Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక్కటి తప్ప
#14
నెల రోజులు చూస్తుండగానే గడిచేలా ఉన్నాయి. ఇంత వరకూ నా మెసేజ్ చూసిందే లేదు. చాలా సార్లు ఫోన్ చేద్ధాం ఒకసారి మాట్లాడుదాం అనిపించేది. వాడు చెయ్యడు. ముందుంటేనే మాట్లాడడు, ఇంక కాల్ లో మాట్లాడుతాడు అనుకొని దండగ. ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళాను. మా ఇంటి నుంచి అర్థకిలోమీటర్ ఉంటుంది. స్కూటీ మీద వెళ్ళాను. మా అత్త ఊర్మిల. వయసు నలభై ఆరు ఉండొచ్చు. ఇంట్లోకి వెళ్ళగానే చుట్టూ చూస్తూ ఉన్నాను, తను ఇక్కడికి ఇంకా రానేలేదు, ఇంట్లో సోఫాలు, పెద్ద టీవీ, వంట గదిలో కొత్త కుక్కర్, గ్రైండర్, వాషింగ్ మెషీన్ అంతా మారిపోయింది. అత్తతో మాట్లాడాక తెలిసింది, సిటీలోనే ఒక ఇల్లు తీసుకున్నాడని, అక్కడే ఉంటున్నాడని. ఇక తనకి అన్నీ ఉన్నట్టే ఒక్కటి తప్ప. 



ఇంకో వారం గడిచింది. ఒకరోజు ప్రొద్దున్నే నేను లేచేసరికి మా అమ్మ వంట గదిలో హడావిడి పడుతుంది. ఆవిలిస్తూ టీవీ దగ్గరకి వచ్చాను, మా నాన్న వార్తలు చూస్తూ కూర్చున్నాడు, టీవీలో టైం చూస్తే పదీ పది అవుతుంది. పళ్ళు తోమి, నా పోనీటైల్ జుట్టు రబ్బర్ బాండ్ పెట్టుకొని, వంట గదిలోకి వెళ్ళాను. పొయ్యి మీద నూనె మసులుతున్న ముకుటూ, పక్కన గిన్నెలో పూరీలు, తిరిగి చూస్తే అమ్మ గారెల పిండి కలుపుతుంది. నా ముక్కు బాగా చురుకండోయి, కమ్మని కోడి కూడా వాసన వస్తుంది. ఉత్సాహం ఆపుకోలేక, ఆ గిన్నె మూత తీస్తూ అడిగేసా, “ అమ్మ నాటు కోడి ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు వండావు? ”

అమ్మకి నా ఉత్సాహంతో పనేం ఉంది. నేను పెద్ద బద్ధకిస్ట్ అని చిరాకు. ఇంకా స్నానం కూడా చెయ్యకుండా వచ్చి అన్ని ముట్టుకుంటున్నా అని “ ముట్టకూ నీక్కాదు అవి, వచ్చేవాల్లకి. అమ్మ ఇంత పని చేస్తుంది, ప్రొద్దున్నే లేచి ఒక చెయ్యందించాలి అన్న జ్ఞానం ఉందా నికూ. పెల్లీడోచ్చింది. అయినా ఇదే మబ్బు మెదడు. ” అంటూ చిరాకు పడింది. 

అప్పుడు నాకు సగం అర్థం అయ్యింది, సగం కాలేదు. సర్లే ఎందుకు పనిలో ఉన్నదాన్ని విసిగించడం అని అక్కడి నుంచి జారుకుంటుంటే, “ అలా ఉండకుండా స్నానం చేసి లంగా ఓని ఎస్కో. ఆ జుట్టు మంచిగా దువ్వుకో. జెడ వేసుకోకుండా కత్తిరించుకొని, పిలక పెట్టుకుంది. ఏం కాలమో ఏమో, ఇంకేమైనా అంటే లొల్లి నీతో. ”


అబ్బా జెడ అంటే నాకు ఇష్టమే, కానీ జీవితంలో ఒక్కసారైనా అలాంటి హేర్ స్టైల్ మెయింటైన్ చెయ్యాలి అని నాకుండదా, ఆ విషయం వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. అలక మొహం పెట్టుకొని, ఇప్పుడే స్నానం చెయ్యాలి అంటే నాకు విసుగొచ్చింది. లంగా ఓణీ అంటా ఇంకా నాయ్యం చీర కట్టుకోమనలేదు.

