Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కన్నయ్యా , బంగారుతల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అమ్మ మాటలు వినిపించడంతో చెల్లి పూలతో decorate చేసిన లోపలివైపు చూసింది . ఏటవాలు పెట్టిన మొబైల్ లో జరిగిందంతా వీక్షించి పరవశించిపోతూ ఆనందబాస్పాలతో అమ్మ విష్ చేసింది .

నాచేతిని పట్టుకొని లోపలికి పిలుచుకొనివెళ్లి నా గుండెలపై వాలి మొబైల్ అందుకొని అమ్మతో వీడియో కాల్ లో లవ్ యు అమ్మా , మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము . 

అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ ను నా జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను అమ్మా అని చుట్టూ పైన చూపించి , లవ్ యు అన్నయ్యా అంటూ నా బుగ్గపై కొరికేసింది . అమ్మా స్స్స్.........అని రుద్దుకోవడం చూసి చెల్లితోపాటు అమ్మకూడా నవ్వేసింది . ఇంతలో చెల్లి మొబైల్ కూడా మ్రోగడంతో చూస్తే అమ్మమ్మ కూడా వీడియో కాల్ చేసింది . 

బుజ్జికన్నా , తల్లి మా ప్రాణమైన కవలలకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అనిచెప్పింది . ప్రక్కనే ఉన్న అత్తయ్య కూడా విష్ చేసి మహేష్ మహి మీరు ఇక్కడ ఉన్నారు చూస్తుంటే స్వర్గంలో విహరిస్తున్నట్లున్నారు అని అడిగింది . అవును చుట్టూ వెలిగిపోతోంది అని ఆశ్చర్యపోయి అమ్మమ్మ కూడా అడిగింది .

అవును అత్తయ్యా , అమ్మమ్మా .......అన్నయ్య పుట్టినరోజు సర్ప్రైజ్ ఇవ్వడానికి స్వర్గాన్నే నాముందుకు తీసుకొచ్చాడు అంటూ తననుఎలా మోసం చేసానో కూడా చెప్పింది . నువ్వంటే ప్రాణం రా మీ అన్నయ్యకి నీతో కాకుండా ఇంకెవరితో చిలిపి పనులు చేస్తాడు చెప్పు అని చెప్పడంతో , లవ్ యు అన్నయ్యా అంటూ నాకళ్ళల్లోకే కొత్తగా ప్రేమకు పీక్స్ అనేలా చూస్తోంది . 

తల్లి మీ అన్నయ్యను చూసింది చాలు ప్రక్కనే ఉంటాడు కదా జీవితాంతం చూసుకోవచ్చు . కేక్ కట్ చేస్తే మేము నిద్రపోవాలి అని చిలిపి నవ్వుతో చెప్పింది . 

పో అమ్మమ్మా నా అన్నయ్య నా ఇష్టం కావాలంటే కొరుక్కుని తినేస్తాను అంటూ మళ్లీ నా బుగ్గను కొరికేసింది . అమ్మమ్మా ఉదయం నుండి ఇది పదోసారేమో కొరికేస్తోంది . అయినా బాగుందనుకో అని చెప్పడంతో అందరూ కళ్ళల్లో నీల్లువచ్చేలా నవ్వుకుని ,

కేక్ దగ్గరకు వెళ్లి అమ్మా , అమ్మమ్మా మరియు అత్తయ్యా చూసేలా ఎదురుగా మొబైల్స్ ఉంచి , మీ ప్రాణానికి ప్రాణమైన మేమిద్దరమూ కలిసి జరుపుకుంటున్న తొలి birthday అంటూ ఒకే ఒక క్యాండిల్ ను వెలిగించాను . ఇద్దరమూ ఒకరినొకరు చూసుకొని సంతోషంతో నవ్వుకుని కత్తి అందుకొని మొబైల్ లో ముగ్గురితోపాటు నేను చెల్లికి ,చెల్లి నాకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ముఖాలకు పూసుకోవడం చూసి వాళ్ళ ఆనందాలకు అవధులే లేవు . 

చెల్లి భుజం చుట్టూ చేయివేసి హత్తుకొని ముగ్గురికీ కేక్ ఆనందించాము . కొద్దిసేపు మాట్లాడి చివరన మరొకసారి విష్ చేసి ఉదయం కాల్ చేస్తాము గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశారు .

