Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
మన పాఠక మిత్రులకోసం మరో ధారావాహికం త్వరలో
వివరాలు కొద్ది దినాలలో
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
(This post was last modified: 30-07-2025, 04:56 PM by
k3vv3. Edited 8 times in total.)
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
కొనేళ్ల క్రితం ఓ పెద్ద స్వామిజీ నాతో చెప్పిన మాటలు ఇవి..
**************************************
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
డేంజరస్ లైఫ్ -2
తప్పిన ప్రమాదం
' నీ పేరు భానుప్రకాష్.... పేరు మార్చుకో బావ... 'అంది విన్నీ...
" ఎందుకే? " అంటే ' భాను అంటే సూర్యుడు, నా పేరు వెన్నెల. ఆ రెండు కలవవు గా' అంది.
" అప్పుడప్పుడు కలుస్తాయిలే ఎర్లీ మార్నింగ్, ఈవెనింగ్ ... అది చాలు " అన్నా నేను
*************************
ఇప్పుడు:
స్పృహ వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న. వెంటిలేటర్ మీద బతికి ఉన్న. నా చావు గేట్ బయటే వెయిట్ చేస్తుంది, జస్ట్ కార్డ్ స్వైప్ చేసి రావడానికి ఆ కార్డ్ ఏ నా పర్మిషన్. నాకు ఈ హాస్పిటల్ బెడ్ కొత్త కాదు. ఇప్పటికి నా మీద 31 మర్డర్ అట్టెంప్ట్స్ జరిగాయి.
నర్సుల మాటలు వినపడుతున్నాయి. " పాపం ఇతని ఫ్యామిలీ అంత బయట టెన్షన్ లో ఉన్నారు. ఒక యంగ్ ఏజ్ అమ్మాయి మాత్రం కాస్త ధైర్యంగా ఉంది. అందరికి సర్ది చెప్తోంది. ఈ వయసులోనే ఎంత ధైర్యమో!! ఇంకో పది రోజుల్లో ఆ అమ్మాయికి ఇతనితో పెళ్లి అంట "
హుమ్...ఆ అమ్మాయే నన్ను షూట్ చేసింది అని వీళ్ళకి ఎలా చెప్పను?? చెప్పిన ఎవరు నమ్ముతారు?? అసలు ఎందుకు చెప్పాలి? తను నా వెన్నెల.....
**********************
కొన్నేళ్ల క్రితం...
అది నా బి.టెక్ ఫైనల్ ఇయర్. క్యాంపస్ ప్లేసెమెంట్ లో మంచి కంపెనీలో ప్లేస్ అయ్యా. లైఫ్ ఇక ఫుల్ హ్యాపీ అనుకుంటూ ఉండగా నా లైఫ్ లో అన
ుకోని ఇన్సిడెంట్ ఒకటి జరిగింది..
ఓసారి నేను, విన్నీ, ఇంకా కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి గోకర్ణ టూర్ కి వెళ్ళాం. అక్కడ అనుకోకుండా ఒక స్వామిజిని కలిసాం. ఆయన నన్ను చూసి నన్ను మాత్రం పక్కకి పిలిచి చెప్పాడు..
"నీలో ఒక గొప్ప శక్తి ఉంది.నువ్వు అనుకుంటే తప్ప నువ్వు చావవు. నీ అనుమతి లేకుండా చావు నీ దగ్గరకు రాదు. ఏ జన్మ పుణ్యమో... ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. నువ్వు నమ్మిన, నమ్మకపోయిన ఇది నిజం."
అప్పటికే ఫ్రెండ్స్ తో ఎంజాయిమెంట్ మూడ్ లో ఉన్న నేను స్వామిజి మాటలు పట్టించుకోలేదు. " థ్యాంక్స్ స్వామి , గొప్ప విషయం చెప్పారు " అని ఆయనకు ఒక 200 ఇచ్చా.