వెళ్లి స్నానం చేసి, గులాబీ రంగు లంగా ఓణీ కట్టుకొని, అన్ని గులాబీ రబ్బర్ బ్యాండ్,  గాజులు, జుంకీలు కూడా గులాబీ రంగు స్టోన్ ఉన్నవి పెట్టుకున్నాను. అది నా ప్యాషన్ సెన్స్. అంతెందుకు ఇప్పుడు నేను బయటకి వెళ్ళాలన్నా నాకు గులాబీ రంగు శాండిల్స్ కూడా ఉన్నాయి.


నేను తయారయ్యి, నా గదిలోంచి బయటకి వచ్చాను. అక్కడ కుర్చీలో నా ముందు తానే నాకు తెలుసు. నేను తన వెనక ఉన్నాను. 


“ ఏముంది మామయ్యా..... ఇలాంటివి ఇక్కడ కొత్త, ఫారన్లో అయితే…..ఇంత హడావిడి కూడా ఉండదు. ” మా నాన్నతో మాటాడుతూ ఉన్నాడు.


తన స్వరం ఎంత గంభీరంగా వుందో. వాళ్ళ మాటలు వింటున్న, నిదానంగా మాట్లాడుతున్నాడు. తన వెనక నుంచే అమ్మ దగ్గరకి అడుగులేస్తున్నా.

వెనక నేనొచ్చిన అలికిడి తెలిసిందేమో, తల వెనక్కి తిప్పి చూసాడు. నేరుగా నా కళ్ళలోకి. ఆహ్.... ఏంటి ఇది, తన చూపు సరాసరి నా గుండెలో గుచ్చింది. పెదాలు విడదీసి చిన్న నవ్వు విసిరాడు. ఏం మాట్లాడలేదు. నేను కూడా నవ్వేసి అమ్మ దగ్గరకి వంటగదిలోకి వెళ్ళిపోయా. 

అమ్మేమో చేతిలో ఛాయి కప్పుల ప్లేట్ పెట్టింది. తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నా. ఇందాక వెనక్కి తిరిగి చూసినోడు ఇప్పుడు అస్సలు చూడట్లేదు. అత్తా మామలకి ఇచ్చి తన ముందుకి వెళ్ళాను. తలెత్తి నన్ను చూడకుండానే కప్పు తీసుకున్నాడు. అదే మా నాన్న మాట్లాడితే మాత్రం ఆయన వైపు చూసి మాట కలుపుతున్నాడు. నేను వాళ్ళకి అందించి ప్లేట్ టేబుల్ మీద పెట్టి మిగిలిన ఒక కప్పు తీసుకొని మా నాన్న పక్కన కూర్చున్న.

తనని చూస్తూ కప్పు అంచును పెదాలకి తీసుకున్న, ఎంత బాగున్నాడో, ఒత్తైన కొంచెం రింగులు తిరిగిన జుట్టూ, చిన్న కళ్ళు, కొచ్చటి ముక్కు, మీసం గడ్డం మరీ ఒత్తుగా లేదు, ట్రిమ్ చేసాడేమో, నీట్ గా ఉన్నాడు. తెలుపు రంగు షర్టు, కింద జీన్స్ ప్యాంటు, చాల్సీ బూట్లు వేసుకొని, ఎడమ చేతికి వాచి పెట్టుకొని ఉన్నాడు. 

 ఛాయి జుర్రుకుంటుంటే కను రెప్పలు ఎత్తుతూ నా వైపు చూసి, “ పీజీ అయ్యిందంటా ఏం చెయ్యట్లేదా? ” అనడిగాడు. 

ఒక్కసారిగా కంగుతిన్నాను, ఛాయి నా పై పెదవికి సుర్రుమంది. అసలు తను చూడడమే ఎక్కువ, అలా అడిగేసిరికి అచ్చెరిపోయాను. కళ్ళు పెద్దగా చేసి సూటిగా చూస్తూ ఉన్నా, నా పెదవంచులో సిగ్గు వచ్చింది. వాడు నన్ను చూస్తూ కళ్ళతో నవ్వాడు. 

నా స్వరం తుత్తర పెట్టింది, “ లేదు.... ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు ” అని బదులిచ్చా. 

