Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భవానీ
#1
Heart 
హలో ఫ్రెండ్స్,
ఒకప్పుడు, చాలాకాలం క్రితం అభిసారికలో కథలు వ్రాసాను.  మళ్ళీ ఇన్నాళ్ళకు  కథ  వ్రాయాలనే కండూతి మొదలయ్యింది. ఫలితంగా ఈ కథ పుట్టింది.

మీ
వ్యాస్


భవానీ
వ్యాస్
పొండిచ్చేరిలో మెడిసిన్ చదువుతున్న  రోజులవి.  మేముండేది చెన్నై మైలాపూర్లో అయినా, చిన్నప్పటినుండీ వున్న ఇష్టంవల్ల, మద్రాస్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా చేరకుండా, నేను పొండిచ్చేరి jipmerని ఎన్నిక చేసుకున్నాను. ఆ రోజుల్లో మైలాపూర్ లో ఎక్కువగా, అంటే, 90% బ్రాహ్మణులుండేవారు. మగవాళ్ళు పిలకలు ముడివేసుకుని, ఆడవాళ్ళు పట్టుతో కలిపి నేసిన నేత చీరలు గోచీ పోసి కట్టుకునే రోజులవి. బిళ్ళ గోచీ అని కచ్చపోసిన గోచీ అనీ అంటారు. పుట్టిపెరిగింది మైలాపూర్ లో అవ్వడం వల్లా, చుట్టుపక్కల వుండేవాళ్ళ కట్టూ బొట్టూ, ఆచార వ్యవహారాలు గమనిస్తూ వుండే స్వభావం కలవాణ్ణి కనుకా , చిన్నప్పటినుండీ  నాలో కొన్ని అభిప్రాయాలు బలంగా నాటుకుపోయాయి. అవి ఇప్పటికీ మారలేదు. ఇప్పుడెన్ని రకాల ఫ్యాషన్స్ వచ్చినా, అప్పటి గోచీకట్టు అందమే వేరు. కనిపించి కనువిందుచేసే మధ్య ప్రదేశ్ అంటే నడుమూ, కనిపించకుండా బిగించి కట్టిన ఎత్తులూ చాలా ఆకర్షణీయంగా వుండేవి. ఇప్పటిలా జీరో సైజ్ ఆడవాళ్ళు కనిపించేవారే కాదు.   పుష్టిగా, నిండుగా వుండేవాళ్లు.  వాళ్ళ మాటల్లో,  అమాయకత్వంతో కూడిన గడుసుదనం  వుండేది. కాటుక పెట్టిన కళ్ళూ, తాంబూలపు ఎరుపుతో ఎరుపెక్కిన పెదాలూ, ముక్కుకి రెండువైపులా పుడకలూ వాళ్ళ మొహాలకు ఒకింత మెరుపూ , మరింత కళా తెచ్చిపెట్టేవి.  
చాలా కాలం తర్వాత, నేను వృత్తిరీత్యా విజయవాడలో స్థిరపడ్డప్పుడు మళ్ళీ అలా చక్కగా  నవ్వుతూ, కలుపుగోలుగా మాట్లాడే ఆడవాళ్ళు సత్యనారాయణపురంలో కనిపించారు. కానీ, తాంబూలపు పెదవులూ, బేల కళ్ళూ, బెరుకు చూపులూ, బిడియాలూ  కరువైపోయాయి-కనిపించకుండా పోయాయి. అమాయకత మాయమై, గడుసుదనం గడప దాటింది.
విజయవాడ విషయం కృష్ణానది గట్టుమీద పెట్టి, అసలు కథలోకి-మళ్ళీ మైలాపూర్ కి వెళ్దాం. 
ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసి, సెలవులకు ఇంటికి, చెన్నై వచ్చాను. ఒక్కరోజు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చునేసరికి విసుగు పుట్టింది. దానికి తోడు, చుట్టుపక్కల వాళ్ళూ, చుట్టపక్కాలూ, వాళ్ళకు వచ్చిన తలనొప్పి నుండి గుండెనొప్పి దాకా సలహా కోసం వచ్చేవాళ్లు.
