Thread Rating:
  • 9 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#1
"ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం...."అని పాడుకునే అబ్బాయి ఒక పక్క

"వద్దు రా సోదరా ప్రేమంటె నూరేళ్ల మంటరా..."అని కవిత్వం చెప్పే అమ్మాయి మరోపక్క

ఇష్టాలు-అయిష్టాలు,రుచులు-అభిరుచులు కలవని ఈ జంట కథేంటి....?!

మధ్యలో ఇంకొకరి పాత్రేంటి...?

***
కథ  రచయితను నేను కాదు..... రచయిత కలం పేరు అవనిక
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
1.పరిచయం
ట్రైన్ నెంబర్ 2456 తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళు ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం పై ఆగి వున్నది....అని రైల్వేస్టేషన్ లో అనౌంస్ మెంట్ అలా వినిపించి ట్రైన్ ఇలా వచ్చి ఆగిందో లేదో....ఇలా ట్రైన్ దిగింది రియా....తన బుజాలకి వున్న బ్యాగ్ ని సరి చేసుకుని కళ్ళకి వున్న కళ్ళద్దాలు కూడా సరి చేస్కుని ముందుకు నడిచింది .....

ట్రైన్ కదలడానికి సిద్ధం గా వుందని ఈ సారి ఇంకొ ఎనౌంస్ మెంట్ వచ్చేసరికి రియా ఎంట్రంస్ దగ్గరవుంది.....

అన్నట్టు గానే ట్రైన్ కదిలింది

రియా వెనుదిరిగి మళ్ళీ చూసింది ట్రైన్ వంక...... కంట్లోంచి కన్నీరు జాలు వారి చెక్కిలి పై పడింది......

అదేమీ పట్టించుకోని రియా ముందుకు కదిలి రైల్వేస్టేషన్ బయటకి వచ్చి అటూ ఇటూ చూసింది ....ఆ తర్వాత వాచ్ చూసింది టైం ఒంటి గంట దాటి పది నిమిషాలయ్యింది.....

బయటకి నడిచి ఆటో స్టాండ్ ని సమీపించింది.....

"మ్యాడం ఆటో కావాలా...?"అడిగాడు ఆటో అతను....

"ఆటొ వద్దు లిఫ్ట్ కావాలి..."అంది రియా

"మీకు కావాలన్నా నేను అమ్మను లేండి....అయినా దాన్ని లిఫ్ట్ అనరు మ్యాడం.....సరే గానీ మీరు ఎక్కడికి పోవాల్న....?"అడిగాడతను

"బస్ లన్నీ ఆగుతాయి సూడు అక్కడ..."అంది రియా

"ఒ బస్టాండ్ ఆ...పోదాం పోదాం 30 రూపాయాలు అవుతుంది పర్లేదా...?"అడిగాడతను

"వాయమ్మొ 30 రూపాయలే......20 రూపాయలు చేస్కో...."అని ఆటో ఎక్కేసింది రియా

ఆటో అతని ముఖం లో వే వేల కాంతులు 10 రూపాయల కిరాయికి 20 రూపాయలు వస్తున్నాయి మరి.....అద్దం లో అతని ముఖం చూసిన రియా ఛా....10 రూపాయలు కి అడిగి వుండాల్సింది అని చింతించ సాగింది.......ఆ బాధ ని రెట్టింపు చేస్తూ తన ఫోన్ రింగ్ అయ్యింది....

స్క్రీన్ పై.....టార్చర్ అని స్క్రోల్ అయ్యింది.....

ఆ పేరు చూడడం తోనే తల పట్టుకుంది రియా.....

"ఏమైంది మ్యాడం తల నొప్పా....మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా...?"అడిగాడు అతను

"అబ్బా..బ్బా..నువ్వు ముందు బస్టాండ్ కి పోనివ్వవయ్యా..."అంది చిరకుగా రియా

ఆగకుండా ఫోన్ మోగుతూనే వుంది......ఏం చేయాలో రియా కి పాలు పోవట్లేదు......ఇంతలో బస్టాండ్ రానే వచ్చింది......ఆటొ అతనికి డబ్బులిచ్చేసి బస్టాండ్ లోపలికి అలా అడుగుపెట్టిందో లేదో తను ఎక్కాల్సిన బస్ అలా ముందుకు కదిలింది......

"ఆపండి........అపండి......."అంటూ బస్ వెంట పి.టి.ఉష లా పరుగు తీసి అలసి సొలిసి ఇక తన వల్ల కాక ఆగిపోయిన 2 సెకన్ల కి అల్లంత దూరం లో బస్ ఆగింది.......

"దేవుడా యూ ఆర్ దేర్....నువ్వున్నావ్....."అని కాలు కాలు కొట్టుకుని అక్కడికి నెమ్మదిగా వెళ్లసాగింది..... తను బస్ కి దగ్గరయ్యే కొద్ది ...."ఏమ్మా.....ఎంతసేపు..? నీ వల్ల బస్ ఆపాము...త్వరగా రా...."అని ఊరంతా వినపడేలా అరుస్తున్నాడు కండెక్టర్......కం డ్రైవర్.......

అతని వైపు ఒక క్రూరమైన లుక్ ఇచ్చి బస్ ఎక్కిన రియా కి ఏ.సి గాలి చల్లగా తాకింది.....ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి....తన టికెట్ తీసి తన సీట్ నెంభర్ చూడ సాగింది.......
"అక్కడ ఉంది ఒక్క సీటే....వెళ్ళక్కడ అగోరించు...."అని కండెక్టర్ అనడం తో ఆయన వైపు కోపంగా చూసింది....తన సీట్ పక్కన ఒక అబ్బాయి కిటికి వైపు తిరిగి కూర్చుని వున్నాడు....చెవుల్లో ఇయర్ ఫోంస్ పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోయాడు....

"కలికాలం...."అని మనసులొ అనుకోబోయి బయటకే అనేసింది రియా.....

"ఇది చలికాలం అండి"అన్నాడాబ్బాయి......

"వామ్మొ....వీడి సెకలూ..."అని మనసులో అనుకుంది రియా

అలానే బొమ్మలా నిల్చున్న ఆమె ని చూసిన ఆ అబ్బాయి...."ఏంటండి కూర్చోకుండా తెగ ఆలోచిస్తున్నారు...?"అడిగాడు

"మీరు చెప్పలేదని..."వెటకారంగా అని కూర్చుంది రియా....

"మీరు పెళ్ళి నుంచి పారిపోయారా...?"కంగారుగా అడిగాడాబ్బాయి....

"వీడికెలా తెల్సిపోయిందబ్బా..."అని కంగారు పడి....ఆ కంగారు బయట పెట్టకుండా..."లేదే....అలా అడిగారేంటి....?"అనుమానంగా అడిగింది రియా

"మీ బుగ్గ పై బుగ్గ చుక్క చేతికి ఇన్ని గాజులు.....చూసి"అనుకున్నాలేండి అన్నాడు ఆ అబ్బాయి......

"ఏమో నేను డ్రామా ఆర్టిస్ట్ ని అయ్యుండొచ్చు కదా?"అంది రియా

"వామ్మొ నేనలా అలోచించనేలేదండి....మీ పేరు ...?"అని అడిగి....మళ్ళీ తను ఏమి అనుకుంటుందో అని సందేహం వచ్చి...."మీకు ఇబ్బంది ఏమీ లేకుంటేనే చెప్పండి "అన్నాడాబ్బాయి.....

"అయ్యొ రామా...పేరు చెబితే ఆస్తులేమైనా కరుగుతాయా ఏంటి...అదేం లేదు మై నేం ఈస్ రియా ....మేరా నాం రియా....నా పేరు రియా....ఎన్ పేర్ రియా....గుక్కుతిప్పుకోకుండా చెప్పింది రియా

నా పేరు విజయ్....వెరీ నైస్ టూ మీట్ యూ అని చెయ్యి ముందుకు చాపాడు విజయ్....షేక్ హ్యాండ్ ఇచ్చింది రియా

"ఇంతకీ.....మీరు నిజం గా డ్రామా బ్యాచ్ ఏ నా...?"అడిగాడు విజయ్ కుతూహలంగా

"ఇప్పుడు ఇతనికి చెప్పాలా వద్దా...?అయినా ఇతను మనకేమి తర్వాత తారాసపడడు గా చెబుదాం లే అసలే ఎన్నో ఏళ్ళుగా తీరని వ్యధలా ఈ బాధని మోస్తున్నాను.......ఇక నా వల్ల కాదు చెప్పేద్దాం...."అనుకుని సిద్ధపడిపోయింది రియా

రియా అంత సేపు ఆలోచిస్తుండడం తో విజయ్ కలగ చేసుకుని..."మీకు ఇబ్బంది ఐతే చెప్పొద్దు లేండి...."అని అన్నాడు

"అయ్య బాబోయ్ మీరు మరీ మొహమాటొస్తుల్లా వున్నారే.....చెబుతాను గానీ దాని కన్నా ముందు ఈ బుగ్గ చుక్క పోవడానికి నాకు సహాయం చేయండి...."అడిగింది రియా

"సహాయమా...?ఎలా?"అడిగాడు విజయ్

"మీకే తెలుస్తుంది లే...."అని బ్యాగ్ వెతకసాగింది...తనకేమి కనిపించక పోవడం తో ఒక్కొక్కటిగా బ్యాగ్ లో వున్న వస్తువలన్నీ తీసి విజయ్ చేతికి అందిస్తుంది...విజయ్ అన్నీ పట్టుకోలేక కుస్తీ లు పడుతున్నాడు......అయినా కూడా రియా కి తనకి కావాల్సిన వస్తువు దొరకలేదు....

"ఏమి చూస్తున్నారండీ..."ఆతృతగా అడిగాడు విజయ్

"అద్దం...అద్దం....మిర్రర్..."అంది రియా తన బ్యాగ్ లో తల పెడుతూ

"అయ్యొ రామా...అద్దం ఎందుకండి...?"అయొమయంగా అడిగాడు విజయ్

"చూడండి విజయ్ గారు బుగ్గ చుక్క ని తుడవాలంటే బుగ్గ చుక్క లొకేషన్ తెలియాలి కదా....?"అందుకే అద్దం కావాలా వద్దా...?"అడిగింది రియా

"వామ్మొ లొకేషన్ ఆ అదేమన్నా సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఆ లేక రైల్వే స్టేషన్ ఆ లొకేషన్లు వుండడానికి...?ఇంతోటి దానికి అద్దం ఎందుకండి...?నేను చెబుతాను గా ఎక్కడుందో...."అన్నాడు విజయ్....

"గుడ్ ఐడియా ఎక్కడ...?"అడిగింది రియా

"ఇంకెక్కడ బుగ్గ మీద....."చెప్పాడు విజయ్

"అబ్బా...కరెక్ట్ గా చెప్పండి లేకపోతే నా ముఖం మొత్తం కాజల్ తో మేక్ అప్ చేసినట్టు వుంటుంది....."అనేసరికి డైరక్షంస్ చెప్పసాగాడు......

ఇంతలో రియా కి ట్రింగ్ మని ఙన బల్బ్ వెలిగి తన ఫోన్లో సెల్ఫీ మోడ్ అన్ చేసి ....తన బుగ్గ చుక్క ని తుడిచేసింది....గాజులు అన్నీ బ్యాగ్ లో వేసింది......కొంచెం స్థిమిత పడి ఊపిరి పీల్చుకుంది......

"ఇప్పటికైనా చెప్తుందా లేదా...?"అని ఆలోచిస్తున్న విజయ్ ఈ లోకం లోకి వచ్చాడు రియా చేయి స్పర్శ తో......

రియా వైపు ఆశ్చర్యంగా చూశాడు.........!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#3
స్టోరీ బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
#4
Nice story
Like Reply
#5
2.భయం...?
విజయ్ రియా వైపు చూసేసరికి రియా నుదురు చెమట తో తడిసిపోయింది....ముఖం లో టెంషన్ స్పష్టంగా కనిపిస్తుంది .....ఇంతలో ఆమె భయపడే విషయం ఏమి జరిగిందో విజయ్ కి అర్థం కాలేదు

"రియా గారు....ఏమైందండి....?"భయపడుతూ అడిగాడు విజయ్......