అటూ ఇటూ చూస్తూ ఉన్నాను, మా మామకి ఫోన్ కాల్ వచ్చింది. రెండు నిమిషాలు మాట్లాడి, “ ఆ తిన్నాక బయల్దేరుతాము ” అంటూ కట్టేసాడు. 

నేను మౌనంగా ఉన్నాను, తనూ మౌనంగా ఉన్నాడు. చూస్కొలేదు కానీ నలభై నిమిషాల పైనే గడిచిందేమో.

మా నాన్న  నా చెవిలో, “ అమ్మని వంట అయ్యిందా అడుగు, అయితే తిందాం, పో ” అని చెప్తే హమ్మయ్య అనుకొని అక్కడ నుంచి లేచి వంట గదిలోకి వెళ్ళాను. 

నేను: అమ్మ వంట అయ్యిందా, నాన్న తినాలి అంటున్నాడు

అమ్మ: అయ్యింది.... చూడు తిన్నాకా మేము రాజశేఖర్ బాబాయ్ కొడుకు పెళ్లికి  సిధిపెట్ వెళుతున్నాం. వచ్చేసరికి చీకటవ్వుద్దేమో, మమత వాళ్ళింటికి పోకుండా ఇంట్లోనే కూర్చో, లేదా దాన్నే ఇక్కడికి రమ్మను.

నేను “ అ సరే ” అన్నాను. 


తినడానికి కూర్చున్నాక, నేను అమ్మా వడ్డించాం. నా నోరే కాదు చేతుకుడా పెద్దదే, అన్నం ఎక్కువ పెడుతుంటే, తల అడ్డంగా ఊపుతూ వద్దన్నాడు. అసలే మొహమాటం ఎక్కువ తనకి, ఇంకొంచెం వేసుకోమని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వెనక్కి తగ్గాను.


వాళ్ళు తిన్నారు, మేము కూడా తిన్నాము. తిండడం అయ్యాక తనకి కాల్ వచ్చింది. బయటకి వెళ్లి చాలా సమయం మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు మా వాళ్ళు తయారయ్యారు. అప్పుడు తెలిసింది, తను ఊరికొచ్చి మూడు రోజులు అవుతుంది అని. ఇవాళ ఆ పెళ్లికి వెళ్తున్నారు అని.  ఏంటోనండీ నాకు స్నేహితులతో ఎటైనా వెళ్ళడం ఇష్టం కానీ చుట్టాల పెళ్ళికి వెళ్ళడం అస్సలు నచ్చదు. మా అమ్మేమో ఈరోజు నువు ఏ పెళ్ళికీ రాకుంటే రేపు నీ పెళ్ళికి ఎవరోస్తారే అనేది. నేనేమో పెళ్లి చేసుకోవడానికి పెళ్ళి కొడుకూ పూజారి ఉండాలి కాని ఎవరోస్తే రాకుంటే నాకేంటి అనేదాన్ని. 

తను ఫోన్ మాట్లాడి లోపలికొచ్చి, ఇప్పుడే హైదరాబాదు పోవాలని, రాత్రికల్లా తిరిగొస్తానని, దారిలో అతమ్మ్మా వాల్లాని సిద్దిపేటలో దింపుతాను అంటుంటే, మా అమ్మ మా కారులో అందరం కలిసే వెళ్తాము. తనని ఒక్కన్నే వెళ్ళమంది. అప్పుడే ఇంకో కాల్ వచ్చింది. ఎత్తి మాట్లాడుకుంటూ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు బయల్దేరుతున్నారు. అత్తమ్మ వెల్లోస్తాము అని చెపుతుంటే అక్కడి నుంచే చేతు ఎత్తి బై అన్నాడు. మా అమ్మ నాతో “ అబ్బాయి వెళ్ళాక, వంట గది సర్దేసెయ్ ” అని చెప్పి వెళ్ళిపోయారు.


ఇంకో పది నిమిషాలు గడిచాక, నేను వంట గదిలో ఉండగా నేరుగా నా దగ్గరకొచ్చాడు. పక్కన పోయి గద్దె మీద ఒరిగి, నన్ను చూస్తూ “ శ్రు... శృతి ” అని పలికాడు.

నాకు జళ్ళుమంది, అసలు నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు అనుకున్న. కాస్త ఊపిరి తీసుకొని అటు చూసా.

