Thread Rating:
  • 13 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7
ముందుగా చెప్పినట్లే ఇంకొక భాగం వరకు కథ చాలా నిధనంగా సాగుతుంది. పాఠకులు ఇది మనసులో ఉంచుకోగలరు అని మనవి.
-----------------------------------------------------------------------

ప్రస్తుతం: 
 
మార్నింగ్ 6 కూడా కాలేదు ఫోన్ రింగ్ తో మెలుకువ వచ్చింది. అదేంటి 8 కి కదా వెళ్దాం అంది భవ్య అప్పుడే కాల్ చేస్తుంది అనుకున్నాను కాల్ ఎవరో కూడా చూడకుండా. చూస్తే కాల్ స్వేత, నాకేం అర్ధం కాలేదు ఇంత మార్నింగ్ ఎందుకు కాల్ చేస్తుంది కొంచం కంగారుగా కూడా అనిపించింది.

"హలో స్వేత.. ఏంటి ఏమైంది ఈ టైంలో కాల్ చేసావ్"
అటువైపు నుండి సైలెన్స్.
"హలో స్వేత.. హలో.. ఉన్నావా"
"లైన్ లో నే ఉన్నాలే.. సారీ నేను తరువాత కాల్ చేస్తాలే"
"ఏయ్ పారలేదు కానీ, ఏమైంది అసలు. అప్పుడే నిద్రలేచావా.. అసలు ఏంటో చెప్పు " ఎదో తెలీని కంగారు నాలో.
"కంగారు పడకు ఎం కాలేదు లే, అసలు నిద్రపోతే కదా నిద్ర లేవటానికి" అంది స్వేత. తన గొంతులో ఎదో sadness తెలుస్తూనే ఉంది.
"ఏమైంది చెప్పు అంతలా నిద్రపోకుండా ఎం ఆలోచిస్తున్నావు"
"నైట్ మమ్మీ డాడీతో మాట్లాడాను, ఇలా ఇప్పుడే వద్దు కొన్నాళ్ళు వెయిట్ చేస్తాను అని"
"ఏమన్నారు", అటు నుండి ఏడుపు తప్ప ఎం వినపడలేదు 
"స్వేత ఏమైందో చెప్పు, ఏడవకు ప్లీజ్"
"ఎం అవుతుంది పెద్ద గొడవ అయింది. almost ఫిక్స్ అనుకున్న మ్యాచ్ కదా, చాలా సీరియస్ అయ్యింది మమ్మీ. డాడీ ఏ బెటర్ కొంచం అర్ధం చేసుకున్నారు. చాలా దారుణంగా మాట్లాడింది మమ్మి" మళ్లీ ఏడుపు.
"స్వేత.. స్వేత ఏడవకు.. ప్లీజ్"
చాలా సైలెన్స్ తరువాత "నాకు నిన్ను కలవాలి అని ఉంది" అంది స్వేత.
ఎం అనాలో అర్ధం కాలేదు "ఎప్పుడు" అన్నాను.
"ఎప్పుడో కాదు ఇప్పుడే, నీతో కలిసి మాట్లాడాలి అని ఉంది" అంది స్వేత
ఇంత పొద్దునే కలిసి మాట్లాడాలి అంటుంది ఏంట్రా బాబు అనుకున్నాను మనసులో కొద్దిగా అసహనంగా అలా అని బయటపడితే ఇంకా ఏడ్చేసేలా ఉంది. "ఎం మాట్లాడాలి" అన్నాను అసహనం బయటకి వినిపించకుండా ఉండేలా ట్రై చేస్తూ.
"సారీ.. ఇప్పుడు ఎం వద్దులే ఎదో తేలిక అడిగేసాను, I am sorry bye"
"ఏయ్ ఎదవ ఫార్మాలిటీస్ కి పోకు చిరాకుగా, ఎక్కడికి రావాలో చెప్పు మీ ఇంటికి రాలేనుగా ఎప్పటి లాగా. మీ మమ్మీ నా గొంతు కొరికేస్తది కోపంలో"
అటు వైపు నుండి చిన్న నవ్వు "ఏడ్చవ్ లే నీ మీద ఎం కోపం ఉంటది నా మీదే పీకలదాకా ఉంది ఇప్పుడు. సరే మా పక్కన ఏరియాలో కాఫీ షాప్ ఉందిగా అక్కడికి రా ఇంత మార్నింగ్ ఆ ఒక్క ప్లేస్ ఏ ఓపెన్ ఉండేది" అనింది 
"సరే 15 mins లో స్టార్ట్ అవుతాను నువ్వుకూడా వచ్చేయి" అన్నాను.

