Posts: 13,917
Threads: 277
Likes Received: 22,822 in 11,142 posts
Likes Given: 2,635
Joined: Nov 2018
Reputation:
452
ఇదిగో మిత్రమా
మీ కొత్త దారం
Posts: 2
Threads: 1
Likes Received: 14 in 1 posts
Likes Given: 0
Joined: Nov 2026
Reputation:
0
01
“ఎవరయ్యా స్టేషన్ ముందు..” వచ్చి రాగానే చిరాకుగా అడిగాడు సిఐ జనార్ధన్. “ఒక టీ చెప్పు” అని కానీస్టేబుల్ వంక చూసి “ఏంటి వాళ్ళ గొడవ” అని ఎస్సై రవిని చూశాడు.
రవి : అడవి జాతి వాళ్ళు సర్, ఆళ్ళ కుల దేవతని గురు మూర్తి ఎత్తుకుపోయాడట అందుకు కంప్లైంట్ తీసుకోమని గొడవ. మీరు లీవులో ఉన్నారని చెప్పినా నాలుగు రోజుల నుంచి రోజూ వస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా వాళ్లకి అర్ధంకాదు.
జనార్ధన్ అంతా విని లోపలికి పంపించమన్నాడు. ఇద్దరు పెద్ద వాళ్లు ఇద్దరు ఆడంగులు లోపలికి వచ్చి చేతులు కట్టుకుని నిలుచున్నారు. ఇద్దరు మగాళ్ళ ఒంటి మీద చొక్కా లేదు, ఒక తువ్వాలు భుజం మీద వేసుకుని, కింద గోచీ కట్టుకున్నారు. ముక్కుకి పోగు, మెడలో కంఠ కడియాలు వేసుకున్నారు. వాళ్లలో ముసలాయన చేతిలో కర్ర ఉంది. మిగతా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు, తల మీద కొంగు కప్పుకుని ఉన్నారు. నుదిటి మీద పెద్ద బొట్టుతో పాటు కళ్ళకి కాటుక, మెడలో కంఠ కడియం, తాళిబొట్టు ఉన్నాయి. వాళ్ళ చేతి నిండా గాజులు, వెండి కంకణాలు, కాళ్ళకి పెద్ద పెద్ద పట్టీలు, కాలి వేలు నిండా తొడిగిన మెట్టెలు చూసి తల ఎత్తి అందరినీ చూశాడు. అమాయకులు అని మనసులో అనిపించింది.
జనార్ధన్ : ఏయి.. ఆ రైటర్ని పిలవ్వయ్యా
అలాగే సర్
రెండు నిమిషాల్లో రైటర్ లోపలికి వచ్చాడు
వచ్చిన నలుగురు మాత్రం కట్టుకున్న చేతులు దించలేదు. ఆడవాళ్ళ కళ్ళలో బెరుకు కనిపిస్తుంది.
జనార్ధన్ : మీ పేర్లు?
నా పేరు వీరయ్య సారూ
నా పేరు రంగా సారూ
నా పేరు దేవుడమ్మ సారూ
నా పేరు మంగ సారూ
జనార్ధన్ : ఎక్కడుంటారు, ఏం చేస్తారు ?
వీరయ్య : మాది పక్కనే గోరంక అడవి సారూ, ఆ ఆడవే మా తల్లిగా బతుకు సాగిస్తున్నాం సారూ. మా పుట్టుక, సావు అన్నీ అడవిలోనే సారూ. చెట్టు తల్లిని పూజిస్తూ అడవిలోనే ఉంటాము, మాలో పుట్టిన చెంచికి ప్రతీ యేటా తల్లి చెట్టు అమ్మోరు పూస్తుంది సారూ. చెంచినే మా దేవతగా పూజించుకుంటాము. అట్టాంటిది మా చెంచిని ఎత్తుకుపోనారు సారూ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెంచి కోసం వెళ్లిన మా ఇద్దరు పిల్లకాయలని తెగ నరికినారు సారూ..
జనార్ధన్ : అమ్మాయి ఫోటో ఉందా?
వీరయ్య : మాకు ఫోటోలు, గుర్తింపులు ఏమి ఉండవు సారూ. అసలు మేము అడవి నుంచి బైటికి రాము సారూ
జనార్ధన్ : మరి ఆ గురు మూర్తి కంట్లో ఎలా పడ్డారు?
వీరయ్య : అడవిలో జింకలని వేటానికి వచ్చినారు సారూ. అవి మేము పెంచుకునేవి. చెంచి ఇష్టంగా కాపు కాసే నెమళ్ళని సంపినారు. చెంచి వాళ్లకి అడ్డం తిరిగినాది. అట్టా గొడవ అయ్యి చెంచిని ఎత్తుకుపోనారు సారూ. మీరే ఏదో ఒకటి చెయ్యాలి సారూ అని బతిమిలాడాడు.
