Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#59
శివ వెనకే కాజల్ వచ్చింది,


కాజల్: ఏంటి వెళ్తారా, వీళ్లేదు ఇవాళ మీరు ఇక్కడే ఉండాలి

సాయి: కుదరదు కాజల్, నీకు తెలుసు గా నాకు పనులు ఉంటాయి, ఇవాళ Sunday కాబట్టి రావడంకుదిరింది, రేపు ఒక్కరోజే ఊరిలో పనులు చూసుకుని పోవాలి

కాజల్: అయితే మాత్రం మధ్యాహ్నం వరకు ఉండి భోంచేసి వెళ్ళండి. 

సాయి: ఇంకో 20 days లో ఎలాగో కలుస్తాం గా అర్థం చేసుకోండి, cards మేమే ఇస్తున్నాం అందరికీ.

శివ: మధ్యాహ్నం వెల్దురూ గానీ ఉండండి

అని దీపా వైపు చూసాడు,

దీపా: నాకేం తెలీదు, తనే busy

సాయి: శివ sorry రా, నాకు ఉండాలి మీతో ఇంకా చాలా మాట్లాడాలి అనిపిస్తుంది కానీ కుదరడం లేదు. పెళ్లికిఎలాగో ఉంటా అప్పుడు వస్త

శివ: రాకుంటే బాగోదు చెప్తున్నా.

సాయి: సరే వెల్లోస్తాం రా

దీపా: వెల్లోస్తాం కాజల్

అని కాజల్ ని hug చేసుకుని, 

దీపా: శివ ని అలా కొట్టకు, చెప్పాను గా నువ్వంటే పిచ్చి వాడికి అందుకే నీ చేతిలో దెబ్బలు తింటున్నాడు

కాజల్: ఇంకో సారి ఆయన్ని వాడు అన్నావో పల్లు రాలకొడ్త

దీపా: ఓహో ok madam. (శివ వైపు చూసి) శివ సార్ bye సార్ మా పెళ్లికి రండి. మీ లాంటి గొప్పవాళ్ళు మాపెళ్ళికి రావడం మా అదృష్టం.

కాజల్ (నవ్వుతూ): ఆపవే ఎక్కువైంది.

సాయి: ok bye

అని బయటకి వెళ్తుంటే, కాజల్ చెయ్యి పట్టుకుని ఆపింది, సాయి దీపా ఎంటా అని చూస్తున్నారు.

సాయి పొడుగు కదా అందడు, అరికాళ్ళు పైకి ఎత్తి లేస్తూ, తల పట్టుకుని కిందకు వంచి, ఎడమ చెంప మీదముద్దు పెట్టింది.

దీపా షాక్ అయ్యింది. శివ చూసి నవ్వుతున్నాడు

సాయి: థాంక్స్ పారు....

కాజల్: కాజల్... పో

బయటకి నడుస్తూ, ఇంటి ముందు ఉన్న మొక్కలని చూస్తూ,

సాయి: మొక్కలు బాగానే పెంచుతున్నారు fight against global warming ఆ?

కాజల్: అలానే అనుకో, అసలు బయట పచ్చదనం కనిపిస్తే జనాలకు కళ్ళు మండుతున్నాయి.

దీపా: హహహ... కాజల్ నిజమే, చెట్టు కనిపిస్తే చాలు నారికేస్తున్నారు.

సాయి: వెల్లోస్తాం రా bye.

వాళ్ళు వెళ్ళిపోయాక, శివ నే అసహనంగా చూస్తూ,

కాజల్: నాకెందుకు చెప్పలేదు, ఈ ఇల్లు గురించి, ఆ గేట్, లాకింగ్, మెన్మ

శివ: అవసరం రాలేదు కదా

కాజల్: రాకపోతే నాకు చెప్పవా, అయినా రోజు ఆ స్కూటీ వేసుకుని మార్కెట్ కి పోతున్న ఇది ఉంది అనితెలిస్తేతీసుకుని వెల్లేదన్ని.

వినకొడనిది విన్నట్టు చూస్తూ,

శివ: ఏంటి దీని మీదనా, జనాలు భయపడతారు ఎదో సూపర్ హీరో మూవీ షూటింగ్ అనుకుని. అది కరాబ్అయ్యిందో అంతే నా కష్టం అంతా వృధా.

కాజల్ (నవ్వి) : సరేలే నువ్వు వెళ్ళు ఇవాళ మార్కెట్ కి.

శివ: పోతా లే.... ఇవాళ మా colleagues వస్తా అన్నారు

కాజల్: రానివ్వు

శివ: అంటే నీకు చెప్పలేదు అంటావేమో అని

కాజల్: ఇంకా చుస్తావే పో మార్కెట్ కి, తొమ్మిది అవుతుంది, వాళ్ళు ఏ టైమ్ కి వస్తారో

శివ చిన్న కళ్ళతో చూస్తూ, " ఉమ్మ్ " అని దగ్గరికి వస్తున్నాడు

శివ మూతి మీద వేలు పెట్టి ఆపి,

కాజల్: ముందు పో ఇవన్నీ తరువాత

శివ అలక మొహం పెట్టి, కౌగలించుకొని, మెడలో ముద్దు చేసి బయటకి వెళ్ళాడు.

కాజల్ శివ నే వెళ్ళేటప్పుడు మౌనంగా చూస్తూ ఉంది.

మెన్మ: మేడం నేను ఏం చెయ్యాలి?

కాజల్: ఆ పో, ఎక్కడి నుంచి వచ్చావో పోయి అక్కడే రెస్ట్ తీసుకో, నాకు నీతో ఎం పని లేదు.

