Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
#1
1





పొద్దున్నే అలారం మొగగానే లేచాను.... రూమ్ నుంచి బైటికి వచ్చి అమ్మ వాళ్ళ రూమ్ చూసాను... ప్రశాంతంగా నాన్న కౌగిలి లో గువ్వ పిట్టలా ఒదిగిపోయి నిద్రపోతుంది....

వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు అమ్మ లాంటి భార్య రావాలని.

షూస్ వేసుకుని జాగ్గింగ్ కి వెళ్ళాను గత రెండు సంవత్సరాలుగా సిక్స్ ప్యాక్ మేంటైన్ చేస్తున్నాను, ధ్రువ సినిమాలో రామ్ చరణ్ ని చూసాక బాగా ఇన్సపైర్ అయ్యాను....

ఇంటికి వచ్చి ఎక్సర్ సైజ్ చేసి కాలేజీ కి వెళ్ళడానికి రెడీ అయ్యాను..... అమ్మ లేచి టిఫిన్ చెయ్యడానికి కిచెన్ లోకి వెళ్ళింది, నాన్న మార్నింగ్ వాక్ కి వెళ్లే ఉంటాడు రోజు పొద్దున్నే వాకింగ్ కి వెళ్లి పేపర్ కొనుక్కుని రావడం అయన కున్న అలవాట్ల లో ఇది మొదటిది.

టీవీ ముందు కూర్చున్నాను అమ్మ టిఫిన్ తెచ్చి ఇచ్చింది, నవ్వుతూ తనని చూసి ప్లేట్ అందుకున్నాను నా తల నిమిరి లోపలికి వెళ్ళింది...

టిఫిన్ తినేసి అమ్మకి నుదిటి మీద ముద్దు ఇచ్చి, "కాలేజీ అయిపోగానే త్వరగా వచ్చేస్తాను" అన్నాను... నన్ను చూసి వేళ్ళతో "నా బంగారం" అని సైగ చేసింది....

మా ఇంట్లో అమ్మే నాకు నాన్నకి బాస్ తను ఎంత చెప్తే అంత, తన మాట కాదని మేము ఏ పని చెయ్యము.

అమ్మ తో మాట్లాడుతుండగానే ఫోన్ నోటిఫికేషన్స్ తెగ మొగుతున్నాయి చూస్తే మా ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి వాట్సాప్ లో తెగ గోల చేస్తున్నారు.... వెంటనే బైక్ తీసాను సరస్వతి డిగ్రీ కాలేజీ కి....

ఇంటి దెగ్గర నుంచి కాలేజీ కి అరగంట దూరం.... ఈ లోగ మా ఫ్రెండ్స్ ని తలుచుకున్నాను ఒకల్లో ఇద్దరో అనుకునేరు మొత్తం ఇరవై రెండు మంది అవును వీళ్లంతా నా ఫ్యామిలీ అనే చెప్పాలి....

ఆరు సంవత్సరాల క్రితం నాన్నకి మొదటి సారి పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన గవర్నమెంట్ డాక్టర్.... ఇంట్లో అమ్మ నాన్న నేనే మేము ముగ్గురమే మా ప్రపంచం.... ఎక్కడ ఉన్నా కలిసే ఉండాలని పొరపాటున కూడా విడిగా ఉండే ప్రయత్నం చెయ్యకూడదని మేము ముగ్గురం ముందే అనుకున్నాం...

అప్పుడే నేను మొదటి సారి పల్లెటూరు చూడటం, ఆ వాతావరణం నాకు చాలా నచ్చింది, అక్కడ ప్రైవేట్ స్కూల్ లేదు ఉన్నది ఒక్క గవర్నమెంట్ స్కూల్ మాత్రమే, అక్కడే జాయిన్ అయ్యాను...

ఎనిమిదవ తరగతి చూసుకుని వెళ్లి కూర్చున్నాను... నాతో కలిపి పన్నెండు మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు అందరిని పరిచయం చేసుకున్నాను అమ్మాయిలని కూడా కానీ కొంచెం సిగ్గు పడ్డాను...