ఆయన కోపంగా ఆ డబ్బుని కింద పడేసి , ' మూర్ఖుడా ' అని ఎరుపెక్కిన కళ్ళతో వెళ్ళిపోయాడు..
నేను ఆ విషయం అసలు మర్చిపోయా..
కొన్నిరోజుల తర్వాత నేను ట్రావెల్ చేస్తున్న ఒక బస్సుకి ఆక్సిడెంట్ అయ్యింది. డ్రైవర్, కండక్టర్ తో సహా బస్సులో ఉన్న అందరు చనిపోయారు. నేను తప్ప.
ఇలాంటివే ఇంకో మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి.. ఓసారి కూలిన బిల్డింగ్ లో ఉన్న, ఇంకోసారి ఫైర్ ఆక్సిడెంట్. నాక్కూడా గాయాలు అయ్యాయి, కానీ చావలేదు.
చావడానికి అన్ని విధాలా అవకాశం ఉన్న ఈ మూడు ఇన్సిడెంట్స్ లో చావలేదు. ఎందుకో స్వామిజి మాటలు నమ్మాలి అనిపిస్తోంది. అవే నిజమైతే నా లైఫ్ ఎలా ఉండబోతోంది??
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
డేంజరస్ లైఫ్ -3
[img=25x25]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image001.gif[/img] చావును జయించిన ఒక్కడు
' ఇంతకీ నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావ్ విన్నీ..? '
అడిగాను నేను.
" జర్నలిస్ట్‌ని అవ్వాలి బావ...నీకు తెలుసు కదా ? అయినా కోర్స్ లో జాయిన్ చేసింది నువ్వేగా. "
' మరి ఇప్పుడేంటి ప్రాబ్లెమ్ ? '
" మా నాన్న, అదే మీ మామ, మిస్టర్ పార్థసారథి IPS కి ప్రాబ్లెమ్. నేను కూడా తనలా సెక్యూరిటీ అధికారి అవ్వాలి అంటాడు. నాకేమో ఇష్టం లేదు బావ. I am against violence. అలా చేతిలో గన్ పట్టుకుని క్రిమినల్స్ చుట్టూ తిరగడం... I know, that doesn't suit me.. అయినా అలా చిన్న బులెట్ తో ఒక్క క్షణంలో ఒక ప్రాణాన్ని ఎలా తీస్తారు బావ !!
అయినా నేను ఎంచుకున్న జాబ్ మంచిదేగా... జర్నలిస్ట్.. తప్పు చేసేవారిని శిక్షించలేకపోయిన, ఆ తప్పుని బయటపెట్టే జాబ్ "
' ఇంతకీ ఏమైంది ? '
" తెలుసుగా.. నాకు ' NewsToday ' పేపర్లో రిపోర్టర్ గా జాబ్ వచ్చిందని.. అది మా నాన్నకి తెలిసి పెద్ద గొడవ అయింది...It's ok లే... కొన్ని రోజులకు సర్దుకుంటుంది "
' అయినా ఏదైనా న్యూస్ ఛానల్లో ట్రై చెయ్యొచ్చుగా ? టీవీలో కనిపిస్తావ్ '
" ఎలక్ట్రానిక్ మీడియా అంత సొల్లు బావ.. I like print media"
*************************
ఇప్పుడు
మళ్ళీ నర్సులా మాటలు :
' తెలుసా ఈ పేషెంట్ పెద్ద క్రిమినల్ అంట. వాళ్ళ అమ్మ అంటుంటే విన్న. ఆవిడ ఇతని కాబోయే భార్యతో ఏమనిందంటే ? '
" విన్నీ... ఏ జన్మలో ఏ పాపం చేసానో ... వీడు ఇలా తయారయ్యాడు. ఎలా ఉండే భాను ఎలా అయిపోయాడు. మా అన్న IPS, నా కొడుకేమో క్రిమినల్. నెలకి ఒకసారి ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడతాడు. వాడికి ఎప్పుడు ఏం అవుతుందో అని క్షణక్షణం నరకం అనుభవిస్తున్న. ఈ వయసులో ఇంతకుమించి తట్టుకునే శక్తి నాకు లేదు.ఆ దేవుడు నన్ను తీసుకుపోవచ్చు కదా..