గురు మూర్తి.. ఆకు రౌడీ నుంచి కిరాయి రౌడీగా మారి ఏరియాలో దోపిడీ, హత్యలు, మానభంగాలు, సెటిల్మెంట్లు చేసేవాడు. అలాంటి వాడికి పొలిటికల్ టచ్ అవడంతో గురు మూర్తి ఆగడాలకి అంతు లేకుండా పోయింది. పైకి మాత్రం రియల్ ఎస్టేట్, లోపల మాత్రం దందాలు, ధంకీలు, దోచుకోవడాలు. ఇప్పుడు ఎంతలా ఎదిగిపోయాడంటే గవర్నమెంట్ తన చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అల్లాడిస్తున్నాడు. అలాంటి వాడి చేతిలో చిక్కుకున్న అమ్మాయిని ఎలా కాపాడాలో జనార్ధన్‌కి అర్ధం కాలేదు. అలా అని వీళ్ళకి మాటలు చెప్పి పంపితే లాభం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నలుగురు వంకా చూశాడు.
జనార్ధన్ : ఆడికి ఫోన్ కొట్టండి
గురు మూర్తి నెంబరుకి ఫోన్ చేశారు. నాలుగు సార్లు రింగ్ అయ్యాక అవతల నుంచి హలో అన్న మాట వినపడింది. ఆ మాటలో ధ్వని.. పొగరు, లెక్క లేని తనం తాండవిస్తున్నాయి. జనార్ధన్ ఫోను చేతుల్లోకి తీసుకుని స్పీకర్ ఆన్ చేశాడు. ఇప్పుడు వీడిని గారు అని సంభోదించాలి అన్న ఆలోచనే ఇంకా ఎక్కువ చిరాకు తెప్పించింది.
జనార్ధన్ : గురు మూర్తి గారు, నేను సిఐ జనార్ధన్ మాట్లాడుతున్నాను.
గురు మూర్తి : చెప్పు
వాడి నోటి నుంచి మర్యాద ఆశించడం నాది తప్పు అనుకున్నాడు జనార్ధన్.
జనార్ధన్ : గోరంక అడవిలో మీరు జింకలు, నెమళ్ళు వేటాడుతున్నారని, ఆ నేరాన్ని ఎదిరించినందుకు అడవిలో నివసిస్తున్న చెంచి అనే అమ్మాయిని మీరు బలవంతంగా ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి నలుగురు అడవి నుంచి వచ్చారు.
గురు మూర్తి : ఏంటయ్యా కంప్లైంటు, నెమళ్ళు జింకలు అంటావ్. ఎవరో నలుగురు వస్తే నాలుగు తగిలించి తోసెయ్యక నాకు ఫోన్ చేస్తున్నావా.. ఎవడు నీకు ఉద్యోగం ఇచ్చింది.
రేయి ఈ కుక్కలకి మేత పంపడం లేదా అన్న గురు మూర్తి అరుపు వినిపించగానే జనార్ధన్ కోపంగా కళ్ళు మూసుకున్నాడు. పిడికిలి బిగించుకుంది.
జనార్ధన్ : చెంచి అనే అమ్మాయిని ఎత్తుకొని పోయారా లేదా?
గురు మూర్తి దగ్గర నుంచి ఎవరో ఫోన్ తీసుకున్నట్టు శబ్దం వచ్చింది. తరువాత హలో అని వినిపించింది. అది లాయర్ రామ బ్రహ్మం గొంతు.
రామ బ్రహ్మం : నేను లాయర్ రామ బ్రహ్మం మాట్లాడుతున్నాను. చెంచి అనే అమ్మాయి ఎవరో మాకు తెలీదు. గురు మూర్తి గారు ఏ అడవికి వెళ్ళలేదు. ఏ నెమలిని, జింకలని వేటాడలేదు. గురు మూర్తి గారు దేశ భక్తుడు. అందరూ లేవగానే దేవుడిని తలుచుకుంటే గురు మూర్తి గారు మాత్రం జై భారతీ అనుకుంటాడు. (ఎందుకంటే అది నా పెళ్ళాం పేరు కాబట్టి అని గురు మూర్తి జోక్ చేస్తుంటే అందరూ నవ్వుకోవడం వినిపిస్తుంది) రామ బ్రహ్మం కూడా నవ్వడం తెలుస్తుంది. అందు చేత ఇలా ఎవరో నలుగురు ఊరు, పేరు లేని వాళ్ళ మాటలు విని గురు మూర్తి గారిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు. మరేం.. ఉంటాను.
