Thread Rating:
  • 8 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica చల్లగాలి
#1

అంతు లేని కథ కి స్వాగతం....
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Thanks for the new story

Manoj thanks announce
Like Reply
#3

ముందుగా అందరికి విజ్ఞప్తి


నేను కధలు ఎలాగో పూర్తి చెయ్యను కాబట్టి... ఎవరికి ఎలాంటి నమ్మకాలు ఉండవు ఎలాగో నా మీద ... So నేను likes కామెంట్స్లాంటి రెస్పాన్స్ లు మీ నుండి ఆశించను .. అలాగే మీరు కూడా నా నుండి ఎలాంటి updates ఆశించకండి... Ideas ఎంత వరకు వస్తే అంతే..

ధన్యవాదములు 
[+] 8 users Like Veeeruoriginals's post
Like Reply
#4

పాతికేళ్ళు పై బడిన లిఖిత ఇంట్లో ఎదో సాంగ్ హమ్ చేసుకుంటూ తన బెడ్ రూమ్ లో కూర్చొని రెడీ అవుతూ ఉంది ఇలా.

[Image: Screenshot-20261015-153155-Telegram.jpg]


పక్కనే ఉన్న తన మొబైల్ రింగ్ అయింది..."దీక్ష కాలింగ్"

లిఖిత : దీక్ష

దీక్ష : లిక్కి....ఈ హిందీ దానికి కాస్త అర్థం అయ్యేలా చెప్పు.. ఈరోజు నేను తినను అంటే  నాన్ వెజ్ ఆర్డర్ పెడతా అంటుంది...

లిఖి నవ్వి సరే తనకి ఇవ్వి అని చెప్పింది..దీక్ష ఫోన్ ఇచ్చింది.

లిఖిత : హలో నేహా... "ఆజ్ వో నాన్వెజ్ నహి ఖాతి... ఉస్కెలియే కుచ్ వెజ్ ఆర్డర్ కర్ దో యార్...అంటూ  ఫోన్ లో మాట్లాడుతుండగా బయట ఎవరో మాటలు వినిపించాయి..తన తల్లి ఎవరితో నో మాట్లాడుతూ ఉంది.. అది బాగా పరిచయం ఉన్న గొంతు లా అనిపించటం తో లిఖిత అలా ఫోన్ మాట్లాడి టాప్ వేసుకుని ఎవరా అంటూ బయటకు వచ్చి చూసింది...

అక్కడ ఆమెకు ఆమె చిన్న తనం లో వాళ్ళ పాత ఇంటి పక్కన టిఫిన్ షాప్ లక్ష్మి ఆంటీ కనిపించింది.

లిఖిత ఆశ్చర్యం పోతూ  "ఓహో!! లక్ష్మి ఆంటీ మీరా ఎలా ఉన్నారు చాలా రోజులు అయ్యిందే" అంటూ ప్రేమగా పలకరించింది...

లిఖిత ను చూడగానే తన కూతురి ని చుసినట్లే ఆప్యాయంగా "ఏమ్మా లక్కీ బాగున్నావా" అంటూ వచ్చి అక్కున చేర్చుకుంది లక్ష్మి...

లక్ష్మి : చాలా పెద్దది ఐపోయింది అమ్మగారు  మన లక్కీ

లిఖిత తల్లి : అందుకేనే  పెళ్లి చేసేస్తా చేసుకోవే అంటున్నా వినట్లేదు... ఐఏఎస్ అవుతా  ఐపీస్ అవుతా  అంటూ చదువుతుంది... నిన్ననే వచ్చింది హైదరాబాద్ నుండి మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది...

లిఖిత : నువ్వు ఊరుకో... మీరే చెప్పండి ఆంటీ ఆడవాళ్లు సొంతంగా ఉద్యోగాలు వ్యాపారాలు  చెయ్యాలా వద్దా...

లక్ష్మి నవ్వుతూ : చెయ్యాలి కదమ్మా మరి...అలా చేయబట్టే నా మొగుడు పట్టించుకోకపోయినా నేను బ్రతకగలుగుతున్నా...అంటూ లిఖిత కు వంత పాడింది..

లిఖిత : హా సరిగ్గా చెప్పారు... విన్నావా

తల్లి : చాల్లే లక్ష్మి అందరూ మీ ఆయన లా ఉంటారా... దానికి మంచి మొగుడు ని తీసుకొస్తాం..