నన్ను సూటిగా చూస్తూ, “ హైదరాబాద్ కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ” అనడిగాడు.

నేను పెద్ద గిన్నెలో ఉన్న పూరీలు కొన్ని చిన్న బాక్సులో పెడుతూ తన వైపు చూడలేకపోతూ, “ రోజులేంటి, రెండు సంవత్సరాలు అవుతుంది ” అని బదులిచ్చాను. 

భరత్: వస్తావా? నైట్ వరకు వచ్చేద్దాం.


ఆ ప్రశ్న నా చెవిన పడింది అంతే నా మోకాళ్ళు జనికాయి. పెదాలు అతుకున్నాయి మాట రావట్లేదు. తనేమో ఇంకాస్త దగ్గరకి వస్తున్నాడు. 

ఏం చెప్పాలో అర్థం కాలేదు. తుత్తరగా “ ఏమో అమ్మని అడగాలి ” అనేసా.

మౌనంగా జేబులోంచి ఫోన్ తీసి చేస్తున్నాడు, అటు వైపు ఎత్తగానే, “ ఆ అమ్మ, అత్తకి చెప్పు నేను శృతి హైదరాబాదుకి వెల్లోస్తాం..... రత్రికల్లా వచ్చేస్తామే...... హ్మ్మ్.... సరే..... సరే సరే.... ”. 

అలా మాట ముగిస్తూ, ఫోన్ కట్టేసి, నాతో “ నీకేమైనా పనుంటే చేస్కో అది అయ్యాకే పోదాం. ”


రావడం నాకు ఇష్టమో లేదో అని కూడా అడగకుండా పని ఉంటే చేస్కో పోదాం అంట. అయినా అమ్మ ఒప్పుకుంటుంది అని నేను అనుకోలేదు. ఉఫ్ఫ్.... ఇప్పుడు వద్దంటే, ఏముంది వెళ్ళిపోతాడు. 

నాతో అలా చెప్పి మళ్ళీ టీవీ గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నా పని ముగించుకొని తన దగ్గరకి వెళ్ళాను. ఎందుకో చెప్పాలి అనిపించింది.

“ నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. ”

“ ఏ దీనికేమైంది, లంగాఓణిలో బానే ఉన్నావు కదా ”

“ అంటే అదీ....”

“ నీ ఇష్టం.... అక్కడ మనం ఏం పెద్దగా తిరిగేది లేదు, నాకు వర్క్ ఉంది, అది చూస్కొని ఇంటికి వెళ్తాం నువు కూడా మా ఇల్లు చూసినట్టు ఉంటుంది కదా అని అంతే. ”

“ హ్మ్మ్ సరే ”

[Image: IMG-0760.jpg]

అయినా ఎందుకో ఇలా వద్దు అనిపించింది, మార్చుకున్నాను. పసుపురంగు అనార్కలీ వేసుకున్న. తయారయ్యి బెడ్రూంలోనుంచి బయటకి వచ్చాక నన్ను చూసి మూడు క్షణాలు ఆగిపోయాడు. నా పెదాల్లో నవ్వు పుట్టుకొస్తుంటే తను కూడా చిన్నగా కళ్ళతో నవ్వుతూ చూపు మర్లించుకున్నాడు.

నేను తలుపు మూసి, నా హ్యాండ్బ్యాగ్ తీసుకొని వెళ్దామా అని అడిగితే తలూపాడు. తను బయటకి వెళ్లి, కార్ తిప్పి పెట్టాడు. నేను శాండల్ వేసుకొని, ఇంటికి తాళం వేసాను. అమ్మకి ఫోన్ చేసి తాళం చెవి మమత వాళ్లకి ఇస్తున్న అని చెప్పి పెట్టేసా. బయటకి వెళ్లి  పక్కింట్లో మమతకి తాళంచెవి ఇచ్చేసా. 

వచ్చేసరికి కార్ దిగి ఉన్నాడు. అది bmw 7 సీరీస్. నేను వెళ్ళగానే ఎడమ వైపు ముందు సీటు తలుపు తీసాడు. నేను సిగ్గుపడుతూ ఎక్కి కూర్చున్న. డోర్ మూసి తిరిగి వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చొని గేర్ వేసాడు. 