భయం నిండిన కళ్ళతో అతని వైపు చూసి ఫోన్ వైపు చూపించింది.....ఆమె చూపించిన వైపు చూసిన విజయ్ కి ఫోన్ లో "టార్చర్" అనే పేరు స్క్రోల్ అవుతూ కనిపించింది.........

"ఎవరండి....?"అర్థం కానట్టు అడిగాడు విజయ్

ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోవడం తో భారంగా గాలి వదిలింది రియా....ఆమె పరిస్థితి విజయ్ కి వింతగా తోచింది....అడగాలో వద్దో సంశయం లో వుండగానే....మరో సారీ ఫోన్ మోగుతుండడంతో కళ్ళు తేలేసింది రియా

"రియా గారు....ఆ ఫోన్ ఇటు ఇవ్వండి....నేను మాట్లాడతాను...."అన్నాడు విజయ్

"ఏం మాట్లాడతారు....?"భయంగా అడిగింది రియా

"ఇంకోసారి అర్థరాత్రి ఫోన్ చేస్తే ఈవ్ టీసింగ్ కేస్ పెట్టి లోపలికి తోయిస్తానని చెబుతాను..."తడుముకోకుండా చెప్పాడు....విజయ్

"అప్పుడు తను నువ్వెవరివి రా అంటాడు...అప్పుడేమి సమాధానమిస్తారు....?"అడిగింది రియా

"నేను మీకు కావాల్సిన వాడ్ని కాబోయే వాడ్ని అని చెబుతాను...."అనుమానంగా చూస్తూ చెప్పాడు విజయ్

ఒక్క నిమిషం అతని చెప్పిన మాటకి ఆశ్చర్యపోయి అతని కళ్ళలోకి చూస్తుండి పోయింది రియా....ఆ కళ్లలో ఎటువంటి కల్మషం లేదు తనని కాపాడాలనే ప్రయత్నం తప్ప.........

ఏమీ మాట్లాడకుండా తనవైపే రియా అలా చూస్తుండటంతో అనుమానమొచ్చిన విజయ్ ఏ అందుకుని...."పోని మీ బంధువని చెబుతాను ఇటు ఇవ్వండి...."అన్నాడు

"అమ్మా-నాన్న ఏ అతనితో మాట్లాడమని ఒత్తిడి చేస్తుంటే.....మీరు బంధువు నాతో మాట్లాడొద్దు అని చెబితే తను వింటాడా.....?"అంది నిర్జీవంగా నవ్వేస్తూ రియా

విజయ్ కి ఏమీ అర్థం కాలేదు..."ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు...ఏమైందో చెప్పండి.......?నాకస్సలు ఎమీ అర్థం కావట్లేదు...."అన్నాడు విజయ్

"ఇది ఇప్పుడు మొదలైన కధ కాదు 13 ఏళ్ళ క్రితం ది....."అంది రియా డల్ గా

"మీరు చెబుతారా లేదా....?"అడిగాడు విజయ్

చెబుతాను అన్నట్టు తలాడించింది రియా

"చెప్పండి కానీ నాదో షరతు.........మీరు మామూలుగా ముందు లా అయిపోవాలి...ఎందుకంటే ఫోన్ రావడం కూడా ఆగిపోయింది........అదీ కాక..."అని నాంచాడు విజయ్

"హా అదీ కాక?"అదోలా ముఖం పెట్టి అతని వంక చూసింది రియా

"అదీ కాక మీరు మీలా వుంటే చాలా బావుంది........ఇలా అస్సలు బాలేదు........"చెప్పాడు విజయ్ నవ్వేసింది రియా

"అది సరే మనం ఈ మీరు - గీరు వదిలేద్దామా.....?"అడిగింది రియా

విజయ్ సరేనంటూ తలూపి..."ముందు నువ్వు స్టోరీ మొదలెట్టు....అసలే 13 ఇయర్స్ బ్యాక్ అంటే మళ్ళీ రావడానికి టైం పట్టింది..... అసలే తెల్లవారే లోగా తిరిగొచ్చాయాలి......"అని విజయ్ అనడం తో...........

రియా:అవి నేను 4 వ తరగతి చదివే రోజులు..........ఒక రోజు పొద్దున్నే ఏవో సౌండ్లు.....వస్తున్నాయి.....బద్ధకంగా లేచిన నేను బాల్కని లోకి తొంగి చూశాను....అప్పుడు నేను చిన్నదాన్ని కదా హైట్ కొంచెం తక్కువ వుండెదాన్ని....

విజయ్:ఓ పెద్ద ఇప్పుడు 6 ఫీట్ వున్నట్టు మరి

రియా(కోపంగా):ఏంటి....?

విజయ్:అబ్బే ఏం లేదండి చిన్న పిల్ల కదా జనరల్లీ అలా పొట్టిగానే వుంటారు అంటున్నా
రియా:పొట్టిగా కాదు హైట్ తక్కువగా....సరే ఇక విషయాని కి వస్తే సో ఆ బాల్కని లోంచి ఎగిరెగిరి మరీ ఆ సౌండ్లు పక్కన ఇంట్లోంచి వస్తుంటే చూస్తున్నా......ఇంతలో ఒక అబ్బాయి ఇంచు మించు నా ఏజ్ ఏ వుంటుంది చాలా ఫెయిర్ గా వున్నాడు.....చేతిలో ఒక డజన్ పుస్తకాలతో నిల్చుని కనిపించాడు......నల్లని జుట్టు అల అలలు గా తన ముఖం పై పడుతూ అతన్ని చికాకు పెడుతుండగా సరి చెయ్యలేక తను అవస్త పడుతున్నాడు........ఇంతలో ఆ అబ్బాయి...ఒక పక్కగా వెళ్ళి నిల్చున్నాడు........అతని ముఖం నాకు సరిగ్గా కనిపించక పోవడం తో నేను ఇంకొంచెం ఎగిరి మరీ చూస్తున్నా.....అప్పుడే మా అమ్మ వచ్చి నా వీపు పై ఒక్కటి ఇచ్చింది........ అంది సాడ్ గా

విజయ్:మరి ఇవ్వరా ...?4 క్లాస్ కే అబ్బాయి లకి సైట్లు కొట్టె వాళ్ళని అలాగే కొట్టాలి.....

రియా:వామ్మొ...అమ్మ కొట్టింది అందుకు కాదుగా అలా ఎగిరి ఎగిరి చూస్తూ కాళ్ళు పైకి లేపేసాను నేనెక్కడ కింద పడతానో అని అమ్మ కొట్టింది ....ఇక ఆ రోజు నేను స్కూల్ కి రెడీ అయ్యి అలా సోఫాలో కూర్చుని ఫలహారం కానిస్తుండగా తను వచ్చాడు........

విజయ్:ఎవరు పేపర్ బాయ్ ఆ....?

రియా:కాదు

విజయ్:ఓహ్ పాలవాడా....?

రియా:చా కాదు కాదు...వుదయం లేవగానే నేను సైట్ కొట్టిన అబ్బాయి...మా పక్కింటి కి కొత్తగా వచ్చిన మా నైబర్......తనతో పాటు ఉష అత్త.....కూడా

విజయ్:మధ్యలో ఈవిడ్ ఎవరు.....?

రియా:అదే ఆ అబ్బాయి వాళ్ళమ్మ.....పేరు ఉష... ఆవిడని అలా పిల్చి పిల్చి ఇప్పుడు కూడా అలానే వచ్చేసింది లే......

విజయ్:ఇంతకీ మీ బావ పేరేంటొ....?వెటకారంగా అన్నాడు

రియా:ఏ బావ...?నాకెవ్వరు బావలు లేరే........ఓహ్ అర్థమయ్యింది ఆ సైట్ కొట్టిన అబ్బాయి పేరే గా..? చెప్తా చెప్తా ఇప్పుడే కాదు....

ఉష అత్త వచ్చి అమ్మతో ఏదో మాట్లాడారు.....నేను నా పాటికి ఉప్మా మేస్తూ వున్నాను......తను మాత్రం మా ఇంట్లో వున్న షెల్ఫ్ లో వున్న మా నాన్న పుస్తకాలు చదవసాగాడు........

నేను మాత్రం తనని చూసి వీడికి చాలా ఎక్స్ ట్రాలు వున్నాయి అని వెంటనే పసిగట్టెశాను.....

విజయ్:అబ్బబ్బ వాట్ ఏ తెలివి వాట్ ఏ తెలివి....సరే ఆ తర్వాత

రియా:ఆ తర్వాత ఏముంది నేను ఉప్మా తినేశాను...ప్లేట్ సింక్ లో వేసాను.....

తల కొట్టుకున్నాడు విజయ్....నువ్వు ప్లేట్ సింక్ లో వేశావా....లేక కడిగి పేట్టేశావా అని నేనడగలేదు.....కధలో తర్వాత ఏమైంది అంటున్నా......

రియా:నేను చెప్పే లోపు నువ్వే తొందర పడ్డావ్....అలా కిచెన్ లోంచి ఇలా బయటకి వచ్చాను

విజయ్:లాభం లేదు కానీ...సింపుల్ గా కట్టె కొట్టే తెచ్చే లా చెప్పు రియా

రియా(కోపంగా):అభి.....నన్ను ముద్దు పెట్టుకున్నాడు....ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పించాడు......ఐ లవ్ యూ చెప్పాడు......స్టోరి అయిపోయింది గుడ్ నైట్ అని చెప్పి అటు తిరిగి కళ్ళు మూసుకుంది

మైండ్ బ్లాక్ అయ్యింది విజయ్ కి...........

విజయ్:రియా...మరీ ఇలానా చెప్పేది....అసలు ఏమైంది చెప్పు......

రియా:నేను చెప్పను..........

విజయ్:సారి......చెప్పు చెప్పు....నువ్వెలా చెబితే అలా వింటాను...కావాలంటే నీ స్టోరీ అయిపోయే దాకా నీ తో పాటు బస్టాండ్ లో వుండయినా సరే వినే వెళ్తాను......సరే నా.....?చెప్పు.......ప్లీస్..........

అని విజయ్ బతిమాలుడుతుండగా సడన్ గా బస్ ఆగింది...........!!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#6
Nice story
Like Reply
#7
Good start


సాఫీగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
#8
నైస్ అప్డేట్ & నైస్ స్టార్ట్  రైటర్  గారు..!!!


ఇద్దరు భిన్నమైన మనస్తత్వలు మధ్య ప్రేమ అనే పాయింట్ కొత్తగా అలాగే చాల ఆసక్తిగా వుంది.

రియా మాస్ గ, విజయ్ కాల్స్ గ అనిపిస్తున్నారు. మీరు మొదలు పెట్టిన రెండు కథలలోని సంభాషణలు సహజంగా అదేవిదంగా హాస్యం తెప్పించే విదంగా వున్నాయ్.

ఈ రెండు కథలు మంచి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

చాల సున్నితమైన హావభావాలు తో కూడిన ఒక మంచి కథను ఇస్తునందుకు చాల థాంక్స్.

ఇక ఇద్దరి మధ్య ఎలాంటి సందర్భాలు, సంభాషణలు వుంటాయో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. 

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#9
3.ఫ్లాష్ బ్యాక్
బస్ ఒక్కసారిగా అగడం తో విజయ్ - రియా ఒక్కసారిగా ముందుకు చూసి చూసి తిరిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.....

ఇద్దరి ముఖాల్లో ఒకే ఎక్స్ ప్రెషన్....."ఏమైందా....?"అని ఇన్ ఫాక్ట్ వాళ్ళిద్దరి ముఖాల మీదే కాదు బస్ లో వున్న అందరి ముఖాల్లోనూ అదే ప్రశ్న.....ఆ ప్రశ్న కి సమాధానమిస్తూ డ్రైవర్ కం కండెక్ట ర్ బదులిచ్చాడిలా

"అమ్మా.....బస్ టైర్ పంక్చర్ అయ్యింది...అందరూ కిందికి దిగితే మారుస్తాను...హా అన్నట్టు బలంగా వున్న ఇద్దరు నాకు సాయం పడితే పని త్వరగా పూర్తవుతుంది...."అని చెప్పాడు ఆయన

చేసే దేమి లేక అందరూ కిందకి దిగారు.....ఒక ఇద్దరు సాయం చేయడానికి వెళ్ళారు....వాళ్ళతో పాటు విజయ్ కూడా వెళ్లబోతుంటే....ఆపేసింది రియా.....