ఎదో వస్తాను అని ఒప్పుకున్నానే కానీ మనసులో నన్ను నేను తిట్టుకుంటూనే రెడీ అయ్యాను. మరీ ఇంతలా friend zone కూడా అవ్వకూడదురా బాబు ఆడపిల్లలకి అనుకుంటూ.

ఆలా నిట్టూరుస్తూనే బయలు దేరాను. నేను రీచ్ అయిన 10 నిమిషాలకు స్వేత కూడా తన కారులో వచ్చింది. నైట్ వేర్ లో ఉంది, నైట్ వేస్కునే టైట్ లెగ్గిన్, టైట్ T shirt కూడా తన నడుము బొడ్డు కవర్ చేద్దామా వద్దా అన్నట్లు ఉంది. ఇంకా నయం కనీసం scarf అయినా ఉండటంతో పోనిలే అని ఊపిరి పీల్చుకున్నాను. నైట్ అంత నిద్ర లేక పోయిన ఏ మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంది అంటే ఎంత నేచరల్ బ్యూటీనో అర్ధం చేసుకోవచ్చు. నన్ను చూడగానే వచ్చి చట్టుక్కున కౌగిలించేసుకుంది. "చాలా థాంక్స్ అండ్ ఐ ఏం సో సారీ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను" అంది. "ఎం పారలేదులే" అంటున్నానే కానీ మగ బుద్ది ఎక్కడికి పోద్ది ఎంత ఫ్రెండ్ అయినా అంత గట్టిగా కౌగిలించేసుకుంటే తన పరువాల మెత్తతనం తన కురుల వాసనా మొతంగా తన స్పర్శ ఎదో తెలియని మత్తుల అనిపించింది. నన్ను నేను తమాయించుకుని కూర్చుని మాట్లాడదాం పద అన్నాను.

అది ఒక హై ఎండ్ కేఫ్ అండ్ రెస్టారంట్ నిజానికి స్వేత రమ్మనకపోతే అలాంటి కేఫ్ మొహం కూడా చూసే రేంజ్ కాదు నాది. ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం తను నా పక్కనే సెటిల్ అయింది. "ఏదోకటి ఆర్డర్ ఇచ్చేయి" అనింది. ఆ menu చూస్తే ఒక్క ముక్క అర్ధం కాలేదు నాకు. "ఎం అర్ధం అవుతుంది ఇందులో నాకు నా బొంగు. ఎదో కెమిస్ట్రీ ఎక్సమ్ పేపర్ లా ఉంది, నువ్వే ఆర్డర్ చెప్పు తల్లీ" అన్నాను. తెగ నవ్వేసింది, ఎదో రెండు రకాల కాఫీ ఆర్డర్ చెప్పి వెయిటర్ ని పంపించేసింది. మరి 7 కూడా కాకపోవటం వాళ్లనేమో ఎవరు లేరు కేఫ్ లో పెద్దగా. లేదా అలాంటి ప్లేసెస్ లో నైట్ క్రౌడ్ తప్ప మార్నింగ్ ఎవరు ఉండరో తెలీలేదు నాకు. మేము కూడా ఎం మాట్లాడకుండా వుండే సరికి కిచెన్ లో సౌండ్స్ తప్ప కేఫ్ అంత చాలా సైలెంట్ గా ఉంది.

