Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
#65
శివుని జటాజూటంలోని గంగను 
మర్యాద పురుషోత్తముడైన   శ్రీరామచంద్రుడు తానే స్వయంగా సిద్ధపురుషునికి ఇవ్వటం అన్నది మామూలు విషయం కాదు. ఇందులో ఏదో కార్యకారణ సంబంధం ఉన్నదని సమర్థ రాఘవుడు అను నామధేయం కలిగిన సిద్ధపురుషునికి వెంటనే అర్థం అయిపోయింది. ఎన్ని వేల కోట్ల జన్మలెత్తినా దొరకని అదృష్టం తనను వరించింది అనిపించింది.
 
శ్వేతద్వీప వైకుంఠం వదిలి అదృశ్య మందిరానికి వచ్చే ముందు శ్రీమహావిష్ణువు ,"ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను సిద్ధా", అన్న మాటే గుర్తుకొచ్చింది క్షణాన సమర్థ రాఘవుడికి. హృదయం ద్రవించిపోయింది ఆయన చూపిన కరుణకి.
 
అక్కడ కొంతసేపు నిశ్శబ్దం ఏర్పడింది. రామలక్ష్మణులను సంజయ్, అభిజిత్, అంకితలు భక్తిభావంతో మైమరచిపోయి అలానే చూస్తూ ఉన్నారు.
 
రాముడిలా చెప్పాడు, "మీరు ఇక్కడి నుండి వాయవ్య దిశగా పయనం అయితే మీరు కోరుకునే గమ్యాన్ని చేరుకునే మార్గం సుగమం అవుతుంది. సీతానది దాటిన తర్వాత కూడా వాయవ్య దిశగానే మీరు పయనించాలి. ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత మీకు ఒక సముద్రం కనబడుతుంది. అది దాటితే వచ్చేదే శంభల నగరం. సముద్రం దాటడానికి మైనాకుడు మీకు తోడ్పడతాడు."
 
మాటలు పూర్తవ్వగానే రామలక్ష్మణులు ఇరువురూ అంతర్ధానమయ్యారు.*

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 26-12-2023, 02:25 PM



Users browsing this thread: 1 Guest(s)