Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల నగరం – 10
#85
శంభల నగర ప్రవేశం
దేవశిల్పి విశ్వకర్మ వృత్తాంతము

శంభల నగర ప్రవేశ ద్వారం దగ్గరికెళ్ళాక సిద్ధపురుషుడు వెనక్కి తిరిగి చూసాడు. సంజయ్, అభిజిత్, అంకితలు ఆశ్చర్యంగా మైమరచిపోయి ముఖద్వారాన్నే చూస్తూ ఉండటం గమనించాడు. 1500 అడుగులకు పైనే ఉన్న ద్వారాన్ని ఇంతవరకూ భూలోకంలో ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరనుకున్నాడు సిద్ధపురుషుడు. సింహద్వారంతో పాటు  సమానమైన ఎత్తులో వున్న ప్రహరీ గోడ కూడా అనంతంగా అన్ని వైపులకూ వ్యాపించి ఉండటంతో అందనంత ఎత్తులో వున్న ఆకాశాన్నే తాకుతోందేమో అన్నట్టుగా కళ్ళను మాయ చేస్తోందా రాజప్రాకారం.
 
సిద్ధపురుషుడు దూరం నుంచి తన చేతులతో సైగ చెయ్యటంతో సంజయ్, అభిజిత్, అంకితలు లోకంలో కొచ్చారు. పరుగులాంటి నడకతో నగర ద్వారం వైపుగా వెళ్లారు.
 
అక్కడికి చేరుకోగానే వాళ్లకు ద్వారాన్ని దగ్గరి నుండి చూసే అవకాశం దొరికింది. సింహద్వారం మధ్యలో ఐదు ముఖాలతో, పది చేతులతో వున్న ఒక ఋషిలాంటి వ్యక్తి యొక్క చిత్రపటము కనిపించింది. దూరం నుండి చూసినప్పుడు శంభల రాజ్యానికి రాజేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు దగ్గరగా చూసేసరికి చిత్రంలో వున్న వ్యక్తి రాజులా అనిపించలేదు.
 
"ఎవరు స్వామి ఆయన?" అని తన చూపుడు వేలితో చిత్రం వైపుగా చూపిస్తూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు అభిజిత్.
 
"అలా వేలితో చూపించకు, అభిజిత్. అది మంచి పధ్ధతి కాదు. చిత్రాన్నే కాదు, ఒక వ్యక్తిని అయినా సరే చూపుడువేలితో అలా చూపిస్తూ మాట్లాడటం సంస్కారం కాదు",అన్నాడా సిద్ధపురుషుడు. "ఇది మానవలోకం కాదు. శంభల నగరం. ఇచట మన ప్రతీ కదలికనీ గమనించే దేవతాగణాలుంటాయి. అందుకే ప్రత్యేకించి   విషయాన్ని చెబుతున్నాను", అన్నాడు.
 
"తెలియక అలా చేసాను స్వామి. ఆయన ఎవరో తెలుసుకుందామనే తొందరపాటులో అలా ప్రవర్తించాను. క్షమించగలరు", అని వినమ్రంగా అడిగాడు అభిజిత్.
 
"ఆయన దేవశిల్పి విశ్వకర్మ", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"మనోడికి దేవశిల్పి అంటే అర్థం అయినట్టు లేదు", అని అంకితతో సంజయ్ అంటూనే అభిజిత్ తో,"అభిజిత్, దేవతలకు  ఆర్కిటెక్ట్ ఆయనే", అన్నాడు.
 
స్వామి, మనం లోపలికి వెళ్ళటానికి  ఇంకా చాలా టైం పట్టేలా ఉన్నది. అంతలోపల విశ్వకర్మ గురించి చెప్తారా?" అడిగాడు అభిజిత్.
 
"అవును స్వామి. చూస్తుంటే ఇప్పట్లో మనకు లోపలికి వెళ్లే అనుమతి దొరికేలా లేదు.
 
విశ్వకర్మ మాకు తెలియని విషయాలన్నీ చెప్పండి", అని అడిగాడు సంజయ్.
 
"ఏంటి నీకు కూడా ఆయన గురించి తెలీదా సంజయ్?" అడిగింది అంకిత.
 
"తెలీదు. నేనేం మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ని కాదు కదా. సిబిఐలో వర్క్ చేసే ఆఫీసర్ ని అంతే", అన్నాడు సంజయ్.
 
"కదా. నాకూ అలాగే దేవశిల్పి అంటే ఏంటో తెలీదు. నాకంటే నీకు కాస్తెక్కువ తెలుసంతే. స్టార్టింగ్ లో నీ నాలెడ్జ్ చూసి అనవసరంగా టెన్షన్ పడిపోయా. ఇప్పుడర్థం అయిపోయింది", అన్నాడు అభిజిత్.
 
