Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#11
కాజల్ anthropology లో మాస్టర్స్ అయిపోతుంది, అన్న సమయానికి, 


కాజల్ కి శివ ప్రతి రోజు, గుర్తు వస్తున్నాడు, ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నడో కూడా తెలీదు. సాయి నిఅడుగుదాం అనుకుంటుంది కానీ, ఆరోజు చెప్పినట్టే సాయి కి కూడా తెలీదో ఏమో అనుకుని ఊకుంటుంది. దీపా ని అడగదు, అసలు శివ తనకు set అవుతాడో లేదో, తొందర పడడం మంచిది కాదు. అలా ఒకసారి శివకావాలి అనిపిస్తుంది, ఒకసారి వద్దు, అయోమయంలో ఇక ఆ విషయంలో రోజు ఆలోచిస్తూ ఉంటుంది. కానీముందుకు సాగదు.

కాజల్ campus కి వెళ్లకుండా, గార్డెన్ లో కూర్చుంది.

కొంత సమయం తరువాత, ఎవరో వచ్చి కాజల్ వెనక నిల్చోని, 

శివ: హై పార్వతీ ఎలా ఉన్నావ్?

కాజల్ పార్వతీ అనే మాట వినగానే ఆశ్చర్య పోయి, వెనక్కి తిరిగబోతుంటే, 

శివ: ఆగు ఇప్పుడే చూడకు నీకో surprise?

కాజల్: ఏయ్ అసలు ఎవరు నువ్వు?

శివ: నేను పారు.... పెళ్ళిచేసుకుంటా అన్నాను నన్నే మర్చిపోయావా... నీకోసం వెతికాను తెల్సా. అనుకోకుండాఇప్పుడు కనిపించావు. 

కాజల్ కి అర్ధం అయింది అది శివ అని.

కాజల్: శివ నువ్వేనా?

శివ: అవును పారు నేనే.

కాజల్ ఆశ్చర్యంలో ఉండిపోయింది, షాక్ లో, 

కాజల్: శివ వాచావా, అప్పుడప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు రా, dreams లో వస్తున్నావు, శివ i think i love you రా, ఏమోరా నాకే తెలీదు. I’m confused.

శివ కి కాజల్ అలా అనడంతో మతి పోయింది.  ముందుకు వచ్చాడు, 

శివ: పార్వతీ నిజమా, నువ్వు ఇలా అంటావు అనుకోలేదు. కానీ నాకు engagement అయిపోయింది. I didn't expected that from you.

శివ చూసి కాజల్ నిరాశ పడింది. 

కాజల్: ఓహ్ నువ్వా.....

కాజల్ ఒక్కసారిగా అలా అనడం చూసి శివ అనుమాన పోయాడు, 

కాజల్: నువ్వేంటి ఇక్కడ?

శివ: నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, గుర్తొస్తున్నానా?

కాజల్: నువ్వు కాదు లే, ఆ శివ వేరు. 

శివ: అవునా, అంటే నా మీద నీకు ఇష్టం లేదా. 

కాజల్: లేదు. 

శివ: సరే లే. ఎలా ఉన్నావ్ బాగున్నావా? ఏం చేస్తున్నావ్ ఇక్కడ నువ్వు?

కాజల్: నేనా, మాస్టర్స్ చేస్తున్న, stafford లో. నువ్వు?

శివ: నేను YouTube లో videos తీస్తూ ఉంటాను. ఇక్కడికి travel vlog అని వచ్చా, ఇందాక నీకు సర్ప్రైజ్చేదాంఅని ఇలా చేసా. 

కాజల్: ఓహ్ ok.

శివ: శివ ఎవరు dreams అంటున్నావ్, నిజమా?

కాజల్: హ్మ్మ్ ఎంత మర్చిపోవాలి అనుకున్న ఇంకా గుర్తువస్తున్నాడు.

శివ: అంటే నీకు ఇష్టం లేదా?

కాజల్: ఏమో నాకు తెలీదు. 

శివ: పార్వతీ ఇలా confuse అవ్వకు. ముందు ఎవరినైనా పరిచయం చేస్కో. Like ఎవరితో అయినాడేటింగ్చెయ్యి, అలా చేశాక కూడా నీకు ఈ శివ గుర్తు వస్తాడో లేదో చూడు. 