"నీ అవతారం ఎప్పుడైన అద్దం లో చూసుకున్నావా...?పుల్ల కి ఫ్యాంటూ చొక్కా తొడిగినట్టు వున్నావు....నీకు ఈ ధీర సాహసాలన్నీ అవసరమా....?"అంది ముఖం మీదే రియా

"మన వంతు సహాయం చేయడం లో తప్పు లేదుగా పైగా మన అవసరం కూడానూ...."అని ముందుకు కదిలాడు విజయ్....

అతను వెళ్ళిన వైపే చూస్తూ మనసులో అనుకుంది రియా..."ఏమో అనుకున్నా మంచోడే...."

టైర్ బిగించేశారు.....తన పని అయిపోవడం తో....షర్ట్ దులుపుకుంటూ వచ్చాడు విజయ్.....షర్ట్ అంతా మట్టి అయ్యి...తెల్ల చొక్కా కాస్తా నల్ల చొక్కా అయ్యింది......తన వైపు వచ్చిన విజయ్ కి తన దగ్గరున్న నీళ్ళు అందించి అతని నుదిటి కి అంటిన చెమట ని తన చీర కొంగు తో తుడిచింది రియా

అలా ఆమె తుడుస్తుంటే అలానే ఆమె కళ్ళలోకి చూస్తుండి పోయాడు విజయ్.....

ఆమె కూడా అలానే అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది......

ఫ్లాష్ బ్యాక్.........

సెకండ్ షో ముగించుకొని....ఇంటి దాకా వచ్చిన రియా గోడ దూకుదామని అలా గోడ ఎక్కి కిందకి చూస్తూ......ఇవాళ పక్కా నా ఎముకలన్నీ విరిగి పోతాయి దేవుడా నువ్వే దిక్కు అని క్యాలిక్యులేషన్లు కూడా వేసుకుందో లేదో...ఇలా ఎవరో తన నడుము దగ్గర పట్టుకున్నట్టు అనిపించి అలా కళ్ళు తెరచిందో లేదో ఇలా తన నడుమును పట్టుకుని తనని కిందకి దించాడు అభి......

ఆ తర్వాత కూడా తనని భుజాల పై మోసుకోని ఇంటి లోపలికి ఆ తర్వాత పైన వున్న తన గదికి అలానే మోసుకెళ్ళాడు......అతని కళ్లలో తన పై ప్రేమ ,బాధ్యత.....చిరు కోపం అన్నీ కనిపించాయి....ఆ అయిదు నిమిషాల్లో.....అలా గదిలోకి తీసుకు రాగానే తనని బెడ్ పై పడుకోబెట్టాడు.......

అయినా కూడా రియా చూపులు అతని కళ్ళ నుంచి మరవలేదు.......

"రియా...రియా..."అని చిటెక వేసి మరీ విజయ్ పిలుస్తుండడం తో ఈ లోకం లోకి వచ్చింది రియా

ప్రయాణం మరలా మొదలయ్యింది........టైం 2:30

"మ్యాడం గారు.....కొంచెం మీ స్టోరి ని రామాయణం లా వర్ణించగలరా...?"గోముగా అడిగాడు విజయ్

"నీ సేవకు మెచ్చితిని....మన ప్రయాణమునకు కారణమైన నీ కోరిక మన్నించకపోతే ఎలా....?చెప్పేదను...జాగ్రత్తగా వినుము...."అని చెప్పడం మొదలుపెట్టింది.........

"అలా నేను కిచెన్ లోంచి బయటకి వచ్చాను"....ఇలా ఉష అత్త ఆ అబ్బాయిని తీసుకొచ్చి...."నాన్నా! మా వాడు కూడా మీ స్కూల్ ఏ వాడ్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళరా....?"అని బతిమాలుతూ అడిగింది.....

రియా:నాదసలే జాలి గుండె కదా...నేను కూడా ఒప్పేసుకున్నాను...అలా మేమిద్దరం నడుస్తూ స్కూల్ కెళుతున్నాం.....తను చాలా సైలంట్ గా నడుస్తున్నాడు.....నాకేమొ నోరు కుదురుగా వుండాదాయే....అందుకే తనని అడిగాను

"ఓయ్ నీ పేరేంటి...?"అని దానికి తను సమాధానం చెప్పలేదు....మళ్ళీ ఇంకోసారి అడిగాను...ఈ సారీ చెప్పలేదు.....ఇంకోసారి అడుగుదామని ఆగాను.....

విజయ్:ఎందుకు ఆగావ్....అడగాల్సింది కదా....?కొంపదీసి చెవుడా ఏంటి?

రియా:నాకూ అదే డౌట్ వచ్చింది....అందుకే ఈసారి అడగకుండా అరిచాను."నీ పేరు ఏంటి?"అని....దానికి తను సైగ లు చేశాడు........

విజయ్:అయ్యొ పాపం మాటలు కూడా రావా.........?మరీ ఫోన్ ఎందుకు చేస్తున్నాడు ఎలా మాట్లాడతాడంట...?కొంపదీసి నీకు ఫోన్ చేస్తుంది నువ్వు చెప్పేది ఒకరి గురించి కాదా....?

ఈ సారి రియా తల కొట్టుకుంది........

రియా:ఎందుకంత స్పీడ్ వెనక ఏమైనా కుక్కలు పరిగెడుతున్నాయా....కాస్త తట్టుకోవమ్మా.....ఇక్కడి తో కట్ నాకిప్పుడు ఆకలేస్తుంది...తినేసి తిరిగి విల్ కంటిన్యూ

విజయ్:ఇలా బ్రేక్ లు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికి అవుతుంది నీ 13 ఏళ్ళ లాంగ్ జర్ని.....ఆ ముద్దెప్పుడు వస్తుందో

రియా:ఏంటి....(అంది బిస్కెట్ నములుతూ)

విజయ్:ఏమీ లేదూ నువ్వు ముందు తినమ్మా.......

బిస్కెట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత......

విజయ్:చెప్పు....తనకి మాటలు రావు కదా

రియా:ఏదో సైగలు చేశాడు నాకర్థం కాలేదు........ఆ తర్వాత ఇద్దరం కలిసి క్లాస్ లోకి అడుగుపెట్టాం ........ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ మ్యాడం క్వస్చింస్ అడుగుతుంది.........అన్నటికి క్లాస్ లో ఒక్కరే ఆంసర్ చెబుతున్నారు ఆ ఒక్కరూ ఎవరో కాదు నేను సైట్ కొట్టిన దుర్మార్గుడు........వాడికి చెవుడూ లేదూ మూగా కాదు.......

మ్యాడం వచ్చి వాడ్ని చాలా మెచ్చుకుని పేరడిగింది.........అప్పుడు తెల్సింది ఆయన గారి పేరు.......అభిమన్యు అని......నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోయేసరికి నాకు చాలా కోపమొచ్చింది....మధ్యహ్నం మా అమ్మ తో పాటు ఉష అత్త క్యారేజ్ పట్టుకుని వస్తే అడిగేశాను....ఎందుకు అభిమన్యు నాతో మాట్లాడలేదని.......దానికి అత్త చెప్పిన సమాధానం వాడెవరితోనూ మాట్లాడంట వాడి ప్రపంచం వాడిదంట........

ఇక అప్పుడే నేను డిసైడ్ అయ్యాను.....ఆరు నూరైనా నూరు నూట ఆరైనా వాడ్ని మార్చాలి అని కంకణం కంటుకున్నాను.......

విజయ్:అబ్బా వచ్చిందమ్మా పేద్ద సంఘసంస్కర్త.........వీరనారి.......సరే ఆ తర్వాత

రియా:అదే నా కొంప ముంచింది.........అవసరం లేకపోయినా వాళ్ళింట్లోనే వుండేదాన్నీ మాట్లాడుతూనే వుండేదాన్ని.....నిద్రపోవడానికి తప్ప ఇంటికి కూడా పోయేదాన్ని కాదు........ఇంతా చేస్తే వాడు నాతో మాట్లాడిన మొదటి మాట..........!

విజయ్:హా చెప్పు....చెప్పు

రియా:వాడు నార్మల్ గా మాట్లాడకపోయినా టీచర్స్ కి ఆంసర్స్ ఇచ్చేవాడు.......ఒకసారి ఐతే స్నేహితుడు మూవీ లో విజయ్ లాగా 7 వ తరగతి లెక్కలు చేస్తూ మా టీచర్ కి దొరికి పోయాడు......వాళ్ళెమొ అత్తయ్య ని మావయ్య ని పిలిపించి 7 క్లాస్ లో వేయమని చెప్పారు........

వీళ్ళు కూడా సరే అనుకునే సరికి మా వాడు అడ్డం తిరిగాడు........నేను వెళ్ళనంటే వెళ్ళనని మారాం చేశాడు.......

ఎందుకు రా అంటే రీసన్ చెప్పడు.........అందరూ అడిగి అడిగి విసుగొచ్చి చివరికి వదిలేసారు.......నేను ఒక పెద్ద మనిషి లా వాడి భవిష్యత్తు నా బాధ్యత గా తీసుకుని వాడితో మాట్లాడ సాగాను.......

"అభి ఎందుకు నువ్వు 7 క్లాస్ కి వెళ్లట్ట్లేదు......త్వరగా చదివితే త్వరగా జాబ్ వస్తుంది....ఎంచక్కా నువ్వు 2 ఇయర్స్ కూడా చదవక్కర్లేదు హ్యాపి గా వెళ్ళొచ్చు కదా......?"అడిగాను నేను

తను తల అడ్డంగా వూపాడు..........."పోనీ రీసన్ చెప్పు..."అని అడిగాను నేను......

"ఐ లవ్ యూ ......"అన్నాడు తను.......

విజయ్:ఇలా ఇవ్వు అనుంటాడు.......నీకు పొరపాటున అలా వినిపించి వుంటుంది లే......

రియా:అప్పటికి ' మనం' సినిమా రాలేదు........అయినా నీకొచ్చినట్టె నాక్కూడా డౌట్ వచ్చింది...."ఏంటి...?"అడిగాను మళ్ళీ...."ఐ లవ్ యూ "అని ఇంకోసారి చెప్పాడు.........

విజయ్:ఒకవేళ అప్పుడే వచ్చిన సిన్మాల ప్రభావేమొ....

రియా:నేను అలానే అనుకున్నాను........అందుకే లైట్ తీసుకొని....ఇంటికి వచ్చేశా...ఆ రోజు నుంచి వాళ్ళింటి వైపు పోలేదు.......కానీ.....!

అంటూ ఆగింది రియా

విజయ్:హా కానీ.......?!........
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#10
కథ చాలా బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
#11
"హా కానీ చెప్పు ఏమైంది...."ఆత్రంగా అడిగాడు విజయ్....

ఒక రెండు రోజుల తర్వాత.....రాత్రి 10:20 ఆ సమయం లో అనుకుంటా...ఏదొ చప్పుడవ్వడం తో లేచాను నేను......ఎదురుగా అభి.....ఒక్క నిమిషం నాకేమీ అర్థం కాలేదు.......

"అభి....నువ్వేంటిక్కడ.....ఆల్మోస్ట్ అరిచినంత పని చేశాను......."నేను

ఇంతలో తనమొ ష్........ఏమీ మాట్లాడకు అనేశాడు......నాకేం అర్థం కాలేదు......."ఎందుకొచ్చావ్ "అని అడిగాను.......అలా అడిగానో లేదో తన మోచేతి కి తగిలిన దెబ్బ నా కంట్లో పడింది....ఒ పక్క రక్తం పోతున్నా తన కళ్లలో ఇంత కూడా బాధ నొప్పి కనిపించలేదు.....పైగా నవ్వుతున్నాడు అతను.........

