Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
#81
 
ఇంతలో సంజయ్ ని వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపించింది. హనుమద్గాయత్రిలో నిమగ్నమై ఉండటంతో సంజయ్ కి స్పర్శ కూడా తెలియలేదు. పదే పదే అదే స్పర్శ కలగటంతో కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక వృద్ధుడైన సాధువు కనిపించాడు.
 
"ఏమయ్యా వాళ్లంతా చక్కగా రామనామ జపం చేస్తుంటే నువ్వేమిటయ్యా హనుమ, హనుమ అంటావు?" అన్నాడా సాధువు.
 
ఒక్క నిమిషం సంజయ్ కి ఏం అర్థం కాలేదు.
 
"ఏమిటి అలా బిక్కమొహము వేస్తావు? నేనే హనుమంతుడిని అనుకో ఒక్క నిమిషం. హనుమంతుడికి రామనామ జపం చేసేవాళ్ళే ఇష్టం. విషయం తెలుసా నీకు?" అన్నాడు సాధువు.
 
"స్వామీ...మైనాకుడు", అని సంజయ్ అంటూ ఉండగా
 
"ఇదిగో రాముడు నాకు అన్ని విషయాలూ చెప్పే పంపించాడులే కానీ.....ఒక్క సారి నాకోసం రామనామ జపం చెయ్యవయ్యా....ఇంతగా అడుగుతుంటే అర్థం చేసుకోవెందుకు?" అన్నాడు.
 
సంజయ్ వెంటనే రామనామ జపంలో లీనమయ్యాడు. సాధువు కూడా ఆనందంగా రామనామ జపం చేస్తూ గడిపాడు.
 
అలా రామనామ జపంతో ప్రదేశం అంతా పరమ పావనం అయినది.
 
వీరి రామనామ జపంతో  సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడు.
సిద్ధపురుషుడు, అభిజిత్, సంజయ్, అంకితలు అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. వృద్ధుడైన సాధువు రూపంలో ఉన్న ఆంజనేయుడు సముద్రుడితో ఇలా మాట్లాడాడు.
 
"ఆనాడు నా రాముడు 3 రోజుల పాటు నిన్ను ఉపాసించినా నీవు ఆయన ఎదుట నిలువలేదు. ఈనాడు నా రాముడి పేరు వినగానే వచ్చితివే ? సముద్రా నీలో ఎంత మార్పు?" అని అడిగాడు హనుమ.
 
" దోషమును బాపుకొనుటకే ఈనాడు నీ ముందు ఇలా నిలిచితిని, హనుమ. ఆజ్ఞాపించు. నేనే విధముగా ఉపయోగపడగలనో విన్నవించు", అన్నాడా సముద్రుడు.
 
"సిద్ధపురుషుడు అయిన సమర్థ రాఘవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శ్వేతద్వీపవైకుంఠవాసి. ఆయనను, ఆయనతోటి వచ్చిన పరివారమును సముద్రగర్భంలో ఉన్న మైనాకుడి ద్వారా శంభల నగరానికి క్షేమంగా చేర్చే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను", అన్నాడు హనుమంతుడు.
 
"ఆఘమేఘాలమీద కార్యాన్ని మైనాకుడికి ఇచ్చెదను. శ్రీరామ జయరామ", అంటూ సముద్రుడు అంతర్ధానమయ్యాడు.
 
వృద్ధుడైన సాధువు రూపంలో ఉన్న హనుమంతుడు అచేతనులై ఉన్న నలుగురి వంక ఒక్కసారి చూసి వారి నుదుటన సింధూరం దిద్ది, "జై శ్రీరామ్" అంటూ అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు.
 
కొంతసేపటికి నలుగురూ కళ్ళు తెరిచి చుట్టూ చూసారు.
 
"హే...అక్కడ చూడండి...మిస్టర్ మైనాక అనుకుంటా", అన్నాడు అభిజిత్.
 
కొండ అంచు చివర మానవరూపంలో ఉన్న మైనాకుడితో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు," ప్రణామములు మైనాక ! శంభల రాజ్యానికి చేరుటకు నీ సహాయము లేనిదే మా ప్రయత్నము సర్వమూ వ్యర్థమగును."
 
"శ్రీరాముడి సాక్షాత్కారము కలిగిన మీ నలుగురికీ సహాయపడుట నా అదృష్టముగా భావించెదను. విధముగానైనను వాయుదేవుని ఋణము కొంత తీర్చుకున్నవాడిని అవుతాను", అన్నాడు మైనాకుడు.
 
మానవరూపంలో ఉన్న మైనాకుడు వెంటనే పర్వతరూపం ధరించాడు.
 
సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకితలు నలుగురూ పర్వతాన్ని అధిరోహించగానే స్వతః సిద్ధముగా కల రెక్కలతో మైనాకుడు గరుడపక్షి వలె వాయువేగంతో మహాసముద్రాన్ని లంఘించాడు.
 
కొన్ని ఘడియలలోనే సముద్రాన్ని దాటి శంభల నగరానికి చేరుకున్నాడు.
 
శంభల నగరానికి ఉన్న ప్రవేశ ద్వారానికి దగ్గరలో వారిని సురక్షితంగా చేర్చి తన దారిన తాను వెళ్లిపోయాడా మైనాకుడు.
 
శంభల నగర ప్రవేశ ద్వారాన్ని చూస్తూ అలానే నోరెళ్ళబెట్టుకుని ఉండిపోయారు సంజయ్, అభిజిత్, అంకితలు.
 
ప్రవేశ ద్వారం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడా సిద్ధపురుషుడు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 24-01-2024, 06:12 PM



Users browsing this thread: 1 Guest(s)