"ఏమైంది అసలు" అన్నాను.
"ఎం అవుతుంది, పెంట పెంట అయింది నువ్వు ఇచ్చిన ఐడియాతో"
"నేనేం చేశాను మధ్యలో"
"నువ్వేం చేయలేదులే ఎదో అలా అనేశాను, కానీ ఇదే మంచి పని ఇప్పుడు పోస్టుపోన్ చేసిన ఇలాగే మళ్లీ మళ్లీ అవుతూనే ఉంటుంది"
"ఏమన్నారు ఇంట్లో కొన్నాలు వెయిట్ చేస్తాను అంటే, అసలు చెప్పే విధంగా చెప్పావా"
"మా డాడీ ఓకే, కొంచం ముందు చెప్పొచ్చు కదా. మరీ ఇంత లేట్ గా చెప్తే నేను అవతలి వాళ్ళకి ఎం చెప్పుకోవాలి అని బాధపడ్డారు, కానీ మా మమ్మీనే"
"ఎం అన్నారు"
"ప్చ్" కళ్ల నుండి నీరు మొదలయింది "ఎం.. ఎదో అనిందిలే" తన నోట మాట కూడా రావట్లేదు.
"ఏయ్ ఇటు చూడు" అంటూ తన చేయి మీద చేయి వేసాను "వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో కూడా అర్ధం ఉంది కదా, అంతలా ఎం అని ఉంటారు తిట్టి ఉంటారు. దానికే ఇలా ఏడుస్తారా"
కొద్దిగా మౌనం తరువాత "తిట్టిన పరలేదు పడేదాన్ని, అసలు ఎలా మాట్లాడిందో తెలుసా. ఆడ పిల్లని నెత్తిన పెట్టుకుని తప్పు చేసాం చదువు అవ్వగానే ఏదొక USA సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తే అయిపోయేది అనవసరంగా ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేసాను. నన్ను చంపుకు తింటానికే పుట్టావు నువ్వు అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది" ఏడుపులో తన చెప్పేది అర్ధం చేసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది. "తను ఆడదే కదా అసలు ఆలా అనొచ్చా అది సొంత కూతుర్ని పట్టుకుని" అంటూ ముందు టేబుల్ మీదకి వాలి పోయి మోకానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడ్చేస్తుంది. నాకు ఎం చేయాలో కుడా తెలీలేదు. కేఫ్ లో స్టాఫ్ తప్ప ఎవరు లేకపోవటం ఒకందుకు మంచిదే అయింది.

ఎం చేయాలో తెలీక తన భుజం మీద చేయి వేసాను "ఏడవకు ప్లీజ్ మనం కేఫ్ లో ఉన్నమే. ప్లీజ్ కంట్రోల్. I can understand"

తను కొంచం సముదయించుకుని లేచి కూర్చుంది కళ్ళు తుడుచుకుంటూ "i am sorry రా" అనేలోపు వెయిటర్ ఆర్డర్ తీసుకు వచ్చింది
"Is everything fine mam" అని అడిగింది నా వైపు ఒకలా అనుమానంగా చూస్తూ
"It's ok. everything is fine" అంది స్వేత. అలా నా వైపు ఒకలా చూస్తూనే అక్కడ నుండి వెళ్ళింది ఆ waitress.
" అదేంటే నన్ను అంత అనుమానంగా చూస్తది, నేనేదో నిన్ను కిడ్నాప్ చేసినట్లు. దీని యబ్బ మరీ అంత ఎదవలా కనిపిస్తన్నానా ఈ డ్రెస్ లో" అన్నాను ఆశ్చర్యంగా.
"అది డ్రెస్ లో ఉండదులే" అంది చిరు నవ్వు నవ్వుతూ
అర్ధం చేసుకోవటానికి ఒక క్షణం టైం పట్టింది నాకు "నీకు బాగా ఎక్కువ అయింది, నీకు ని మమ్మీనే కరెక్ట్" అనేశాను ఎదో అనుకోకుండా. తన మొహం మాడి పోయింది నేను అలా అనేసరికి.
"నేను సరదాగా అన్నాను ఎదో అలా వచ్చేసింది నువ్వు మళ్లీ ఏడవకు ప్లీజ్, అసలు ఇంకా ఏమన్నారో చెప్పు" అన్నాను
తను నా వైపు జరిగి నా చేయి పట్టుకుని భుజం పై వాలి పోయింది.

నాలో ఎదో తెలియని అసహనం తను అంత క్లోజ్ గా ఉండటం ఎందుకో నచ్చట్లేదు నాకు. నేను మనిషినే కదా మగాడినే కదా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత క్లోజ్ గా మూవ్ అయితే లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి అనే ఆలోచన కూడా ఉండదా దీనికి అనుకున్నాను మనసులో. అలా అని ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైం కూడా కాదు. సరే అని సర్ది చెప్పు కున్నాను.