నా ప్రశ్న అభి చెప్పాడు...."2 డేస్ నుంచి రావట్లేదు కదా....చూద్దామని వచ్చాను..."అని అన్నాడు....అదేమీ నేను పట్టించుకోకుండా బ్యాండేజ్ తీసి నాకొచ్చిన విధంగా ఫస్ట్ ఎయిడ్ చేశాను....దానికి తను నా కళ్ళలోకి చూస్తూ నవ్వాడు......

"ఏంటి...అలా నవ్వుతున్నావ్...నీకు నొప్పి గా లేదా...?"అడిగాను నేను...

"నిన్ను చూశాగా నొప్పి పోయింది..."అని తను చెప్పాడు.....నాకు చాలా కోపమొచ్చి...తనని వెళ్ళమని చెప్పేసరికి తను కొంచెం నొచ్చుకున్నట్టు ముఖం పెట్టి వెళ్ళిపోయాడు........

ఆ తర్వాత కూడా నేను వాళ్ళింటి కి వెళ్లలేదు.....ఒక 4 రోజుల తర్వాత అనుకుంటా ఉష అత్త మా ఇంటి కి వచ్చి నన్ను వాళ్ళింటికి లాక్కెళ్ళింది.....ఆవిడ అలా ఫోర్స్ ఫుల్ గా నన్ను తీసుకెళ్ళడం తో నాకేమీ అర్థం కాలేదు....కొంపదీసి వీడేమీ చెయ్యలేదు గా అని ముక్కోటి దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను.....

వాళ్ళింటిలోకి అడుగుపెట్టడం తోనే నాకు షాక్ తగిలింది.....అభి....సోఫాలో కూర్చుని వాళ్ళ నాన్న తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.......ఇంతలో ఉషత్త నన్ను గట్టిగా హత్తుకుని......నీవల్లే రియా వాడు మాట్లాడుతున్నాడు....

"నావల్లా....?"అర్థం కానట్టు అడిగాను నేను

"వాడే చెప్పాడు నువ్వలా గల గలా మాట్లాడుతుంటే వాడికి కూడా మాట్లాడాలి అనిపించింది అంట...."అంది అత్త

"ఓహ్...సరే నేను వెళ్తాను..."అని బయల్దేరుతున్న నన్ను ఆపేసిందో చెయ్యి....ఆ చెయ్యి అత్తమ్మ ది అనుకున్నా కానీ కాదు ఆ చెయ్యి అభి ది....తను నన్ను చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కొని వెళ్ళాడు...
"వామ్మొ.....ఏం చేస్తాడా ఏమొ...."అని భయపడుతున్న నా దగ్గరికి వచ్చాడు అభి.......

వెనకగా దాచి పెట్టుకున్న తన చేతులని ముందుకు చాపాడు....తన చేతిలో ఏదో వుంది...."అని ఆగింది రియా

విజయ్:లవ్ లెటర్ ఆ....

రియా:కాదు.....నోట్ బుక్.....ఆ నోట్ బుక్ చేతికి అందించి....నువ్వు అస్సలు చదవవు అంట కదా అత్తయ్య చెప్పింది అన్నాడు....అభి

"అత్తయ్యా...?అత్తయ్య ఎవరు...?"అడిగాను నేను

"మీ అమ్మ లే గానీ....ఇవాళ్టి నుంచి నువ్వు చదవకపోతే నేనస్సలు ఊరుకోను...రేపు టెస్ట్ వుంది 10 మార్క్స్ కి ఒక్క మార్క్ తగ్గినా నేనస్సలు ఒప్పుకోను...."అన్నాడు సీరియస్ గా

దానికి నేను.......అని మళ్ళీ ఆగింది రియా

విజయ్:హా నువ్వు....?చెప్పు.....

రియా:అబ్బా....ఇలా నువ్వు నేను చెప్పడం కష్టం గా వుంది.......మాములుగా కధ చెప్పినట్టు చెప్పేస్తా విను...సరేనా...?

విజయ్:ఏదోటి తగలడు లే గానీ త్వరగా చెప్పు

ఇంక రియా చెప్పడం స్టార్ట్ చేసింది.......

"నీకు రేపు ఒక్క మార్క్ తగ్గినా నేనూర్కోనూ...."అన్నాడు అభి

"కానీ రేపు టెస్ట్ 10 మార్క్స్ కే.....మరీ ఒక 5 మార్క్స్ అన్నా జాలి చూపించొచ్చు గా...."అంది రియా బిక్క ముఖం వేసుకుని

"నోర్మూస్కుని చదువు.....హాఫ్ ఎన్ అవర్ లో అడుగుతాను........"అని చెప్పి స్నానానికి వెళ్లాడు అభి......

చిక్కిందే సందు అని భావించిన రియా మెల్లాగా అభి రూం నుంచి బయటకి వచ్చి ఆ తర్వాత వాళ్ళింటి కి వెళ్ళిపోయింది.......

15 నిమిషాలు గడిచాక.......

స్నానం చేసి వచ్చిన రియా తన రూం లో వున్న అభి ని చూసి కెవ్వు మని అరిచింది........"నువ్వు ఎందుకు వచ్చావ్.........?"అరిచింది రియా

"నీకు మా ఇంట్లో చదవడం ఇష్టం లేదు గా అందుకే....నేనే మీ ఇంటికి వచ్చాను...త్వరగా వచ్చి చదువు...."అని ఆర్డర్ జారీ చేశాడు........

చేసేదేమీ లేక చదివింది........9 మార్కులు కూడా తెచ్చుకుంది.......ఆ రోజు నుంచి అభి రియా కి ట్యూటర్ అయిపోయాడు........పని లో పనిగా అమ్మ వాళ్లు చెప్పడం తో ఒక క్లాస్ కూడా జంప్ చేశాడు.......

ఇలా కాలం భారంగా సాగుతుండగా.........

రియా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వుంది....అభి 2 ఇయర్.....

అభి కి మెయింస్ ఎగ్జాం వుండటంతో వాళ్ళ నాన్న కార్ లో తీసుకుని వెళ్దామని అనుకుంటారు...అదే విషయం అభి కి చెబితే....రియా కూడా రావాలి అప్పుడే నేనూ వస్తాను కార్ లో అనే సరికి తప్పక రియా కూడా బయల్దేరుతుంది........

కార్ ముందు సీట్ లో అభి వాళ్ళ నాన్న వెనక్ సీట్ లో రియా ఇంకా అభి కూర్చున్నారు.........

అభి రియా నే చూస్తున్నాడు.......రియా కి అన్ ఈసీ గా వుంది......

"ఏంటి వీడు అప్పుడెప్పుడో 4 వ క్లాస్ లో ప్రపోస్ చేశాకా మళ్లీ ఆ వూసె ఎత్తలేదూ ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ప్రేమగా చూడలేదు...ఈ రోజేంటి ఇలా....?"అని తెగ ఆలోచించ సాగింది........

2 గంటల జర్ని తర్వాత ఎగ్జాం హాల్ కి చేరాక......అభి వాళ్ళ నాన్న కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళగా రియా ని ఒక పక్కగా తీసుకెళ్ళిన అభి ఆమె కళ్ళలోకి చూస్తూ.....

"ఇంక కొన్ని రోజులే బంగారం నీకు నాకూ ఈ ఎడబాటు.....అతి త్వరలో మనకి కావల్సింది జరుగుతుంది.....భయపడకు"అని చెప్పి ఎగ్జాం రాయడానికి వెల్లిపోయాడు అభి

"వీడికి చదివి చదివి బ్రైన్ పోయినట్టు వుంది........ఏం వాగుతున్నాడొ అస్సలు అర్థం కావట్లేదు......."అని అయొమయం లో వుండిపోయింది........

ఎగ్జాం ముగించుకుని రానే వచ్చాడు అభి......

"ఏరా ఎలా రాశావ్.......?"అడిగారు వాళ్ల నాన్న

"లేదు నాన్న.....బాగా రాయలేదు......."చెప్పాడు అభి...

"ఏం పర్లేదు లే రా "అని ఆయన ధైర్యం చెబుతుండగా ఇంతలో ఫోన్ వచ్చింది......ఫోన్ మాట్లాడిన ఆయన

"అభి...నాకర్జెంట్ పని పడింది రా ఇటు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళాలి......ఇప్పుడేలా...?'అన్నాడు ఆయన

"ఏం పర్లెదు నాన్నా...నేను రియా బస్ ఎక్కి వెళ్ళిపోతాము మీరు వెళ్ళండి.....మా గురించి టెంషన్ పడొద్దు నేనున్నా కదా...."అని చెప్పడం తో వారిద్దరిని బస్ ఎక్కించి ఆయన వెళ్ళిపోయారు......

కిటికి లోంచి చూస్తూ మౌనంగా వుండి పోయింది రియా

"రియా నీతో కొంచెం మాట్లాడాలి"అన్నాడు అభి..........

"వామ్మొ...ఏం చెబుతాడొ" అనుకుంటూ అతని వైపు తిరిగి "ఏంటి...?"అంది రియా

"ఊహు ఇప్పుడు కాదు....లే మళ్ళీ చెబుతా టైం వచ్చినప్పుడు..."అని ఆగిపోయాడు అభి....

"హమ్మయ్య" అనుకుంది రియా

ఒ పది నిమిషాలకే నిద్ర పోయిన అభి....రియా భుజం పై వాలిపోయాడు......రియా గుండె వేగం పెరిగింది అతని స్పర్శ తో.......ఇంకో పది నిమిషాలకి రియా చేతిలో తన చెయ్యేసి గట్టిగా తనని పట్టుకుని నిద్రపోయాడు అభి......!!!!!!

2 గంటల తర్వాత....స్టాప్ రావడం తో......మేల్కున్న అభి....రియా తో కలిసి బస్టాండ్ లో దిగాడు......

రా అని తన చెయ్యి పట్టుకుని బైక్ పార్కింగ్ ఏరియా కి తీసుకువెళుతుండగా అతన్నే అనుసరిచిన రియా కి మనసులో ఏదో అలజడి..........!!!

బైక్ స్టార్ట్ చేసిన అభి...."రా ఎక్కు ..."అనేసరికి...."ఈ బైక్ ఎక్కడిది......?"అనుమానంగా అడిగింది రియా

"నా ఫ్రెండ్ ది....మెసేజ్ చేస్తే తెచ్చి ఇక్కడ వుంచాడు రా ఎక్కు లేట్ అవుతుంది......"అని తన చెయ్యి పట్టుకుని చెప్పాడు

అతడు పట్టుకున్న తన చేతినే అలా చూస్తూ వుండిపోయింది రియా.......అలా ఎక్కి తన భుజాన్ని పట్టుకుంది........

"మన విషయం ఇంట్లో చెప్పేదాం అనుకుంటున్నా....రియా"అన్నాడు అభి.....

ఆ మాట తో ఉలిక్కి పడింది రియా........!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#12
కథ చాలా చాలా బాగా రాస్తున్నారు....సూపర్
-- కూల్ సత్తి 
Like Reply
#13
4.ఫ్లాష్ బ్యాక్ లో...?
"మన విషయమేంటి....?అభి....?నాకేమి అర్థం కాలేదు....."టెన్షన్ పడుతూ అడిగింది రియా

"ఏం లేదులే ఇల్లు వచ్చింది దిగు....."అనేసరికి దిగేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది రియా

ఆ మరుసటి రోజు పేపర్ లో మెయింస్ కీ పడటంతో తన దగ్గరున్న అభి క్వశ్చిన్ పేపర్ లోని ఆంసర్స్ పేపర్ లో పడిన వాటితో పోల్చి చూసింది......300 మార్క్స్ వస్తున్నాయి 360 కి.......ఆ మార్కులు చూసిన రియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.......

అభి కి పక్కాగా ఐ ఐ టి లో సీట్ వస్తుంది అంటే తను ఏ డిల్లీ కో ముంబయ్ కో వెళ్ళిపోతాడు....యాహూ అని ఆనందపడిపోయింది......

