Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
190. 5

 
అలాంటి కలలు ప్రతి రోజూ  రావడం లేదు,  కానీ  వారం లో తప్పకుండా  ఓ సారి  వస్తాయి  అంట.  
"డాక్టర్  దగ్గరి కి వెళ్ళాల్సిందే , నేను ఏవిధంగా  హెల్ప్  చెయ్యాలి  ఈ డ్రీమ్స్ కి"
"అది కుడా అయ్యింది , కానీ  అయన  ఏవో టాబ్లెట్స్  ఇచ్చి పంపాడు  , దాని వలన పెద్దగా ఉపయోగం లేకుండా  ఉంది "
"ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు"
"ఇదేదో పూర్వ జన్మకు సంబంధించిన కల అని  తను అనుకుంటుంది , కానీ  నాకు దాని మీద పెద్ద నమ్మకం  లేదు " అంది శ్రీలత
"వాటి మీద నాకు కూడా పెద్ద నమ్మకం లేదు , కానీ  మన ఎదురుగా తను ఉందిగా , ఒకసారి ఇలాంటి  కల రావడం అంటే ఎదో  సినిమానో లేదా బుక్కో  చదివినప్పుడు  దాని ప్రభావం మెదడు మీద పడి  అది కల రూపం రావడం  జరుగు తుంది కానీ , తనకు ప్రతి వారం  వస్తుంది అంటుంది"
"అవును ప్రతి వారం  తప్పకుండా ఎదో ఒక రోజు వస్తుంది ,  నాకు గుర్తు చేస్తున్నట్లు  గా"
"కానీ  ప్రతి సారీ  నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావు "
"అవును , కానీ   చావు అంచుకు  వెళ్లి వచ్చినట్లు  అనిపిస్తుంది ,  అప్పుడు భయంతో  నిద్ర లేస్తాను"
"ఆ ప్లేస్ ఎక్కడో తేలుస్తుందా  , అంటే  ఏదైనా గుర్తులు  లాంటివి "
"కోట  అడవికి మద్యలో ఉంది ,  కోటకు ఓ   సొరంగం ఉంది  ,  నేను ఎప్పుడు అందులోంచి బయటకు వస్తు ఉంటాను.    ఆ  అడివి  దట్టమైనది ,  కోట లో  అన్నీ  నాకు బాగా గుర్తు  ఉన్నాయి  , నేను అక్కడ   నివాసం ఉన్నట్లు  ప్రతి  ప్రదేశం నాకు బాగా తెలుసు అన్నట్లు గా ఉంది "
 
"సరే ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు"
"ఓ సారి   ఆ కోట ఎక్కడుందో కనుక్కొని అక్కడకు వెళ్దాం అంటుంది  వర్షా ,  అందుకే నీ హెల్ప్ కావాలని  పిలిచాం " అంది శ్రీ
"మీ నాన్నా వాళ్ళకు చెప్పాల్సింది  , వాళ్ళు ఎదో ఒకటి చేస్తారు గా "
"అదీ  అయ్యింది ఓ సారి ,  ఇలా కల  వస్తుంది అంటే  వాళ్ళు పెద్ద హంగామా చేసి, ఎదో చెరుపు చేసారు అంటూ , భూత వైద్యుల్ని పిలిచి దీనికి తాయెత్తులు కట్టి  అమ్మోరుకు  కోళ్లు , మేకపోతులు బలి ఇచ్చి , నానా పెంటా చేసారు  ,  ఆ తరువాత అది  వాళ్ళకు తాయెత్తు  కట్టిన తరువాత  కల లు  రాలేదు అని  అబద్దం చెప్పింది "
 
"అంటే  ఇప్పుడు ఆ కోట ఎక్కడ ఉందొ ,  వెతికి అక్కడికి  వెళ్లి  రావాలి అంతేనా, మరి ఇంట్లో ఏమని చెప్తారు ఏంటి ,  వాళ్ళు  ఒప్పుకుంటారా "
"అక్కా  వాళ్ళు ఇంకో  10 రోజుల్లో   కాలేజీ  టూర్  వెళుతున్నాను   ఒక వారం రోజులు  , అక్కతో పాటు నేను కూడా  వెళతాను అని అడిగితే   పంపిస్తారు ,  అక్క టూర్ బదులు మనతో పాటు వస్తుంది."
"అయితే అన్నీ  సెట్ చేసుకొనే  రెడీ అయ్యారు  , మరి ఇంక  ఆలస్యం దేనికి , ఆ కోట ఎక్కడ  ఉందో  కనుక్కోవాలి"
"దానికి కూడా  కొద్ది గా  గ్రౌండ్  వర్క్ చేశాము.  యూనివర్సిటీ  లో  హిస్టరీ ప్రొఫెసర్  ని కలిశాము  అయన  కొన్ని  బుక్స్  చెప్పాడు  , సిటి  సెంట్రల్ లైబ్రరీ  లో దొరుకుతాయి " అంటూ   తన బ్యాగ్ లోంచి  ఓ చిన్న పేపర్ తీసి అందులో రెండు బుక్స్ పేర్లు  చదివింది.
“రేపు ఓ సారి  ఆ లైబ్రరీ  కి వెళ్లి ఆ  బుక్స్ చూద్దాం  నువ్వు  ఫ్రీ  గా ఉంటే”  అంది  వర్షా
“సరే అయితే  రేపు  ఉదయం 10 గంటలకు   లైబ్రరీ  ఎంట్రెన్స్ లో కలుద్దాం”  అని  ఓ నిర్ణయానికి  వచ్చి   ఇంటికి బయలు దేరాము.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:43 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)