లంచ్ బెల్ లో అబ్బాయిలంతా కలిసి బెంచ్ లని పక్కకి నెట్టేసి అందరూ కింద కూర్చున్నారు పెద్దగా రౌండ్ గా, ముచ్చట్లు పెట్టుకుంటూ రౌండ్ గా కూర్చున్నారు అందరు... నా ఇంతక ముందు స్కూల్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే అదేదో పాపం చేసినట్టు లేకపోతే లవ్ అన్నట్టు వింతగా చూసే వారు కానీ ఇక్కడ ఒకరిని ఒకరు ఒరేయ్, ఒసేయ్ అనుకుంటూ అరుచుకుంటూ కరుచుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళని చూస్తుంటే నాకు ఈ స్కూల్ మీద కొంచెం భయం తగ్గింది.... ఎవ్వరికి మొహమాటం లేదు ఒకరి కూరలు ఇంకొకరు మొహమాటం లేకుండా తీసుకుని వేసుకుంటున్నారు..... నాది కూడా తీసేసుకున్నారు....

మాటల్లో నా బర్తడే అడిగారు చెప్పాను "హో వచ్చే నెలే" అన్నాడు ఒక అబ్బాయి....అందరు ఒక్కసారిగా నన్ను చూసి తమ్ముడు అన్నారు నవ్వుకోలుగా చూస్తూ.... కొంచెం జంకాను...

అందులో రమ్య అనే అమ్మాయి చూడు విక్రమ్ మా ఊరిలో గవర్నమెంట్ స్కూల్ మేము పుట్టిన చాలా సంవత్సరాలకి వచ్చింది అందుకే మేము ఉండటానికి ఎనిమిదవ తరగతి లో ఉన్నాం కానీ అస్సలుకి ఐతే ఇంటర్ లో ఉండాల్సిన వాళ్ళము.... నీకంటే ఇక్కడున్న అందరమూ నాలుగు సంవత్సరాలు పెద్దవాళ్ళం... అని చెప్పి ముగించింది...

విక్రమ్ : ఓహ్ అలాగా అదే వచ్చినప్పటి నుంచి ఏదో తేడా కొడుతుంది ఇప్పుడు అన్నిటికి ఆన్సర్స్ దొరికేసినట్టే... అన్నాను.

ఇంతలో ఒక అమ్మాయి టిఫిన్ బాక్స్ కడగటానికి బైటికి వెళ్ళింది... వెంటనే

పూజ : రేయ్ రేపు సలీమా బర్తడే అందరికి గుర్తుంది గా....

చందు : గుర్తుంది... విక్రమ్ నువ్వు కుడా ఒక చెయ్యి వేస్తావా?

విక్రమ్ : మనిషికి ఎంతనుకుంటున్నారు..

చందు : ఇరవై రూపాయలు..

విక్రమ్ : అలాగే నేను వేస్తాను....

అలా ఆ రోజు అయిపోయాక ఇంటికి వచ్చి స్కూల్ గురించి చెప్పి బర్తడే గురించి చెప్పాను... అమ్మ నవ్వుతూ ఓకే అన్నట్టు నవ్వుతూ సైగ చేసి నాన్న జేబులోనుంచి వంద రూపాయలు నా చేతిలో పెట్టింది.


అమ్మా కానీ ఇరవై మాత్రమే అన్నాను... ఉంచు అన్నట్టు సైగ చేసింది బ్యాగ్ లో పెట్టుకున్నాను... అమ్మ సలీమ కి గిఫ్ట్ గా ఇవ్వమని పెన్ కూడా ఇచ్చింది...పొద్దున్న స్కూల్ కి వెళ్ళాక అందరు నీరశగా ఉన్నారు..

విక్రమ్ : ఏమైంది.

చందు : అందరం కలిపాము కానీ ఇంకా ఎనబై రూపాయలు కావాలి... ఇంకా సేపటిలో సలీమ వచ్చేస్తుంది ఎలాగొ తెలియడం లేదు

నేను బ్యాగ్ తీసాను..

చందు : నీ ఇరవై కలిపితేనే ఇంకా ఎనభై కావాలి విక్రమ్ అన్నాడు అసహనంగా.

బ్యాగ్ లోనుంచి వంద నోట్ తీసి చందు చేతిలో పెట్టాను.... అందరి కళ్ళలో ఒక్కసారిగా సంతోషం వెంటనే నన్ను కౌగిలించుకుని చందు భరత్ డబ్బులు తీసుకుని బాలూన్స్ ఒక పెద్ద కేక్, కాండిల్స్ కొనుక్కోచ్చారు...

అందరం కలిసి క్లాస్ ని బాలూన్స్ తో డెకొరేట్ చేసాము సలీమ కొత్త డ్రెస్ తో ఎంటర్ అయ్యింది.... అందరం ఒక్కసారిగా బర్తడే విషెస్ చెప్పాము....