రియా వాళ్ళమ్మమ్మ హాలిడేస్ కి రమ్మని ఒత్తిడి చేయడం తో అభి నుంచి అభి టార్చర్ నుంచి దూరంగా వుండొచ్చు అని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి అభి కి మాత్రం తెలియకూడదని తెలిస్తే తను ఎక్కడ వచ్చేస్తాడో అని ఉదయం 4:00 గంటల కే బస్ ఎక్కుదామని నిర్ణయించుకుంది.....

"ఇంత పొద్దున్నే ఎందుకే...?"అంది వాళ్లమ్మ

"లేదమ్మా వెళ్లాలి..........అమ్మమ్మ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా వుంది..."అని చెప్పింది రియా

"ఏంటో నే నువ్వు ఒక్కోసారి ఒక్కోలా వుంటావ్...!సరే పద బయటకి "అని ఇద్దరూ బయటకి నడిచారు.....

వాళ్లిద్దరు బయటకి వచ్చేసరికి అభి గుమ్మం లో బైక్ తో సిద్ధంగా వున్నాడు......షాక్ అయ్యి అలానే చూస్తుండిపోయింది రియా

"మీ నాన్న కి చెబితె ఇంత పొద్దున్నే నా వల్ల కాదన్నారు...అందుకే అభి ని పంపించింది మీ ఉష ఆంటి...."అని చెప్పింది వాళ్లమ్మ

"ఐతే సరే నన్ను బస్టాండ్ లో దింపమను అభి ని...."అభి వైపు చూడకుండా వాళ్ళమ్మ తో చెప్పింది రియా

"అమ్మొ ఇంకేమైనా వుందా పేపర్లో చదవట్లేదా ఏంటి...ఎందుకు తల్లీ రోజులస్సలే బాలేవు......అయినా 2 గంటల ప్రయాణం ఏ కదా...?ఇద్దరూ వెళ్ళి వచ్చేయండి..."అంది వాళ్ళమ్మ

"వెళ్ళి వచ్చేయాలా...అంటే ఏంటి అభి కూడా నాతో పాటు అక్కడ వుంటాడా...?"అనుమానంగా అడిగింది రియా

"హా అవును....అభి కి కూడా రిఫ్రెష్ అయినట్టు వుంటుంది అసలే ఎగ్జాం బాగా రాయలేదని బాధ లో వున్నాడు తను....."అంది సర్ది చెబుతూ వాళ్ళమ్మ

"అలా ఐతే నేనక్కడికీ వెళ్లను...."అని విసురుగా లోపలికి వెళ్ళి తన గది లోకి అడుగుపెట్టి తలుపేసుకుంది రియా

2 రోజుల తర్వాత.....

ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పిన రియా అటు నించి అటు వాళ్ళమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పించింది.........రియా ఎందుకిలా ప్రవర్తిస్తుందో వాళ్ళమ్మ కి అర్థం కాలేదు.....

కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి ఫోన్ రావడం తో తప్పక ఇంటికి బయల్దేరింది రియా.......

ఇంటికి వెళ్ళడం తోనే ఉష అత్త మళ్ళీ వాళ్ళింటి లోకి లాకెళ్లింది రియా ని.......

"బాబోయ్ మళ్ళీ ఏం చేశాడో..."అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది రియా

"ఏమయ్యింది ఆంటి....?"టెంషన్ తట్టుకోలేక అడేగేసింది ఆకరికి

"ఇవాళ మెయింస్ రిసల్ట్స్ వచ్చాయి.....అభి క్వాలిఫై కాలేదు......అది తెల్సి రూం కెళ్ళి తలుపేసుకున్నవాడు 5 గంటలవుతున్నా బయటకి రాలేదు......పిల్చినా పలకట్లేదు....మీ ఇంట్లో నుంచి వాడి రూం లోకి చూస్తే ఏడుస్తూ కనిపించాడు ఏం చెయ్యాలో అర్థం కాక నిన్ను రమ్మాన్నాము....నువ్వంటే వాడికి చాలా ఇష్టం కదా కనీసం అలా అయినా బయటకి వస్తాడేమొ అని......"గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఆవిడ

తను వింటుంది నిజమేనా అనిపించింది రియా కి 300 మార్క్స్ వచ్చే తను క్వాలిఫై కాకపోవడం ఏంటి...?ఎక్కడో ఏదో అయ్యింది......అని అనుకుంటూ తలూపి......అభి రూం కి వెళ్ళి తలుపు తట్టి....."అభి..."అని పిలవడం ఆలశ్యం రూం తలుపు తెరుచుకుంది.........
లోపల వున్న అభి...ఎవరూ రావొద్దు...రియా తప్ప అనేసరికి ఎవ్వరూ లోపలికి వెళ్ళె సాహసం చేయలేదు......

లోపలికి వెళ్ళిన రియా కి అభి కనిపించలేదు.....ఎక్కడున్నాడా అని వెతుకుతుండగా...వెనకి నుంచి రెండు చేతులు రియా ని చుట్టెశాయి ....ఒక్క నిమిషం ఊపిరి ఆగినంత పనయ్యింది రియా కి

విసురుగా అభి నుంచి దూరం జరిగింది.......

"అభి....ఏం చేస్తున్నావ్...?"అంది కోపంగా........

అభి రియా కి దగ్గరగా రా సాగాడు...రియా వెనక్కి అడుగులు వేయసాగింది.......అభి ముందుకి రియా వెనక్కి జరుగుతూ చివరికి రియా వెనక్కి వెళ్ళే ఆస్కారం లేకుండా గోడ అడ్డం వచ్చేసరికి ఆగిపోయింది......తనకి దగ్గరగా జరిగిన అభి.......తన జుట్టు ని సరి చేయసాగాడు......తన బుగ్గ ని తన చేత్తో తాకుతూ......."ఐ మిస్ యూ......"అని చెప్పి దూరం జరిగాడు......

అప్పటి దాకా భారంగా తీసుకున్న శ్వాస తేలికపడటం తో ధైర్యం తెచ్చుకుని....."నువ్వెందుకు క్వాలిఫై అవ్వలేదు.....?"అడిగింది రియా

"బాగా రాయలేదు సొ అవ్వలేదు..."లైట్ గా చెప్పాడు అభి

"అబద్ధం చెప్పకు అభి.....నువ్వు బాగా రాశావ్ నీకు 300 మార్క్స్ వస్తాయ్...నీ పేపర్ నా దగ్గర వుంది....నేను కాలిక్యులేట్ కూడా చేశాను..."అంది రియా

"ఆ కీ తప్పేమొ....!"అన్నాడు అభి...

"నిజం చెప్పు...అభి..."అడిగింది రియా

"హిం.....బాగా రాద్దాము అనే నేనూ అనుకున్నాను...కానీ ఎగ్జాం రాసేటప్పుడు నాకోటి అనిపించింది...అందుకే ఆంసర్స్ వచ్చినా తప్పు గా పెట్టాను..."అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ అభి

"ఏమి అనిపించింది.......?"అర్థం కాక అడిగింది రియా

"ఒకవేళ నేను క్వాలిఫై అయితే అడ్వాంస్ లో క్వాలీఫై కాకపోయినా నాకు నిట్ లో సీట్ వస్తుంది.......ఇక్కడెక్కడా ఐఐటి కానీ నిట్ కానీ లేవు......నీకు దూరం గా వుండాలి......సో ఇవన్నీ ఆలోచించి......ఐఐటి లైట్ తీసుకున్నా.."అన్నాడు అభి

"నీకేమైనా పిచ్చా....ఐఐటి లైట్ తీసుకోవడం ఏంటి.......?ఐ డోంట్ ఎక్స్ పెక్ట్ దిస్ ఫ్రం యూ అభి..."అని విసురుగా బయటకి వచ్చేసింది రియా

రియా బయటకి రావడం తోనే....

"ఏమ్మా ఎలా వున్నాడు వాడు..."అడిగింది వాళ్ళమ్మ టెంషన్ గా

"బానే వున్నాడు....ఎంసెట్ వుంది కదా,....లైట్ తీసుకుంటాడు లే ఆంటి.....మీరు వర్రీ అవ్వకండి...."అని చెప్పి ఇంటికి కదిలింది రియా

అనుకున్నట్టు గానే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అభి కి......"హమ్మయ్య "అనుకుంది రియా

కానీ అభి కి వచ్చిన కాలేజ్ చూసి నీరస పడిపోయింది......అభి కి మంచి కాలేజ్ ఏ వచ్చింది కానీ ఆ కాలేజ్ వాళ్ళ వూరికి చాలా దగ్గరలో వుంది......అభి హాస్టల్ లో వుండి చదువుకుంటాడు అని ఆశలు పెట్టుకున్న రియా కి నిరాసే మిగిలింది.......

ఇక ఇలా కాదని తనే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.........

అనుకున్నట్టుగానే చాలా కష్టపడి చదివింది.....కాదు కాదు అభి చదివించాడు.........తనకి కూడా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది.....అభి వాళ్ల కాలేజ్ తప్ప అన్నీ కాలేజ్ లూ ఆప్షంస్ పెట్టుకుంది...కానీ తనకి చిత్రంగా అభి వాళ్ల కాలేజ్ లో సీట్ వచ్చింది........

తనకి సేం కాలేజ్ లో సీట్ రావడం తో ఇద్దరి పేరేంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి........

కానీ రియా కి మాత్రం చాలా కోపం వచ్చింది.....ఆవేశం తో వూగిపోతూ తాడో పేడొ తేల్చుకుందాం అని అభి వాళ్ళింటికి వెళ్ళి...అతని రూం లోకి అడుగుపెట్టింది..........

రూం లో ఎవరూ లేరు..........

రూం అంతా కలియ తిరుగుతూ వుండగా....????
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#14
5.అలక
స్నానం చేసి టవల్ తో బయటకి వచ్చాడు అభి...అతన్ని అలా చూడగానే బయటకి పరిగెత్తబోయిన రియా చెయ్యి పట్టుకుని తన వైపు కి లాక్కున్నాడు......రియా వెళ్ళి అభి ని గుద్దింది....తన రెండు చేతులతో తనని బంధి చేస్తూ.....ఏంటోయ్ పారిపోతున్నావ్...ఏదో తెల్చుకుందామని వచ్చినట్టున్నావ్...తేల్చుకుని పో......అన్నాడు.....

"నేను ఏమీ తేల్చుకోడానికి రాలేదు....నన్నొదిలేస్తే నేనెళ్ళిపోతాను........."అంది రియా

"అవునా సరే వెళ్ళిపో..."అని వెంటనే వదిలేసాడు అభి......అతను అలా వదిలేస్తాడని ఊహించని రియా అలానే అతన్ని చూస్తూ నిల్చుండిపోయింది...

"ఓయ్ మొద్దు వదిలేసాను....ఇక పో..."అన్నాడు అభి

ఈ లోకం లోకి వచ్చిన రియ వెంటనే బయటకి పరిగెత్తింది.........

"దేవుడా ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది......."అనుకుంటూ ఇంట్లోకి నడిచింది...కానీ అభి మీద కోపం మాత్రం పోలేదు.......

సమయం దొరికినప్పుడు అడగాలి అనుకుని సమయం కోసం ఎదురు చూడసాగింది........అనుకున్నట్టు గానే సమయం రానే వచ్చింది.......

ఒకరోజు రియా అభి రూం లోకి వెళ్ళగానే ఏదో రాస్కుంటూ కనిపించాడు అభి....

ఇదే కరెక్ట్ టైం అని భావించిన రియా లోపలికి అడుగుపెడుతూనే......లోపలికి వస్తున్న రియా ని చూసిన అభి బుక్ మూసేశాడు....

రియా కి అనుమానం వచ్చినా తను వచ్చిన మ్యాటర్ అది కాదని గ్రహించి........