లిఖిత  : పెళ్లి కాక ముందు అందరూ మంచి వాళ్ళే... పెళ్లి అయ్యాకే బయట పడతాయి

లక్ష్మి నవ్వుతుంది లిఖిత మాటలకి...లిఖిత తల్లి ఈ పిల్లకి చెప్పలేం అంటూ మొత్తుకుంటుంది

లిఖిత : మా అమ్మ గోల ఉండేదే కానీ... ఇంకేంటి ఆంటీ ఎలా ఉన్నారు అంకుల్ ఇంకా  మారలేదా... మీ టిఫిన్ షాప్ ఎలా  నడుస్తుందా... అన్నట్లు నిఖిల్ గాడు ఎలా ఉన్నాడు చూసి చాలా రోజులు అయింది వాడిని... ప్రశ్నలు టపి టపి మని అడిగేసింది.

లక్ష్మి మొహం లో ఒక రకమైన నిర్వేదం..కళ్ళ వెంట నీళ్లు

లిఖిత : ఆంటీ!! ఏమైంది... అమ్మా??

"ఆ నిఖిల్ గాడి కోసమే ఏడుస్తుంది... వాడు కాలేజ్ లో ఎవరో అమ్మాయిని ప్రేమించాడట...ఆ పిల్ల కోసం  పురుగులు మందు తాగి... చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు"....తల్లి చెప్పుకుంటూ పోతుంటే  లిఖిత వింటూ  లక్ష్మి మొహం లో బాధ ని గమనిస్తూ ఉంది...

లిఖిత : ఆంటీ!!!! అవునా??

లక్ష్మి మౌనంగా అవునమ్మా అంటూ సమాధానం చెప్పింది..

లిఖిత : నిఖిల్ గాడు చాలా సైలెంట్ గా ఉంటాడు అనుకునే దాన్ని.. వాడు ప్రేమ అది అంటే నమ్మలేకపోతున్నా..

తల్లి : సైలెంట్ గానే ఉంటాడు... ఒక్కోసారి నేను గుళ్ళకి గోపురాలకి ఎటైనా పొతే మీ నాన్న కి వాడే వండి పెడతాడు... వాడిని అలా చూసి ఆయన కూడా చాలా బాధ పడుతున్నారు లక్ష్మి...

వాళ్ళ మధ్య లో  నిఖిల్ ప్రస్తావన ఇంకా  కొనసాగుతూ ఉంది కానీ లిఖిత కు చిన్నప్పటి జ్ఞపకాలు ఒక్కసారి గా కళ్ళ ముందు కదిలాయి...

(నిఖిల్ చిన్నప్పుడు అక్క అక్క అంటూ తన వెంటే తిరిగేవాడు... నీ పేరెంట్రా అంటే లిఖిల్ అనేవాడు ముద్దుగా...చూడటానికి కూడా చాలా ముద్దొచే వాడు.)

లక్ష్మి : ఎం చేస్తాం అమ్మా!!!! పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా... అన్న మాటకి లిఖిత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోనుండి బయటకు వచ్చింది..

ఒక కాబోయే ఐఏఎస్ ఆస్పిరంట్ కి ఉండే ప్రధానమైన క్వాలిటీ సమస్య కనిపిస్తే దానిని తన దైన శైలి లో పరిష్కారం వెతకటం..

లిఖిత : ఆంటీ వాడెక్కడ... నేను మాట్లాడాలి

లక్ష్మి : ఇంట్లోనే ఉన్నాడు అమ్మ

లిఖిత : వస్తాడా ఇక్కడికి పిలిస్తే

తల్లి : కాల్ చేసి అయ్యగారు పిలుస్తున్నారు వంట వండాలి ... ఆంటీ ఇంట్లో లేదట అని చెప్పే వాడికి...ఆయన పిలుస్తున్నారు అంటే వస్తాడు కచ్చితంగా. ..

లిఖిత : హా అలా పిలవండి ఆంటీ...

లక్ష్మి సరే అని అలాగే చేసింది..... నిఖిల్ ముందు నిరకరించినా వెంటనే మనసు మార్చుకుని వస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

కొద్ది సేపటికి నిఖిల్ (18) వచ్చాడు.....చాలా  రోజులు తర్వాత వాడిని చూస్తుంది లిఖిత చాలా పొడుగ్గా అయ్యాడు... హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు.... కానీ ఎదో కోల్పోయిన వాడిలా వాడి వాలకం లిఖిత కి అస్సలు నచ్చలేదు..

లిఖిత : నిఖిల్ ఎలా ఉన్నావ్ రా

చిన్నప్పుడు తనని చూడగానే  ఉన్నంత చాలకి తనం లేదు ఇప్పుడు వాడిలో.. ఇప్పుడు ఆ స్థానం లో మొహమాటం సిగ్గు వచ్చాయి.

లిఖిత పలకరింపు తో  మొహమాటం గా నవ్వి బాగున్నా అన్నట్లు తలకాయ రెండు సార్లు  ఊపాడు..

