Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లాకెట్
#1
లాకెట్
(ఈ లాకెట్ నిజంగానే ప్రాణాలు తీస్తుందా)

నిష్కల

డాక్టర్: గుడ్ మార్నింగ్ ! కూర్చోండి , మీ పేరు?
(తన పేరు తో పాటు డాక్టర్ వెంటనే అడిగిన వయసు మరియు కుటుంబం గురించి కూడా చెప్పి , డాక్టర్ టేబుల్ మీద ఉన్న బోర్డు వైపు చూసింది శశాంక్ సైక్రీయాట్రిస్ట్ అని ఉంది)
డాక్టర్: మీ సమస్య ఏంటి?
ఆకాంక్ష: నిద్ర
డాక్టర్: ఓహో సాఫ్ట్వేర్ ఉద్యోగమా , అది మామూలే
ఆ: లేదు డాక్టర్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో పని చేస్తున్నాను
డాక్టర్: అయితే పని ఒత్తిడి వల్ల నిద్ర రాకపోవడం అవ్వచ్చు
ఆ: నా సమస్య నిద్ర రాకపోవడం కాదు డాక్టర్ నిద్ర రావడం
డాక్టర్: సరే , ఎన్ని గంటలు నిద్ర పోతున్నారు అయితే ?
ఆ: నా సమస్య చీకటి పడగానే నిద్ర ముంచుకు వస్తుంది ఎంత గా ప్రయత్నం చేసినా ఆపుకోలేక పోతున్నాను చుట్టూ వెలుతురు ఉంటుంది కాబట్టి పర్వాలేదు కానీ ఇంట్లో నేను ఒక్కదానినే కదా వుండేది అందుకే పొద్దున్న వెళ్ళే ముందే లైట్ వేసుకుని వెళ్తున్న లేదంటే ఒక రోజు తలుపు దగ్గరే పడిపోయాను తెల్లవారి వెలుతురు వచ్చాక మెలకువ వచ్చింది
(ఆ విషయం చెప్తూన్నప్పుడు ఆకాంక్ష కళ్లలో బెదురు గమనించాడు శశాంక్)
డాక్టర్: మీ సమస్య ఎప్పటి నుండి మొదలు అయింది ?
ఆ: ఈ లాకెట్ నా దగ్గరికి వచ్చినప్పటి నుండి (అంటూ తన బ్యాగ్ లో ఉన్న లాకెట్ తీసి డాక్టర్ చేతికి అందించింది . ఒక గుండ్రటి బంతి ఆకారం మీద పక్షి ఎగరడానికి సిద్దంగా ఉన్నట్టు ఉండి నోరు తెరిచి కోరలు చుపిస్తూన్నట్టు ఉంది సగం బంగారు రంగు లోనూ సగం ఆకుపచ్చ రంగు లోనూ ఉంది. శశాంక్ దాని పరిశీలన గా చూశాడు )
డాక్టర్: మీ దగ్గరకు ఎలా వచ్చింది? మీకు ఎలా తెలిసింది మీకు వచ్చిన నిద్ర సమస్య దీని వల్లే అని?
ఆ: మా ఆఫీస్ పని మీద నేను సైట్ కి వెళ్లాను ముందు ఉన్న పాత ఇల్లు కొట్టేశారు ఆ ఇల్లు మాములుగా ఉన్నా చుట్టూరా చాలా ఖాళీ వదిలారు అక్కడ మొక్కలు ,చెట్లు కొన్ని కుండీల లో కూడా మొక్కలు వేశారు అయితే ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చనిపోవడం తో ఆమె బంధువులు ఇల్లు అమ్మేసారూ అక్కడ ఏవో కట్టాలని అనుకోవడం తో మాకు ఆ పని అప్పగించారు ఆ పని మీద వెళ్ళినప్పుడు స్వతహాగా మొక్కలు అంటే ఇష్టమున్న నేను వాటిని పాడు చేయడం ఇష్టం లేక వేరేగా పెట్టిoచాను కొన్ని అందరికి పంచేసి ఒక మూడు కుండీల మొక్కలు మాత్రం నేను ఇంటికి తెచ్చుకున్నాను అదే నా పాలిట శాపం అయింది కుండీలు మారుద్దామని మట్టి ని తీసిన నాకు ఈ లాకెట్ దొరికింది బాగుంది కదా అని మెడలో చైన్ కి వేసుకున్నా అంతే ఆరోజు నుండి నాకు ఈ సమస్య మొదలయిoది. వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ నా దగ్గరే కనిపిస్తుంది పోనీ నిద్ర కదా సమస్య ఎదో సర్దుకుందాం అనుకుంటే కిందటి వారం నుండి బంగారు రంగు పోయి ఆకుపచ్చ రంగు రావడం మొదలయింది నాకు ఇంక ఎక్కువ రోజులు సమయం లేదు కొన్ని రోజుల లో ప్రాణాలు కోల్పోతాను డాక్టర్ మీరే ఎలా అయినా నన్ను కాపాడండి నిద్ర రాకుండా చేయండి ప్లీజ్ డాక్టర్ ...(అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది )
డాక్టర్: రంగు పోవడానికి మీ ప్రాణాలు కోల్పోడానికి సంబంధం ఏంటి? మీకు ఎవరు చెప్పారు?