అన్నయ్యా జీవితంలో ఇప్పటివరకూ ఫీల్ అవ్వని ఆనందాన్ని పొందుతున్నాను అంటూ నా చేతిని అందుకొని ముందుకు నడుస్తూ పూలను decoration ను చేతితో తాకి మురిసిపోతోంది . ఇంకా ఆకాశంలో క్రాకర్స్ వెలుగులు విరజిమ్ముతూనే ఉండటంతో , చివరగా మిగిలిన పూల బుట్టలోని పూలతో గోడ ముందు కూర్చోవడానికి అనుకూలం చేసి అన్నయ్యా ఇక్కడే కూర్చొని ఆకాశంలోకి చూస్తూనే ఉండాలని ఉంది అని కోరింది . లవ్లీ అంటూ కూర్చున్నాను , లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అంటూ నా ప్రక్కనే కూర్చుని గుండెలపై వాలిపోయి రెండుచేతులతో నన్ను చుట్టేసింది .

ఆకాశంలో ఒక్కొక్క క్రాకర్ ఒక్కొక్కవిధమైన స్పార్కిల్ వెదజల్లుతుంటే చెల్లి కన్నార్పకుండా చూస్తూ అన్నయ్యా అక్కడ ఇటు అంటూ వేలితో చూపించి మురిసిపోతోంది . ఇద్దరమూ అలా చాలాసేపు మాటల్లో మునిగిపోయాము . అన్నయ్యా అన్నయ్యా అన్న..... య్యా........happy....... birthday .......అంటూ పెదాలపై చిరునవ్వుతో సంతృప్తితో నిద్రలోకి జారుకుంది . సమయం ఉదయం 2 గంటలు దాటడంతో Happy birthday to you ఏంజెల్ అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ముద్దుపెట్టి , రెండు చేతులతో ఎత్తుకొని కింద రూంలోకి వచ్చి బెడ్ పై పడుకోబెట్టి ,నేను తన ప్రక్కన చేరేలోపు నా స్పర్శ తనకు తగలకపోయేసరికి , కళ్ళుతెరిచి నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకు అంటూ లేచిమరీ నామీదకు ఎగిరి నా గుండెలపైనే నిద్రపోయింది . 

నా ప్రాణాన్ని వదిలి నేనెక్కడికి వెళతాను అంటూ muddhupetti తనను ఎత్తుకునే వెనక్కు బెడ్ పై వాలిపోయాను . మ్మ్మ్.......ఇలాగే అంటూ బెడ్ మీదకు జరిగి ఒక చేతిని నా షర్ట్ లోపలికి దూర్చి మరొక చేత్తొ నన్ను చుట్టేసి గుండెలపై హాయిగా నిద్రపోయింది . లవ్ యు రా అంటూ కురులపై ముద్దుపెట్టి భుజంపై జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాము.

తలుపులు కొట్టిన శబ్దం మరియు రేయ్ మామా అంటూ వినీత్ గాడి మాటలు వినిపించడంతో సడెన్ గా మెలకువవచ్చింది . సమయం చూస్తే 9 గంటలు అవుతోంది . ఈసారి వాడి మాటలతోపాటు మహి అని ప్తెసిడెంట్ మాటలు కూడా వినిపించడంతో , చెల్లికూడా సడెన్ గా లేచి ప్రమీలా అని సగం కళ్ళతో మాట్లాడింది .

అవును చెల్లి బయట ఉన్నారు అని ఇద్దరమూ లేచి బెడ్ దిగాము . అన్నయ్యా అందరూ వచ్చేసారేమో వెళ్ళిచూడు నేను రెడీ అవుతాను అని కొత్తబట్టలు తీసుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది . నేను పరుగున కిందకువచ్చి తలుపు తీసాను . 

Happy birthday రా మామా అంటూ ఫ్రెండ్స్ అంతా నామీదకు దూకి కౌగిలించుకొని విష్ చేశారు . మహేష్ ఎంతసేపటి నుండి పిలుస్తున్నాము , తలుపు కోరుతున్నాము , కాల్స్ చేస్తున్నాము , పాపం కృష్ణగాడు తెల్లవారుఘాము నుండి చేస్తున్నాడట విష్ చెయ్యడానికి , ఇంతకీ మొబైల్ ఎక్కడ పెట్టావు అని ఒకడు అడిగాడు . రేయ్ పైన మేడ మీదనే రాత్రి మరిచిపోయానురా అందరూ కూర్చోండి అంటూ పైకి పరిగెత్తాను .మొబైల్ అందుకొని చూస్తే వందల్లో missed కాల్స్ కృష్ణగాడి నుండి , దివ్యక్క , కిషోర్ బావ నుండి మరియు సీఎం PA నుండి కూడా వచ్చాయి . ఒక్కొక్కరికే చేసి sorry చెప్పి విషెస్ అందుకున్నాను . 