రెండోరోజుకల్లా చిరాకూ, ఆసహనం మొదలయ్యాయి.  సాయంత్రం కపాలేశ్వరస్వామి గుడిదాకా వెళ్ళి, అప్పటికి చెన్నైకి మాత్రమే పరిమితమైన మాంఛి స్ట్రాంగ్ కాఫీ తాగి, ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తారేమోననే ఆశతో రోడ్డుమీద పడ్డాను. వేసవికాలపు సాయంత్రం. ఎండ వేడి తగ్గింది. సముద్రపు గాలి వొంటిని చల్లగా తాకుతోంది. స్నేహితులెవరూ కనిపించకపోవడంతో, సినిమాకు వెళ్దామనే ఆలోచన వచ్చింది.
కపాలేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి, జనసమ్మర్దం తో జనసముద్రం లా వుంది. ఏడాదిలో ఎంత మార్పు? వీధి పొడవునా కంప్యూటర్ బ్రౌజింగ్ సెంటర్స్ వచ్చాయి. ఒక బ్రౌజింగ్ సెంటర్ నుండి అప్పుడే బయిటకు వస్తోన్న ఒక అందమైన అమ్మాయి కనిపించింది. లేత ఆకుపచ్చ రంగు జాకెట్, ముదురు ఆకుపచ్చ రంగు పరికిణీ, కనకాంబరం రంగు ఓణీలలో మెరిసిపోతోంది. నేను తనను చూడటం గమనించి, తను కూడా నా వేపు చూసి దగ్గరకొచ్చింది. 
నాగుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది.
“ప్రసాద్! ఎలా వున్నావు? ఎప్పుడొచ్చావు?” చిరునవ్వుతో, ఆప్యాయంగా అడిగింది.
చూసిన ముఖం లానే వుంది కానీ, ఎక్కడ చూశానో, ఎవరో గుర్తుకు రావడం లేదు. ఆశ్చర్యపడటం నా వంతయ్యింది.
నా అవస్థ గమనించి తను నవ్వుతూ, “ప్రసాద్, నేను-భవానీని. వెంకట్ చెల్లెలిని” అంది.
వెంకట్ అంటే వెంకట్రామన్. వాడు ఇంటెర్మ్మెడియట్ వరకూ నాతో చదివి, తర్వాత కాంచీపురంలో బి.టెక్ చదివి,  ఆ తర్వాత  MS చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఇద్దరమూ విభిన్న ప్రొఫెషనల్ కోర్స్ ల లో చేరడం వల్ల,  మేము కలుసుకోవడం తగ్గిపోయింది. నాకు వున్న కొద్దిపాటి క్లోజ్ ఫ్రెండ్స్ లో వాడొకడు.  ఈ కథ జరిగేప్పటికి వాట్సప్ లేదు. నెలకో, రెణ్ణెల్లకో ఓసారి యాహూ మెయిల్స్ మాత్రం పంపుకుంటూ వుండేవాళ్లం. వాడికి  ముగ్గురు చెల్లెళ్లూ, ఇద్దరు కజిన్సూ వున్నారు. ఈ అమ్మాయి వెంకట్ కి స్వంత చెల్లెలా! కజినా!! గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాను కానీ గుర్తుకు రాలేదు.
రథం వీధిలో నడుచుకొంటూ వెళ్తూండగా. “వెంకట్ కి నువ్వు పంపిన మెయిల్ నాకు పంపించాడు. జోక్ బావుంది” అంటూ నవ్వింది. ఆ జోక్ నాకు గుర్తుంది. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గురించి నాకు వచ్చిన జోక్ ని వెంకట్ కి పంపించాను.
ఆమె ఎవరో ఖచ్చితంగా గుర్తుకు రాకపోయినా, వెంకట్ కి భవానీ  అనే చెల్లెలున్నట్టు జ్ఞాపకం వచ్చింది. తన వయస్సెంతో, తను వెంకట్ కి ఎన్నో చెల్లెలో అంచనా వేయడానికి ప్రయత్నించాను. ఏదేమైనా ఈ ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు. అయిదేళ్లక్రితం నేను చూసిన భవానీకి, ఇప్పుడు కంటెదురుగా వున్న భవానీకి ఎంత తేడా? అప్పటి పాపాయి ఇప్పుడు పాపలా మారిపోయింది.  చాలా లేతగా, కోమలంగా వుంది. అదరగొట్టేలా కూడా వుంది.