ఫోన్ కట్ అయ్యింది. జనార్ధన్ ఎదురుగా ఉన్న వాళ్ళని చూశాడు. మిగతా ముగ్గురు ఏడుస్తుంటే మధ్య వయసులో ఉన్న రంగా మాత్రం కోపంగా చూస్తున్నాడు. అందరినీ బైటికి వెళ్ళమన్నాడు జనార్ధన్.
జనార్ధన్ : చూడు పెద్దయ్యా.. ఆ గురు మూర్తి రాక్షసుడు. వాడు చేసే ఏ పనికి సాక్ష్యాలు, ఆధారాలు ఉండవు. ఏవైనా ఉన్నా వాటిని మాయం చేస్తాడు. బలం, బలగం అన్ని వాడి గుప్పిట్లో ఉన్నాయి. ఇక్కడ అందరూ వాడి నుంచి లాభం పొందేవారే, ఎవరైనా మీకు సాయం చెయ్యాలని చూసినా వాళ్ళ కుటుంబాలకి ముప్పు వస్తుంది. అందువల్ల వాడి జోలికి ఎవ్వరు వెళ్ళలేరు. అది నేను అయినా.. అని తల దించుకుని ఆపేశాడు.
వీరయ్య : మీరే చేతులు ఎత్తితే ఎట్టా సారూ
జనార్ధన్ : ఆ పిల్ల రాత అంతే అనుకుని మీరు మెలకుండా వెళ్ళిపోతే మంచిది. లేదంటే చావులు చూడాల్సి వస్తుంది.
రంగా : నేను అప్పుడే చెప్పాను అని కోపంగా బైటికి వెళ్ళిపోయాడు.
వీరయ్య మిగతా ఆడంగులతో బైటికి వచ్చేశాడు. అడవి బాటలో నడుస్తూ ఎట్టా ఉన్నావే చెంచి.. ఆ చెట్టు తల్లే నిన్ను కాపాడుతాది అని నడుస్తుంటే రంగా మాత్రం ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వేగంగా అడవిలోకి వెళ్లి చిన్న కత్తి నడుముకు దోపుకుని , బాణాల సంచి భుజానా వేసుకున్నాడు.
చీకటి పడింది. అడవిలో అందరూ తల్లి చెట్టు కింద సమావేశం అయ్యారు. కాగడాల వెలుతురులో చిన్న పిల్లల్ని పంపించేశాక చెంచి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరికి వారు తోచింది చెపుతుంటే వీరయ్య వింటున్నాడు. అప్పుడే మంగ పరిగెత్తుకుంటూ వచ్చింది.
వీరయ్య : ఏమైనాది మంగా!
మంగ : నా పెనివిటి రంగా మాయమైనాడు. ఆడితో పాటు బాణాల సంచి, కత్తి కూడా తీసుకుపోనాడు. ఆవేశంలో ఏమైనా సేతునేమో అని భయపడింది.
మంగ మాటకి రేతిరి ఎవరి కంటా కునుకు నేదు. తెల్లవారుజామున కట్టకి పోయిన పిల్లగాండ్లు భయంతో కేకలు పెడుతుంటే అడవంతా మేలుకుంది. అందరూ పోయి చూశారు. రంగా తల చెట్టుకి వేలాడ తీసి ఉంది. బొట్లు బొట్లుగా రక్తం కారుతుంటే అది చూసిన అందరూ ఏడుస్తూ చుట్టూ చేరారు. చివర్లో వచ్చిన మంగ మొగుడి తల చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. వీరయ్యకి సిఐ జనార్ధన్ చెప్పిన మాటలు చెవిలో మ్రోగుతున్నాయి.
The following 14 users Like phantom_series's post:14 users Like phantom_series's post
• akak187, Anamikudu, Chamak, Donkrish011, Gurrala Rakesh, hemu4u, Kmsastry, Manoj1, Nani666, Paty@123, Ramakrishna 789, Uppi9848, Venrao, VijayPK
Posts: 1,697
Threads: 1
Likes Received: 1,400 in 1,111 posts
Likes Given: 1,926
Joined: Sep 2021
Reputation:
15
Nice starting andi .. bagundi
Posts: 6,189
Threads: 0
Likes Received: 2,181 in 1,810 posts
Likes Given: 1,536
Joined: Jul 2021
Reputation:
35
Good starting, plz continue, The war will start between a criminal and a Rowdi converted projecting himself as a polished leader with the help of political leaders