తల్లిగా నాకంటే తప్పదు. నువ్వెందుకు వాడిని పెళ్లి చేసుకుని నిండు జీవితం నాశనం చేసుకుంటావ్
? అసలే తండ్రిని పోగొట్టుకున్నావ్. ఇలాంటి భర్తతో జీవితాంతం బాధ పడతావా ?ఆలోచించుకో. మీ అమ్మతో కావాలంటే నేను మాట్లాడతాను " అంటూ బాధ పడింది..
ఇంకో నర్స్ : " హా !! నేను ఎప్పుడో అనుకున్న వీడు క్రిమినల్ అని. ఇప్పటికి మన హాస్పిటల్లోనే ఇలా బులెట్ గాయాలతో 5 సార్లు జాయిన్ అయ్యాడు. ఏ సెక్యూరిటీ అధికారి వచ్చి కేస్ ఫైల్ చెయ్యేడు.. అప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఆ అమ్మాయి చక్కగా ఉంది. ఇలాంటివాడు భర్తగా రావడం ఏంటో.."
అవును నిజమే... మా మామ IPS, విన్నీ జర్నలిస్ట్, నేనేమో క్రిమినల్. వింత ఫ్యామిలీ నాది !!
మా మావయ్యని చంపింది నేనే. ఈ మేటర్ మా అమ్మకి తెలిస్తే ఏమైపోతుందో !!! అమ్మ చెప్పినట్లు నేను నిజంగా విన్నీకి సరిపోనా ????
***************
అప్పుడు :
స్వామిజి చెప్పిన మాటలు నేను బలంగా నమ్మసాగాను. ప్రాణాలకు తెగించైనా టెస్ట్ చేసేంతగా.... ఇక మా ఊరి దగ్గర్లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ సెంటర్ ఉంది. మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు.. అక్కడికి ఏదో విసిట్ లాగా మా ఫ్రెండ్ హెల్ప్ తో వెళ్లి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ లైన్ పట్టుకున్న.. 1 మినిట్ గుండె జల్లు మంది భయంతో.. కానీ చూస్తే నేను బతికే ఉన్న ..
మా ఫ్రెండ్ సడన్ గా వచ్చాడు.. రేయ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ ఏదో ఫెయిల్ అయ్యిందంటా.. ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది. 3 ఇయర్స్ గా ఎప్పుడు ఇలా జరగలేదు. మాకింకా చేతి నిండా పని. నువ్వు ఇంటికి వెళ్ళిపో....తర్వాత ఎప్పుడైనా చూపిస్తా అన్నాడు..
అప్పుడు కంఫర్మ్ అయింది. చావు చచ్చిన నా జోలికి రాదు అని. ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్.
నాకు నేను చావాలని ఎప్పుడు అనుకుంటాను ?
ముసలితనంలో, లేదా ఏదైనా పెద్ద భరించలేని రోగం వస్తే తప్ప చావాలి అనిపించదు.. ఇక లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ / డిప్రెషన్స్కే చనిపోయే మూర్కుడిని కాదు. సో నేను చావుని జయించినట్టే !!!
నెమ్మదిగా ఆలోచించ సాగాను. ఇన్ని కోట్ల జనాభాలో నా ఒక్కడికే ఈ వరం ఉందంటే నేను కోటిలో ఒక్కడిగా బ్రతకకూడదు. ఏదో చెయ్యాలి. ఏదో సాధించాలి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
డేంజరస్ లైఫ్-4
ప్రమాదంలో జీవితం
దీర్ఘాయువు ఉండే నా లాంటివాడు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా బతకాలి. అది ఎలా ?