కిందకువచ్చి ఫ్రెండ్స్ ఫీల్ కంఫర్టబుల్ అనిచెప్పి బట్టలతోపాటు గెస్ట్ రూంలోకి వెళ్లి తల స్నానం చెయ్యసాగాను . చెల్లి కొత్తబట్టలతో birthday ఏంజెల్ లా కిందకువచ్చింది . ఫ్రెండ్స్ అంతా విష్ చెయ్యడంతో థాంక్స్ అంటూ మురిసిపోయింది . ప్రమీలను బయటకు పిలుచుకొనివెళ్లి ఏంటే తెచ్చావా అని అడిగింది . నువ్వు చెప్పిన అన్నిరకాల పూలు మరియు decoration క్యాండీల్స్ మిగతావన్నీ కారులో ఉన్నాయి అని బదులిచ్చింది . అన్నింటినీ అన్నయ్యకు తెలియకుండా పైన రూంలోకి మార్చేయ్యాలి అని తన ఫ్రెండ్స్ కు అవి ఏమో చెప్పకుండా సైలెంట్ గా పైకి తీసుకెళ్లి పూలు ఏమీ అవ్వకుండా తడి గుడ్డలోకి మార్చేసి హమ్మయ్యా ఒక పని ఫినిష్ అంటూ కిందకువచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నారు . 

స్నానం చేసి వచ్చి decoration అన్నయ్యకు కాల్ చేసి 100 మందివరకూ టిఫిన్ మరియు మధ్యాహ్నం లంచ్ కు కేటరింగ్ ఏర్పాటుచేయ్యగలరా అని అడిగాను . ఇదిగో పంపించేస్తున్నాను అంటూ నేను బట్టలువేసుకొని రెడీ అయ్యి వచ్చేలోపల ఇంటి నిండా మరియు కాంపౌండ్ మొత్తం ఫ్రెండ్స్ తో నిండిపోయింది . 

డాక్టర్ అంటీ ఫ్యామిలీ కూడా వచ్చి చెల్లితో మాట్లాడుతున్నారు . దగ్గరకువెళ్లి అంటీ అంకుల్ ఆశీర్వాదం తీసుకొన్నాము . పుట్టినరోజు శుభాకాంక్షలు my dear లవ్లీ ట్విన్స్ అంటూ కౌగిలించుకొని విష్ చేశారు . 

బయటకువచ్చి ఫ్రెండ్స్ అందరి విషెస్ కు థాంక్స్ చెప్పి , అప్పుడే వచ్చిన అన్నను సంతోషం పట్టలేక కౌగిలించుకొని ఒకటా రెండా .........అన్నింటికీ చాలా చాలా థాంక్స్ అని చెప్పాను . మురిసిపోయి happy birthday మహేష్ అని చెప్పి , మీరు ఎంజాయ్ చెయ్యండి డిన్నర్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడంతో ,మళ్లీ థాంక్స్ అన్నా అంటూ ఫ్రెండ్స్ లో కలిసిపోయాను.

 మా ఫ్రెండ్స్ ఉత్సాహం చూసి అప్పటికప్పుడు dj తెప్పించారు . ప్రతి విషయంలో ఆ అన్నకు నేను ఋణపడిపోతున్నాను . ఇక dj సౌండ్ కు మావాళ్ళ ఉత్సాహం రెట్టింపు మూడింతలయ్యింది కూల్ డ్రింక్స్ స్ప్రే చేస్తూ ఎగురుతూనే ఉన్నారు  .  టిఫిన్ తయారవ్వడంతో చెల్లితోపాటు అంటీ వాళ్లకు లోపలికి పంపించి ఫ్రెండ్స్ తోపాటు తిన్నాము . అంటీ వాళ్ళు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యండి అని మరొకసారి విష్ చేసి సంతోషంతో వెళ్లిపోయారు .