సలీమా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యింది.... ఆ తరువాత చాక్లేట్లు పంచింది....నా గురించి చెప్పినట్టున్నారు నా దెగ్గరికి వచ్చి థాంక్స్ విక్రమ్... అంది

వెంటనే బ్యాగ్ లో నుంచి పెన్ తీసి సలీమకి ఇచ్చి మా అమ్మ నీకోసం ఇచ్చిన గిఫ్ట్ అని తన చేతికి ఇచ్చాను.... అందరు పెన్ తీసుకుని చూసి వావ్ అన్నారు...

సలీమా : థాంక్స్ విక్రమ్ అమ్మకి చెప్పానని చెప్పు ఇంతకీ అమ్మ పేరేంటి?

విక్రమ్ : కావ్య.

ఒక్క నెలలోనే అందరం కలిసిపోయాం కలిసి చదువుకోడం, ఒకరి మీద ఒకరం జోకులు వేసుకోడం, సిటీ నుంచి వచ్చిన వాడిని కదా నాకు ఎ ఇబ్బంది రాకుండా చూసుకునే వాళ్ళు, నన్ను అందరు చిన్న పిల్లాడిలా చూసే వాళ్ళు... చిన్నోడినే అనుకోండి..

ఒక సారి సలీమా హోమ్ వర్క్ చెయ్యలేదు సోషల్ సర్ చాలా స్ట్రిక్ట్ అందుకే నా పేరు కొట్టేసి సలీమ అని రాసి సబ్మిట్ చేసేసాను...

సర్ అందరివీ కరెక్షన్ చేసి నా బుక్ లేకపోడం తో నన్ను లేపి కొట్టాడు... సలీమా ఆ విషయం తెలుసుకుని లంచ్ బ్రేక్ లో నన్ను హత్తుకుని "థాంక్స్ విక్రమ్" అంది.

ఏం జరిగిందో అందరికి చెప్పింది అందరు నన్ను కొంచెం అభిమానం గా చూసారు.....

ఇంటికి వెళ్లి అమ్మ తో చెప్పాను అమ్మ గర్వంగా చూసింది, నాకు ఆ చూపు నచ్చింది.

ఎల్లుండి నా బర్త్ డే అందరు కలిసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తారనే ముందే చెప్పాను ఏమి చెయ్యొద్దు అని అలాగే అని నవ్వారు... వీళ్ళు వినరు అనుకున్నాను..

పొద్దున్నే లేచాను అమ్మ నాకు తల స్నానం చేయించి రెడీ చేసింది, కొత్త బట్టలు వేసుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు విష్ చేసారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఆనందం గా స్కూల్ కి బైలుదేరాను ఇవ్వాళ కేక్ కటింగ్ ఉంటుందని...

కానీ స్కూల్ కి వెళ్లే సరికి క్లాస్ మాములుగానే ఉంది డెకొరేషన్ ఏమి లేదు.... వెళ్లి బెంచ్ లో కూర్చున్నాను..

అందరు హ్యాపీ బర్త్ డే అని విషెస్ చెప్పారు... నిరాశగానే కూర్చున్నాను లంచ్ బెల్ లో అందరు నా ముందుకి వచ్చి.... అలిగావా? అన్నారు

విక్రమ్ : లేదు...

భరత్ : నువ్వే కదా ఏం చెయ్యొద్దు అన్నావ్...

విక్రమ్ : నేనేం అలగలేదు సంతోషంగానే ఉన్నాను... ఇవ్వాళ అమ్మ మనలనందరిని ఇంటికి రమ్మంది సాయంత్రం బిర్యానీ చేస్తుంది...

అందరు ఆనందంగా ఎగిరారు.... అందరం కింద కూర్చున్నాం తినడానికి...అందరు వాళ్ళ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి...

ముందుగా రమ్య నా ముందుకి వచ్చి స్పూన్ తో తన బాక్స్ లో ఉన్న సేమ్యా ని నాకు తినిపించి హ్యాపీ బర్తడే అని చెప్పింది....

"వావ్ థాంక్స్ రమ్య" అని అన్నాను

రమ్య : నీకోసం నేనే చేశాను...

విక్రమ్ : నిజంగా చాలా బాగుంది రమ్య..

ఆ వెంటనే సలీమా వచ్చి తన బాక్స్ లో డబల్ కా మీఠా పెట్టింది....

పూజ అందరిని తోసుకుంటూ ముందుకి వచ్చి "జరగండి జరగండి" అంటూ తన బాక్స్ లో ఉన్న చికెన్ పెట్టింది.... ఉన్న అందరిలో పూజ నే అల్లరిది తనంటే మా అందరికి ఇష్టం...

