Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
#91
శంభల నగరం – 2
స్వర్వాహినీ క్షేత్రం

శంభల నగరానికి నాలుగు వైపులా పర్వత శ్రేణులే ఉంటాయి. శంభలలో మొత్తం 18 ప్రాకారాలు ఉంటాయి. 9 ప్రాకారాలు శంభల నగరంలో ఉంటే మిగిలిన 9 శంభల రాజ్యంలో ఉంటాయి. శంభల నగరం, శంభల రాజ్యం వేటికవే రెండూ భిన్న లోకాలలా ఉంటాయి. శంభల నగరంలో జ్ఞానసముపార్జన, దైవసంకీర్తన, శివారాధన ప్రముఖంగా కనిపిస్తే శంభల రాజ్యంలో యుద్ధవిద్యా బోధన, నైపుణ్య పరీక్ష, ధర్మ శాస్త్రాలపై అవగాహన ప్రధానంగా ఉంటాయి.
 
శంభల నగరంలోని మొదటి ప్రాకారం ఐన  స్వర్వాహినీ క్షేత్రంలో ఉన్నారు సంజయ్, అభిజిత్, అంకితలు.
సిద్ధపురుషుడికి కూడా శంభల నగరానికి రావటం ఇదే మొట్టమొదటి సారి కావటంతో చుట్టూ ఒకసారి పరిశీలనగా చూస్తున్నాడు. సైనికులు వీరితో పాటే అక్కడున్నారు.
 
"  స్వర్వాహినీ క్షేత్రానికి ఎందరో సిద్ధులు, శంభల రాజ్యంలోని రాజులు, మంత్రులు, యోగులు వస్తూ ఉంటారు. ఇదొక నది అంటారు. శంభల చుట్టూతా ఉంటుంది. కానీ మనకు ఇదొక పుష్కరిణిలా కనిపిస్తుంది. ప్రాకారాన్ని అలా నిర్మించారు. శంభల నగరంలోకి అడుగుపెట్టేవారికి ఇది మొట్టమొదటి ప్రాకారంలా అనిపిస్తుందేమో కానీ ఇది చిట్టచివరిదైన 9 ప్రాకారం. వికసించిన పద్మానికి ఎలా అయితే దళాలు విచ్చుకుని ఉంటాయో అలానే 9 ప్రాకారాలు శంభల నగరం మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిని ఆలంబనగా చేసుకుని చుట్టూ రక్షణ కవచాలలా వృత్తాకారంలో ఉంటాయి", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.
 
" క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి?" అని అభిజిత్ అడిగాడు.
 
"వాక్కులో ఎలాంటి దోషాలు, అపశబ్దాలు లేకుండా అనవసరమైన ప్రసంగాలు చెయ్యకుండా ఉండాలంటే ఇక్కడికొచ్చి  స్వర్వాహినీ దేవిని ప్రార్థించి ఇక్కడి జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలునని అంటూ ఉంటారు శంభలలో", అన్నాడొక సైనికుడు.
"మానవులకు వాక్కులో దోషాలు సహజం. శంభలలో కూడా ఇలాంటివి ఉంటాయా స్వామి?" అంటూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
 
"ఎంతటి వారికైనా సరే భగవంతుని గుణగణాల కీర్తన చెయ్యనిదే వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి అనేది అసంభవం. అందుకే మనకు  అచ్యుతా...అనంతా...గోవిందా అని స్మరించమంటారు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
స్వర్వాహినీ క్షేత్రంలోని నీటిని తీర్థంలా సేవించి అక్కడే కాసేపు ఆసీనులయి వాక్కులో పరిపూర్ణమైన శుద్ధి కొరకు స్వర్వాహినీ దేవిని ప్రార్థించారు.
"స్వామీ  కనకధారాస్తోత్రంలో
…..
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
అని వస్తుంది కదా. అక్కడ ప్రస్తావించినది నది గురించేనా?" అని అడిగాడు సంజయ్.
 
స్వర్గలోకంలో ఉన్న ఆకాశగంగ  మందాకినీ
అనే పేరుతో నదిగా ప్రవహిస్తోంది. శంభల శివుని క్షేత్రం కావటంతో ఇక్కడ అదే ఆకాశగంగ స్వర్వాహినీ 
పేరుతో ప్రవహిస్తోంది. ఆదిశంకరుని కనకధారా స్తోత్రంలో చెప్పిన స్వర్వాహినీ విమల చారు జలం ఇదే. నీ ఆలోచనలో ఉన్న లోతు నాకెంతగానో నచ్చింది. ఇలాగే ప్రతీ విషయాన్ని వివేకంతో ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు నీకు బ్రహ్మజ్ఞానం తప్పక లభిస్తుంది, అంటూ ఆనందంతో సంజయ్ ని చూస్తూ చిరునవ్వు చిందించాడు సిద్ధపురుషుడు.
 
రెండవ ప్రాకారం ఐన  ధనుః ప్రాకారం వైపుగా అడుగులు వేస్తున్నారు సంజయ్, అభిజిత్, అంకితలు. సైనికులు వీళ్లకు దారి చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. సిద్ధపురుషుడు సైనికులని అనుసరిస్తూ వారి వెనకే వస్తున్నాడు. సిద్ధపురుషుణ్ణి అనుసరిస్తూ మిగతా ముగ్గురూ తమ అడుగులు ముందుకేస్తున్నారు.
 
శంభల నగరంలోని ప్రతీ ప్రాకారం వెడల్పు 3 యోజనాలు. 3 యోజనాల దూరం నడిస్తే గాని మరొక ప్రాకారానికి వెళ్లలేము. ప్రతీ ప్రాకారం యొక్క చుట్టుకొలత తగ్గుతూ పోతుంది. లెక్కన చూస్తే శంభల నగరంలో వున్న 9 ప్రాకారాలలో  
స్వర్వాహినీ క్షేత్రమే అతి పెద్ద చుట్టుకొలత గల ప్రాకారం.
 
మధ్యలో కేంద్రీకృతం అయ్యి ఉన్న శక్తిపీఠం కిందుండే భూగృహములో చింతామణి అనే దేవమణి ఉంటుంది. దేవమణిని కోరుకుంటే దొరకని శక్తి లేదు. దేవమణి కాంతి ప్రసరిస్తే చాలుననుకునే రాజులు ఎందరో ఉన్నారు శంభల చరిత్రలో. ఇంతవరకూ అలాంటి అవసరం కానీ, సందర్భం కానీ   కల్కి రాజుకీ రాలేదు. అనిరుద్ధుల వారికి అలాంటి అరుదైన సువర్ణావకాశాన్ని ఇచ్చేది బహుశా ముగ్గురేనేమోనని.సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సిద్ధపురుషుడు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 14-02-2024, 06:38 PM



Users browsing this thread: 2 Guest(s)