Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విప్లవ ఉగాది
#1
విప్లవ ఉగాది

రచన: అల్లు సాయిరాం



భారతికి ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పట్నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగింది. అమ్మమ్మగారింట్లో ఉగాది రోజున అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి, ఉగాది రోజు తెల్లవారుజామున నుంచి యింటి ముందు ముగ్గులు వేసేవాళ్ళతో, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవాళ్ళతో, అలంకరణాలు చేసేవాళ్ళతో, ఇంట్లో పని చేసేవారితో, ఊరందరికి పంచడానికి సిద్దపరిచిన రెండు, మూడు బస్తాలతో తోటల్లో కాసిన మామిడికాయలు, వేపపువ్వులు, లేత పనసకాయలు, కొత్త బెల్లం కుండలు తాతయ్య దగ్గరుండి పంచుతుంటే తీసుకోవడానికి వచ్చేవాళ్లతో, మామిడితోటలో చెట్లకు పెద్దతాళ్ళతో ఉయ్యాల కట్టి ఊగేవాళ్ళతో సందడిగా ఉండేది. యిలా ఉగాది పండుగ భారతి దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. మామిడితోటలో చెట్లు ప్రతి యేటా ఉగాదికి తప్పకుండా గంపెడుల కొద్ది కాయలు కాస్తుండడం వలన తోటని ఉగాది మామిడితోట అని పిలిచేవారు. మామిడితోటని అమ్మమ్మ భారతి తల్లికి పుట్టింటి పెళ్లి కానుకగా యిచ్చింది. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతి పట్టుబట్టి మరి అమ్మ దగ్గర నుంచి తన పుట్టింటి పెళ్ళి కానుకగా తీసుకుంది. భారతి పెళ్ళయిన తరువాత కుడా ఉగాది పండుగ అలానే జరుపుతూ వస్తుంది. 



 భారతి కాస్త భారతమ్మ అయ్యి పాతికేళ్ళవుతుంది. భర్త సూర్యప్రకాశరావు ఉద్యోగ రీత్యా, కొడుకు కుమార్ చదువుల దృష్ట్యా పల్లెటూరి నుంచి పట్టణానికి మారి మూడేళ్లవుతుంది. వయసు మళ్ళుతున్న కుడా భారతమ్మకి ఉగాది అంటే మక్కువ పోలేదు. ఈసారి ఉగాది యిలా చేద్దాం, అలా చేద్దాం అంటూ ఎన్నో ఊహలతో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తుంది. ఈసారి ఉగాది రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు రాయడానికి రకరకాల రంగులు, పదిహేను వరుసల పదిహేను చుక్కలతో ముగ్గులు, డిజైన్లలో ముందస్తు సన్నాహాలు చేస్తుంది. 



 ఎంతగానో ఎదురుచూస్తున్న ఉగాది రానే వచ్చింది. భారతమ్మ తెల్లవారుజాము మూడు గంటలకు హడావిడిగా నిద్రలేచేసి, గబగబా తలంటుకునేసి, కుమార్ ని, సూర్యప్రకాశరావుని నిద్ర లేపేసి, పడుకున్న కోడిని సైతం లేపి కూత అరిపించేసింది. గబగబా యింటి ముందుకు వచ్చేసి "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రంగురంగుల ముగ్గు పెడదామనుకుని చూస్తుంది. తండ్రికొడుకులిద్దరు భారతమ్మ భాధ పడలేక, నిద్రముఖాలతో చెరో ప్రక్కన చెరో లైటు పట్టుకుని నిల్చుని చూస్తున్నారు. ఒక వరుసకి ఒక అడుగు చొప్పున చూసిన కుడా పదిహేను వరుసల ముగ్గుకి పదిహేను అడుగుల స్థలం అవసరం పడుతుంది. ఉన్నదే పది అడుగుల రోడ్డు. అందులో సగం ఎదురింటివాడిది, సగం పక్కింటివాడిది. ఉన్న స్ధలంలో కనీసం "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రాయడానికి కుడా ఇరుకుసందుల వీధుల్లో స్థలం సరిపోవట్లేదు. అయినా, భారతమ్మ పట్టువదలకుండా పెద్ద ముగ్గులు వేస్తూ, చెరిపేస్తూ, మళ్ళీ మార్చి మార్చి ఎన్ని సార్లు ముగ్గులు వేసినా లాభం లేకుండాపోయింది. చుక్కల ముగ్గు సంగతి ఏమోగానీ, ముగ్గులు వేయటానికి మాత్రం భారతమ్మకి చుక్కలు కనిపించాయి. ముందస్తు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారతమ్మ ఆశలు నీరుగారిపోయాయి.



భారతి! నువ్వు ఎన్నిసార్లు వేసినా, నీ ముగ్గులకి యి ప్లేస్ సరిపోదు. అనవసరంగా మాకు నిద్ర పాడుచేసేశావు! అని సూర్యప్రకాశరావు అంటే, కుమార్ నవ్వుతూ



అవునమ్మ! ఒక పని చేద్దాం. ముగ్గులు వేసిన పేపర్ యిక్కడ అంటించేద్దాం! నీ కోరిక తీరిపోతుంది! అని అంటూ యిద్దరూ మెల్లగా నవ్వుకుంటున్నారు.



అసలే అనుకున్న ముగ్గులు రాక మండిపోయి ఉన్న భారతమ్మ "ఆఁ! మీకు ఆకలి వేసినప్పుడు, భోజనం అని పేపర్ మీద రాసేసి పెట్టేస్తాను. మీ ఆకలి తీరిపోతుంది! ఏమంటారు! అని అనేసరికి, తండ్రి కొడుకులిద్దరూ నవ్వు ఆపేసి, యిప్పుడు అమ్మని కెలకకూడదని, నోరు మూసేసి నవ్వుకుంటున్నారు.