కాజల్: hmm okay. Sorry Shiva, నాకు class టైం అవుతుంది వెళ్ళాలి. 

శివ: ఓహ్ ok, ఇదిగో నా wedding invitation, హేయ్ పెళ్లికి తప్పకుండా రావాలి. 

కాజల్ నవ్వుతూ, 

కాజల్: హా వస్తాను.

శివ: ok bye పారు. See ya.

కాజల్: నా పేరు పార్వతీ కాదు, కాజల్. 

శివ: అవునా మర్చుకున్నవా? బాగుంది లే. నీ శివ నీకోసం పార్వతీ అనే పేరుతో వేతుకున్నడు కావచ్చు. 

కాజల్ కి అదీ నిజమే అనిపించింది, 

కాజల్: థాంక్స్ శివ bye. Marriage లో కలుద్దాం..


ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. 

కాజల్ room కి వచ్చి, అలసిపోయి, మొహం మార్చుకుని, బాగ్ పక్కన పడేసి కూర్చుంది.

కాజల్: అమ్మా చెప్పు.

శారద: కాలేజ్ కి వెళ్లి ఇప్పుడే వచ్చావా?

కాజల్: ఆ అర్ధగంట అవుతుంది లే.

శారద: ఇదిగో నాన్న మాట్లాడుతాడు. ఇస్తున్న.

కాజల్: హా సరే.

సుదర్శన్: అమ్మ చదువు ఎక్కడిదాకా వచ్చిందీ?

కాజల్: హా ఈ నెల ఆకరిన ఎగ్జామ్స్ నాన్న, అయిపోతే వస్తాను ఇంటికి.

సుదర్శన్: ఏం లేదు అమ్మా, నీకు ఆ రోజు గుర్తుందా, వెంకన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అదే సుల్తాన్పుర్. 

కాజల్: గుర్తుంది, 

సుదర్శన్: తల్లి పెళ్లి చేస్కుంటావు గా. అబ్బాయి నాకు నచ్చాడు.

అంతే కాజల్ కి హఠాత్తుగా మనసు బరువెక్కింది, 

కాజల్: ఏంటి నాన్న ఇలా సడన్ గా?

సుదర్శన్: అలా ఎం లేదురా, నువ్వు వచ్చాక పెళ్లి చూపులు. Exams బాగా రాయి. 

కాజల్: సరే నాన్న నేను తర్వాత కాల్ చేస్తాను. 

Phone cut,

కాజల్: శివా ఎక్కడున్నావ్ రా... కనపడురా నాకు. ఎంత వద్దనుకున్నా నువ్వే గుర్తువస్తున్నావ్.

ఆలోచిస్తూ వెళ్ళి,

బాత్రూం లో అద్దం ముందు నిలబడి, మొహం కడుక్కుని,

కాజల్: పార్వతి అని పేరు మార్చుకుని తప్పు చేసానా. నువ్వు నా కోసం ఆ పేరుతో వెతుకుతున్నవా? అబ్బాయినచ్చలేదని చెప్పి నీ దగ్గర్కి వచ్చేస్తారా.



ఇక నెల 10 రోజులకు కాజల్ anthropology లో మాస్టర్స్ అయిపోయింది. పెళ్లి చూపులకోసం ఇంటికి వస్తుంది. శివకూడా అదే ఫ్లైట్ లో వస్తున్నాడు.

శివ వెనక వైపు కూర్చొని, కాజల్ వైపు చూస్తున్నాడు. కాజల్ కి తనని ఎవరో చూస్తున్నారు అని అనిపించింది, వెనక్కితిరిగింది, శివ మొహం తిప్పుకుని ఫోన్ చూస్తున్నాడు.


కాజల్ పట్టించుకోలేదు. 

ఫ్లైట్ దిగిన తర్వాత కూడా, శివ కాజల్ వెనకే బయటకి వస్తున్నాడు, కాజల్ మళ్ళీ అలాగే అనిపించింది, చూసింది. దొరికేసాడు శివ, 

కాజల్ వెనక్కి వచ్చి శివ కి ఎదురుగా నిలబడింది. 

అంతే శివ కి కాలం ఆగినట్టు అయ్యింది. ఏమౌతుంది అని టెన్షన్, ఏమంటుంది అని భయం. 

