Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
అభిజిత్, అంకితలు వేసుకున్న దుస్తులు మారిపోయాయి. అక్కడి ప్రాంగణం అంతా చీకటిగా మారిపోయింది. అభిజిత్, అంకితలకు అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఎన్నో నక్షత్రాలు చుట్టూ కనబడుతున్నాయి. 27 నక్షత్రాలున్నాయి. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలు 27 నక్షత్రాలు. దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యటం అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనబడుతోంది. చంద్రుడు రోహిణీకి బాగా దగ్గరయ్యి మిగతా 26 మందినీ దూరం పెట్టడం, 26 మందీ దక్షుని దగ్గరికి వెళ్లి తమ బాధను మొరపెట్టుకోవడం, దక్షుడు చంద్రుని దగ్గరకొచ్చి హెచ్చరించటం ఇవన్నీ ఒక దాని తర్వాత మరొకటి అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దక్షుడి శాపంతో చంద్రుడు ఒక చోట కూర్చుని రోదిస్తూ ఉండటం కనిపించింది అభిజిత్, అంకితలకు. వారి కళ్ళ ముందే చంద్రుడు అలా బాధపడటం చూసి చలించిపోయారు. ఓదార్చటానికి దగ్గరకి వెళ్లే లోపు చంద్రుని దగ్గరికి బ్రహ్మ వచ్చాడు.
 
"అదిగో అటు వైపు చూడు", అంటూ బ్రహ్మ చూపిస్తున్న దిశగా చూసిన చంద్రుడు ఆశ్చర్యపోయాడు. అభిజిత్, అంకితలు కూడా అటు వైపు చూసారు. వారి కళ్ళను వారే నమ్మలేనట్టుగా ఉందా అద్భుతం.
 
అదొక  పాల సముద్రం. పాల సముద్రంలో ఎగసి పడే అలలు. ఎవరో కవ్వముతో చిలుకుతున్నట్టుగా అక్కడ పాల సముద్ర మథనము జరుగుతోంది. పాల సముద్రములో ఎగసి పడే ప్రతీ అల వల్ల అక్కడ పాల నురుగు అంతకు అంత పెరుగుతూ పోతోంది. పెరుగుతున్న పాల నురుగు చిక్కగా తయారవుతోంది. అలా కొంతసేపు పాలసముద్రంలో జరిగే మథనాన్నే చూస్తూ ఉన్నారు అభిజిత్, అంకితలు. పాల నురుగు చిక్కదనం ఎక్కువవుతూ పోగా అందులో నుండి ఉద్భవించాడు చంద్రుడు. ఇదంతా బ్రహ్మ చంద్రుడికి చూపించాడు. బ్రహ్మ చంద్రుడితో ఇలా అన్నాడు.
 
"అది నీ పుట్టుక, చంద్రమా. అలాంటి నువ్వు ఇలాంటి స్థితిలో ఉండటం లోకానికే అమితమైన బాధ. దక్షుడు నీకిచ్చిన   క్షయ వ్యాధి పోవాలంటే నీ మనసును పరమశివుని యందే లగ్నం చేసి ఉంచు. కఠినమైన తపస్సును ఆచరించు. పరమశివుడే నీకు దారి చూపిస్తాడు. విజయోస్తు", అని అంతర్ధానమయ్యాడు.
 
చంద్రుడు నిష్ఠగా శివుణ్ణి పూజిస్తే, శివుడు ప్రత్యక్షం అయ్యి  శుక్ల పక్షంలో చంద్రుడు క్రమక్రమంగా  వృద్ధి చెందేలాకృష్ణ పక్షంలో  మాత్రం  క్షీణిస్తూ ఉండేలా దక్షుడిచ్చిన శాపాన్ని సడలించాడు. పూర్తిగా శాపాన్ని తొలగిస్తే దక్ష ప్రజాపతి వాక్కుకు అర్థం లేకుండా పోతుంది. అందుకే శివుడు చంద్రుని ప్రార్థన మేరకు చంద్రుణ్ణి శిరస్సున ధరించాడు. చంద్రుడు పార్వతీ దేవి భక్తుడయిపోయాడు. పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఒకడయ్యాడు.
 
రోజు నుండి చంద్రుడు మహాశివభక్తుడిగా గొప్ప పేరు పొందాడు. తన దోషాన్ని సైతం అధిగమించాడు.
 
ఇదంతా ఒక కథలా వారి కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపించింది. అది ముగిసిపోగానే వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి అంతక్రితం ఉన్న ప్రాంగణం కనిపించింది.
 
మునుపటిలా అక్కడ ఎంతో మంది అందమైన జంటలు కనిపించారు. సంజయ్ వారి పక్కనే ఉన్నాడు. అంకిత మాత్రం అభిజిత్ పక్కన ఉంది. శంఖినీ జాతి స్త్రీ  వాళ్లకు  ఎదురుగానే ఉన్నది.
 
మనసు చేసే మాయ తొలగిపోవాలంటే  భక్తి  ఒక్కటే ఏకైక మార్గం. ఎంత కష్టపడైనా సరే మనసుని భక్తి మార్గము నందే ప్రవేశ పెట్టాలి. మీకు చంద్రుని కథంతా కళ్ళ ముందు కనిపించటానికి కారణం ఏంటో తెలుసా?" అని అడిగింది శంఖినీ జాతి స్త్రీ.
 
తెలియదు అన్నట్టుగా అభిజిత్, అంకితలు  ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"అయితే మీతో వచ్చిన మీ స్నేహితుడిని అతనికి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారో ఒకసారి అడిగి చూడండి", అంది శంఖినీ జాతి స్త్రీ.
 
"సంజయ్, నీకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు?" అడిగాడు అభిజిత్.
 
"అదేం ప్రశ్న. బాగా వయసు మళ్ళిన వృద్ధ దంపతులు ఒకరిని ఒకరు చూసుకుంటూ పసి పిల్లలలా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు కదా. వాళ్ళే కనిపిస్తున్నారు.అయినా ఎందుకలా అడుగుతున్నావు?" అన్నాడు సంజయ్.
 
"అంటే నీకిక్కడ యువతీ, యువకులు ఎవ్వరూ కనిపించటం లేదా?" అని అడిగాడు అభిజిత్.
 
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
 
"మరి శంఖినీ జాతి స్త్రీ కనిపిస్తోందా?" అడిగాడు అభిజిత్.
 
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
 
సంజయ్ చెప్పిన జవాబులు విని నిర్ఘాంతపోయారు ఇద్దరూ. అభిజిత్, అంకిత ఇటు తిరిగి చూసే లోపు శంఖినీ జాతి స్త్రీ మాయమైపోయింది.
 
అప్పుడు అభిజిత్ కి అందులోని అంతరార్థం బోధపడింది. ఆమె ఒక దేవతని అర్థం అయ్యింది. అభిజిత్, అంకితల మనసు ఇంకా మాయకు వశం అయ్యి ఉండటం వల్లే వాళ్లకు అక్కడ ఎంతో మంది యువతీ, యువకులు జంటగా కనిపించారు. మాయను దూరం చేసి  ఇందుః ప్రాకారంలోని చంద్రుని గురించి చెబుతూ తమకు జ్ఞానోదయం కలిగించటానికి వచ్చిన దేవత అని అభిజిత్ కు అనిపించింది. అంకిత ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. అసలేం జరిగిందో అర్థం అయ్యే స్థితిలో తను లేదు.
 
  అసిధారావ్రతం అనే ప్రాంగణం నుండి బయటికి వచ్చేసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 8 - by k3vv3 - 28-04-2024, 05:38 PM



Users browsing this thread: 1 Guest(s)