Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
"స్వామి, శివుడు ఎక్కడి నుండి వస్తాడు?" అడిగాడు అభిజిత్
 
ముముక్షువు అభిజిత్ ను ఎగాదిగా ఒక్కసారి చూసి గట్టిగా నవ్వాడు. అభిజిత్ గుండెను తన చేత్తో బలంగా తాకుతూ,"నీ హృదయం అనే పద్మంలో నుండి వస్తాడు", అన్నాడు.
 
"ఇక్కడ ధ్యాన రూపంలో ఉన్న 56 అడుగుల బంగారు శివుణ్ణి కేవలం విగ్రహస్వరూపం అనుకుంటున్నావా?" అని అభిజిత్ ను గట్టిగా అడిగాడు.
 
సూర్య గణాలు తెచ్చిన బంగారం  సూర్యప్రభకు నిదర్శనం. సూర్యుని ద్వారానే ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. బంగారానికి ఉన్న గుణాలలో జ్వలించే శక్తి ప్రథమమైనది. ఎంతగా జ్వలిస్తే అంతగా మెరిసిపోతుంది. సతీదేవి అగ్నికి ఆహుతి కావటం జ్వలనమే కదా. అందుకే రోజున ఇక్కడ మీకు కనిపించే హిరణ్య తేజమైన శివుడు ధ్యానం వీడి తన నటరాజరూపంతో జ్వలిస్తూ తాండవం చేస్తాడు, అన్నాడా ముముక్షువు.
 
"అంటే ఇప్పుడు మనం చూస్తున్న ధ్యానరూపంలో ఉన్న శివుడే కళ్ళు తెరిచి ఇక్కడ తాండవం చేస్తాడా స్వామి?" అంటూ 56 అడుగుల శివుణ్ణి చూస్తూ అభిజిత్ విస్తుపోయి పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసాడు.
 
"అవును. ఆయనని బంగారు వర్ణంలో అలా ధ్యాన మూర్తిగా చూడటం వలన మీకు విగ్రహంలా కనిపిస్తున్నాడు. కొంత మంది యోగీంద్రులకు ఆయన తీసుకునే శ్వాస కూడా వినిపిస్తుంది. వాళ్ళ యోగసిద్ధి అలాంటిది మరి", అన్నాడా ముముక్షువు.
 
" పాదుకాతీర్థం తయారీలో వాడే పుప్పొడిని శివుని ఆలయంలో ఉన్న సువర్ణ పుష్పాల నుండే తీసుకుంటారని చెప్పారు స్వామి. సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు ఎక్కడుందో చెబుతారా?" అని అడిగాడు అభిజిత్.
 
ముముక్షువు వాళ్ళ ముగ్గురినీ ఒక చోటికి తీసుకువెళ్లాడు. అక్కడొక దేవతా వృక్షం ఉన్నది. దేవతా వృక్షానికే ఎన్నో సువర్ణ పుష్పాలున్నవి. వాటిని చూపిస్తూ ముముక్షువు ఇలా చెప్పాడు.
 
"సూర్యుని నామాలలోని ఒక నామమే పూషా. పోషించువాడు అని అర్థం. సమృద్ధిని ఇచ్చువాడు అని అర్థం. ద్వాదశ ఆదిత్యులలో ఒకడే పూషుడు. ఆయన నుండే సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు వచ్చింది. చెట్టుని కూడా సూర్య గణాలే అందించాయి", అన్నాడా ముముక్షువు.
 
ఇంతలో అక్కడికి సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు వచ్చారు. సైనికుల్ని చూడగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు సైనికులు కారు. ఇన్నాళ్లూ సైనికుల వేషధారణలో వాళ్ళని భ్రమింప జేసిన  కామరూపధారులు. అనగా రూపం కావాలంటే రూపం ధరించగల శక్తి సంపన్నులు వారు.
 
ఇద్దరు సైనికులూ వాళ్ళ రూపాల్ని వదిలేసి తమ సొంత రూపంలోకి వచ్చేసారు. వాళ్లిప్పుడు సైనికులలా లేరు. శంభల రాజ్యంలోని ఖరీదైన వస్త్రాలు ధరించి ఉన్నారు.
 
"నేను అనిరుద్ధుల వారి ఆస్థానంలోని మంత్రిని. నా పేరు  ఫాలనేత్రుడు. మా అమ్మ శివభక్తురాలు. అందుకే నాకు శివుని పేరే పెట్టింది", అన్నాడు మంత్రి.
 
"నేను అనిరుద్ధుల వారి రాజ్యంలోని సేనాధిపతిని. నా పేరు   రుద్రసముద్భవ ", అన్నాడా సేనాధిపతి.
 
"మిమ్మల్ని పరీక్షించనిదే మీకు శంభల రాజ్యంలోని యుద్ధ విద్యలు నేర్పటం అసాధ్యం. మీకా యోగ్యత లేనిచో విద్యలు మీకు నేర్పినా అవి సిద్ధించవు. అందుకే మేము ఎప్పటికప్పుడు సిద్ధపురుషుడితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడు మాకు మీ మీద నమ్మకం కలిగినది. ఇక శంభల రాజ్యానికి బయలుదేరుదామా?" అని అడిగాడు ఫాలనేత్రుడు.
 
శివునికి నమస్కరించి ఆలయం నుండి బయటికొచ్చేశారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
సిద్ధపురుషుడు, రుద్రసముద్భవ, ఫాలనేత్రుడు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది.
 
అప్పుడే అక్కడికో  ఖగరథము వచ్చినది.
 
"భూలోకంలో మీరు చూసే విమానాల కంటే 1000 రేట్లు వేగంతో ఖగరథ గమనం ఉంటుంది.
 
ఇలాంటివి శంభల రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి", అంటూ ఖగరథంలోకి వాళ్ళను ఆహ్వానిస్తూ అన్నాడు మంత్రి ఐన ఫాలనేత్రుడు.
 
భూలోకంలోని విమానానికి రెట్టింపు పరిమాణంలో ఉందా  ఖగరథం. బయటి నుండి చూసే వాళ్లకి బంగారు విమానంలా ఉంది. భూలోకంలోని విమానాలకు ఉన్నట్టే ఖగరథానికి రెక్కలున్నాయి కానీ అవి గాలిలో ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకునేలా వెసలుబాటు ఉంది. ఒక్క సారి భూమ్మీదకు దిగిన తర్వాత రెక్కలు ఇక కనిపించవు. అలా అమర్చారు వాటిని.
 
శంభల నగరంలో చిట్టచివరి ప్రాకారం ఐన  చింతామణి గృహంలోకి అడుగుపెట్టడానికి అనుమతి, అర్హత లేకపోవటం వల్ల అభిజిత్, అంకిత, సంజయ్ లు  శివుని ఆలయం నుండి ఖగరథంలో  శంభల రాజ్యానికి పయనమయ్యారు. సిద్ధపురుషుడు కూడా వారితో పాటే వస్తున్నాడు.
 
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవ ఎంతో ఆనందంగా ఒక కార్యాన్ని పూర్తిచేసినట్టు గర్వంతో విజయదరహాసం చేస్తున్నారు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 9 - by k3vv3 - 07-05-2024, 07:10 PM



Users browsing this thread: 1 Guest(s)