కాజల్: హెయ్ మిస్టర్, నన్ను ఎందుకు చూస్తున్నావ్?

శివ మనసు లో " బిత్తిరిదాన, నన్నే మర్చిపోయావా, గుర్తుపట్టలేదు, ఆగవే నీ పని ఇప్పుడు కాదు పెళ్లి చూపులతర్వాత చెప్తా " అనుకున్నాడు. 

కాజల్: ఏయ్ ఎంటి చూస్తున్నావ్?

శివ: ఏం లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు.

కాజల్: ఆ విషయం నాకు తెల్సు. చూడకు పో. 

శివ వెళ్ళిపోయాడు. 

శివ " దీనికి పొగరు ఇంకా తగ్గలేదు, పెళ్ళి కాని చెప్తా నీ పని " 

ఇంటికి వెళ్ళాక, సాయంత్రం, హిమాజ ఇంటికి వచ్చింది, 

హిమాజ: పెద్దమ్మ పార్వతి ఎది?

శారద: రూం లో ఉందే. 

హిమాజ కాజల్ రూం కి వచ్చి, 

హిమాజ " దీన్ని పార్వతి అని రెచ్చగొడుత, ఏం చేస్తుంది చూస్తా " అనుకుంది. 

కాజల్ రూం డోర్ తీసి, " పార్వతీ " అని అరిచింది. 

కాజల్ మౌనంగా చప్పుడు చెయ్యకుండా కూర్చుంది. 

హిమజ " ఇదేంటి, ఏమీ అనట్లేదు " 

ఇక కాజల్ దగ్గరకి వెళ్లి చూసింది, కాజల్ ఏడుస్తూ ఉంది.

కాజల్ అలా చూసి,

హిమజ: ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? 

కాజల్: హిమా నాకు శివ కావాలే...

హిమజ: ఏ శివ?

కాజల్: అదే ఆ waste fellow. 

హిమజ: అదేంటే వాడంటే ఇష్టం లేదుగా నీకు?

కాజల్: కాదే... నాకు సరిగ్గా తెలీదు, కానీ ఇప్పుడు వాడే కావాలి అనిపిస్తుంది. కానీ ఎక్కడున్నాడో తెలీదు. 

హిమజ: మరి నువ్వు పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకున్నావే.

కాజల్: మరి ఏం చెయ్యాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, వాడెక్కడున్నది తెలీదు, నేను అసలు గుర్తున్ననో లేదో. నాకర్మ. 

ఇదంతా శారద విని గదిలోకి వచ్చింది. 

కాజల్ అమ్మని చూసి కళ్ళు తుడుచుని అసలు ఏం లేనట్టు నటిస్తుంది.

శారద: నేను చూసాను. 

కాజల్: అది అమ్మా... 

శారద దగ్గరకి వచ్చి, కాజల్ ని ఒళ్ళోకి తీస్కొని, 

శారద: మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదే? 

కాజల్: భయం వేసింది మీరు ఏమంటారో అని. 

శారద: సరే ఇప్పుడు చెప్తే బాగోదు, రేపు అబ్బాయిని చూసి నచ్చలేదు అను. కానీ మీ నాన్న కే ఆ అబ్బాయిబాగానచ్చేసాడు. 

శారద ఇలా చెప్పి వెళ్ళిపోయింది. 

హిమజ: ఏం కాదే నచ్చలే అని చెప్పు. అవును ఇంతకీ రేపు వచ్చే వాడి పేరేంటి?

కాజల్: ఏమో నేను అడగలేదు. 

హిమజ: ఏంటి? తెలీదా.

కాజల్: అవును ఫోటో కూడా చూడలేదు, అతనికి ఫోటో దిగడం ఇష్టం ఉండదట. 

రాత్రి కాజల్ శివ నే తలుచుకుని పడుకుంది.


పెళ్లి చూపుల రోజు, 

అందరూ రెఢీ అయ్యారు, కాజల్ కూడా.

శివ వాళ్ళ తల్లితండ్రుల తో వచ్చాడు. 

కాజల్ శివ ని చూసి, " ఇతన అయ్యో నిన్న అలా పొగరుగా అనేసరికి ఏమనుకున్నాడో ఏంటో, అయినామంచిదెలే, no చెప్తే, cancel అవ్తే చాలు " అనుకుంటూ ఉంది. 