"ఏమైంది" అన్నాను కామ్ గా.
"ఇంకా చాలా మాటలు అనిందిలే" కళ్ళల్లో నీళ్లు అలానే వున్నాయి.
"సరే వదిలేయి"
" వదిలేసేది కాదు రాహుల్ తను అన్నమాటలు, నన్ను వదిలిచుకోవాలి అన్నట్లు మాట్లాడింది"
"అలా ఎం కాదులే అంత ని ఆలోచన కోపంలో ఉన్నావ్"
"నా స్పీడ్ చూసి ఇన్నాళ్లు ఎక్కడ వేరే క్యాస్ట్ వాడిని లవ్ చేసి తీసుకువస్తానో అని భయపడింది అంట. ఇప్పుడు కనీసం అలా అయినా ఏమైనా ఉంటే చెప్పు నువ్వు ఈ కొంపలో నుండి పోతే చాలు నాకు అన్నది రా.. ఎవర్రా కన్న కూతురిని అలా అంటారు. నేను అంత పాపం ఎం చేసాను" అంటూ మళ్లీ ఏడవటం మొదలు పెట్టింది.
నాకు ఎం చెప్పాలో కూడా అర్ధం కాలేదు ఇంక ఎం చేయలేక తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకి తీసుకున్నాను. తను నన్ను కౌగిలించుకుని ఏడ్చేస్తుంది. "ఊరుకో స్వేత, కోపంలో ఎదో అనేసారు అంత బాధ పడకు"
చాలా సేపు అలాగే ఉండి పోయింది, కొద్దిగా తెరుకొని "అంత బాధ పాడటం ఎందుకు అంట అసలు ఎవరు కనమన్నారు నన్ను"
"ప్చ్ పిచ్చిగా మాట్లాడకు కోపంలో ఉన్నప్పుడు" అన్నాను తన వైపు చూస్తూ. "Sorry" అంటూ తను ఇంకా గట్టిగా కౌగిలించేసుకుంది నన్ను. మాములుగా మేము ఉనంత క్లోజ్ గా వేరే టైం లో ఉండుంటే నా సిట్యుయేషన్ వేరు గా ఉండేది కానీ నేను ఇప్పుడు ఆ మూడ్ లో కూడా లేను.
"సరే ఏడవకు.."
అలాగే ఉండిపోయింది ఎం మాట్లాడకుండా
"కాఫీ చల్లగా అయిపోతాయి లే" అంటూ విడ తీసాను మా కౌగిలిని. తను కూడా కొద్దిగా తెరుకొని కాఫీ అందుకుంది.
"నా ప్రోబ్ల్మ్స్ అన్ని ని మీద డంప్ చేస్తున్న కదా" అంది నా వైపు చూసి 
ఒక చిన్న నవ్వు నవ్వి "అదేం లేదు లే" అన్నాను "ఓయ్ ఒక మాట అడగనా మళ్లీ నా మీద సీరియస్ అవ్వకూడదు ఏడవకూడదు"

అలా అడిగే సరికే తన మొహం మళ్లీ వాడి పోయింది "నిన్నటిలాగా తిట్టొదు క్లాస్ పికొద్దు ప్లీజ్ "
నాకు నవ్వొచ్చేసింది తను అలా అమాయకంగా అనేసరికి "అదేం లేదు లే"
"అడుగు అయితే"
"అసలు ఎం కావాలి నీకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదా"
"చెప్తా విను. నాకు అలా అప్పటికి అప్పుడు ఎవరో ఒక మ్యాచ్ తీస్కు వస్తే వాళ్ళ ఆస్థి మా ఆస్థి కంపేర్ చేసి జాతకాలు చూసి పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది అనుకునేలా నాకు వద్దు. ఇంక పైగా నెల క్రితం ఫిక్స్ అయిన మ్యారేజ్ కి i mean ఒక బిజినెస్ డీల్ కి, prewedding postwedding photoshoot అని ఎదో ఒకరికోసం ఒకరు పుట్టాం అన్నట్లు ఫొటోస్ కి pose ఇవ్వటం నా వళ్ళ కాదు. మ్యారేజ్ కి ముందు కనీసం పరిచయం ఉండాలి కదా. అసలు నేను ఎవరు తను ఎవరు మాకు తెలియాలి కదా. ఏమైనా అంటే మ్యారేజ్ తరువాత తెలుసుకోవచ్చు కదా అంటారు what the hell ఇంకా ఏంటి తెలుసుకునేది అప్పుడు నచ్చక పోతే exchange offer ఉంటుందా ఏంటి. అది అర్ధం చేసుకోరు ఏంటి"