"ఏమర్థం అయింది?" అన్నాడు సంజయ్.
 
"సమర్థ రాఘవుడి లాంటి గురువు ఉంటే నీకంటే నేనే బ్రైట్ స్టూడెంట్ ని అని", కాన్ఫిడెంట్ గా కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పాడు అభిజిత్.
 
"స్పర్థయా వర్ధతే విద్యా అని మన పెద్దలెప్పుడో చెప్పారు", అంటూ నవ్వాడు సిద్ధపురుషుడు. "సరే మీరు అడిగినట్టే విశ్వకర్మ గురించి క్లుప్తముగా చెప్తాను. శ్రద్ధగా వినండి", అంటూ ఇలా చెప్పసాగాడు సిద్ధపురుషుడు.
 
"విశ్వకర్మకు మూడు రూపాలున్నాయి. వాటిల్లో మొదటిది విరాట్ స్వరూపమైన  పరమాత్మ తత్వము
. పరమాత్మ ఐన విశ్వకర్మనే ప్రవేశ ద్వారం మీదున్న చిత్రంలో మీరు చూస్తున్నారు. తన సంకల్ప బలంతో పునఃసృష్టి చేసి సమస్త జీవకోటినీ సృష్టించాడని ఋగ్వేదం చెబుతోంది. స్వయంభువుగా ఉద్భవించిన ఆయనకు ఐదు ముఖాలు, పది చేతులని వేదాలలో చెప్పబడి వున్నది.
 
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః
అని విష్ణుసహస్రనామ స్తోత్రంలో వుంది. అంటే ఆయన పరమాత్మ స్వరూపం అన్నట్టే కదా.
 
రెండవది 
భౌవనపుత్ర విశ్వకర్మ. ఇతను భువనుడు అనే రాజర్షి యొక్క పుత్రుడు. ఒక శిరస్సు, నాలుగు హస్తములు మరియు ఏనుగును వాహనంగా కలవాడు. ఇతను వేదకాలంలోనే తన తండ్రిలా చక్రవర్తి పట్టాభిషేకం జరిపించుకున్న శిల్పర్షి, రాజర్షి. ఇతను భూమి నుండి జన్మించినటువంటి సువర్ణరత్న శిల్పి యని మహాభారతములో చెప్పబడి వుంది. సహస్ర శిల్పముల కర్త అని కూడా మహాభారతమునందు చెప్పబడి వున్నది. శ్రీమహావిష్ణువు యొక్క రూపమని విశ్వకర్మసంహితలో వున్నది.
 
మూడవదైనటువంటి రూపమే మనం ఎక్కువగా వినే 
 దేవశిల్పి విశ్వకర్మ . దేవతలకు, మానవులకు శిల్ప గురువు ఇతడే. తన తపో శక్తితో భౌవన పుత్ర విశ్వకర్మ సాక్షాత్కారం పొందటం చేత ఆయన నుండి సర్వశక్తులను పొందినవాడయ్యాడు దేవశిల్పి విశ్వకర్మ. ఒక శిరస్సు, రెండు భుజములు మరియు హంసను వాహనంగా కలవాడు.పార్వతీదేవిని పరిణయమాడిన తర్వాత శివుడు ఒక అందమైన భవనాన్ని నిర్మించమని విశ్వకర్మను అడగటంతో ఆయన   స్వర్ణలంకను సృజించాడు. తర్వాతి రోజుల్లో ఇదే రావణాసురుని దగ్గరికి చేరింది. దధీచి వెన్నెముకతో ఇంద్రునికి 
వజ్రాయుధాన్ని తయారు చేసిచ్చింది కూడా విశ్వకర్మే.
 
సత్యయుగంలో దేవతల  స్వర్గలోకమును , ద్వాపరయుగంలో 
ద్వారకా నగరాన్ని , కలియుగంలో  హస్తినాపురాన్ని
ఇంద్రప్రస్థాన్ని కూడా దేవశిల్పి విశ్వకర్మే సృజన చేసాడు.
శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని కూడా ఈయనే చేసిచ్చాడు. ఇలా ఎన్నెన్నో చేసాడు. మీరిప్పుడు చూడబోయే శంభల నగరాన్ని, శంభల రాజ్యాన్ని కూడా విశ్వకర్మ సంతానమే సృజించి ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు, అని అక్కడితో ముగించాడు సిద్ధపురుషుడు.
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 01-02-2024, 06:15 PM



Users browsing this thread: 1 Guest(s)