Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
మన తెలుగు , సాహిత్యం , చరిత్ర
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
సోదర సోదరీమణులకు మరియు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు.
Posts: 9,619
Threads: 1
Likes Received: 9,451 in 5,591 posts
Likes Given: 58,651
Joined: Nov 2018
Reputation:
137
మీకు మీ కుటుంబ సభ్యులకు, ఈ ఫోరమ్ నిర్వాహకులకు, పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలు
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ
అంటే ఏమిటి?
Posts: 6,369
Threads: 0
Likes Received: 2,842 in 1,908 posts
Likes Given: 1,730
Joined: Jul 2021
Reputation:
35
Plz, continue even it a history or culture also, we can read if it is interesting plz
Posts: 245
Threads: 2
Likes Received: 428 in 152 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
15
namaskaram sair
nijam ga chala goppa alochana sir
please continue mana telugu bashani marachipokunda inka meelaanti vaallu unnaru kabatte enno vishayalu telusukune avakasam undi
telugu vyakaranak enta gopppagaa untundi, telugu padyalu enta ruchi ga untaaye, goppa saahityam unna telugu paatalu inka ela cheppukuntuu poote enni enni unnayoo
desa bahalandu telugu goppa, maatelugu talli kee malle pudanda
Posts: 154
Threads: 0
Likes Received: 148 in 92 posts
Likes Given: 170
Joined: Aug 2025
Reputation:
1
చాలా మంచి ఆలోచన.. పర్యాయ పదాలు, సామెతలు అసలు వినపడటం లేదు ఈ మథ్య.. వీటితో పాటుగా సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెలియచేస్తూ వుండండి
(This post was last modified: 22-10-2026, 05:54 AM by
Milkboy76. Edited 1 time in total.)
Posts: 428
Threads: 1
Likes Received: 1,376 in 383 posts
Likes Given: 3,488
Joined: Dec 2021
Reputation:
20
ఈ సామెత వెనుక ఉన్న పూర్తి భావం ఇది:
• కుదిరితే ఆరామడ: ఏదైనా ఒక విషయం లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కుదిరితే (అనుకూలిస్తే), వారు చాలా దగ్గరవుతారు. అంటే దూరం కేవలం 'ఆరామడ' (సగం ఆమడ) అన్నంత తక్కువగా, ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది.
• చెదిరితే పన్నెండామడ: అదే బంధం లేదా కార్యం చెడిపోతే (వికటిస్తే), వారి మధ్య దూరం లేదా మనస్పర్థలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంతగా అంటే, అసలు అందుకోలేనంత 'పన్నెండు ఆమడల' దూరానికి వెళ్ళిపోతారు.
ఇక్కడ ఆమడ అనేది పూర్వకాలంలో దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలత (ఒక ఆమడ అంటే సుమారు 8 నుండి 10 కిలోమీటర్లు
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
"కామినీ కాయ కాంతారే కుచ పర్వత దుర్గమే |
మా సంచర మన: పాంథ! తత్రాస్తే స్మర తస్కర: ||"
భావం:
ఓ మనసనే బాటసారీ! స్త్రీ శరీరం అనే అడవిలో, ఆమె వక్షస్థలం అనే పర్వతాలు దుర్గమమైన కోటల్లా ఉంటాయి.
ఆ అడవిలో నువ్వు సంచరించవద్దు. ఎందుకంటే, అక్కడ 'స్మరుడు' (మన్మథుడు) అనే దొంగ కాపుకాచి ఉంటాడు, నిన్ను దోచుకుంటాడు జాగ్రత్త!
అర్థం:
ఇక్కడ స్త్రీ శరీరాన్ని ఒక కఠినమైన అటవీ ప్రాంతంతో, స్త్రీ కుచాలను పర్వతాలతో పోల్చి...
మనసును ఆ అడవిలో తిరిగే బాటసారితో, మన్మథుడిని దొంగతో పోల్చడం జరిగింది.
(This post was last modified: 23-10-2026, 10:51 PM by
తెలుగోడు. Edited 1 time in total.)