తన క్లారిటీకి ఎం అనాలో అర్ధం కాలేదు "కరెక్టే నీకు ఎవరు అయినా అలా ఉంటే చెప్పొచ్చు కదా, మీ బావ ఎవరో వున్నారు అన్నావ్ అతను కాకపోతే మీ రెలెటివ్స్ లో లేకపోతే కాలేజీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరొకల్లు నీకు నచ్చిన వాళ్ళు లేరా. ఎందుకు అంటున్నాను అంటే ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు ఆ ఒక్క పర్సన్ దొరకరు అంటావా నీకు. నిజం చెప్పనా ఇప్పుడు లవ్ లో పడి లైఫ్ పార్టనర్ ని వెతుకునే ఏజ్ కాదు మనది. కొంచం అది కూడా అలోచించి మీ మమ్మీ డాడీలు చెప్పేది కూడా కొద్దిగా అర్ధం చేసుకో"
"ఏమోరా నాకు అయితే అసలు ఎం అర్ధం కావట్లేదు అందుకేగా టైం అడుగుతుంది"
ఇంతలో నాకు కాల్ వస్తుంది మాటల్లో పడి టైం చూసుకోలేదు భవ్య నుండి ఆ కాల్ "అబ్బా.. "
"ఏమైంది" అంది స్వేత
కాల్ లిఫ్ట్ చేసాను "ఆ భవ్య చెప్పు"
"ఏంటి సార్ చెప్పేది, నిద్ర లేచారా అసలు 8 కి వస్తాను అని చెప్పాను కదా"
"నేను రెడీ గానే వున్నా కానీ చిన్న పని మీద బయటకి వచ్చాను 9 కి స్టార్ట్ అవుదాం sorry" అన్నాను. ఎందుకో స్వేత తో ఉన్నాను అని చెప్పాలి అనిపించలేదు.
"సరే అయితే ప్లాన్ డ్రాప్ అయేట్లు అయితే చెప్పు పరలేదు"
" అబ్బా అదేం లేదు. రెడీగా ఉన్నట్లు ఉన్నావ్ నువ్వు డ్రాప్ అవ్వటానికి"
"అదేం లేదులే నాకు రిలీఫ్ కావాలి sharp 9 కి ఉంటాను ని రూమ్ దగ్గర" అని కాల్ కట్ చేసింది

"ఎవరు ఆంటీనా ఇంకా ని అప్పలమ్మ ఏమో అనుకున్నాను" అంది స్వేత నిన్న నేను అన్న మాటలు గుర్తు చేస్తూ ఉడికిస్తూ.
నవ్వు ఆపు కుంటూ "నీకు రావాలె ఏ అంకుల్ గాడో అప్పుడు ఉంటది నీకు"
ఇద్దరం అలా ఎదో సరదాగా అట పట్టిచుకున్నాము కొంచం సేపు 
తను ఒక్క క్షణం నా వైపు చూసి మౌనం గా ఉండి పోయింది
"ఏంటి" అన్నాను
"నిజంగా చాలా థాంక్స్ రా.. నువ్వు లేకపోతే ఈ రోజు ఏడుస్తూ వుండే దాన్ని రూమ్ లో పడి"
" it's ok"
"సరే స్టార్ట్ అవుదాం మళ్లీ అంటీ వచ్చేస్తుంది. నేను మాట్లాడతానులే ఇంట్లో నాకు తప్పదు ఈ two days"
"సరే ఎక్కువ ఆలోచించకు మమ్మీ డాడీ అరిచినా అర్ధం చేసుకో అర్ధం అయ్యేలా చెప్పటానికి ట్రై చేయి" అన్నాను
"సరే.. Love you రా నిజంగా నువ్వు లేకపోతే ఏమైపోయే దాన్నో.. నాకు నువ్వు ఉంటే చాలు love you so much" అంటూ గట్టిగా వాటేసుకుంది.