హిమజ వచ్చింది, నవ్వుకుంటూ, 

హిమజ: ఏయ్ ఎంటే చూస్తున్నావ్ అబ్బాయి సూపర్ ఉన్నాడు కదా.. 

దిగులుగా,

కాజల్: అయితే ఏంటి, నా శివ ఇంకా బాగుంటాడు, వాడు దొరకని చూపిస్తా. 

కాజల్ చెయ్యి పట్టుకుని లాగుతూ,

హిమాజ: రావే చెప్తా 

కాజల్: అబ్బా వదులు గాజులు గుచ్చుతున్నాయి. ఎటూ?

ఇద్దరూ కాజల్ బెడ్రూం లోకి వెళ్ళారు, 

కాజల్: ఎంటే చెప్పు.

హిమజ: ఓసి పిచ్చిధానా, love అన్నవ్ గుర్తుపట్టలేవా? 

చిరాకుగా మొహం పెట్టి, 

కాజల్: ఎంటి గుర్తుపట్టెది?

హిమజ: వాడే వీడు. 

కాజల్: యేహే ఏంటి వాడు వీడు..

హిమజ: వాడేనే నీ waste fellow. గుర్తుపట్టలేదు నువ్వు. మొహం మారిపోయింది. 9 years తరువాత కదా.

కాజల్ ఒక్కసారి ఆశ్చర్యపోయింది, సంతోషం వస్తుంది.

కాజల్: నిజమానే...

కళ్ళలో నీళ్ళు, 

హిమజ: నిజం. అగో మీ అమ్మ వస్తుంది చుడు అడుగుతా, 

శారద వచ్చింది, 

హిమజ: పెద్దమ్మ, అబ్బాయి పేరేంటి?

శారద: శివ, fitness trainer. అంటా, ఏ చెడు అలవాట్లు లేవు, ఆస్తి కూడా ఉంది. 

అని చెప్పి వెళ్ళిపోయింది. 

కాజల్: నిన్న airport లో కలిసాడే, కానీ చెప్పలేదు. 

హిమజ: అవునా అయితే కావాలనే చేసాడే. 

కాజల్: హ్మ్మ్ అయితే నేను కూడా అలాగే చేస్తా ఎప్పుడు బయట పడతాడో చూస్తా.


ఇక కాజల్ వెళ్ళి శివ ముందు కూర్చుంది, కావాలనే నకిలీ సిగ్గు నటిస్తూ ఉంది, శివ ఇంకా కాజల్ తననుగుర్తుపట్టలేదు అనుకుంటున్నాడు. 



ఇద్దరు మాట్లాడుకోవడానికి పైకి వెళ్ళారు. 

ఇద్దరు అలా కాసేపు మౌనంగా నిలపడి, ఆలోచిస్తూ ఉన్నారు. కాసేపటికి శివ మౌనం విరిచేసాడు. 

శివ: కాజల్ గారు సారీ నిన్న, నేను మీ ఫోటో చూసి కూడా అలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు, 

కాజల్: నేను కూడా sorry' అండి, మీ మీద అలా అరచినందుకు. 

శివ: పొనివ్వండి కానీ ఎదో దిగులుగా ఉన్నారు, ఎందుకు?

అప్పుడే కాజల్ research అని చెప్పింది, ఇక ఇద్దరు పెళ్లి వాయిదా ఒప్పందం చేసుకున్నారు.

శివ వాళ్ళు వెళ్ళిపోయారు. 

హిమజ: ఏయ్ ఏం మాట్లాడుకున్నారే?

కాజల్: వాడు కావాలనే చేస్తున్నడే, నాకోసం 5 years wait చేస్తా అన్నాడు. 

హిమజ: ఎందుకు?

కాజల్: నేను research చెయ్యాలి అని చెప్పిన. 

హిమజ: అయినా నీకోసం 5 years ఏంటీ, 10 అయినా ఆగుతాడు. 

కాజల్: నాకు తెల్సు, అందుకే పెళ్లి వాయిదా వేసాను. తెల్సా నేను చెప్పిన దానికి ఏం అనుకోలేదు, ఒప్పుకొడేమో అనుకున్న. అయినా ఒప్పుకోక చేస్తాడా. 

హిమజ: అంతేలే.
[+] 4 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:51 PM



Users browsing this thread: 2 Guest(s)