ఈ ఏర్పాట్లను చూసి రాని ఫ్రెండ్స్ ను కూడా కాల్ చేసి పిలిచారు . 12 గంటలకల్లా అందరూ కేక్ లతోపాటు రావడంతో , గర్ల్స్ అంతా చెల్లివైపు బాయ్స్ అంతా నావైపుకు వచ్చి కేక్ కట్ చేయించి happy birthday మహి మహేష్ ట్విన్స్ అంటూ కేకలువేసి , స్ప్రే లు కొట్టి , గిఫ్ట్స్ ఇచ్చి, కేక్ ను తినిపించడం కంటే నాకు పూసి వాళ్ళల్లో వాళ్ళు పూసుకోవడంతోనే సరిపోయింది . మాఇద్దరితోపాటు సగం మంది ఫ్రెండ్స్ ముఖం కేక్ తో నిండిపోయింది . మధ్యాహ్నం రెండు గంటలు దాటినా ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు . 

ఆ కేరింతల మధ్యన మహి అక్కా మహి అక్కా అని చిన్న పిల్లలు లోపలికి రావడంతో , మా ఫ్రెండ్స్ అంతా వారికి దారి వదిలి పిల్లల వైపే చూస్తున్నారు . వెంటనే కొద్దిమంది వెళ్లి dj ఆఫ్ చేశారు . అప్పుడు మహి అక్కా అని ముద్దు పిలుపు వినిపించడంతో , బుజ్జి అంటూ మహి కర్చీఫ్ తో ముఖం తుడుచుకుని పరుగున వచ్చి అమ్మో నాకోసం వచ్చారా అంటూ కొంతమంది శరణాలయం పిల్లలను ఆప్యాయతతో హత్తుకొని ముద్దుచేసింది . 

పుట్టినరోజు శుభాకాంక్షలు మహి అక్కా అంటూ గిఫ్ట్ అందించారు . చెల్లి ఒక్కసారిగా ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు ........అంటూ బుగ్గలను స్పృశించి గిఫ్ట్ అందుకొని , చుట్టూ అందరమూ వాళ్లనే చూస్తుండటంతో , గిఫ్ట్ ఓపెన్ చేసింది . ఆరోజు సాయంత్రం మొత్తం పిల్లలందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోను ఫ్రేమ్ చేయించి ఉండటం చూసి కళ్ళల్లో చెమ్మతో బెస్ట్ గిఫ్ట్ బుజ్జాయిలూ అంటూ ఫోటోని గుండెలకు హత్తుకొని , అన్నయ్యా అని చేతిని చాపింది . వెళ్లి తనప్రక్కనే మోకాళ్లపై కూర్చున్నాను . గిఫ్ట్ నాకు అందించింది సంతోషంతో వాళ్ళ నుదుటిపై ముద్దుపెట్టి , 

మీ మహి అక్క పుట్టినరోజు అని ఎలా తెలిసింది అని అడిగాను . మహి ఫౌండేషన్ సైట్ లో చూసాము అన్నయ్యా .........పిల్లలందరి తరుపునా మీకు విష్ చెయ్యమని మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించారు . ఈ ఫోటో ఉందికదా ఇక అందరూ ఇక్కడికొచ్చి విష్ చేసినట్లే అని ముద్దుముద్దు మాటలతో బదులిచ్చారు . బుజ్జాయిలూ ఈరోజు మీ అక్కయ్యతోపాటు మీ అన్నయ్య పుట్టినరోజు కూడా ..........., అయ్యో అక్కయ్యా మీరు ట్విన్స్ కదా మరిచిపోయాము అని ఒకరినొకరు చూసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా ........., మీ అక్కయ్యకు గిఫ్ట్ తెచ్చారు మరి నాకు అని అడిగాను . పిల్లలంతా గుమికూడా ఏదో మాట్లాడుకుని నాచుట్టూ చేరి బుగ్గలపై ముద్దులుపెట్టారు . అమ్మో ఇన్ని costly గిఫ్ట్స్ నాకొసమే అనడంతో అందరూ నవ్వుకున్నారు . 

చెల్లి పిల్లలకు ఆకలి అవుతోందేమో మీరు లోపలికి వెళ్ళండి నేను పంపిస్తాను అని చెప్పడంతో , ఒక బుజ్జిని ఎత్తుకొని ఫ్రెండ్స్ తెచ్చిన ఇంకా ఓపెన్ చెయ్యని కేక్ తీసుకొని లోపలికి రండి అని పిలిచింది . చెల్లి ఫ్రెండ్స్ పిల్లలను ఎత్తుకొని అందరూ లోపలికివెళ్లి , చుట్టూ పిల్లలతో వాళ్ళతోనే కేక్ కట్ చేయించి అందరికీ సంతోషంతో తినిపించి మురిసిపోయింది . Dj కు పిల్లలు భయపడతారేమో అని మళ్ళీ on చెయ్యలేదు . పిల్లలతోపాటు అమ్మాయిలందరికీ వంటలన్నీ లోపలకు పంపించి ఫ్రెండ్స్ అందరమూ భోజనాలు చేసాము . 