కేవలం అధికారంతోనే అది సాధ్యం అవుతుంది.
అవును !! నేను పెద్ద పోసిషన్ కి వెళ్ళాలి. ఎలాగో నేను ఎక్కువ కాలం బతుకుతాను. ఆ బతుకేదో ఈసురో మంటూ బతికే బదులు, I will live like a king..
ఈ డెసిషన్ తీసుకున్నాక అందుకు మార్గాలు వెతికాను.. సక్రమమార్గంలో నేను అనుకుంది సాధించలేను.. అలా సాధించాలన్న టైం పడుతుంది. దొరికింది అక్రమ మార్గమే...
నాకు తెలిసిన కాలేజ్ ఫ్రెండ్ ఒకడు smuggling చేస్తుంటాడని విన్న. ఎలాగో కష్టపడి వాడ్ని కలిసాను. నేను ఆ ఫీల్డ్‌లో ఎంటర్ అవుతా అని చెప్పా. '' అరేయ్ ! నాకంటే చదువు అబ్బలేదు.. నీకేంట్రా బానే చదువుకున్నావ్ గా '' అన్నాడు.
ఏమో రా నాకు అందరిలా ఇష్టం లేదు అన్న.
నా లైఫ్ సీక్రెట్ ఎవరికీ చెప్పదల్చుకోలేదు. దాన్ని జనాలు ఇంకోలా అడ్వాంటేజ్ తీసుకుంటారని నా భయం.. ఎలాగోలా, వాడితో పాటు ధను గ్యాంగ్‌లో చేరాను. ఆ గ్యాంగ్‌లో అవకాశాలు బాగుంటాయి అంటా.. స్టార్టింగ్‌లోనే ఆ గ్యాంగ్‌లో చేరడం అదృష్టం అంటా.
ఒక నార్మల్ కాలేజ్‌లో B.Tech చేసినవాడికి గూగుల్‌లో ప్లేసెమెంట్ వచ్చినట్లు.. ధన గ్యాంగ్‌లో నేను జాయిన్ అయ్యా.. ఫస్ట్ టైం గన్ పట్టుకున్న. ఏదో కొత్త ఫీలింగ్. నా చేతిలోకి పవర్ వచ్చినట్లు అనిపించింది.
కానీ నా లైఫ్ సీక్రెట్‌ని ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి అనిపించింది.. నాకు ఇంకెవరు ఉన్నారు...విన్నీ తప్ప..
' ఏంటి , నువ్వు అనుకుంటే తప్ప నీకు చావు రాదా ? తపస్సు చెయ్యకుండానే గొప్ప వరం పొందావు !!! ' అనింది..
'' అవును ..హిరణ్యకశపునిలా '' అన్నాను.
వెంటనే విన్నీ మొహం ముడ్చుకుంది.
. ' జాగ్రత్త బావ ' అంది.
' భయపడకు . ప్రహ్లాదుడు పుట్టాలంటే ముందు మనకి పెళ్లి అవ్వాలి ' అన్నాను..
తను సిగ్గు పడింది. ఈ మేటర్ ఎవరికీ చెప్పొద్దు అని తన దగ్గర ప్రామిస్ తీసుకున్న.
తనకి నా మాఫియా మేటర్ చెప్పలేదు. చెప్తే చంపేస్తుంది. నేనేం చేసిన ఊర్కోడానికి తను ' నేనే రాజు నేనే మంత్రి ' లో కాజల్ టైపు కాదు. శత్రువులో విజయ శాంతి టైపు పైగా జర్నలిస్ట్ కూడా.. లవ్ కన్నా నీతి న్యాయం ఏ ముఖ్యం అంటుంది. తనకి మేటర్ తెలిస్తే డైరెక్ట్‌గా పోయి వాళ్ళ నాన్నకు చెప్తుంది..