మెన్మ: i hate you

కాజల్: తొక్క పోవే రేకు ముక్క

అంతే మెన్మ చెర వేగంతో పైకి వెళ్లింది. ఆ వేగానికి అక్కడ మొక్కలు ఊగిపోయాయి, కింద మట్టి లేచింది, కళ్ళలోకిగాలి తాకి కాజల్ కళ్ళు మూసుకుంది.

“ దీనమ్మ ఇంత ఫాస్ట్ ఆ, హచ్చుం ” తుమ్మింది

శివ వచ్చే లోపు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని స్నానం చేసింది.

మధ్యాహ్నం రెండు గంటలకు, ధృవ, శిరీష, మేఘన, ఆనంద్ వచ్చారు. శివ వాళ్లకు ఎదురెళ్లిఇంట్లోకిస్వాగతించాడు

శివ: ఓహ్ ధృవ వచ్చారా మీకోసమే చూస్తున్నా, ఇంకా రావట్లేదు అని. (ఆనంద్ కి కూడా shakehand ఇస్తూ) అక్కని కూడా తీసుకురావాల్సింది

ఆనంద్: లేదురా ఇంకెప్పుడైన ఇద్దరం కలసి వస్తాం లే. 

మేఘన: హై sir, ఇల్లు బాగుంది, ముందు ఉన్న గార్డెన్ కూడా.

శివ: ఓహ్ థాంక్స్ మేఘా

శిరీష: అవును నాకుడా నచ్చింది.

అప్పుడే కాజల్ వచ్చింది, అందరికీ హై చెప్పుతూ, కావాలనే, 

కాజల్: మేఘా అని nick names కూడా పెట్టేసుకుంటున్నారాన్నమాట

శివ కాజల్ వైపు చూసాడు, శిరీష కూడా చూసింది, 

శిరీష (కాజల్ కి shakehand ఇస్తూ): హై ma'am you're so beautiful.

కాజల్: ఓహ్ thanks కాని మేడం వద్దు call me కాజల్

మేఘన కాజల్ ని షాకింగా చూస్తుంది, కాజల్ ధృవ వైపు చూసింది, కాలం ఆగినట్టు కాజల్ నేచూస్తూబిగుసుకుపోయాడు. అతన్ని అలా చూసి కాజల్ మూతికి చెయ్యి అద్దం పెట్టుకు నవ్వుతుంది. 

శిరీష: ఏంటి అలా నవ్వుతున్నారు.

కాజల్ అటు చూడు అన్నట్టు సైగ చేసింది.

వాళ్ళు అది చుడు నవ్వారు, శిరీష ధృవ ని గిల్లింది, తెలుకుని, 

ధృవ: ఓహ్ ma'am angels అంటే ఇలాగే ఉంటారేమో

శివ: శిరీష చూస్తుంది

ధృవ: అయితే ఏంటి, sir మీ అంత lucky ఇంకెవ్వరూ ఉండరు. (కాజల్ వైపు చూసి) హీరోయిన్ లు కూడాఇంత అందంగా ఉందరండీ బాబు.

శిరీష: ఇక ఆపుతావా

కాజల్: enough రండి ముందు భోజనం చేద్దాం

శివ: ఆ అప్పటి నుంచి ఆకలేస్తుంది, మీరు వస్తే కానీ తిండి లేదు అని ఆపింది

ముగ్గురు నవ్వారు, 

మేఘన: ఏంటి శివ sir మీరు ఇలా కూడా ఉంటారా సరదాగా

కాజల్: అంటే ఏంటి అర్థం

మేఘన: కాదు మా ముందు స్ట్రిక్ట్ ఉంటారు

కాజల్: ఓహ్ అవునా, అయితే ఈన అక్కడ కూడా ఆక్టింగ్ చేస్తున్నారా

శిరీష: అంటే శివ sir funny ఆ?

కాజల్: అలా ఎం లేదు

ఇక వాళ్ళు భోజనం చేశాక, కాసేపు మాట్లాడుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. ఆనంద్ ఆగాడు 

కాజల్ ఆనంద్ శివ ముగ్గురు కూర్చొని,

ఆనంద్: శివ ఏం చేద్దాం అనుకుంటున్నావు?

శివ: ఏం చెయ్యాలి నాకే తెలీడం లేదు. రియాక్టర్ డిజైన్ చేసాను, కానీ ఇప్పట్లో అయ్యేలా లేదు, అటు అమెరికాలోఇలాంటి వాటి మీదే ఇంకొందరు already చేస్తున్నారు. ఆ డిఫెన్స్ మినిస్టర్ గాడు, ఇప్పటికీ నేను నువ్వుకలిసిచేసిన ఆ బాంబ్స్ ని అమ్మమంటున్నాడు.

ఆనంద్ (తల గోక్కుంటూ) : అదే కదా నన్ను కూడా బెదిరించాడు, కానీ మొత్తం నీ చేతిలోనే ఉంది అని చెప్పిన. శివ నా మాట విను

శివ: చెప్పు

ఆనంద్: నువ్వు ఆ manual scanvenging రోబోట్స్ మీద focus చెయ్యిరా govt కూడా చాలాముందంజగానిధులు కేటాయిస్తుందని విన్న.  నువ్వు గ్రావిటీ, gyro analytical expert ఆలోచించు.

కాజల్: అవును అండి, ఎదో ఒక improvement ఉంటే చాలా మేలు జరుగుద్ధి, రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం, ఆ manual drainage సమస్యలు

ఆనంద్: ఇది చెప్పుదామని ఆగిన, ఆలోచించు, వెల్లోస్తానమ్మ

కాజల్: ok అన్న, ఎప్పుడైనా వదిన ని తీసుకురా

ఆనంద్: హా తప్పకుండా.

ఆనంద్ వెళ్ళిపోయాడు.
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:45 PM



Users browsing this thread: 2 Guest(s)