లక్ష్మి : హా చాలా బాగున్నావ్... గడ్డాలు అవి పెంచుకుని... ఇంటర్మీడియట్ కూడా పాసవ్వలేదమ్మా...పరీక్ష కట్టడం తప్పటం కట్టడం తప్పడం... కొడుకు మీద కంప్లైంట్స్..

లిఖిత తల్లి : బుర్ర లో ఆ పిల్ల ఉంటే ఇంకేం ఎక్కుతుంది చదువు.... వీడు వాళ్ళ బాబు లాగే తయారు అయ్యాడు ఆఖరికి... నాలుగు తగిలిస్తే దారిలో పడిపోతాడు... నా దగ్గర వదిలేయ్ లక్ష్మి నేను చూసుకుంటా...అంటూ వాడిని తిట్లు తిట్టడం మొదలుపెట్టింది...

వాడు తల దించుకుని తప్పు చేసిన వాడిలా నిలబడ్డాడు

లిఖిత : అమ్మా.... అమ్మా!!! నువ్వు ఆపు కాసేపు..

లిఖిత తల్లి తగ్గింది...

లిఖిత : నిఖిల్.. నాతో రా... అంటూ వాడిని రూమ్ లోకి తీసుకెళ్లింది..

నిఖిల్ అక్క వెంట వెళ్ళాడు...

లిఖిత నిఖిల్ ని కూర్చోబెట్టుకుని... "ఏంట్రా ఇది అంటూ క్లాస్  మొదలుపెట్టింది".

అక్క  చెప్పిన మాటలు చాలా చక్కగా విన్నాడు ఎం మాట్లాడకుండా...

లిఖిత : అర్థం అయిందా

నిఖిల్ : సరే అక్క

లోపల వాళ్ల మాటలు బయట వీళ్ళ మాటలు పూర్తి అయ్యాయి

కాసేపటికి  తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు....

కానీ లిఖిత కి... తన మాటలు ఏవి కూడా  వాడి బుర్రలోకి ఎక్కలేదు అని స్పష్టంగా  అర్థం అయింది..

*****************

నెక్స్ట్ డే మార్నింగ్  లిఖిత ని స్టేషన్ కి  డ్రాప్ చేయటం  కోసం  తల్లి దండ్రులు ఇద్దరు వెంట బయలుదేరారు..

ముగ్గురు అలా కార్ లో వెళ్తున్నారు...లిఖిత తన  డాడ్ పక్కన కూర్చుంది

తండ్రి : చదువు కంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త రా..

తల్లి : హా వెళ్లి నెల రోజులకే ఎలా అయిందో చూడండి... బొమ్మల ఉండేది.

లిఖిత : అమ్మ నువ్వు ఊరుకుంటావా కాసేపు ప్లీజ్

తండ్రి : తను చెప్పేది నీకోసమే కదరా

లిఖిత : డాడ్... లాస్ట్ త్రీ వీక్స్ నుండి కుక్ లేరు... బయట ఫుడ్ తింటున్నాం

తల్లి : అదేంటి వంట మనిషి ఉండే కదా... ఎం అయింది

లిఖిత : నేహా ఉంది కదా నార్త్ అమ్మాయి.... తన గోల్డ్ చైన్ పోయింది... కుక్ మీదే డౌట్...

తల్లి : అంత జరిగిందా

లిఖిత : హా అందుకే కొత్త వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు... ఎవరిని నమ్మలేకపోతున్నాం

తండ్రి : జాగ్రత్త గా ఉండటం మంచిది...

తల్లి :  కుక్ లేకపోతే ఏం .. మీ ముగ్గురు ఆడపిల్లలే కదా... మీ ముగ్గురు వండుకు తినండి...

తండ్రి : వాళ్ళు  చదువుతుంది సివిల్స్ ... అంత టైమ్ ఉండదు వాళ్లకి..

తల్లి : అలా అయితే మన నిఖిల్ గాడిని వెంట తీసుకుపో... వాడు సూపర్ గా వండి పెడతాడు మీ ముగ్గరికి...

లిఖిత : హహహ mom క్రేజీ ఐడియా...వాడు వస్తాను అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను...

అంతలో సరిగ్గా  లక్ష్మి ఆంటీ టిఫిన్ కొట్టు ముందు నుండి కార్ పాస్ అవుతూ ఉంటే లిఖిత అదిగో టిఫిన్ షాప్... నేను టిఫిన్ పార్సెల్ చేయించుకుంటా డాడీ ఆపండి అని అడిగింది..