అర్ధగంట అవుతుంది ఊరు దాటి, ఏం మాట్లాడలేదు, నాకుడా ఎలా మాట కలపాలో తెలీటం లేదు. ఒకసారి తనని చూసాను. నేను చూస్తున్నది తనకి తెలుసు, చిరునవ్వు చేస్తున్నాడు. ఏంటో అలా చూస్తూ ఉండిపోయా.

అబ్బాయిగారు పది నిమిషాలకు నోరు విప్పాడు. 

భరత్: చూస్తూ ఉండే బదులు ఎదో ఒకటి అడగొచ్చు కదా

మొహంలో సిగ్గు చూడాలి నవ్వొచ్చింది.

నేను: ఇంకా అలాగే ఉన్నవురా, అస్సలు ఎక్కువ మాట్లాడట్లేదు

భరత్: నీకలా అనిపిస్తుందా? నేను ఏమనుకున్నా తెల్సా?

నేను: హ్మ్మ్...

భరత్: ఎదో ఒకటి వాగేది ఇలా సైలెంట్ గా ఉంటుందెంటి అని

నేను: అంటే నేను వాగుబోతు దాన్నా?

భరత్: కాదా

నేను: అదంతా అప్పుడు ఇప్పుడు కాదులే

భరత్: హా సరే.... చెప్పవే ఎదో ఒకటి, ఎక్కడ చదువుకున్నావు, ఎంత మంది బాయిఫ్రెండులు ఉన్నారు?


హమ్మో మాట్లాడేస్తున్నాడు ఇక. బాయిఫ్రెండ్ అంటా. 

నేను: నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అయినా నా గురించి ఏముంది, నీ గురించి చెప్పు, ఊరికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలు వచ్చావా లేదా?

ఇక తన గురించి చెప్పుకొచ్చాడు. ఇంటర్ అయ్యాక, ఐఐటీ సీటు వచ్చాక, ఐఐటీ మద్రాసులో చదివాడట. ఐఐటీలో ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉండేవాడు అన్నీ చెపుతూ, అది అయ్యాక యుకే వెళ్ళాడంటా. అక్కడ రెండేళ్లు ఉండి, ఇక్కడికి వచ్చాక స్టార్టప్ ఆలోచన వచ్చి మొదలు పెట్టాడంట. 

అవన్నీ వింటుంటే వాడి తీరు, వాడికి తన స్టార్టప్ మీద ఉన్న కసి అర్థం అవుతుంది, నాకు బాగా నచ్చేసాయి. 

అంతా అయ్యాక, “ నువ్వేం చెప్పవెంటే ” అన్నాడు. 

నేనేం చెప్పాలి, అన్నీ వాడే చెప్తున్నాడు. “ నాకేం అన్ని ఎక్స్పీరియంసులు లేవు. ఎదో చదివామా అంటే చదివాం అంతే. నీలా రాష్ట్రలు, దేశాలు తిరగలేదు. ” అంటూ నవ్వాను. తను కూడా నవ్వాడు.

భరత్: హైదరాబాద్ కి రాక రెండేళ్లు అవుతుంది అన్నావు, ఫ్రెండ్స్ ఎవరూ లేరా?

నేను: అలా అని కాదు, నాలుగైదు సార్లు చుట్టాలింటికి, మూడు సార్లు ఫ్రెండ్స్ తో వచ్చాను. ఇక ఈ కరోనా గోల అయ్యాక ఇంట్లోనే 

భరత్: అన్నీ చూసావా మరి?

నేను: హా చూసా, కానీ ఎక్కువ అలవాటు కాదు 

భరత్: హ్మ్మ్


నాన్న కాల్ చేసారు, ఎక్కడి దాకా వెళ్ళాం అని. ఆయనతో మాట్లాడాక మా మాటలు ఆగాయి.


తిని బయల్దేరాము కదా నాకు కన్నంటుకుంటుంది. కళ్ళు మూస్కొని వెనక్కి ఒరిగాను. తను సీట్ ఇంక్లైన్ చేసాడు. కిటికీ మూసి, AC పెంచాడు. నేను కళ్ళు మూస్కున్నా కదా నన్ను చూస్తున్నాడెమో తెలీదు. 

నాకు నిద్రపట్టేసింది. మేలుకునేసరికి సిటీలో ఉన్నాము. త్వరగానే తీసుకొచ్చాడు, టైం ఇంకా నాలుగు ఇరవై అవుతుంది.

భరత్: మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉందా?