ఇంకా నాలో ఫ్రస్ట్రేషన్ ఆగలేదు "వదులు స్వేత" అని కొద్దిగా కాసురుకున్నాను.
ఆశ్చర్య పోయింది "ఏమైంది" అని అడిగింది కొంచం బిత్తర పోయి.
"ఏంటి ఏమయ్యేది closeness కూడా హద్దు ఉంటది"
"ఇప్పుడు ఎం చేసాను నేను"
" ఎం లేదు లే వదిలేయ్"
"కాదు చెప్పు ఏంటి ని ప్రాబ్లెమ్"
"నువ్వు అన్న మాటలు ఒక్క సారి స్లోగా rewind చేసుకో, నాకు నువ్వు ఉంటే చాలు love you అర్ధం అవుతుందా అసలు అలా అనొచ్చా లేదా అని. నీకు అది చాలా casual ఏమో, నేను చాలా మిడిల్ క్లాస్ నుండి వచ్చాను ని అంత పోష్ సోషల్ లైఫ్ స్టైల్ కాదు నాది. నాకు ఎలా ఉంటుంది love you, love you అంటే. అర్ధం లేకుండా అనేస్తావ్ నా ప్లేసులో వేరే వాడు ఉంటే casual గా తీసుకుంటాడా. ఏమో లే వదిలేయి"
తన మొహం వాడి పోయింది
"Sorry, ఫీల్ అవ్వకు వదిలేయి"
"నేను ఎందుకు ఫీల్ అవ్వాలి నేను ఎం తప్పు అనలేదు నాకు అనిపించిందే చెప్పాను"
"ప్చ్.. స్వేత"
"I love you" అంది చాలా సీరియస్ గా "i love you.. Love you, love you" నాకు ఎం అనాలో కూడా అర్ధం కాలేదు "నీకు love you అర్ధం తెలీక పోతే ఎవడు ఎం చేయలేడు" 
"నాకు తెలిసిన love you అర్ధం ఒక్కటే" అన్నాను 
స్వేత మౌనంగా వుండి పోయింది నా వైపు కూడా చూడకుండా.
"సరే వెళ్దాం ఇంకా" అన్నాను

ఎం మాట్లాడకుండా బిల్ పే చేసి అక్కడ నుండి లేచాము. తన కార్ దగ్గరకి వెళ్లే అంత సేపు మౌనం గానే వున్నాము. తను చాలా ఆలోచనలో ఉన్నట్లుగా అనిపించింది. కార్ పార్కింగులో నుండి తీసి రమన్నట్లుగా దగ్గరకి పిలిచింది window కిందకి దించుతూ. "ఏంటి" అన్నాను window దగ్గరకి వంగుతూ.

తను ఒక్కసారిగా నా వైపుకి బయటికి తల పెట్టి చట్టుక్కున బుగ్గన ముద్దు పెట్టేసింది "సారీ" అంది నా వైపు చూడకుండా తల తిప్పుకుని. నాకు ఎం అనాలో కూడా అర్ధం కాలేదు ఒక చిన్న నవ్వు నవ్వి "సరే జాగ్రత్త.." మళ్లీ నిశ్శబ్దం "కాల్ చేయి ఏమైనా మాట్లాడాలి అంటే, ఊరికే టెన్షన్ అవ్వకు.. Bye" అన్నాను. తను అలాగే అన్నట్లు తల ఊపి కార్ ముందుకి కదిలించింది నా వైపు చూడకుండానే.

నాకు అసలు ఎం అవుతుందో ఎం క్లారిటీ లేదు, అలా ఊరికే love you అనేస్తే మనసు కుదుట పడొద్దా ఆ ఆలోచనలతోనే బైక్ తీసాను. ఇదే ఇంత కష్టంగా గడిచింది అనుకుంటే ఇప్పుడు భవ్య ని ఎలా పేస్ చేయాలి రా దేవుడా అనుకున్నాను మనసులో.
Like Reply


Messages In This Thread
RE: Office Romance - లేడీ బాసతో ప్రయాణం, ప్రేమాయణం - Part - 5 - by timepass4fun - 27-11-2023, 02:05 AM



Users browsing this thread: 1 Guest(s)