ఎంత ప్రయత్నించినా సరిగ్గా కుదరకపోయేసరికి భారతమ్మ సర్లే! ఎంతైనా పల్లెటూరిలో చేసినట్టుగా పట్టణాలలో చెయ్యలేం కదా! ఇదే పల్లెటూరిలా ఖాళీ స్థలం ఉండి ఉంటే, యి భారతి వేసిన ఉగాది ముగ్గు చూసి ఆశ్చర్యపోయి నోళ్ళు తెరవాలి. మళ్ళీ యి భారతి చేసిన ఉగాది పచ్చడి తినడానికి నోరు మూస్తారు. పట్టణానికి వచ్చి సంవత్సరాలు కావస్తున్నా, కనీసం పక్కింటివాళ్లు ఎవరో కుడా తెలియట్లేదు. ఎంతైనా, రోజులు మళ్ళీ వస్తాయా ఏంటి!" అని అదినిష్టూరంగా నిట్టూరుస్తూ ముగ్గు తంతు కానిచ్చేస్తుంది. చూస్తుండగానే సూర్యుడు పిలవని అతిథిలా వచ్చేస్తున్నాడు. "ఇంకా ముగ్గు దగ్గర ఉంటే, మరి ఉగాది పచ్చడో! మామిడికాయలు తెచ్చుకోవాలి కదా! కాలంలో, మామిడికాయల కోసం వూరిలో మన యింటి గడప తొక్కనివాళ్ళే ఉండేవాళ్ళు కాదు! రోజులే వేరు!" అంటూ రెండోసారి నిట్టూరుస్తూ, కుమార్ ని పిలిచి మామిడికాయల కోసం మార్కెట్ కి పంపించింది.



 తండ్రి కొడుకులకి ఉగాది రోజున భారతమ్మ నిట్టూర్పులు కొత్తేం కాదు. సూర్యప్రకాశరావు కుడా తలంటుకుని వచ్చి, టివిలో రాశిఫలాలు చెప్తుంటే ముందు కూర్చున్నాడు. అనుకుని, జరగని ప్రతి విషయానికి ఇదే కాలంలో అయితే..! అని భారతమ్మ నిట్టూర్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో శుభాకాంక్షల సందేశాలు వస్తూనే ఉండడంతో మొబైల్ ఫోన్లు మ్రోగుతునే ఉన్నాయి. ఉగాది చుక్కలముగ్గు ఆశ ఎలాగో తీరలేదు. కనీసం ఉగాది పచ్చడి అయినా అనుకున్నట్లుగా చేద్దామని తహతహలాడిపోతోంది. మామిడికాయల కోసం వెళ్లిన కుమార్ ఎంతకీ రావట్లేదు. కుమార్ రాక కోసం వంటింట్లోకి, వాకిట్లోకి వందసార్లు తిరిగిందో, భారతమ్మ కాలి పట్టీల శబ్ధాలు వింటున్న సూర్యప్రకాశరావుకే తెలియాలి. ఇటువంటి సందర్భంలో భారతమ్మని గాని కదిపితే, చిన్నసైజు కందిరీగలా ఉంటుంది. అనుభవపూర్వకంగా భారతమ్మ గురించి తెలుసు కాబట్టి, సూర్యప్రకాశరావు ఒక్కసారి కూడా భారతమ్మని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. 



 సమయం తొమ్మిది కావస్తోంది. "ఏమండోయ్! కుమార్ ఎప్పుడో వెళ్లాడు. ఇంకా రాలేదేంటండీ? మామిడికాయలు తెమ్మంటే, తోట మొత్తం దులిపేసి తీసుకొచ్చేస్తున్నాడా ఏంటి! ఒకసారి కుమార్ కి ఫోన్ చెయ్యండి!" అని యింటి మెట్ల మీద నిలబడి రోడ్డు వైపు చూస్తూ అంది భారతమ్మ. "ఫోన్ ఎందుకులే! నువ్వు అన్నట్టు తోటలో ఉన్న కాయలు మొత్తం తేవాలంటే బరువు ఎక్కువగా ఉండడం వలన తీసుకురావడానికి టైం పడుతుందేమో! నన్ను వెళ్లి చూసి రమ్మంటావా?" అని బయటికి వెళ్లడానికి యిదే అదునుగా సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ అడిగాడు సూర్యప్రకాశరావు. గ్యాస్ పొయ్యి మీద వంటచేసిన కూడా నిప్పులు వస్తాయా అన్నంత ఎర్రగా, భారతమ్మ ఒక చూపు చూసి "అప్పుడనగా వెళ్లిన కొడుకు యింకా రాలేదు. ఇప్పుడు తండ్రి వెళ్తే ఎప్పుడు వస్తాడో! ఏమక్కర్లేదు! కుమార్ వచ్చేస్తాడులే!!" అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సూర్యప్రకాశరావు కూర్చుని యధావిధిగా టివిలో రాశిఫలాలు చూస్తున్నాడు. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
విప్లవ ఉగాది - by k3vv3 - 12-04-2024, 07:16 PM
RE: విప్లవ ఉగాది - by k3vv3 - 12-04-2024, 10:29 PM
RE: విప్లవ ఉగాది - by k3vv3 - 12-04-2024, 10:30 PM



Users browsing this thread: 1 Guest(s)