(ఆకాంక్ష అంత బెదురుతు చెప్తున్నా డాక్టర్ మామూలుగానే వింటూ ప్రశ్నలు సంధిస్తూన్నాడు కారణం అతని వృత్తి రీత్యా మానసిక సమస్యలు ఉన్నవాళ్ళని రోజు చుస్తూ ఉంటాడు కాబట్టి ఆకాంక్ష చెప్తున్న విషయాలకి పెద్దగా ఆశ్చర్య పోవటం లేదు పైగా ఆకాంక్ష ఎదో భ్రమ లో ఉంది దాని నుండి ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు)
ఆ: చీకటి పడగానే నిద్ర వస్తుంది అని చెప్పా కదా అసలు నిజo చెప్పాలంటే అది నిద్ర నా శరీరం నుండి నా ఆత్మ వేరు అవుతుంది అలా వేరు అయిన ఆత్మ మరో లోకం లో అడుగు పెడుతుంది...(అంటూ ఆపింది)
డాక్టర్:విచిత్రం గా ఉందే అంటే మీరు నిద్ర పోవటం లేదు కేవలం మీ శరీరం నుండి మీ ఆత్మ వేరు అవుతుంది ..చెప్పండి తరువాత ఏమి అవుతుంది.
ఆ: ఆ లోకం లో కూడా మనుషులు ఉంటారు మన లాగే కాకపోతే మెడ నుండి కాళ్ల దాకా నల్లటి వస్త్రం ఉంటుంది గుంపు గుంపులు గా ఉంటారు నా వైపు వింతగా చుస్తూ ఉంటారు , వాళ్ల కళ్ళు ...క....ళ్ళు..(భయం తో గొంతు లో గుటక వేసి ) తెల్లగా ఉంటాయి మన లాగా నల్లటి కను గుడ్లు ఉండవు రాత్రి నా కళ్ళు మూసుకోగానే ఆ లోక ద్వారం దగ్గర ఉండేదానిని మళ్ళీ వెలుతురు నా శరీరం మీద పడటం వల్లనో ఏమో ఒక్కసారిగా ఎవరో లాగినట్టు అనిపించేది తెరిచి చూస్తే ఇంట్లో ఉండేదానిని అలా కొన్ని రోజులు అయ్యాక గుస గుసగా వాళ్లు ఎదో మాట్లాడుకుంటూనట్టు అనిపించేది కాకపోతే వాళ్ళ పెదాలు మాత్రం కదిలేవి కాదు ఈ రంగు పోవడం మొదలైన దగ్గర నుండి వాళ్ళ మాటలు వినపడటం మొదలు అయింది మొదట్లో గుస గుస గా వినిపించేది తరువాత అలా సృష్టం గా వినపడుతున్నాయి కానీ ఏమి మాట్లాడుకుంటారో అర్ధం అయ్యేది కాదు అప్పుడు కలిసింది ఆమె ఏమి చెప్తూoదో అర్ధం కాలేదు కాని సైగల ద్వారా అక్కడ నుండి వెళ్ళిపోమ్మoటూన్నట్టు అర్ధం అయింది ఆమె పెదాలు కూడా కదిలేవి కాదు కానీ మాటలు వినపడేవి ఆమె నాకు ఎందుకు సహాయ పడాలి అనుకుంటూoదో అర్ధం కాలేదు ఏమైనా తెలుస్తుంది ఏమో అని ఆ సైట్ అమ్మిన వాళ్ళ దగ్గరకు వెళ్లాను అప్పుడు ఫోటో చూస్తే తెలిసింది ఆ సైట్ లో ఉన్న ఇంటి ఓనర్ అని ఆవిడ తమ దూరపు బంధువు అని తన వాళ్ళ అందరు ఒక ఆక్సిడెంట్ లో పోవడం తో ఒంటరిగా ఉండేదని అన్నీ సంవత్సరాలు ఒంటరిగా ఉన్నా దిగులు పడని ఆమె చనిపోయే నెల ముందు నుండి విచిత్రం గా ప్రవర్తించేది అని తనూ చనిపోతాను అని ఇంటికి వచ్చిన వాళ్ళ అందరికి చెప్పడం ఆస్తులు అన్నీ పంపకాలు చేసిన రెండు రోజుల తరువాత ఇంట్లో మంచం పక్కన ఉన్న శవాన్ని పక్కింటి ఆవిడ చూసి సెక్యూరిటీ అధికారి లకు