Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#16
(16)

సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. హారర్ మొదలవ్వగానే ప్రియ నా చేయి పట్టుకుంది. సినిమ అయినంత వరకు వదల్లేదు. సినిమా అయిపోయాక మేము కింద ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ తినేసి ఇంటికి వెళ్దామనుకున్నాము. ఫుడ్ కోర్ట్ కి వెళ్లి:

"స్వీటీ.....ఎలా అనిపించింది నీకు సినిమ??"

"బాగుంది..సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎక్ష్పెక్త్ చేయలేదు..."

"య అవును......చాల బాగా ఇచ్చాడు ట్విస్ట్"

కొంచెం సేపు నిస్సబ్దం

"నువ్వు మాత్రం చాలా గట్టిగ పట్టుకున్నవేనా చేతిని, ఒక సీన్ అప్పుడు......"

"అవునా ??" అని నువ్వుతూ అడిగింది.

తన మాటల బట్టి చూస్తే ప్రియ ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది నాతో.

"యా....."

"సారీ సంజు......"

"ఇట్స్ ఒకే"

ఆఫర్ ఉందంటే ఇద్దరం ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇలా ఇద్దరం కలసి షేర్ చేసుకోవటం ఫస్ట్ టైం. ఇద్దరం ఆలా ఒక చిన్న టేబుల్ మీద కూర్చొని ఆలా తినటం.

ఇన్ని సందర్భాలలో తనను ఇంత ఫ్రీ గా చూసింది మొదటి సరి. తనతో ఇలా సమయం గడపడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. తను ఇప్పుడు బాగా తెలిసిన వ్యక్తి లాగా అనిపిస్తుంది. రోజు రోజు కి తన పైన ఇష్టం అలాగే అట్రాక్షన్ నాకు పెరుగుతున్నాయి. తనతో ఇలాగె రోజు గడపాలనిపిస్తుంది. తన తీయటి మాటలు, వింత చేష్టలు, మూసి మూసి నవ్వులు, మొహం పై చిరు కోపం అన్నిటిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

తినేసి కారులో ప్రియని ఇంట్లో దింపాను. తను నాకు ఒక కవర్లో తన జాకెట్ ఇచ్చింది. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్లి కార్ పెట్టేసి, నా అపార్ట్మెంట్ కి చేరుకున్నాను. ఆ రోజు రాత్రి తన గురించే ఆలోచనలన్నీ తన గురించే అన్ని ఉహించుకున్నాను.

ప్రియ తో ఇంకా పెళ్లి దాకా కలవకూడదని అనుకున్నాను. ఎందుకంటే, తనని కలిసినప్పుడల్లా సంతోషం, తర్వాత అప్పుడుదే సమయం అయిపోయిందని బాధ. తన పై ఎన్ని ఫీలింగ్స్ ఉన్న కంట్రోల్ చేసుకోవలసి వస్తుంది. తనని ముద్దుపెట్టుకోవాలని, కానీ ఏమి చేయలేని పరిస్థితి. తనను కలసి నప్పుడల్లా హోమ్ సిక్ గా ఫీల్ అయ్యినట్లు "ప్రియ సిక్" అయిపోతున్నాను. పోయిన సరి కూడా అంతే. తనని కలసిన తర్వాత భయంకరమైన ఊహలు, తన పై కంట్రోల్ చేసుకోలేని అట్రాక్షన్.

పెళ్లయ్యాక తనతో బాగా ఫ్రీగా ఉండొచ్చు. తనతో చెప్పి నా కోరికలన్నీ తీర్చుకోవచ్చు. రోజు తనతో సమయం గడపొచ్చు. తనతో చాల క్లోస్ గా సరదాగా ఉండొచ్చు. ఇద్దరం కలసి మాకు కావలసిన విధంగా జీవించొచ్చు. తనతో నా ఫీలింగ్స్ అన్ని ఫ్రీగా చెప్పుకోవచ్చు, తనతో దగ్గరగా సమయాన్ని గడపొచ్చు. ఎన్ని సార్లైనా ముద్దులుపెట్టొచ్చు, చిలిపి పనులు చేయొచ్చు, తన అందాల్ని కళ్ళార్పకుండా చూడొచ్చు, ఇద్దరం కలసి ఎప్పుడు కావాలన్న బయటకి వెళ్లొచ్చు, చాటింగ్ చేయొచ్చు, పిచ్చి పిచ్చి మెసేజీలు పెట్టొచ్చు, తనతో రొమాన్స్ చేయొచ్చు....

కానీ ఇప్పుడు మాత్రం, కేవలం ఊహలు మాత్రమే. అందుకే ఇక పెళ్లయ్యేదాకా నిజమైన కారణం ఉంటె తప్ప ప్రియను కలవకూడదని అనుకున్నాను. ఎందుకంటే రోజు రోజు కి తనను తలచుకొని ఒక పిచ్చివాడినైపోతున్నాను. తను ఆలా పక్కనుంటే చాలు ఏదో చెప్పలేని ఒక బలమైన ఫీలింగ్ నాకు.

టు బె కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 3 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:26 AM



Users browsing this thread: 1 Guest(s)