నేను: లేదు... ఏంటో నిద్రొచ్చింది.

భరత్: కాఫీ టీ ఏమైనా తాగుతావా ఆపాలా ఎక్కడైనా?

అలా అడుగుతాడు అనుకోలేదు, డ్రైవ్ చేసిన వేగానికి ముందు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు అనుకున్న. నాకుడా ఇప్పుడు తాగాలని లేకుండే.

నేను: లేదు, ముందు నువేదో పని ఉంది అన్నావు కదా. అదే కాన్నివ్వు

మాట్లాడలేదు, సరాసరి వాళ్ళ కంపెనీ భవనం ముందు ఆపాడు. గేటులోపలికి వెళ్ళాక, పక్కన పార్కింగులో ఆపాడు. దిగి నా వైపు వచ్చి తలుపు తీసాడు. అలా మర్యాదిస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటి దాకా నా చున్నీ హ్యాండ్బ్యాగులో ఉండే, తీసి వేసుకున్నాను. తను ఒక కొంటె చూపు చూసాడు, మురిసిపోతూ దిగాను. హైదరాబాదుకి చాలా సార్లు వచ్చానే కానీ అక్కడి వాతావరణం, వ్యవహారం నాకు అలవాటు లేదు. అంత జనంలో, పైగా ఆ ట్రాఫిక్ గోల నాకు ఇబ్బందే.

 తలుపు మూసి నా కుడి చేతిలో ఎడమ చేతిని కలిపాడు. అదే మొదటి సారి వాడు తను నన్ను ముట్టుకోవడం. అంత ట్రాఫిక్ గోల హడావిడిలో ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపించింది. నాలో తడబాటు మాయం అయ్యింది. ధైర్యంగా అనిపించింది. నన్ను పట్టుకొని లోపలికి నడిచాడు. 


లోపలికి వెళ్ళాక, అన్నీ క్యాబిన్లు, కంప్యూట్ సిస్టంలు. చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అని పలకరిస్తున్నారు.  నాకేమో వాళ్ళని చూడాలంటేనే మొహమాటం ముంచుకొస్తుంది. అక్కడ ఒక చిన్న మీటింగ్ హాల్ ఉంది. తనకోసమే కొందరు వేచిచూస్తున్నారేమో. నేరుగా ఆ గదిలో వెళుతుంటే నా అడుగు ఆపాను. 

అనుమానంతో వెనక్కి చూసాడు. ఏమైంది అని అడిగాడు. నేను “ నువెల్లు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ” అని నిట్టూర్చాను. 

తనేమన్నాడో తెలుసా, “ లేదు. నువు కూడా ఉండాలి నాతో రా ” అంటూ లోపలికి లాక్కెళ్లాడు. 

లోపల ఆరుగురు ఉన్నారు. ఒకతను ముసలాయన, ఇంకోతను మేము రాగానే లేచి నిల్చున్నాడు. తనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నావైపు చూసాడు. భరత్ నన్ను చూపిస్తూ, “ తను నా మర్థలు, శ్రుతకీర్తి ” అంటూ పరిచయం చేసాడు. అక్కడ కుడి వైపు నాలుగో కుర్చీలో ఒక్క అమ్మాయి, భరత్ వయసే ఉంటుందేమో, భరత్ ని చూసి వ్యంగ్యంగా నవ్వింది. ఆమెకి ఎదురుగా ఇంకొకతను ఉన్నాడు. పేరు రఘు అని చెప్పాడు. ఆమె పేరు వైష్ణవి అని చెప్పింది. 

నేను వెళ్లి ఆఖరి కుర్చీలో కూర్చున్నాను. తను ఇంకొకతను ఇద్దరూ ఎదో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. తననే చూస్తూ కూర్చున్న. ఎంత బాగా మాట్లాడుతున్నాడో. మద్యమద్యలో తడబడుతున్నాడు, అయినా సరే వాళ్ళు వినేది చూసేది చూస్తుంటే బానే చెప్తున్నాడు అని అర్థం అవుతుంది. 


గంటకంటే ఎక్కువే గడిచింది. బయటకి వచ్చేసాం. తన క్యాబిన్ కి తీకెల్లాడు. కూర్చున్నాం.

భరత్: ఎలా చెప్పాను

నేను: నాకేం అర్థం కాలేదు, ఏం చెప్పను.