"అభి నీతో కొంచెం మాట్లాడాలి..."అంది

"హా చెప్పు రియా...."అన్నాడు అభి తన వైపు చూస్తూ

"అది...నేను మీ కాలేజ్ అస్సలు పెట్టుకోలేదు......కానీ నాకు మీ కాలేజ్ ఏ వచ్చింది......దీనికి కారణం నువ్వని నాకు తెల్సు కానీ........ఎందుకిలా చేశావ్ అభి......?నువ్విలా చేయడం నాకస్సలు నచ్చలేదు....నాకంటూ సొంతం గా ఇష్టాలు ఆలోచనలు వుండవా...?అసలు నువ్వు అవి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్......ఎందుకిలా టార్చార్ చేస్తున్నావ్.....అసలు ఏమనుకుంటున్నావ్.....?నువ్వు మీ కాలేజ్ పెట్టడం వల్ల నాకేదొ ఉపకారం చేస్తున్నావనుకుంటున్నావేమో....అస్సలు కాదు....ఇప్పుడు చెబుతున్నా విను నాకస్సలు చదువు అంటే ఇష్టం లేదూ...కానీ చదివాను ఎందుకో తెల్సా కేవలం కేవలం నీకు దూరంగా వుండాలి అనే...నా కష్టానికి ప్రతిఫలం దక్కకుండా చేసావ్...నీ ఉపకారం ఎప్పటికి మర్చిపోను......ఇప్పటి నుంచు నువ్వు నాకు అభి వి కాదు అభిమన్యు వి.......నీకు నాకు ఎలాంటి పరిచయం లేదు........కాలేజ్ లో ఇలానే వుండాలి....నీతో బైక్ పై కాలేజ్ కి వెళ్లమంటారు అమ్మ వాళ్ళు....నువ్వు నన్ను బైక్ పై తీసుకెళ్ళి బస్టాండ్ లో దింపాలి..మళ్ళీ బస్టాండ్ లో ఎక్కించుకుని తీసుకురావాలి....నాతో కాలేజ్ లో అస్సలు మాట్లాడానికి ట్రై చేయకూడదు......నా క్లాస్ ల బయట తిరిగకూడదు......ఇవన్నీ నువ్వు చేస్తేనే నేను నీతో ఒకటి అరా అయినా మాట్లాడతా లేకపొతే అది కూడా మాట్లాడను ఇక నీ ఇష్టం..."అని లేచి వెళ్ళిపోయింది రియా

తను చెప్పింది విన్న అబీ మనసు విరిగిపోయింది

కాలేజ్ మొదటి రోజు....

చెప్పినట్టుగానే బస్టాండ్ లో రియా ని దించేసి అభి వెళ్ళిపోయాడు కాలేజ్ కి.....ఒక అరగంట గడిచాక రియా కూడా కాలేజ్ చేరింది.......ఫస్ట్ డే కావడం తో సీనియర్స్ అంతా జూనియర్స్ కోసం వెయిట్ చేస్తూ వున్నారు.......

రియా కాలేజ్ లోకి అడుగుపెట్టడం తోనే అభి వాళ్ల బ్యాచ్ లో వాళ్ళు రియా ని పిల్చారు......

రియా వినిపించుకోకుండా వెళుతుండగా....ఈ లోపు అభి మాటలు వినిపించాయి తనకి

"రేయ్...తనని పిలవొద్దు.....పిలిస్తే బాగోదు చెబుతున్నా తనని అలా వెళ్ళనివ్వండి..."అని అభి అంటున్నాడు....ఆ మాటలు వినడం తోనే రియా ముందుకు వెళ్ళేది కాస్త వాళ్ళ దగ్గరికి వచ్చింది....

వాళ్లలొ ఒకడు..."నిన్ను కాదులే చెల్లమ్మా నువ్వెళ్ళు..."అని అన్నాడు....

"ఎందుకు సార్ మీరు నన్ను ర్యాగింగ్ చేయరా...?"అడిగింది రియా

అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..."ఏంటీ అమ్మాయి...ర్యాగింగ్ చేయరా అని అడుగుతుందేంటి...?"అని ఆశ్చర్యం లో వుండగా

ఒకడు తేరుకుని..."లేదు నువ్వెళ్ళమ్మా.."అన్నాడు
"పర్లేదు సార్ చెయ్యండి"అంది రియా......ఒక వైపు అభి ముఖం లో మారుతున్న రంగులు చూస్తూ

ఇంకో అతను చేతులు జోడిస్తూ..."తల్లీ నీ వరస చూస్తుంటే నువ్వే ర్యాగింగ్ చేయించుకోని వెళ్ళి మా మీద కంప్లెయింట్ ఇచ్చేటట్టున్నావ్....మాకంత బంపర్ ఆఫర్ వద్దులేమ్మా...నీకు దండం పెడతాం వెళ్ళమ్మా..."అని వేడుకునేసరికి...."మీ బ్యాడ్ లక్..."అని ముందుకు కదిలిందో లేదో......

ఒక అబ్బాయి వచ్చి రియా ఎదురుగా మోకాలి మీద కూర్చుని.......చేతిలోని గులాబి రియా కి అందిస్తూ

"నిన్ను చూసిన క్షణం .....నా మనసు నన్నొ మాట అడిగింది....ఇన్నాళ్ళు నువ్వు లేని నేను ఎలా బతికి వున్నాను అని....అప్పుడు నేను చెప్పాను దానికి... ఇన్నాళ్ళ నా వెతుకులాటకి ,వేదనకి దొరికిన ప్రతిఫలం నీవు....ఇప్పటి దాకా ఎలా బతికానో తెలియని నేను....ఇక మీదట నువ్వు లేక ఎలా బతుకుతానో తెలియట్లేదు...చిత్రంగా వున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా...నువ్వు లేపోతే బతకను అని నేను చెప్పను...కానీ ఆ బతుకు లో ఆనందం వుండదు....బాధ తప్ప.....

ప్రేమ వుండదు వేదన తప్ప.......ఐ లవ్ యూ....."

అతని మాటలు వింటున్న రియా అలానే చూస్తుండిపోయింది........!!!!!

అదే మాటలు విన్న అభి.....అతని వైపు కోపంగా వస్తున్నాడు...అతన్ని చూసిన రియా......ఎదురుగా వున్న అబ్బాయి చేతిలోని రోజా పువ్వు తన చేతిలోకి తీస్కుని అతని కళ్ళ లోకి చూస్తూ నవ్వింది.........ఆ నవ్వు చూసిన అభి....నిల్చున్న చోటే స్థానువై పోయాడు.........

అక్కడి నుంచి విసురుగా వచ్చేసి తన క్లాస్ వైపు నడిచాడు........కంట్లోంచి నీళ్ళు వస్తుండగా ఎదురుగా వున్న దారి మసక బారింది...........

అలానే ఏడుస్తూ తన ప్లేస్ కి వెళ్ళి కూర్చున్నాడు అభి.....

చెప్పలేనంత బాధ తీరని మనోవేధన మనసును తొలుస్తుండగా .....జరిగిన క్లాస్లేవీ బుర్ర లోకి ఎక్కట్లేదు.......మనసులో ఒక్కటే ఆలోచన......"రియా..."

అలా ఉదయం కాస్తా మధ్యాహ్నం అయ్యింది..........బెంచ్ పై తల వాల్చి పడుకొని వున్నాడు అభి....అప్పుడు తన దగ్గరికి వచ్చింది షాలిని.........అభి వాళ్ళ క్లాస్ మేట్

"ఏంటి...అభి....ఎమైంది ఎందుకలా వున్నావ్...?"అన్న మాట కి లేచి....షాలిని వైపు చూసిన అభి....ఏం లేదు అని క్లాస్ బయటకి వచ్చేశాడు.......ఏం చెయ్యాలి...?ఎక్కడికి వెళ్ళాలో తెలియక కారిడార్ లో తిరుగుతూ రియా వాళ్ల క్లాస్ వైపు గా వెళ్ళాడు అన్యమనస్కంగా.......

వాళ్ల క్లాస్ లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి.........ఆ నవ్వు ఎవరిదా అని చూసిన అభి మనసు వికలమైపోయింది...

ఉదయం రియా కి ప్రపోస్ చేసిన అబ్బాయి తో రియా మాట్లాడుతూ నవ్వుతోంది......

అలా రియా ని చూసిన అభి కి అక్కడ ఒక్క నిమిషం కూడా వుండాలనిపించక వచ్చేశాడు.........

ఆ సాయంత్రం.....రియా ని బస్టాప్లో ఎక్కించుకోవడానికి వెళ్తున్నాడు అభి.......బస్టాప్ లో ఒంటరిగా వెయిట్ చేస్తుంది రియా......ఎందుకో రియా ముఖం చూడగానే అప్పటిదాకా మనసులో వున్న బాధ,వేదన ఒక్కసారిగా పోయాయి........వెంటనే తన వైపు వెళ్ళడానికి స్పీడ్ పెంచిన అభి.....రియా వద్దకి ఆ అబ్బాయి రావడం తో........అదే స్పీడ్ తో రియా చూస్తుండగానే ముందుకు వెళ్ళిపోయాడు......

ఇంటికి చేరిన అభి....బాధలో....తన రూం కెళ్ళి నిద్రపోయాడు.......టైం 7 అవుతుండగా....ఎవరో తన తలుపు తడుతున్నారు.........ఆ శబ్దం వినపడినా వినిపించనట్టు దిండు అడ్డం పెట్టుకుని నిద్రపోసాగాడు.......అయినా తలుపు తడుతున్నవారు తడుతూనే వుండటంతో........ఇక తప్పక......వెళ్ళి తలుపు తీశాడు...ఎదురుగా వాళ్ళమ్మ తో పాటు రియా వాళ్లమ్మ....కూడా కనిపించింది......

"ఏమైంది.....?"కళ్ళు నులుముకుంటూ ప్రశ్నించాడు అభి.....

"రియా ఏది........?"అడిగింది వాళ్ళమ్మ.......

అంతే...రియా రాలేదు అని అర్థమయి పోయిన అభి...బైక్ కీస్ తీసుకుని మారు మాట్లాడకుండా బయటకి పరుగు తీసి బైక్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో బస్టాప్ కి పోనిచ్చాడు.......ఒంటరిగా కూర్చోని కనిపించింది రియా.......

అభి ని చూడడం తోనే తన ముఖం లో రిలీఫ్ వచ్చిన మరుక్షణం కోపం కూడా రీప్లేస్ అయ్యింది.........
"రియా...రా వెళ్దాం..."అని అభి అనేసరికి........లేచి వచ్చి బైక్ పై కూర్చుంది.....ఇద్దరి మధ్యా మౌనం.....రియా ఏమైనా అడిగితే సమాధానం చెపుదామని అభి...

అభి ఏమైనా మాట్లాడితే తిట్టెయాలి అని రియా ఎవరికి వాళ్ళు మౌనంగా ప్రయాణం ముగించారు.......

అలా వారం రోజులు గడిచాయి......ఇద్దరి మధ్య మాటలు లేవు........ఈ మౌనం అభి ని కుంగదీస్తుంది.....

వారం కాస్తా 4 వారాలు అయిపోయాయి.......ఎగ్జాంస్ మొదలయ్యాయి.......ఇంతకు ముందు లా అభి దగ్గరకి వచ్చి చదువుకొవట్లేదు రియా.....

అభి-రియా ఒకే హాల్లో పడ్డారు......రియా ఏమి రాయకపోవడం అభి గమనించాడు...2 పరీక్షలకి అదే తంతు....రియా హాల్లో కి కి రావడం...పేపర్ తీసుకోవడం బెంచ్ పై పడుకుని నిద్రపోవడం........

తన వైఖరి చూసి విసుగెత్తిపోయిన అభి......ఆ రోజు సాయంత్రం రియా వాళ్లింటి కి వెళ్ళాడు......

అభి ని చూసిన రియా కూడా పెద్ద ఆశ్చర్యపోలేదు.........

అభి ఇంపార్టెంట్ క్వశ్చింస్ చెప్పి...చదవమని తన ల్యాప్ టాప్ లో ఏదో చూస్కోసాగాడు........మధ్య మధ్యలో నవ్వుతున్నాడు.....అదంతా రియా ఒక కంట గమనిస్తూనే వుంది.......సరిగ్గా అభి ఏమైనా తినటానికి తీసుకువద్దామని కిందకి వెళ్ళేసరికి చిక్కిందే సంధు అని భావించిన రియా అభి ల్యాప్ టాప్ లోకి చూసి,...........షాక్ అయ్యింది!!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#15
6.మాట్లాడొద్దు
వెంటనే అభి ల్యాప్ టాప్ చూసిన రియా ఆశ్చర్యపోయింది......అభి వాళ్ల క్లాస్ మేట్ షాలిని తో ఫేస్ బుక్ లో చాట్ చేస్తున్నాడు.......ఆ అమ్మాయి చాటింగ్ చూసి ఒళ్లు మండిపోయీంది రియా కి..........