నాకున్న వరం వల్ల అతి కొద్దీ రోజుల్లోనే మాఫియాలో ఎదిగాను. విచ్చలవిడిగా ఎటాక్ చేసేవాడ్ని. నా మీద కౌంటర్ ఎటాక్ జరిగిన బతికిపోయే వాడ్ని. అందరూ నన్ను లక్కీ అనుకునేవాళ్లు.
మా గ్యాంగ్‌కి పొలిటికల్ లీడర్స్ తో కూడా సంబంధాలు ఉండడంతో I became prominent in society. కుప్పలు కుప్పలుగా డబ్బు, పలుకుబడి, అధికారం ఇదే నేను కోరుకుంది. అవి నా సొంతం అయ్యాయి. ఇప్పుడు నేనే మా గ్యాంగ్లీడర్ని.
నా కింద ఓ వంద మంది పని చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎన్ని క్రైమ్స్ చేసానో ఎంత మందిని చంపానో లెక్కే లేదు.
ఇది నా కథ... ఒకప్పటి ఇప్పటికి నేను ఎంతో మారిపోయాను. మారనిదల్లా విన్నీ మీద ప్రేమ ఒక్కటే.. తనకి నేను చేసే పనులు తెలీకుండా దాచడం చాలాకష్టం అయ్యేది. తను ఫోన్ చేసి అర్జంట్ అంటే గాయాలను దాచుకుని మరి హాస్పిటల్ బెడ్ మీద నుండి లేచి వెళ్లే వాడ్ని....
ఏరోజైనా విన్నెల భానుప్రకాష్ అవుతుంది తను. తనకి అలా పిలిస్తే చాలా ఇష్టం. ఎప్పుడైనా తన కోపం తగ్గాలంటే, నేను అలా పిలుస్తా. దెబ్బకి కూల్ అయిపోతుంది.
ప్రతి లైఫ్‌లో ఓ ట్విస్ట్ ఉన్నట్లు నా లైఫ్‌లో కూడా ఉంది. అదే మా మామ చావు...
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
డేంజరస్ లైఫ్-5
ఎవరు
షరీఫ్ ఖాన్, స్ట్రిక్ట్ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్, నీతికి కట్టుబడ్డ అతి కొద్దీ మంది ఆఫీసర్స్‌లో ఆయన ఒకడు. ఈ మధ్యే ట్రాన్స్ఫర్ మీద మా సిటీకి వచ్చాడు. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఖాళీగా ఉండరు కదా.. ఏదోటి చేస్తారు. అలా.. ఇతను సిటీలో ఉన్న గ్యాంగ్స్ లిస్ట్ అంత బయటకు తీసాడు. నాది టాప్ గ్యాంగ్ కనుక లిస్ట్ లో ఫస్ట్ ఉంది. మమ్మల్ని టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేసాడు. ఆకు నుండి మొదలు పెట్టి, కొమ్మల దాకా... అటు పై ఏకంగా వీరు లాంటి నా దాకా వచ్చాడు.
తట్టుకోలేక పోయాను. నేను ఎంతో కష్టపడి నిర్మించుకున్న కోట ఇది. దాన్ని ఎవడో కొల్లగొడ్తా అంటే ఎలా ఒప్పుకుంటా...? అక్కడికి వాడికి లంచం ఇవ్వడం , బెదిరించడం కూడా ట్రై చేసాం . స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా .. లొంగలేదు...అంతే ఎలాగైనా వేసెయ్యాలని ఫిక్స్ అయ్యా..
వాడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిటీ ఔట్‌సైడ్ ఐసోలేటెడ్ ఏరియాకి పిలిపించాం. కానీ వాడు గ్రూప్ తో వచ్చాడు. ఒకడ్ని చంపితే పొయ్యేది ఇప్పుడు 5,6 మందిని చంపాల్సి వచ్చింది.