భరత్: హహ.... సరేలే. ఇదే పని, రేపు అనుకున్నా కానీ చూసావుగా వాడే కిషోర్ అని, ఇవాల్నే కావాలి అంటే రాకతప్పలేదు. సారీ నిన్ను ఊరికే కూర్చోపెట్టాను.

నేను:  నాకేం బోర్ కొట్టలేదులే

భరత్: చెప్పు ఎటైన పోదామా?

నేను: మీ ఇంటికి తీసుకెళ్తా అన్నవుగా?

భరత్: ఆ కానీ నీకేటైన వెళ్ళాలి అనిపించట్లేదా అని

ఏం చెప్పాలి నాకెటూ వెళ్ళాలి అని లేదు. తనతో ఇంటి నుంచి బయటకు వచ్చా అంతే. 

భరత్: షాపింగ్ చేస్తావా?

నేనిప్పుడెం షాపింగ్ చెయ్యనూ, ఏమో అలా అయినా సమయం గడుస్తుందేమో అనుకున్న.

నేను: షాపింగ్ ఆ ఇప్పుడా?

భరత్: నీ ఇష్టం ఎదో టైంపాస్ అవుతుంది, ఏమైనా కావాలంటే కొనుక్కో. పదా

అలా చెపుతూ లేచి నిల్చున్నాడు. నేను మౌనంగా ఉండిపోయా. ఈసారి కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. నేను తల కిందకి వేసుకొని ఆ చెయ్యిని చూస్తూ ఉన్నా. చాలా బాగనిపించింది. వెచ్చగా, బలంగా ఎదో నేను చిన్న పాపని తప్పిపోతానేమో అన్నట్టు పట్టుకున్నాడు.

కార్ ఒక ఉమెన్ ఫ్యాషన్ స్టోర్ ముందు ఆపాడు. లోపల ట్రెడిషనల్ వెస్టర్న్ రెండు రకాలు ఉన్నాయి. వెళ్ళగానే ఒక ఆవిడ వచ్చి, ఎటువంటివి చూస్తారు అని అడిగింది. తన వైపు చూసాను. చిరునవ్వు చేస్తూ, “ నన్ను చూస్తావు ఎంటి, నీ ఇష్టం ఏదైనా తీస్కో ” అన్నాడు.


నేను ఒక ఎరుపు రంగు లేహెంగా చూస్కున్నాను. ఆ సెట్టు తనకి చూపించాను బాగుందన్నాడు. ముందుకి వచ్చి ఆవిడకిచ్చి ఒకే అని చెప్పాను. 

వెనక నుంచి, “ ఒక్కటే కొంటావా? ” అనడిగాడు.

తను ఎన్ని కావాలంటే అన్ని కొనిచ్చెలా ఉన్నాడు, కానీ అలా దొరికిందే సందు అని ఎక్కువ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనుకున్న. “ ఇది బాగుంది కదా ” అన్నాను. లేచి నా దగ్గరకి వచ్చి, “ వెస్టర్న్ లో వెస్కోవా నువు ” అంటూ కుతూహలంగా చిలిపి నవ్వు చేస్తూ అడిగాడు. నాకు సిగ్గేసింది. చూపు దించుకొని “ వేసుకుంటాను ”

ఆవిడ నా చెయ్యి పట్టుకొని లాక్కుపోతూ, “ రండి మిస్, సెకండ్ ఫ్లోర్ లో వెస్టర్న్ ఉన్నాయి ”, తీసుకెళ్లింది.

పైకి వెళ్ళాకా, వెస్టర్న్ అంటే, కాజ్యుయల్, ఆఫీస్, పార్టీ, బీచ్, అన్నీ అన్ని రకాలు ఉన్నాయి. నేను ఒక జీన్స్, దాని మీద ఒక పచ్చ రంగు టీషర్ట్ తీసుకున్నాను. ట్రాకుల మధ్యలోంచి నడుస్తూ ఉంటే ఒక డ్రెస్సు కనిపించిది. చాలా మోడర్న్ గా ఉంది. అది వేసుకుంటే ఎక్స్పోజింగ్ లా ఉంటుంది. కాకపోతే చాలా సింపుల్గా, బంగారు రంగులో ఆకట్టుకునేలా ఉంది. దాన్ని చూస్తూ ప్రైస్ ట్యాగ్ చూసాను, అమ్మో అరవై మూడు వేల నాలుగు వందలా ముప్పై రుపాలు అని ఉంది. ఒక్క డ్రెస్సుకి ఇంత ఖరీదా, అది అసలు బంగారు రంగులో ఉందా లేక బంగారు పూతగాని పూసారా అనుకున్నా. మనకెందుకులే ఇప్పటికే ఎన్ని వేలు పట్టుకుని తిరుగుతున్నానో అనుకున్న. రెండు లోదుస్తులు కూడా తీసుకొని కిందకి వెళ్ళిపోయా.