రేయ్ మామా we enjoyed a lot , once again happy birthday మనం ఎప్పుడూ ఇలాగే కాలుస్తూ ఉండాలి అనిచెప్పి అమ్మాయిలతోపాటు గ్రూప్స్ గ్రూప్స్ ఆనందంతో వెళ్లారు . 4 గంటలకల్లా వినీత్ ప్రమీలా తప్ప అందరూ వెళ్లిపోయారు . మహి మహేష్ మేము కూడా వెళ్ళొస్తాము అనిచెప్పి కౌగిలించుకొని విష్ చేసి వెళ్లిపోయారు . అన్నయ్యా పిల్లలు కూడా వచ్చి చాలాసేపు అయ్యింది వెళ్లి వదిలిరా , నేను అంతలోపు ఫ్రెష్ అవుతాను అని పిల్లలను హత్తుకొని నాకోసం వచ్చినందుకు చాలా థాంక్స్ కానీ , మీరు రావాలనుకుంటే నా నెంబర్ ఉందికదా కాల్ చెయ్యండి నేనైనా మీ దగ్గరికి వస్తాను లేకపోతే అన్నయ్య మిమ్మల్ని నాదగ్గరకు పిలుచుకొనివస్తారు సరేనా అని చెప్పింది . అలాగే అక్కయ్యా బై అంటూ నాతోపాటు బయటకువచ్చారు . 

తలుపు ముందుకువేసి పిల్లలను కారులో కూర్చోబెట్టి డోర్స్ చెక్ చేసిమరీ క్లోజ్ చేసి గేట్ దగ్గరికి కారులో వచ్చి నేను వచ్చేన్తవరకూ ఏ ఒక్కరినీ లోపలికి వదలొద్దు జాగ్రత్తగా వాచ్ చెయ్యండి అనిచెప్పి పిల్లలు ఉన్నందువల్ల నెమ్మదిగానే డ్రైవ్ చేసాను . సెంటర్ లోకి వెళ్లి శరణాలయం లోని పిల్లలందరికీ స్వీట్స్ తీసుకొని చేరుకున్నాము . పిల్లలను పెద్దవాళ్లకు అప్పగించి స్వీట్స్ అందరికీ పంచమని చెప్పాను . నాతోపాటు వచ్చిన పిల్లలు చెప్పడంతో నాకు విష్ చేసి అక్కయ్యకు కూడా చెప్పండి అని చెప్పారు . అందరికీ థాంక్స్ మరియు లవ్ యు అనిచెప్పి ఇంటికి చేరుకునేసరికి 5:30 అయ్యింది .

సెక్యూరిటీతో ఎవ్వరూ రాలేదని తెలుసుకొని లోపలకువచ్చి వదిలివెళ్లిన కేక్ బాక్సస్ ఇంట్లో పిల్లలకు తీసుకువెళ్లండి అని ఇచ్చాను . Happy birthday బాబు అని చెప్పారు , థాంక్స్ అన్నా అని నవ్వి లోపలికివచ్చి తలుపు తీసుకొని లోపలికి అడుగుపెట్టగానే , మొబైల్ కు మెసేజ్ రావడంతో తీసి చూస్తే చెల్లి నుండి ఓపెన్ చేసాను . అన్నయ్యా గెస్ట్ రూంలో కొత్తబట్టలు ఉంచాను స్నానం చేసి వేసుకొని హాల్ లో కూర్చో వచ్చేస్తాను . నేను చెప్పేంతవరకూ హాల్ లోనే కూర్చోవాలి లవ్ యు . .............as you wish రా అంటూ గెస్ట్ రూమ్ లోకి వెళ్లి బట్టలను చూసి చిరునవ్వుతో బాత్రూమ్లోకివెళ్లి కేక్ స్మెల్ మొత్తం పోయేలా సుమారు అర గంటపాటు తలస్నానం చేసి టవల్ తో తుదుచుకొని కొత్తబట్టలు వేసుకొని చెల్లి ఆర్డర్ మేరకు హాల్ లోనే స్టెప్స్ వైపు తిరిగి పేపర్ చూస్తూ కూర్చున్నాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2019, 09:56 AM



Users browsing this thread: 24 Guest(s)