షరీఫ్ అంత ఈజీ కాదు. అల్లాడిచాడు మమ్మల్ని. తన వాళ్లంతా పోయిన ఒంటరిగా గంట సేపు పోరాడాడు.
మా వాళ్ళని ఒక 12 మందిని ఏసేసాడు. ఇక వీడ్ని వదలకూడదని నేనే రంగంలోకి దిగాను. తన వైపు aim చేసి, చుట్టూ చూసి గోడ వెనక నుండి వచ్చి తనని కాల్చాను.
అంతే నా బ్రెయిన్ మొద్దుబారి పోయింది. ఎక్కడి నుండి వచ్చాడో, సడన్ గా మా మామయ్య అక్కడికి వచ్చాడు, షరీఫ్‌ని కాపాడబోయి బులెట్ తగిలి తను చనిపోయాడు. షరీఫ్ తన శవాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కన్నీళ్లతో ' నిన్ను వదలను రా ' అని వార్నింగ్ ఇస్తూ...
అంటే నా కేస్ డీల్ చేసిన టీంలో మా మామయ్య కూడా ఉన్నాడు. మరి తనకి నేను అని తెలుసా ? తెలీదా ? తనని కాల్చింది నేనే అని తనకి తెలుసా లేదా ? ఆలోచనలు వస్తున్నాయి కానీ వాటికీ ఆన్సర్స్ తెలీవు. నా బ్రెయిన్ పని చెయ్యలేదు. చిన్నప్పటినుండి ఎత్తుకు పెంచిన మామయ్యని నా చేత్తో చంపాను.
ఈ విషయం విన్నీకి తెలిస్తే ఏమైనా ఉందా !!!
ఆ ఆలోచనే తట్టుకోలేకపోయాను.
ఎందుకో వెంటనే విన్నీ ని కలవాలనిపించింది. అర్జంట్ గా బయటకు రమ్మన్నా. వచ్చింది. ఏమో ఆ రోజు విన్నీ చాలా హ్యాపీగా ఉన్నింది. రొమాంటిక్ మూడ్ లో కూడా. నన్ను హాగ్ చేసుకుంది. లైఫ్ లో ఫస్ట్ టైం we both kissed. కానీ నాకు ఏం అనిపించలేదు. I was just numb. భయమో, బాధో, పశ్చాతాపమో, guilt ఓ నాకేం తెలీలేదు. ఒక మెషిన్లా అక్కడున్న అంతే.
అంతలో విన్నీ ఫోన్ మోగింది. విన్నీ నన్ను వదిలి కుప్ప కూలిపోయింది.
' బావ...నాన్న !!! ' అని భోరున ఏడ్చింది.
తనని తీసుకుని ఇంటికెల్లా. మామయ్య శవం. చుట్టూ ఏడుస్తూ మా ఫ్యామిలీ. విన్నీ కూడా. నేను మాత్రం జీవశవంలా అలా ఉన్న అంతే. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను.
2 డేస్ తర్వాత కాల్ చేసింది విన్నీ. ఇంటికి రా బావ.. ' నాకంత శూన్యంలా ఉంది. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది ' అంటూ. తప్పక వెళ్ళాను.
వెళ్లి విన్నీతో మాట్లాడుతుంటే అక్కడికి అనుకోకుండా షరీఫ్ వచ్చాడు ఏవో ఫార్మాలిటీస్ కోసం. నన్ను చూసాడు. ఇంకేముంది,...భూకంపం ...!! అదృష్టం కొద్దీ ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు విన్నీ తప్పా.
విన్నీకి మొత్తం చెప్పాడు. విన్నీ ఒక్క నిమిషం నమ్మలేదు. నిజమా అన్నట్టు నా వైపు చూసింది. నేను అవును అనగానే తనకి తలకిందులైంది.