ఇంతలో అభి అడుగుల శబ్దం వినపడటం తో అలర్ట్ అయిన రియా పక్కకి వచ్చేసింది....లోపలికి వస్తూనే రియా టేబు ల్ పై ఫ్రూట్స్ పెట్టి మెరుపు వేగంతో ల్యాప్ టాప్ వైపు కదిలాడు అభి......

షాలిని నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకున్నాడు.........

రియా కి అభి వ్యవహారం చూస్తుంటే ముళ్ల మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది.....ఆ మరుసటి రోజే షాలిని గురించి ఎంక్వయిరి మొదలుపెట్టింది రియా........

ఈ లోపు అభి వల్ల ఎగ్జాంస్ కూడా బానే రాస్తుంది.......చివరి ఎగ్జాం కి అభి వాళ్లింటి కి రాకపోవడం తో.... రియా నే బుక్స్ తీసుకుని తన రూం కి వెళ్ళింది.....రియా లోపలికి అడుగుపెట్టెసరికి అభి రూం లో లేడు..బెడ్ పై ల్యాప్ టాప్ చూసిన రియా పరుగున దాని దగ్గరికి వెళ్ళింది........

అప్పుడే షాలిని నించి అభి కి మెసేజ్ వచ్చింది......

అది చూసిన రియా కి కోపం పీక్స్ లో వెళ్ళిపోయింది......షాలిని అభి కి ఐ లవ్ యూ చెప్పింది.......

"లాభం లేదు అభి తో మాట్లాడాలి........షాలిని తో మాట్లాడొద్దు అని నేను చెబితే అభి వింటాడా......?నీకేమి సంబంధం అని అంటె....?"అని ఆలోచిస్తూండగా ఇంకో మెసేజ్ వచ్చింది అది చూసిన రియా అభి తో మాట్లాడకపోవడమే బెస్ట్ అనుకుంది.........

అప్పుడే అభి వాష్ రూం లో నుంచి బయటకి వచ్చాడు......రియా కి క్వశ్చింస్ చెప్పి ల్యాప్ టాప్ చూస్కో సాగాడు.....మధ్య లో రియా ని చూడసాగాడు.........రియా ముఖం చాలా ప్రశాంతంగా వుంది......మధ్య మధ్య లో నవ్వుకుంటుంది కూడా గత 4 రోజుల్లో ఎన్నడు తన ముఖం లో కనిపించని సంతోషం చూసిన అభి కి అనుమానమొచ్చింది,............

ఎగ్జాంస్ అయిపోయిన తర్వాత పరిస్థితి మాములు అయిపోయింది...........

అలా ఒక సెం ముగిసి రెండవ సెం మెదలయ్యిందో లేదో యాన్యువల్ డే సెలబ్రేషంస్ కోసం కాలేజ్ మొత్తం హాడావిడిగా మారిపోయింది..........

డ్యాంస్ లూ డ్రామా లూ....అంటూ అన్నీ బ్రాంచ్ ల వాళ్ళు బిసీ అయిపోయారు.........అభి వాళ్ల బ్రాంచ్ ఈవెంట్స్ కి ఆర్గనైజర్......

వర్క్ మొత్తం తనదే అయ్యేసరికి చాలా బిసీ బిసీగా గడిపేస్తున్నాడు అభి......ఈ సమయం లో రియా ని పికప్ చేస్కొవడం డ్రాప్ చెయ్యడం చేయట్లేదు.....ఉదయం 7:30 కల్లా వెళ్తున్నవాడు రాత్రి 10:30 అయితే గానీ రావట్లేదు......

రియా ని చూసి ఒక 2 వారలు అవుతుందేమొ....

ఆరోజు కూడా అలసిపోయి ఇంటికి వచ్చిన అభి....పడుకున్నాడు అనే గానీ కళ్ల ముందు రియా నే మెదులుతుంది..........

చాలా కంట్రొల్ చేసుకున్నాడు కానీ అభి వల్ల కాక...వాళ్ళింటి టెర్రస్ పైకి వెళ్ళి.....పక్కనున్న రియా వాళ్ల ఇంటి టెర్రస్ పైకి దూకి.....మెట్లు దిగి.....అక్కడున్న తలుపుని తన దగ్గర వున్న కీ తో ఓపెన్ చేశాడు.......రియా వున్న రూం వైపు అడుగులో అడుగేసుకుంటు వెళ్లసాగాడు....

రియా రూం కి చేరుకోగానే దగ్గరగా వేసి వున్న తలుపు ని మెల్లగా తీశాడు.......ఎదురుగా బెడ్ పై ఆదమరచి నిద్రపోతుంది రియా.......అలా తనని చూడగానే తన కున్న బడలిక మొత్తం పోయింది......ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేతిలో చెయ్యేసి...........తనకి దగ్గరగా జరుగుతూ ఆమె మోము కి అతని ముఖాన్ని దగ్గరగా తీసుకెళ్ళి ఆమె బుగ్గ పై తన పెదవులతో ముద్దాడాడు.....ఆ వెంటనే తను చేసింది అర్థమై తను లేస్తుందేమోని భయఫడి వెనక్కి తగ్గాడు.....అభి బయపడినట్టు గా రియా నిద్ర లేవలేదు........"హమ్మయ్య..."అనుకున్న అభి.....లేచి తను వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు........
ఆ రోజు మొదలు రోజు తన రూం కి వెళ్ళి రియా ని తనివి తీరా చూసుకునేవాడు.........

అలా ఒక రోజు వెళ్ళిన అభి......రియా రూం లోకి ఎంటర్ అయ్యి తన చేతిలో చెయ్యేసి......మనసులో మాత్రం...."ఇంకొన్ని రోజులు రియా.....మన విషయం అమ్మ వాళ్లకి చెప్పేస్తాను........నీకు దూరంగా వుండడం ఎంత కష్టమొ ఈ కొన్ని రోజుల్లో నాకు తెల్సి వచ్చింది.......ఇంకొక్క క్షణం కూడా నిన్ను వదిలి నేను వుండలేను....."అని ఆమె కళ్లలొకి చూస్తూ తను ఎక్కడున్నాడన్న విషయం మరచిపోయి ఆదమరచి నిద్రపోయాడు....

ఉదయం 6:00 గంటలు.....

ఎవరో తన షర్ట్ పట్టి లాగుతున్నారు......"అభిమన్యు...అభిమన్యు.."అని పిలుస్తున్నారు......సడన్ గా మెలుకువ వచ్చి చూస్తే ఎదురుగా రియా......కోపంగా తన వైపు చూస్తుంది......

"అభిమన్యు.........నువ్వేంటిక్కడ...?"5 నెలల తర్వాత తను మాట్లాడుతున్న మొదటి మాట....నిజమా కలా అని ఆలోచించే లోపే తను ఎక్కడున్న సంగతి గుర్తొచ్చింది అభి.....

"గాడ్ ..."అని తలపట్టుకున్నాడు అభి

"నువ్వేంటిక్కడ...?"మళ్లీ అడిగింది రియా......

"రోజులాగే నిన్ను చూద్దామని వచ్చి....ఇక్కడే నిద్రపోయాను....ఐ యాం సారీ..."అని వెళ్లడానికి అన్నట్టు లేచాడు అభి.......ఆల్రెడీ నిల్చొని వున్న రియా అతని మాట తో......అభి ని గట్టిగా హగ్ చేస్కుంది.......అభి కి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు....కానీ రియా తనని అలా హత్తుకుంది అన్న కలే తనెప్పుడు కనలేదు....అలాంటిది నిజమయ్యే సరికి మనసు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.....అలా ఎంత సేపు ఆమె కౌగిలోలో బంధి అయ్యాడో తెలీదు కానీ...ఒక్కసారిగా తనని వదిలేసి......."ఇక పో" అమ్మ వాళ్లు వచ్చేస్తారు అని రియా అనడంతో ఈ లోకం లోకి వచ్చిన వాడల్లే వాళ్ళింటికి పరుగు తీశాడు.......!

ఆ రోజు అభి దేని మీదా కాంసట్రేట్ చేయలేక పోతున్నాడు.......ఏ పని చేస్తున్నా రియా నే కళ్ళ ముందు మెదులుతుంది.....ఒక్కసారి రియా ని చూద్దామని లంచ్ బ్రేక్ లో తన క్లాస్ కి వెళ్ళాడొ లేదో....తను తనకి ప్రపోస్ చేసిన అబ్బాయ్ తో మాట్లాడుతూ కనిపించింది.......మనసు విరిగిపోయి వెనుదిరిగాడు.......

"ఎట్టి పరిస్థితుల్లో...నేనివాళ రియా తో మాట్లాడతాను...ఆ అబ్బాయి తో మాట్లాడొద్దని చెప్పేస్తాను...."అని నిశ్చయించుకున్న అభి......కాలేజ్ అయిపోయాక బస్టాప్ కి వెళ్లాడు......రియా ఆటో కోసం వెయిట్ చేస్తూ కనిపించింది..ఆలస్యం చేయకుండా తన దగ్గరికి వెళ్లి.....

"రియా నీతో ఒక విషయం మాట్లాడాలి..."అన్నాడు అభి

"చెప్పండి అభిమన్యు గారు.."అంది చేతులు ముడుచుకుంటూ

తన పిలుపుకి బాధపడినా తనని తాను తమాయించుకుని......"నువ్వు ఆ వినయ్ తో మాట్లాడకు....."అన్నాడు అభి

"ఏ...?ఎందుకు మాట్లాడకూడదు......."అడిగింది రియా

"తను నీకు ప్రపోస్ చేశాడు....నువ్వు నోచెప్పి ఇప్పుడు మాట్లాడుతుంటే.....తను అడ్వాటేజ్ తీసుకోడా...?అడిగాడు అభి

"నో చెప్పానని నీకు చెప్పానా......?"ఎదురు ప్రశ్నించింది రియా

అలానే తన్ వైపు చూస్తుండిపోయాడు అభి తను వింటుంది నిజమొ కాదో తేల్చుకోలేక.......!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#16
7 & 8.డ్రామా+డ్యాంస్

తను చెప్పింది విని షాక్ లో వుండగానే.....తనే అందుకుని మళ్ళీ చెప్పింది రియా

"అయినా నువ్వు షాలిని తో మాట్లాడినప్పుడు లేనిది నేను వినయ్ తో మాట్లాడినప్పుడు వచ్చిందా....?"అడిగింది రియా

"షాలిని ని మధ్యలో తీసుకు రాకు...."అన్నాడు అభి సీరియస్ గా

"అహా...కోపమే.....ఆ అమ్మాయి ని అంటె నీకెందుకు అంత కోపమొస్తుంది.......?"అంది రియా

"రియా.....ఆ షాలిని మా క్లాస్ షాలిని ఒక్కరు కాదు...అసలు చెప్పాలంటే తను నేనే....నీకు కోపమొచ్చి తనతో మాట్లాడద్దు అని నువ్వు చెబితే నువ్వు వినయ్ తో మాట్లాడొద్దు అని చెబుదామని ఆ ఎకౌంట్ క్రియేట్ చేసి ఒక పక్క షాలిని లా ఫోన్ లో మరో పక్క ల్యాప్ టాప్ లో నాలా చాట్ చేస్తున్నాను...లాస్ట్ ఎగ్జాం రోజు నువ్వు నా రూం కొచ్చినప్పుడు నేను వాష్ రూం లో వుండి ఆ "ఐ లవ్ యూ" మెసేజ్ పెట్టాను....ఇదంతా కనీసం నువ్వు నాతో మాట్లాడతావనే హోప్ తో చేశాను...కానీ వినయ్ విషయం అలా కాదు....."అన్నాడు అభి

"సో......అబ్బద్దాలు కూడా ఆడుతున్నారన్నమాట తమరు మా దగ్గర......ఇప్పుడు చెబుతున్నా విను.....నేను వినయ్ తో మాట్లాడడం ఆపను.....ఎందుకంటే...నేను తన ప్రపోసల్ ని ..."అని ఏదో చెబుతుండగా అక్కడికి వచ్చిన వినయ్ "హాయ్ రియా అక్కా..."అన్నాడు వినయ్

"వచ్చెశాడు ఎదవ....కరక్ట్ టైం కి వూడిపడ్తాడు........."అని తల కొట్టుకుంది రియా

వినయ్ నోట్లోంచి "అక్కా " అన్న మాట వినపడటం తో వినయ్ ముఖం లో ఒక వెలుగొచ్చి చేరింది.......వినయ్ ని పట్టుకుని "ఏమన్నావ్...?"అన్నాడు అభి

"అక్కా...అన్నాను...ఏమయ్యింది సార్..."అన్నాడు వినయ్

"మరి ఆరోజు రియా కి నువ్వు ప్రపోస్ చేశావ్.......?"అడిగాడు అభి

"అదా....ఆరోజు సీనియర్స్ ర్యాగింగ్ లో భాగంగా చెయ్యమన్నారు....అక్క అది గ్రహించి....వాళ్ళ ముందు నవ్వింది...అంతే అప్పటి నుంచి అందరు మమ్మల్ని లవర్స్ అనుకుంటున్నారు........మేము కూడా ఎందుకు లే..అని ఎవరికి చెప్పలేదు....."అని సింపుల్ గా తేల్చేశాడు వినయ్.......