అందరు అయిపోయాక అందరు కలిసి నా ముందుకి వచ్చి నా చేతిలో పార్కర్ పెన్ పెట్టి హ్యాపీ బర్తడే అని సప్రైస్ ఇచ్చారు.... ఆ పెన్ చూస్తూనే తెలుస్తుంది చాలా కాస్ట్లీ అని.

విక్రమ్ : ఇంత ఖరీదైన పెన్ నాకొద్దు....

పూజ, రమ్య ముందుకు వచ్చి తీసుకో విక్రమ్ నీకోసం మేము వంట మాత్రమే చేసాము కానీ చందు భరత్ వాళ్ళు పొలానికి వెళ్లి ఒక పూట అంతా పని చేసి నీకోసం ఆ పెన్ కొన్నారు.. కావాలంటే వాళ్ళ చేతులు చూడు....

చందు వాళ్ళ చేతులు చూసాను అర చేతిలో పొక్కులు ఉన్నాయ్....

రాజు : విక్రమ్ గిఫ్ట్ నచ్చిందా.... మా అందరికంటే నువ్వే బాగా చదువుతావ్ అందుకే ఆ పెన్ ఇచ్చాము...

నా కళ్లెమ్మట నీళ్లు వచ్చాయి గట్టిగా అందరిని హత్తుకుపోయాను.... సాయంత్రం ఇంటికి వెళ్ళాక అమ్మకి నాన్నకి చెప్పాను వాళ్ళు చాలా సంతోషించారు... నాన్న గర్వంగా చూస్తే అమ్మ నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకుంది.

వాళ్ళిద్దరికీ పార్టీ గురించి గుర్తు చేశాను ముగ్గురం కలిసి అన్ని రెడీ చేసాము, ఏడు అవుతుందనగా అందరు వచ్చారు...

అందరిని లోపలికి పిలిచి కేక్ కటింగ్ చేసాము ముందు అమ్మకి నాన్నకి తినిపించి మిగతాది అందరం తినేసాం.

అమ్మ నాన్న నేను సైగలు చేసుకోడం చూసి అందరు నన్ను బైటికి పిలిచారు....

పూజ : ఏంట్రా మీ అమ్మ మేము ఏం మాట్లాడినా మూగదానిలా సైగలు చేస్తుంది మౌన వ్రతమా? అని నవ్వింది...

విక్రమ్ : అవును మూగదే అమ్మ మాట్లాడలేదు...

అందరూ ఒక్క సరిగా సైలెంట్ అయ్యారు పూజ ని కోపంగా చూసారు...

పూజ బుగ్గ గిల్లి "పదండి లేట్ అవుతుంది తిందాము, మళ్ళీ బిర్యాని చల్లగా అయిపోతే బాగోదు " అని పూజ భుజం మీద చేయి వేసి ముందుకు నడిచాను...

పూజ : సారీ రా...

విక్రమ్ : పర్లేదు పదా...అని లోపలికి తీసుకెళ్ళాను..

అలా టెన్త్ వరకు అయ్యింది, ఈలోగా ఒకళ్ళ గురించి ఒకళ్ళం పూర్తిగా తెలుసుకున్నాం, ఇంటర్ లో కూడా కావాలనే అందరం ఒకే సారి గవర్నమెంట్ కాలేజీ లో జాయిన్ అయ్యాము కొంతమంది అమ్మాయిలని చదవనియ్యము అన్నారు కానీ మా ఐకమత్యం చూసి మమ్మల్ని ఆపలేకపోయారు...

సెలవుల్లో ఆడుకోడాలు, కలిసి వంటకి పొలాల్లో పడి ఆడుకునేవాళ్ళము అమ్మాయిలంతా వంటలు ఓండుతుంటే మేము క్రికెట్ ఆడుకుని మధ్యనానికి వేప చెట్టు కింద కూర్చుని తినేవాళ్ళము...సాయంత్రం వరకు చెరువులో ఈతలు, గోలీల ఆటలు ఇలా ఒకటేమిటి 1990 పిల్లలు ఎంత ఎంజాయ్ చేసారో అంత ఎంజాయ్ చేసేవాళ్ళము.

అందరిని ఇంటర్ పాస్ చేయించి డిగ్రీ లో జాయిన్ చేయించడానికి నాకు రమ్యకి చందుకి చుక్కలు కనిపించాయి ఎలాగోలా పాస్ అయ్యాము.

మా గ్యాంగ్ లో ముగ్గురు అబ్బాయిలు చదువు అబ్బట్లేదాని ఇంకో ఇద్దరు ఇంట్లో కష్టంగా ఉందని మానేశారు...