చెప్పింది మొదట అనుమానస్పద మృతి కింద నమోదు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గుండె ఆగిపోవడం అని చూసి కార్డియాక్ అరెస్ట్ వల్ల అని కేసు మూసేసారు అని తెలిసింది ఇప్పుడు వాళ్లు చెప్పిన వివరాలు బట్టి 2 లేదా 3 రోజులు సమయం ఉంది నాకు మీరు ఎలా అయినా నన్ను కాపాడాలి ఈ రంగు పూర్తిగా పోయేలోపు వరకే మనకు అవకాశం తరువాత నా ప్రాణాలు గాలి లో కలిసిపోతాయి ఆత్మ ఆ లోకం లోకి వెళ్లిపోతుంది.(అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకుంది)
డాక్టర్: చూడండి ఆకాంక్ష నా అనుభవం తో చెప్తున్నాను మీరు ఒంటరి గా ఉండటం మూలాన ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఇవన్ని కేవలం ఊహించుకుంటున్నారు మీకు కొన్ని రోజులు థెరపీ అవసరం తరువాత మీరే మాములు మనిషి అవుతారు ఆమె చనిపోవడం నిజమే కానీ మీరు ఊహించిన కారణం అయ్యి ఉండకపోవచ్చు పైగా మీ నేపధ్యం ఆమె నేపధ్యం ఒకేలా ఉంది కాబట్టి మీరు మీకు కూడా అలా అవుతుంది అని ఊహించుకుంటున్నారు
ఆ:డాక్టర్ నేను మీ దగ్గరకు వచ్చిందే మీ గురించి విని మీరు ఎలాంటి సమస్య అయినా పరిష్కారిస్తారని కానీ మీరు నా మాటలు నమ్మటం లేదు దయచేసి పోనీ కొన్ని రోజులు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారా మనుషుల మధ్య ఉంటే నాకు నిద్ర రాకపోవచ్చు.
డాక్టర్: ఏ కారణం లేకుండా అడ్మిట్ చేయకూడదు సరే ఆ లాకెట్ కదా మీకు సమస్య అది నా దగ్గర వదిలి వెళ్ళండి 3 రోజులు అయ్యాక నేనే మీకు తీసుకువచ్చి ఇస్తాను.(అంటూ చేయి చాచి ఆ లాకెట్ తీసుకున్నాడు)
ఆ : ఈ విషయం మీకు వచ్చి ఎందుకు చెప్పాను అంటే ఎవరికీ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతూందా అని ఆలోచిస్తుంటే ఎక్కడో అల్మారా లో ఉన్న 2 రోజుల క్రితం పేపర్ గాలి కి ఎగిరి వచ్చి నా ముందు మీ ఇంటర్వ్యూ వచ్చిన పేజి కనపడేటట్టు పడింది అప్పటి వరకు సైక్రీయాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలనే ఆలోచన రాలేదు అందుకే ముందుగా చెప్తున్నా ఆ లాకెట్ తో జాగ్రత్త నాకు ఎందుకో నా తరువాత మిమ్మలిని ఎంచుకుంది ఏమో అనిపిస్తుంది లాకెట్ నా దగ్గర లేనంత మాత్రాన జరగవలసింది ఆగుతుంది అని అనుకోను
డాక్టర్: (చిరు నవ్వు తో ) చూడండి మీ ముందే ఇది నా టేబుల్ కింద డ్రాయర్ లో పెడుతున్నా దానిని లాక్ చేస్తున్నా దాని తాళం చెవి నా దగ్గరే ఉంటుంది ఇంకెవరు తీయరు నేను కూడా 3 రోజుల తరువాత తీస్తాను అప్పటికి నమ్ముతారు మీది కేవలం ఊహే అని ఆందోళన వద్దు నా మీద నమ్మకం ఉంచి వెళ్ళండి .
