్యూస్. అందుకనే చేశింది."
"అవునా...చెప్పు ఏంటి?"
"మిథున..మిథున పడ్డది నాకు.."
"వ్వాట్? ఏం చెప్తున్నావ్ నువ్వు?..జోకా?"
"జోక్ ఎందుకు చేస్తాబే?..ఇయ్యాల్నే చెప్పిన..ఒప్పుకుంది.. ఒప్పుకునుడేంది..ముద్దు గూడ పెట్టింది."
"ముద్దా..?"
"అవును బే. ఇంకా డీటెయిల్స్ కావాల్నా....ఇందాక కలిసినప్పుడూ............ "
ఒక పెద్ద భూకంపం ఒచ్చింది..వెయ్యి టన్నుల బరువున్న రాయి నా మీద పడింది. బుర్ర తిరిగిపోతుంది. ఫోన్ కట్ చేశాను.
నోరు తడారిపోయింది. అడుగులు తడబడుతున్నాయి..
భయమేసింది. ఎందుకో చాలా భయమేసింది...
ఆదరా బాదరాగా కిందికొచ్చాను..
బండి స్టార్ట్ చేసి పోనిచ్చాను.. వెనక్కి తిరిగి చూడలేదు.
ఇంటికెళ్ళేటప్పుడు కొత్తకార్డ్ కొని నా ఫోన్ నంబర్ మార్చేశాను.
 
మా అమ్మ
 
"మా అమ్మoటే నాకు చాలా ఇష్టం, చాలా మంచిది. చెప్పడానికి కొంచం టూ మచ్ గా ఉంటుంది కాని మా అమ్మంటే దేవతే... అంటే ఎవరికైనా వాళ్ళమ్మ దేవతలాగే అనిపిస్తుంది కాని నా విషయంలో ఇది నిజంగా నిజం."
ఇలాంటి మాటలు నేనెప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. కాని కొన్ని రోజుల నుంచి ప్రీతి చాలా దెగ్గరయ్యింది. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోబుద్ధవుతుంది. తను గురించి కూడా చాలా తెలిసింది. ఇద్దరం ఇంటికి దూరంగా ఉండటమో మరింకేంటో తెలియదు కాని ఒకరితో ఒకరికి చాలా చాలా తొందరగా స్నేహం ఏర్పడింది.. రోజూ గంటలు గంటలు ఫోన్ లో గడిచిపోతుంది.
నా పేరు భార్గవ్. నేను సెవెంత్ క్లాసులో ఉన్నప్పుడు ఊళ్ళో హాస్టల్ కి ఒచ్చాము నేను, మా తమ్ముడు. టెన్త్ క్లాసు వరకు పూర్తిగా బాయ్స్ స్కూల్ అండ్ హాస్టల్ కావడంతో అమ్మాయిలతో అస్సలు పరిచయం లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఒచ్చాక ట్యూషన్ దెగ్గర ప్రీతి పరిచయం అయ్యింది. ముందు తనతో మాట్లాడాలని చాలా కోరికగా ఉండేది కాని దెగ్గరికెళ్తే నోరు పెగిలేది కాదు.
కాని ఒక కామన్ ఫ్రెండ్, శివగాడు, వాడి వల్ల రెండు మూడు సార్లు కలిశాం. ఎలాగోలాగ ధైర్యం చేసి పలకరించాను. తను చాలా కూల్. అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. నాకున్న సిగ్గు, భయం తనకు లేవు. అందరం కలిసినప్పుడు తనే సెంటరాఫ్ అట్రాక్షన్. అందరూ తన చుట్టూ చేరతారు. దీనికి కారణం తను అందంగా ఉండటమే అంటాడు శివగడు. కాని అదొక్కటే కాదు, తను ఎప్పుడూ హ్యాపీగా ఉండటం అని నేనంటాను. ప్రీతి చిరాకుపడ్డంకాని, విసుగ్గా ఉండడం కాని చాలా చాలా తక్కువ. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం అస్సలలా ఉండదు, అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మేమిద్దరమే ఉన్నప్పుడు, లేదా నాతో ఫోనులో ఉన్నప్పుడు మాత్రం ఏదైనా నచ్చని విషయం ఉంటే చెప్తుంది. చిరాకులు, కోపాలు ఎవరిమీదన్నా ఉంటే అప్పుడు నాకు మాత్రం చెప్తుంది.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 13-09-2023, 09:34 PM



Users browsing this thread: 1 Guest(s)