' మనిషివేనా నువ్వు ? మా నాన్నని చంపి నన్ను..' అని.....ఏడవడం స్టార్ట్ చేసింది.
' ఎందుకిలా మృగంలా తయారయ్యావ్ ? మృగాలే మేలు, తండ్రిని చంపి బిడ్డల్ని ముద్దాడవు. నిన్ను తిట్టాలంటే మాటలు కూడా రావట్లేదు. ఇలా..అయిన వాళ్ళని చంపుతూ నువ్వు కలకాలం బతికే బతుకు ఓ బతుకేనా !! ఛీ... పో ఇక్కడి నుండి ' అంది.
ఎందుకో అనుకోకుండా అలవాటులో తనని వెన్నెల భానుప్రకాష్ అని పిలిచా..
' వెన్నెల పార్థసారథి. ఆ పార్థసారథినే లేకుండా చేసావ్ ' అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
(This post was last modified: 11-06-2025, 06:10 PM by
k3vv3. Edited 1 time in total.)
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
డేంజరస్ లైఫ్-6
విన్నీ ఎవరు...
అంతే.. ఆ ఇన్సిడెంట్ తో నాకు విన్నికి మధ్య ఓ అగాధమే ఏర్పడింది. కానీ విన్నీ ఈ మేటర్ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలలు గడిచాక విన్నీ కాల్ చేసింది. నన్ను కలవాలని అంది. ఒక నిమిషం తెలీని ఆనందం. పరుగున వెళ్ళాను.
" థాంక్స్ విన్నీ.... నిజం ఇంట్లో వాళ్లకు చెప్పనందుకు "
" ఆల్రెడీ అమ్మానాన్నని పోగొట్టుకుంది. నిజం చెప్పి తనకి మీ అమ్మానాన్నని కూడా దూరం చెయ్యడం నాకు ఇష్టం లేదు "
" విన్నీ.. నేను దుర్మార్గుడినే.. కానీ మామయ్యని చంపేంత కాదు ".
" నాకు తెలుసు. షరీఫ్ చెప్పాడు. నువ్వు తనని టార్గెట్ చేస్తే అనుకోకుండా నాన్న అక్కడికి వచ్చాడు అని. సో ఇప్పుడు నేను నీకు సర్టిఫికెట్ ఇవ్వాళా ? షరీఫ్‌ది మాత్రం ప్రాణం కాదా ? తనకి ఫ్యామిలీ లేదా ? "
"షరీఫ్ కూడా మా గ్యాంగ్‌లో 12 మందిని చంపాడు. వాళ్ళవి ప్రాణాలు కాదా ? వాళ్ళకి ఫ్యామిలీ లేదా ? "
" వాళ్ళు తప్పు చేసారు. "
" ఎంతో మంది సెక్యూరిటీ ఆఫీసర్లు మా గ్యాంగ్ దగ్గర లంచాలు తీసుకుని తప్పు చేసారు "
" ఎవరో తప్పు చేస్తే మంచి వాళ్ళని చంపుతావా ? "
అంతే ఇక నా దగ్గర ఆన్సర్ లేదు. " అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు విన్నీ... నేను ఎంచుకున్న దారి తప్పు అవ్వచ్చు. బట్ నీ మీద ప్రేమ, అత్తయ్య,మామయ్య మీద గౌరవం నాకు ఎప్పుడు ఉన్నాయ్ విన్నీ.."
" నిజంగా ఇంకా నా మీద ప్రేమ ఉందా ? "
" నిజం విన్నీ...ఎలా ప్రూవ్ చేయమంటావ్ ? "
"అయితే ఈ క్షణం ఇవన్నీ వదిలేసి రా..."