వినయ్ చెబుతున్నంత సేపు వినయ్ వైపు కొరా కొరా చూసింది రియా

"ఏంటక్కా అలా చూస్తున్నావ్......అభి సార్ ఎవరికి చెప్పరు లే...ఏ సార్ చెప్పరు గా...?"అడిగాడు వినయ్

ఒక నవ్వు నవ్వాడు అభి..."రా రియా..."అని లాకెళ్ళాడు.......వినయ్ మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తుండిపోయాడు....

***

"హలో ప్రియా ఎక్కడున్నావ్....రిహార్సల్ కి టైం అవుతుంది......"ఫోన్ లో అడిగాడు అభి

"సారీ అభి..నిన్న స్కూటి పై ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది.....3 వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు...నాకు రావడానికి కుదరదు...ఐ యాం సారి..."అని చెప్పింది ప్రియ

ఫోన్ పెట్టెసాక.."రేయ్ ఏమంటుంది...ఎక్కడ దాకా వచ్చిందంట...?"అడిగాడు అభి ఫ్రెండ్ ఆకాష్

"తనకి యాక్సిడెంట్ అయ్యిందంట రా.....3 వారాల వరకు రాదంట..."చిరాకుగా చెప్పాడు అభి

"ఇప్పుడెలా 2 వీక్స్ లో యానువల్ డే వుంది....ఇప్పటికిప్పూడు ఎవరు చేస్తారు...."అని అంటుండగా అటు వైపు నుంచి వెళ్ళిన రియా ని చూసిన ఆకాష్....."రియా.."అని పిల్చాడు.....

రియా-వినయ్ ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు....

"ఏంటి సార్ పిల్చారు" అడిగాడు వినయ్

ఆకాష్ ఏం చెబుతాడా అని వినయ్-రియా ల తో పాటు అభి కూడా చూస్తున్నాడు........

"డ్రామా ఇంకా డ్యాంస్ లో మెయిన్ లీడ్ కి యాక్సిడెంత్ అయ్యింది ఆ ప్లేస్ లో రియా నువ్వే చేయాలి...ఈ రోజు నుంచే రిహార్సల్స్.....గెట్ రెడీ..."అన్నాడు ఆకాష్...

ఒక్కసారిగా ముగ్గురూ షాక్

"అది సార్...నా వల్ల కాదు.."అని రియా చెప్పబోయేంత లో....ఆమె మాటకి అడ్డం వస్తూ "చూడు రియా ఇది బ్రాంచ్ పరువుకి సంబందించింది.....కాదు కాడదు అని చెప్పకు....పద..."అనేసరికి ఇక చేసెడేమి లేక ఒప్పుకుంది........రియా కూడా....

డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయి..........రియా తన డైలాగ్ చెప్పేసి ఎదురుగా వున్న హీరో డైలాగ్ కోసం ఆగింది.....
హీరో:ప్రియా(క్యారెక్టర్ నేం) నువ్వంటే ప్రాణం నాకు...నువ్వు లేకు లేను నేను.........నువ్వు...నువ్వు........

అభి:రేయ్ ఏం పోయే కాలం రా నీకు నిన్నటి దాకా బానే చేశావ్ గా....ఈ రోజే మైంది.....అరిచాడు అభి

ఆకాష్:నిన్నటి దాకా వాడి క్రష్ ఏ హీరోయిన్ డైలాగ్ లు పొంగుకొచ్చాయి ఇవాళ రియా అయ్యేసరికి బాబు కి మాట రావట్లేదు......

చూసి చూసి అభి కి విసుగొచ్చి......వెళ్ళి........రియా మఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని

"వెతకని వరమై దొరికావు కానీ నీ మౌనం తో బాధ పెడుతున్నావ్...నీ పై నా ప్రేమ తెలపడానికి మాట లు రాని నిస్సహాయత లో వున్న నాకు కొంచెమైనా జాలి చూపించవా ప్రియా....నిన్ను చూసినప్పుడు ఎన్నో భావాలు.....నువ్వు మదిలో మదిలితే ఎన్నో స్మృతులు.....నువ్వు నా కళ్ళ ముందుకొస్తే రెట్టింపయ్యే నా హృదయ స్పందన......నీ పై వున్నది ప్రేమ కాదు ప్రియా పిచ్చి.......ఈ పిచ్చి లో ఏమైపోతాను అనే దిగులు లేదు....ఎవరూ నాతో వుండరేమో అనే భయం లేదు....నా గమనం ఎటు వైపో అనే చింత లేదు......ఎందుకంటె నా గమ్యం నువ్వైనప్పుడు......నాకెందు భయం....నేను నువ్వైనఫ్ఫుడు నాకెందుకు బాధ...?"అని అంటూ అభి అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు......ఎదురుగా వున్న ప్రియా(అలియాస్ రియా) కంగారుగా అతన్ని పట్టుకుని..."అద్వయ్(హీరొ పేరు) ఏమయింది నీకు...?"అంటుంది........

"నా గమ్యం నీవని తెల్సుకున్న నేను...నీ గమ్యం నేను కాదని తెలియడానికి ఇంత కాలం పట్టింది...ప్రియా......అందుకే జీవితం లొ ఒక ప్రేమ మాత్రమే వుండాలి అది నువ్వే అవ్వాలి...అందుకు నువ్వొప్పుకోవు.......నిన్ను మర్చిపోయి నేనుండలేను......నిన్ను ఒప్పించలేని నేను నిన్ను నొప్పించలేక విషం తాగాను.......ఇక సెలవు..."అని అలా పడిపోతాడు.......అతని గుండెల పై రోదిస్తూ ప్రియా కూడా కన్నుమూస్తుంది.........

ఆడిటోరియం అంతా కరతాళ ద్వనులతో మారు మోగిపోయింది.......

(రిహార్సల్స్ లో అబి పర్ఫామెంస్ నచ్చి.....లాస్ట్ కి కూడా తనే కంటిన్యూ చెయ్యమనే సరికి........ఇలా రిహార్సల్ కాస్తా లైవ్ ఫర్మామెంస్ అయ్యింది)

ఆ తర్వాత...డ్యాంస్.....

ఎలాగో అందులో మెయిన్ అభి-రియా నే కాబట్టి.....ఆ సాంగ్ కూడా వాళ్ళిద్దరూ దుమ్ము దులిపేశారు.......

పెర్ఫామెంస్ ముగుంచుకుని కిందకి దిగుతుండగా రియా కాలు స్లిప్ అయ్యి కిందపడింది...వెంటనే వెనక వున్న అభి......తన కాలు పట్టుకున్నాడు....

నొప్పి తో విల విల్లాడింది రియా......తన నొప్పి ని చూడలేని అభి కళ్లలో నీళ్ళు తిరిగాయి......తను లేచే స్థితిలో లేకపోవడం తో అభి ఎ తనని మోసుకుని ఒక రూం లోకి తీసుకెళ్ళాడు.....ఆయిట్మెంట్ రాస్తూ ఏడుస్తున్న అభి ముఖాన్ని...తన చేత్తో పైకి లేపి....

"అభిమన్యు గారు కూడా ఏడుస్తారా....?"అంది రియా

తన మాటాలేమి పట్టించుకోకుండా ఏడుస్తూనే ఆయిట్మెంట్ రాయసాగాడు అభి.....

"ఛీ ఛీ అబ్బాయిలు ఏడుస్తారా....?వెరీ చీప్ వెరీ చీప్.."అని ఆట పట్టించసాగింది రియా

ఆ మాటకి తన కళ్లలోకి చూశాడు అభి..."ఏ...మేము మనుషలం కాదా?మాకు ఫీలింగ్స్ వుండవా...?"అన్నాడు అభి...

"వామ్మొ.....అబ్బాయిలని అనేసరికి పౌరుషం బానే పొడుచుకొచ్చిందే......"అని అంటుండగా తిరిగి ఆయింట్ మెంట్ రాయసాగాడు అభి......

"అమ్మా........"అరిచింది రియా........"ఓ...సారి..."మెల్లగా చెప్పాడు అభి...

"సారీ చెబితే నొప్పి పోతుందా....?"అడిగింది రియా

"మరి ఏం చేస్తే పోతుంది...?"అర్థం కాక అడిగాడు అభి....ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నట్టు గా వెంటనే ముందుకి వంగి అభి ని గట్టిగా చుట్టేసింది రియా.....

షాక్ లో వుండిపోయాడు అభి.....?!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#17
అప్డేట్ అన్ని సూపర్ గా ఉన్నాయి
-- కూల్ సత్తి 
Like Reply
#18
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

అప్డేట్ చదువుతుంటే అభి అనేవాడు మంచివాడో లేదా చెడ్డవాడో తెలియటం లేదు.
రియా మీద పెత్తనం మాత్రం చలాయిస్తున్నాడు, మరి రియా అభి ని ప్రేమించిందో లేదో అనేది మీ తరువాత అప్డేట్ లో తెలుస్తుంది.

ఇప్పటికి కొంచెం కాన్ఫ్యుజ్ అవుతున్న, ఈ కథ లో ప్రేమ అనేది రియా-విజయ్ ల మధ్య లేదా రియా-అభి లా మధ్య అని. చూడాలి మరి, నాకు మీ నెక్స్ట్అప్డేట్ లో ఆన్సర్ దొరుకుతుందో లేదో అనేది.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=



వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

ముందుగా పైన వున్నా కామెంట్ పెడతామని అనుకుంటుండగా laptop లో ఎదో ఒక pagedown బటన్ ప్రెస్ అయ్యి రీసెంట్ గ అప్లోడ్ అయ్యేనా అప్డేట్స్ అన్ని వచ్చాయి, చిన్న అప్డేట్ అనుకున్న కానీ చాలా పెద్ద అప్డేట్ ఇచ్చి మెప్పించారు.

చాల బాగా వర్ణించారు అప్డేట్స్ ని, చిన్న సందేహం వస్తుంది ఇంతలా ప్రేమించిన అభి ని వదిలి రియా ఎందుకు పారిపోయింది అని. రియా ప్రేమించలేదు అనుకుందాం అన్న ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే రియా కూడా అభి ని ప్రేమిస్తుంది. 

నెక్స్ట్ అప్డేట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తూ...

మీ
=>విక్కీ<=
Like Reply
#19
Super Updates
Like Reply
#20
updates చాలా బాగున్నాయి అన్నెపూ గారు..... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
Like Reply




Users browsing this thread: 1 Guest(s)