ఆకాంక్ష నిరాశ గా నవ్వి వెనుతిరిగింది
**********(3వ రోజు)********
సమయం సాయంత్రం అయిదు అవుతుంది హాస్పిటల్ లో తన రూమ్ లో పేషెంట్స్ అందరు అయిపోయాక ఖాళీగా కూర్చున్న శశాంక్ కి ఆకాంక్ష గుర్తు వచ్చింది 'ఒకసారి డ్రాయర్ తెరిచి చూద్దామా ' అని అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే వెంటనే తన బ్యాగ్ దగ్గరకు వెళ్ళి తాళం చెవి తెచ్చి తెరిచి చూసేసరికి ఆశ్చర్య పోవడం శశాంక్ వంతు అయింది అందులో ఆ లా.. కె..ట్ లేదు.
సమయం అయిదుoపావు శశాంక్ కారు డ్రైవ్ చేస్తున్నాడు అన్నమాటే గానీ ఆ లాకెట్ ఎలా మాయం అయింది ఈ రెండు రోజులు తాళం చెవి తన దగ్గరే ఉంది మరి లాకెట్ ఎలా మాయం అయింది అని మనసులో అనుకున్నాడు ఒక పావు గంట లో ఆకాంక్ష ఉండే ఇంటి దగ్గరకు వచ్చాడు అది గ్రూప్ హౌస్ లాంటిది మొదటి అంతస్థు లో చివరి పోర్షన్ ఆకాంక్ష ది విసిరేసినట్టు గా వేరే గా ఉంది ఆ పోర్షన్ కాలింగ్ బెల్ నొక్కాడు తలుపు తెరిచిన ఆకాంక్ష శశాంక్ ని చూసి ఆశ్చర్యపోయింది " మీరు ...! రండి లోపలికి " అంటూ ఆహ్వానించింది వచ్చి కుర్చుని " అది మీ లాకెట్ గురించి .." అని చెప్పబోతున్నవాడిని ఆపి " నాకు తెలుసు అది మీ దగ్గర లేదని ఎందుకంటే ఇంటికి రాగానే నా టేబుల్ మీద దానిని చూసా ముందే చెప్పాను గా ఎక్కడ వదిలిన అది నా దగ్గరకే వస్తుంది అని " అంటూ నిరాశ గా నవ్వింది " అయితే మీ నిద్ర ,మరో లోకం నిజమా?మీరు ఇంకొ గంట లో చనిపోవడం కూడా నిజం అవుతుందా?" అని భయం తో గడ గడ అడిగేసాడు ప్రశ్నలు అన్నీ ఎందుకంటే ఆకాంక్ష దగ్గర ఉన్న లాకెట్ ని చూస్తే బంగారు రంగు దాదాపు పోయింది " అదే కదా డాక్టర్ మొన్న మీకు చెప్పాను అయినా మన చేతుల లో ఏమి లేదు " అంటూ విరక్తి గా మాట్లాడిoది.