భవానీని చూస్తోంటే, సరీగ్గా సంవత్సరం క్రితం తిరుమల కొండపై, అద్దె రూమ్ కోసం వెదకుతూండగా, కనిపించిన అయ్యంగార్ల అమ్మాయి గుర్తుకు వచ్చింది. పుత్తడి బొమ్మ అని అలాంటి వాళ్ళనే అంటారేమో! తెల్లగా, కొంచెం బొద్దుగా, బొండుమల్లి పువ్వులా వుంది. చూపులు సూటిగా వున్నాయి. ఆ అమ్మాయి అంతందంగా వుండటం మూలాన్ని నాలో hormones ఎక్కువగా release అయ్యాయో, లేక hormones ఎక్కువగా release కావడం వల్ల  ఆ అమ్మాయి అంతందంగా కనిపించిందో అంతుబట్టలేదు. కానీ, ఆ అమ్మాయిలో నేను చూడనివి భవానీలో చూశాను. అమాయకత్వమూ, ఎదుటివాళ్లమీద చెరగని నమ్మకమూ.
మైలాపూర్ బ్రాహ్మణులమ్మాయికి వుండాల్సిన లక్షణాలన్నీ వున్నాయి. తన ముక్కుపుడక పైనుంచి నా చూపు మరల్చలేక పోయాను. భవానీ ప్రక్కన నేను నా జీన్స్ పాంటూ, టీ-షర్టులో స్టుపిడ్ లా వున్నానిపించింది. ఆ రోజు  మధ్యాహ్నం తను చూసిన హిందీ సినిమా గురించి చెప్పింది. ఆ తర్వాత, తన చేతికి పెట్టుకున్న గోరింటాకు చూపించింది గర్వంగా. తన చేతులు ఎర్రగా పండాయి. చాలా బాగా పండిందని మెచ్చుకున్నాను. పెద్దవాళ్ళు అనే మాట గుర్తొచ్చింది. “గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంత ఎర్రగా పండితే, అంత మంచి మొగుడొస్తాడట” 
తనకు హిందీ సినిమాలంటే చాలా ఇష్టంలా వుంది. ఎడ తెరిపి లేకుండా ఏదేదో చెబ్తూనే వుంది.
“చూడ్డానికి నువ్వు  ఐశ్వర్య (Ash) లా వుంటావు” అన్నాను.
భవానీ సిగ్గుపడుతూ నవ్వింది. “నీకు తెలుసా! నేను లంగా వోణీ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్” అంది.
కొంచెం సేపు ఆగి “నేను నిజంగా ఐశ్వర్యారాయంత అందంగా వుంటానా” అని అడిగింది.
నేను తన వేపు పరీక్షగా చూసి,“ ఏదో కొంచెం తక్కువైనట్లుగా వుంది” అన్నాను.
[+] 14 users Like Vyas Kumar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
భవానీ - by Vyas Kumar - 24-03-2022, 09:50 PM
RE: భవానీ - by prash426 - 24-03-2022, 10:05 PM
RE: భవానీ - by ramd420 - 24-03-2022, 10:42 PM
RE: భవానీ - by DasuLucky - 24-03-2022, 11:05 PM
RE: భవానీ - by K.rahul - 24-03-2022, 11:42 PM
RE: భవానీ - by appalapradeep - 25-03-2022, 04:35 AM
RE: భవానీ - by krantikumar - 25-03-2022, 05:23 AM
RE: భవానీ - by Shaikhsabjan114 - 25-03-2022, 06:45 AM
RE: భవానీ - by murali1978 - 25-03-2022, 03:15 PM
RE: భవానీ - by utkrusta - 25-03-2022, 04:07 PM
RE: భవానీ - by K.R.kishore - 25-03-2022, 10:46 PM
RE: భవానీ - by Ravanaa - 25-03-2022, 11:21 PM
RE: భవానీ - by osbpreddy456 - 16-05-2022, 12:55 AM
RE: భవానీ - by Okyes? - 16-05-2022, 10:51 AM
భవానీ - by Vyas Kumar - 25-03-2022, 07:25 PM
RE: భవానీ - by Ravanaa - 25-03-2022, 07:50 PM
RE: భవానీ - by ramd420 - 25-03-2022, 10:07 PM



Users browsing this thread: 1 Guest(s)