" వస్తా విన్నీ... నీ కోసం ఏదైనా చేస్తా "
విన్నీ లాగా నన్ను ఇంకెవ్వరు ప్రేమించలేరు అనిపించింది. తన సొంత తండ్రిని చంపినా వాళ్ళ మీద ఎవరికైనా చంపెయ్యాలి అన్నంత కోపం ఉంటుంది. కానీ విన్నీ.. నేను ఎందుకు అలా చేసానో ఆలోచించింది. నేనేంటో తెలుసు కాబట్టి నాకు పట్టిన ఈ 'అధికార దాహం' అనే దెయ్యాన్ని విడిపిస్తే చాలు అనుకుంది
అందుకే తన మాటకి విలువ ఇచ్చి అన్ని వదిలేసి మాములు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యా. కానీ అదే సిటీలో ఉండడంతో నా గ్యాంగ్ వాళ్ళు నన్ను ఏదో విధంగా కలిసే వాళ్ళు. రమ్మని ఫోర్స్ చేసే వాళ్ళు, సెటిల్మెంట్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఓ పక్క నేను జాయిన్ అయినా కంపెనీలో నాకు గౌరవం ఉండేది కాదు. బీటెక్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని జాయిన్ అయ్యా. సంపాదన లేదు, గౌరవం లేదు. బాస్‌లు నా మీద అర్చినప్పుడు రక్తం మరిగేది. అదే అక్కడ అయితే నా కిందే అంత మంది పని చేసేవారు. నేనంటేనే భయపడేవారు. కోట్లలో డీల్ సెట్ చేసినవాడ్ని. ఇలా PPT లు చేసుకోడం ఏంటో అనిపించింది.
నెమ్మదిగా విన్నీ అప్పుడప్పుడు నాతో మాట్లాడేది. నా పరిస్థితి విన్నీకి అర్థం అయ్యింది. ఇక్కడే ఉంటే నేను డైవర్ట్ అవుతానేమో అని దూరంగా వెళ్ళిపోదాం అని ముంబై కి టికెట్స్ బుక్ చేసింది..
సరిగ్గా ఆరోజు నైట్ 8 కి ఫ్లైట్ అనగా 5 కి మా గ్యాంగ్‌లో శివ ఫోన్ చేసాడు. 'అన్న ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు ఎటాక్ చేసారు. మనోళ్లంతా చచ్చిపోతున్నారు. రా అన్న' అని.
' కుదరదు రా ' అన్న.
" ప్లీజ్ అన్న " అని వాడు బతిమాలుతూ ఉండగానే బులెట్ చప్పుడు. ఫోన్లో వాడి వాయిస్ ఆగిపోయింది. వాళ్లంతా నన్నే భరోసాగా నమ్ముకుని బతికే వాళ్ళు. వాళ్ళను అలా వదిలేసి వెళ్ళలేకపోయాను.
అంతే ఇమ్మీడియేట్ గా స్పాట్ కి వెళ్లాను.
అక్కడ అప్పటికే మా వాళ్ళు చాలా మంది పోయారు. నేను ఎటాక్ స్టార్ట్ చేసి చెదరగొట్టాక ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వెళ్లిపోయారు. శివ, మిగిలిన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాను.
ఈ గ్యాంగ్స్, గొడవలు ఒక ఊబి లాంటివి. ఇందులో దిగ కూడదు. ఓసారి దిగితే బయటకు రావడం చాలా కష్టం. అయినా వాళ్ళని దూరం చేసుకుని ఏదో తెలియని దాని కోసం పాకులాడుతూ ఉంటాం.
ఈ గొడవలో టైమే తెలీలేదు.
టైం చూస్తే 8:30. ఫోన్ చూస్తే విన్నీవి 10 మిస్డ్ కాల్స్. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది.
** కాల్ ఫర్మ్ విన్నీ**
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,408
Threads: 173
Likes Received: 13,869 in 2,748 posts
Likes Given: 8,950
Joined: Nov 2018
Reputation:
957
నేను విదేశీ యాత్రలో ఉన్నందువల్ల ఈ నెలాఖరు వరకు అప్డేట్లు ఇవ్వలేను
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