Posts: 245
Threads: 2
Likes Received: 428 in 152 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
15
అయ్యా మీ వ్యాకరణం భావం చదువుతున్న నా చిన్నతనం మా తెలుగు మాస్టారు తెలుగు వ్యాకరణం గుర్తుకు వస్తున్నాయి నేను సాహిత్యం పిచోణ్ని మన తెలుగు లో ఎన్నో మంచి సాహిత్యం విలువలు ఉన్న పాటలు ఉన్నాయి నేను ఎక్కువగా ఆ పాత మధురాలు వింటా
హిందీ సహితయం కూడా నాకు చాల చాల ఇష్టం
మా తెలుగు మాస్టారు నేను 10 వ తరగతి చదివే సమయం లో ఒక పదాన్ని విడదీసి సంధి సూత్రం చెప్పామన్నారు ఛందస్సు చాల చాల హాయిగా ఉండేది
పూబోడి
మొత్తం క్లాస్ అంతా చెప్పలేక పోయాం
Posts: 428
Threads: 1
Likes Received: 1,376 in 383 posts
Likes Given: 3,488
Joined: Dec 2021
Reputation:
20
నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగా మోహావేశమ్ |
ఏతన్మాంస వసాది వికారం, మనసి విచింతయ వారం వారమ్ ||
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
శ్లోక భావం:
స్త్రీల అందమైన చనుమొనలు (స్తనములు) మరియు నాభి దేశాన్ని చూసి మోహంలో పడిపోకుమా!
(ఓ మనసా!) ఇది కేవలం మాంసము, కొవ్వు (వసా) మొదలైన పదార్థాల వికారమే (మార్పు మాత్రమే) అని నీ మనసులో మాటిమాటికీ ఆలోచించుకో.
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
1) సంయుక్తాక్షరాలు,
2) ద్విత్వాక్షరాలు,
3) సంశ్లేషాక్షరాలు
1) సంయుక్తాక్షరాలు:
తెలుగు వ్యాకరణంలో ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని 'సంయుక్తాక్షరం' అని అంటారు.
ఉదాహరణలు: మార్చి, విశ్వాసము, చిహ్నము.
2) ద్విత్వాక్షరాలు:
ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరితే 'ద్విత్వాక్షరం' ఏర్పడుతుంది.
ఉదాహరణలు: అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు.
3) సంశ్లేషాక్షరాలు:
ఒక హల్లునకు వేరొక రెండు హల్లుల ఒత్తులు వచ్చి చేరితే దానిని ‘సంశ్లేషాక్షరాలు’ అంటారు.
ఉదాహరణలు: స్వాతంత్ర్యము ( త్ర్య ), స్త్రీ, రాష్ట్రము, జోత్స్న, అర్ఘ్యము
Posts: 9
Threads: 1
Likes Received: 22 in 7 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
తెలుగు వ్యాకరణం ప్రకారం పదాలను ప్రధానంగా 4 రకాలుగా విభజించారు.
1) తత్సమము
2) తద్భవము
3) దేశ్యము
4) అన్యదేశ్యము
1) తత్సమము:
సంస్కృత, ప్రాకృత పదాలకు తెలుగు విభక్తులు చేరగా ఏర్పడే పదాలు
సంస్కృత, ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు. సంస్కృత, ప్రాకృత శబ్దాల ప్రాతిపదికలపై తెలుగు విభక్తి ప్రత్యయాన్ని చేర్చడంవలన తత్సమం ఏర్పడుతుంది. వీటినే ప్రకృతులు అంటారు.
(ఉదాహరణ: బాలః – బాలురు, పుస్తకమ్ - పుస్తకము)
2) తద్భవము:
సంస్కృత, ప్రాకృత పదాలు కొద్ది మార్పులతో తెలుగులోకి వచ్చినవి
సంస్కృత, ప్రాకృత భవంబగు భాష తద్భవము. సంస్కృత, ప్రాకృత పదాల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదాలను తద్భవాలు అంటారు. వీటినే వికృతులు అంటారు.
(ఉదాహరణ: యజ్ఞము → జన్నము , పంక్తి → బంతి , విద్య → విద్దె).
3) దేశ్యము:
తెలుగు ప్రాంతాలలో పుట్టి, స్వతంత్రంగా వాడుకలో ఉన్న పదాలు
తత్సమం, తద్భవాలుకాక, తెలుగుదేశంలో వాడుకలో ఉన్న పదాలను దేశ్యాలు అంటారు.
(ఉదాహరణ: పీట, చెట్టు , నీరు మొదలైనవి.).
4) అన్యదేశ్యము:
ఇతర భాషలకు చెందినవై, తెలుగులో వాడబడుతున్న పదాలను అన్యదేశ్యాలు అంటారు.
ఇంగ్లీష్, అరబీ, ఉర్దూ వంటి ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన పదాలు
(ఉదాహరణ: స్టేషను, రోడ్డు ,పెన్ను, ఖుషీ మొదలైనవి ).
(This post was last modified: 23-11-2026, 10:11 AM by
తెలుగోడు. Edited 1 time in total.)