అమ్మాయిల్లో ఇద్దరికీ పెళ్లి చేసేసారు ఇంకో ఇద్దరు ఇంటర్ వరకైతే మీ కోసం చదివించాము కానీ ఇక చదివించం అని కారాఖండిగా మొహం మీదే చెప్పేసారు....

అలా చివరికి పదముడు మందిమి మిగిలాము... అందులో మూడు జంటలు...

ఇవ్వాళ డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి రోజు ఆటే వెళ్తున్నాను.

....................................................................

ఏంటే ఈ కాలేజీ ఇదొక కాలేజీ యే నా చాపల మార్కెట్ లా ఉంది నీ వల్ల ఇక్కడ జాయిన్ కావాల్సి వస్తుంది... అని తన ఇద్దరు ఫ్రెండ్స్ మూడో వ్యక్తిని తిడుతున్నారు, ఆడి కార్ దిగుతూనే...

"నాకు మాత్రం సరదా నా, మా నాన్న ఏదో గెలిచిన ఆనందం లో న్యూస్ చానెల్స్ ముందు వాగేసాడు దాని వల్ల ఈ చెత్త లో పడాల్సి వచ్చింది... పదండి అలా వెళ్లి ఇలా జంప్ కొట్టి మాల్ కి వెళ్ళిపోదాం..

అని లోపలికి వెళ్లారు ముగ్గురు.........

నేను లోపలికి వెళ్లి బైక్ పార్క్ చేసి మా వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉన్నాను, ఎదురుగానే మొహం వెళ్లడేసుకుని ఉన్నారు...

విక్రమ్ : ఏమైంది?

అందరు సైలెంట్ గా ఉన్నారు...

విక్రమ్ : పూజ ఏమైంది...

పూజ : అదిగో ఆ ముగ్గురు లోపలికి వెళ్తున్నారు చూడు అని చూపించింది....

ముగ్గురు జీన్స్ అండ్ టీ షర్ట్స్ వేసుకుని లోపలికి వెళ్తున్నారు.... వాళ్ళని చూసి "అయితే" అన్నాను.

పూజ : మమ్మల్ని అవమానించారు... సలీమా ని పట్టుకుని పల్లెటూరి మొద్దు అన్నారు...

మనమంతా పల్లెటూరి వాళ్ళమని డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని అందరి ముందు చులకనగా మాట్లాడారు అందరూ మమ్మల్ని చూసి నవ్వారు... అంది.

విక్రమ్ : మరి మీరు ఏం చేస్తున్నారు మీకు మాటలు రావా?

పూజ ఏదో మాట్లాడుతుంటే రమ్య మధ్యలో వచ్చి...

రమ్య : విక్రమ్ ఇక్కడితో వదిలేయ్ తను పెద్ధింటి అమ్మాయి అందులోనూ ఈ ఊరి mla కూతురు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉందాం....అని అందరికి సర్ది చెప్పింది.

లోపలికి వెళ్ళాము.... అందరు ఆడిటోరియం కి వెళ్తుండడం గమనించి మేము కూడా లోపలికి వెళ్లి కుర్చీలలో కూర్చున్నాం....

అందరూ వచ్చాక కాలేజీ డీన్ వచ్చి స్పీచ్ ఇచ్చి ఫ్రెషర్స్ కి స్వాగతం చెప్పి, ఇంకో వారం రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది అని అనౌన్స్ చేసాడు అందరం సంతోషించాం.

ఆ తరువాత డీన్ గారు..... "మన ఊరి mla అయిన శివరాం గారూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన కూతురిని మన కాలేజీ లో జాయిన్ చెయ్యడం మనకు గర్వ కారణం.... ప్లీజ్ జాయిన్ యువర్ హాండ్స్ అండ్ వెల్కమ్ మిస్ మానస".... అన్నాడు.

తల ఎత్తి చూసాను... డయస్ మీదకి వెళ్ళింది అందరు చెప్పట్లు కొట్టారు , తన నడకలో కొవ్వు , వొళ్ళంతా పొగరే తన మొహం చూసాను అందం తో వచ్చిన టెక్కు అది....దానితో పాటు ఫిగర్ కస్సక్ లాగ ఉంది, ఇంకెందుకు ఆగుతుంది....

తన పేరు గుర్తుపెట్టుకున్నాను "మానస"...





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Takulsajal - 06-05-2022, 01:42 PM



Users browsing this thread: 1 Guest(s)