"ఇప్పుడు చీకటి పడుతుంది ఎలాగూ లైట్ లు అన్నీ వేసే ఉన్నాయి కదా కాబట్టి మీకు నిద్ర వచ్చే అవకాశం లేదు నేను ఉన్నాను కదా మీకు భయం లేదు" అంటూ భరోసా ఇచ్చాడు " లేదు డాక్టర్ మిమ్మలిని అనవసరం గా ఇందులో తెచ్చాను ఏమో అనిపిస్తుంది నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం రాకూడదు దయచేసి వెళ్ళీపొండి" అని వేడుకొంది " చూడండి మీరు కూడా కావాలని ఇందులో రాలేదు నన్ను ఎంచుకోన్నట్టు మిమ్మలిని కూడా ఎంచుకుంది ఏమో కాబట్టి కలిసే పోరాడుదాo" అని శశాంక్ అన్నాడో లేదో ఇంట్లో లైట్లు అన్నీ మినుకు మినుకుమనసాగాయి " పదండి బయటికి వెళ్దాం " అని ఆకాంక్ష చేయి పట్టుకుని బయటికి వెళ్ళే లోగానే వెనక నుండి ఎదో లాగినట్టు అనిపించింది ఇద్దరికీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదో పెద్ద ద్వారం దగ్గర ఉన్నారు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎదో మాట్లాడాలి అనుకున్నా గొంతు పెగల లేదు లోపలికి అడుగు పెట్టారు శశాంక్ కి ఆకాంక్ష చెప్పినట్టు గానే ఉంది అక్కడి పరిస్థితులు అందరు వింతగా చూస్తున్నారు ఇంతలో ఎదో శబ్దం వచ్చింది అందరి ఒంటి మీద ఉన్న నల్లటి వస్త్రం రెక్కలు గా మారిపోయింది ఎవరో వస్తున్నారు అని అర్ధం అయింది అందరు గౌరవం ఇస్తున్నట్టు రెక్కలు ఆడించడం మొదలుపెట్టి వృత్త ఆకారం లో నిల్చున్నారు ఇంతలో ఒక పెద్ద పక్షి వచ్చి మధ్యలో వాలింది ఆ లాకెట్ మీద ఉన్నట్టు గానే ఉంది శశాంక్ చూస్తుండగానే ఆకాంక్ష ని తీసుకువెళ్లారు పక్షి ఆకాంక్ష కళ్ళలోకి చూడగానే ఆకాంక్ష కూడా అక్కడ ఉన్న వారి లాగే మారిపోయింది శశాంక్ ఆకాంక్ష ని చేరుకుందాం అనే లోపు బలం గా వెనక్కి ఎవరో లాగినట్టు అనిపించింది అంతే తెరిచి చూస్తే శశాంక్ తన ఇంట్లో మంచం మీద ఉన్నాడు ' అయితే ఇది కల ' అనుకుని లేచి ముఖం కడుక్కున్నాడు అయితే ఆకాంక్ష కి ఫోన్ చేస్తే సరిపోతుంది ఏమి జరిగిందో తెలుస్తుంది అనుకుని ఫోన్ చేసాడు కానీ తీయలేదు సరే కాఫీ పెట్టకుందామని కిచెన్ లోకి వెళ్లాడు తన ఒంటరి జీవితాన్ని వెక్కిరిస్తున్నట్టు లంకoత ఇంట్లో తనూ ఒక్కడే ఈలోగా ఫోన్ మోగింది ఆకాంక్ష నెంబర్ చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది వెంటనే తీసి " హలో ! ఆకాంక్ష " అన్నాడు " లేదండి మీరు ఎవరు?" అని ఒక మగ గొంతు వినిపించింది " నా పేరు శశాంక్ నేను ఒక సైక్రీయాట్రిస్ట్ తను నా పేషెంట్ తను ఎక్కడికి వెళ్లింది ?మీరు ఎవరు?" అని అడిగాడు ఆందోళన గా " నేను ఒక సెక్యూరిటీ అధికారి కానిస్టేబుల్ క్షమించండి మీరు అడిగిన అమ్మాయి చనిపోయింది పక్కింటి వాళ్ళు చూసి మాకు చెప్పారు ఇప్పుడే పోస్ట్ మార్టం కి తీసుకువెళ్లారు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి మీకు ఇంకా వివరాలు కావాలంటే పోస్ట్ మార్టం జరిగాక ఫోన్ చేయండి " అంటూ ఫోన్ పెట్టేసాడు .శశాంక్ కి తల తిరిగిన్నట్టు అనిపించింది అంటే జరిగింది అంతా నిజమే అయితే తనూ కూడా కొన్ని రోజుల లో అని అనుకుంటూ ఫోన్ టేబుల్ మీద పెట్టబోతు అక్కడున్న వస్తువు చూసి కెవ్వున అరిచాడు బంగారు రంగు లో లాకెట్ మెరుస్తుంది .
**********సమాప్తం**********

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice thrilling story  happy
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)