తను నా కోసం చూస్తూ ఉన్నాడు. ఎందుకో గాని పైకి రాలేదు. నన్ను చూసి దగ్గరకి వచ్చాడు నా చేతిలో దుస్తులు తీసుకున్నాడు. ఆ టీషర్ట్ చూసి మొహం అదోలా పెట్టాడు. నన్ను చూసి, “ ఇంకా మంచివెం లేవా ఇది తీస్కున్నవు ” అన్నాడు.

అక్కడ ఒక్కో టీషర్ట్ మూడు వేలు ఉంది. అంత కర్చు నేను ఎప్పుడూ చెయ్యలేదు. అందుకే తక్కువలో మంచిగుందని ఇది తీసుకున్న. సమాధానంగా “ అంటే మరీ ” అనాబోతుంటే నా చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళాడు. 

అక్కడ తిరుగుతూ తిరుగుతూ కొన్ని టాప్స్ చూసి రెండు టాప్స్ తీసాడు. “ టీషర్ట్ అవసరమా ఇవి తీస్కో బాగుంటాయి. ” అంటూ చేతికిచ్చాడు.

నేను: ఇదొక్కటే అయిదు వేల నాలుగొందలు ఉంది

భరత్: అయితే బాగున్నాయి కదా కొనుక్కో

నేనేం చెప్పలేదు, తానే సెలెక్ట్ చేసాడు, అవే ట్రైల్ వేసుకున్నాను ఫిట్టింగ్ సరిపోయాయి తీసుకున్నాను. కిందకి వెళ్దాం అనుకునెలోపు ముందుగా నేను చూసిన ఆ పార్టీ వేర్ డ్రెస్సులు తన కంట పడ్డాయి, ఆ బంగారు రంగు దాన్నే చూసి చిలిపిగా నన్ను చూస్తూ నవ్వాడు. నాకు మురిపెం ముంచుకొచ్చింది. తల నిలువునా పైకి ఊపుతూ ఏంటి అన్నట్టు చూసాను.

భరత్: నువు ఇలాంటివి వెస్కుంటావా?

నాకు ఇంకా సిగ్గేసింది, ఊహు అంటూ తల అడ్డంగా ఊపాను. ఏమనుకున్నాడో ఏం మాట్లాడకుండా ముందుకి నడిచాడు. నేను ఆ డ్రెస్సునే చూస్తూ తన వెనక అడుగేస్తుంటే, టక్కున వెనక్కి చూసాడు. నేను చూడడం తను చూసాడు.  వెనక్కి తిరిగి, “ తీస్కో ” అన్నాడు. 
Like Reply


Messages In This Thread
ఒక్కటి తప్ప - by Haran000 - 22-11-2023, 11:25 PM
RE: ఒక్కటి తప్ప - by utkrusta - 23-11-2023, 02:49 PM
RE: ఒక్కటి తప్ప - by Hrlucky - 23-11-2023, 04:13 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 24-11-2023, 02:00 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 24-11-2023, 02:00 PM
RE: ఒక్కటి తప్ప - by utkrusta - 25-11-2023, 03:49 PM
RE: ఒక్కటి తప్ప - by Bittu111 - 26-11-2023, 07:46 AM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 26-11-2023, 10:14 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 26-11-2023, 10:15 PM
RE: ఒక్కటి తప్ప - by sri7869 - 15-12-2023, 10:05 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 21-12-2023, 05:34 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 21-12-2023, 06:59 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 09-05-2024, 08:10 AM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 09-05-2024, 12:42 PM
RE: ఒక్కటి తప్ప - by nareN 2 - 12-05-2024, 08:00 PM
RE: ఒక్కటి తప్ప - by Haran000 - 13-05-2024, 10:06 AM



Users browsing this thread: 1 Guest(s)