కార్ షాప్ ముందు ఆగింది.... లక్ష్మి కార్ ను చూసి ఆనందం తో కార్ దగ్గరికి వచ్చింది...

లిఖిత : ఆంటీ మీ టిఫిన్ తిని చాలా రోజులు అయింది..ఊరు వెళ్తున్న త్వరగా పార్సెల్ చెయ్యరా plz అని కార్ దిగబోయింది..

లక్ష్మి : అయ్యో ఉండమ్మా కార్ దిగకు... నేనే తెచ్చి ఇస్తా అంటూ మళ్ళీ లోపలకి పరిగెత్తింది...

పక్కనే అయోమయం లో ఎదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్న నిఖిల్ గాడిని ఒరేయ్ అయ్యగారు వాళ్ళు  రా త్వరగా వచ్చి చట్నీ లు కట్టు అని అరిచింది...

దూరం నుండి లిఖిత తల్లి "చూడండి వాణ్ని ఎందుకీ బతుకు అన్నట్లు ఎలా కదులుతున్నాడో"... అని చెప్పింది.

లిఖిత : వాడితో నిన్న మాట్లాడి చూసా... వాడికింకా కౌన్సిలింగ్ అవసరం అనిపించింది.... వాడిని అలా వదిలేయకూడదు... నేను ఇక్కడే  ఉన్నట్లు అయితే కచ్చితంగా వాడిలో మార్పు వచ్చేది ఏమో...

లిఖిత తండ్రి కళ్ళ జోడు తీసి వాడినే పరిశీలిస్తూ ఉన్నాడు అలా..

లక్ష్మి నిఖిల్ లు ఇద్దరు టిఫిన్ పార్సెల్ కట్టి కార్ దగ్గరికి వచ్చారు...

లక్ష్మి లిఖిత కి పార్సెల్ అందించింది...

లిఖిత తండ్రి మెల్లగా కార్ దిగి లక్ష్మి తో  "లక్ష్మి....నీ కొడుకు బాగుండటం నీకు ఇష్టమా కదా అని అడిగాడు "..

లక్ష్మి : ఇష్టమే అయ్యా...

లి. తండ్రి : మరైతే... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లోపలకి వెళ్లి వాడు ఊరు వెళ్ళటానికి బ్యాగ్ సిద్ధం చెయ్ ట్రైన్ టైమ్ ఐపోతుంది అని అడిగాడు...

నిఖిల్ గాడు ఆశ్చర్యం గా చూసాడు... లక్ష్మి మాత్రం యే ఊరు ఏంటి అని కూడా అడగకుండా లోపలకి వెళ్లి వాడివి నాలుగు జతలు బట్టలు పళ్ళు తోముకోటానికి బ్రష్ సర్ది బయటకు వచ్చి వాడి చేతిలో పెట్టేసింది .

లిఖిత తండ్రి : రా వచ్చి బండెక్కు... అని చెప్పాడు సీరియస్ గా..

లిఖిత తల్లి డోర్ తీసింది రారా బాబు రా అని...నిఖిల్ గాడు సైలెంట్ గా కార్ ఎక్కేసాడు..

లిఖిత వెనక్కు తిరిగి  "ఎక్కడికి ఏంటి అని కూడా అడగవు ఏంట్రా " అంటూ నవ్వుతుంది..

లిఖిత తండ్రి లక్ష్మి తో "నీ కొడుకు ఇక్కడ ఉండటం కంటే చోటు మారటం మంచిది అందుకే  కొద్ది రోజులు లక్కీ తో  హైదరాబాద్ లో ఉంటాడు". అని చెప్పాడు.

లిఖిత కార్ బయటకు లేచి  ఆంటీ మీరేం భయపడకండి నిఖిల్ గాడిని నేను చూసుకుంటా అని చెప్పింది..

లక్ష్మి కి ఆనందం  తో కన్నీళ్లు తిరిగాయి.... జాగ్రత్తగా వెళ్లి రా అని చెప్పింది కొడుకు తో...కార్ ముందు కి కదిలింది.
Like Reply
#5

Elaa vastaayi annaa ilanti crazy ideas super story continue continue
Like Reply
#6

Superb

Manoj thanks announce
Like Reply
#7

సూపర్ అప్డేట్
Like Reply
#8

Nice starting andi.
Like Reply
#9

Super start... Continue cheyandi bro
Like Reply
#10

Hi veeru Anna,

Namasthe!!

Thank you for the new story. ""Challagaali"". Challaga vundi, baavundi.

Anna, please continue "" Gayatri Apartments"". Baaga nachindi anna.

Mee style super anna. Love you for giving such nice story. Please continue anna.

Thank you.

Me
Kiran kumar
Like Reply




Users browsing this thread: 1 Guest(s)