Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" మా ముగ్గురికి మీరంటే చాలా ఇష్టం.మీరు వెళ్ళిపోతున్నారని తెలిసి,ఒక్కసారి కలుద్దామని వచ్చాము" (భారమైన గొంతుతో)స్టోరీస్.

మాలతి కళ్ళలో అదే ఆశ్చర్యం
" అలా టన్నులు టన్నులు కొద్ది ఆశ్చర్యపోకండి...తప్పుగా అనుకోకుంటే,మాకు మీ గురించి,శివా గురించి అంతా తెలుసు..."(చిరునవ్వుతో) కమల్
ఆ ముగ్గురిని నఖశిఖపర్యంతం ఒక్కసారి మాలతి చూసింది.తనకేమి అర్థం కావడం లేదు.శివ సంగతి ఒక్క సుధకు తప్ప వేరెవరికీ తెలీదు.....అలాంటిది...వీరికెలా తెలుసు....? చూడ్డానికి మర్యాదస్థులులా ఉన్నారు..కొంపదీసి శివా రాయభారం పంపాడా...?????.లేక....లేక బ్లాక్ మెయిల్??????? ఈ అలోచన రాగానే మాలతికు చిరుచెమటలు పట్టాయి...
కానీ ఆ మువ్వురి కళ్ళలో అలాంటిదేమీ కనబడ లేదు.అవి తనను అభిమానంగా, ప్రేమగా చూస్తున్నాయి.....
" ఒక్కటి అడగవొచ్చా.......?" కమల్
" ఏంటీ " అన్నట్టు, తనని చూసింది.
" మీరు....మీరు శివాను అస్యహించుకుంటున్నారా....?"
" అబ్బే లేదండి....మీకందరి కంటే చిన్నదానను....మీకు విడమరచి చెప్పేటంత,అనుభవం నాకు లేదు......ఒక తప్పటడుగు..... ఎక్కడో చోట ఆగిపోతే, మంచిదని అనిపించింది...."
మాలతి కళ్ళలో నీరు పొంగింది.
తాను వెళ్ళే ట్రయిన్ వస్తున్నట్టు అనౌన్స్ మెంటు వినబడింది.........నలుగురి మధ్య మౌనం ఏలుతోంది.......
ముగ్గురికి ఇక మాలతి కనబడదనే ఆవేధన...
మాలతికి శాశ్వతంగా ఆ ఊరు వదలిపోయే సమయం ఆసన్నమయ్యిందనే బాధ............
ట్రయిన్ ఫ్లాట్ ఫారం మీదకు వచ్చింది.......
పిల్లలను నిద్రలేపింది...ఇంతలో గిరీశం మాలతి సూట్ కేసు, ట్రావల్ బ్యాగ్ చేత పుచ్చుకున్నాడు.స్టోరీస్ హారతిని భుజాన వేసుకున్నాడు.మాలతి నిద్రలో జోగుతున్న కౌసీ చెయ్యిపట్టుకుని ఎక్కాల్సిన భొగి వైపు సాగారు.భొగీలో లగేజి జాగ్రత్తగా సర్ది, మాలతికి జాగ్రత్తలు చెబుతుండగా, కమల్ రెండు వాటర్ బాటిల్స్ , బిస్కెట్ ప్యాకెట్లుతో కిటికీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు....సిగ్నల్ పడింది........ట్రెయిన్ భారంగా ఒక కుదుపుతో బయలుదేరింది....బండి కదలిక పసిగట్టిన ఇద్దరు లోపల నుండి క్రిందకు వచ్చే హడావుడిలో ఉన్నారు......
కిటికీ దగ్గర ఉన్న కమల్ ట్రెయిన్ తో బాటు అడుగులేస్తూ,మాలతిని ఆర్తిగా చూస్తూ,
" మాలతిగారు.........ఇక ఉంటాను" అంటూ,తనకు తెలియకుండానే కరచాలం కోసం చెయ్యి చాపాడు..
"సంకోచం,తొట్రుపాటులేకుండా మాలతి పెదవులమీద తెచ్చిపెట్టుకుని చిరునవ్వుతో,
" థాంక్స్ అండి" కరచాలం చేసింది.
ఆ సుతిమెత్తని వ్రేళ్ళ స్పర్శకోసం, ఇన్నాళ్ళు తాను వేచి ఉన్నట్టూ,అనుకోనీ ఈ అనుభూతికి పిలవని పెరంటంలా రెండు కన్నిటి బొట్లు కమల్ కళ్ళలో తొంగి చూశాయి......
నీరు నిండిన కళ్ళలో,మాలతి ముఖం మసకబారింది.....
రైలు వేగం పుంజుకుంది......





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 04:31 PM



Users browsing this thread: 2 Guest(s)